Read Those three - 40 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 40

తర్వాత వారం రోజులు గడిచాయి. అన్వర్ కోలుకున్నాడు.
సమతా సదన్ కు మారాడు. డ్యూటీ కి మాత్రం వెళ్ళటం లేదు. యాకూబ్ సెలవు ముగిసింది. అతడికెందుకో వెంటనే వెళ్ళాలనిపించలేదు. ఈ లోపల రహీం ఫోన్ చేసి అన్వర్ కు జరిగిన ప్రమాదం గురించి చెప్పాడు. ప్రస్తుతానికి నెట్వర్క్ ఆగిపోయింది కదా అని అక్క నిఖా సాకుతో మరో వారం సెలవడిగాడు. రహీం కు ఒప్పుకోక తప్పింది కాదు. యాకూబ్ కు మరో వారం ఆటవిడుపు.
ఇంతియాజ్ మిషన్ జన్నత్ డోనార్స్ లిస్ట్ జల్లెడ పట్టగా నలుగురు " suspected" గా తేలారు. రెండో వడబోత లో
ఇద్దరు తేలారు. ఇద్దరికీ రాజకీయ నేపథ్యం ఉంది. ఒకరు ఆరిఫ్ ...... రెవెన్యూశాఖా మంత్రి షేక్ మస్తాన్ కా సాలా.
మరొకరు ఆరిఫ్ కజిన్ ఫయాజ్.ఇద్దరినీ బాగా స్టడీ చేశారు.
వారి దినచర్య ను గమనించారు. వారి ఫ్రెండ్స్ సర్కిల్స్ వివరాలు సేకరించారు. ఇదంతా యుద్ధ ప్రాతిపదికన జరిగింది. చివరికి ఆ ఇద్దరిలో ఫయాజ్ అన్న నిర్ణయానికి వచ్చారు.
ఈ లోపల ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. దాంతో ఆపరేషన్ జన్నత్ పునాదులు కదిలాయి. ది యాక్ట్ ఆఫ్ ఫేట్. !
నగరం ఇంకా నిద్ర లోనే జోగుతోంది. అంతటా ప్రశాంతంగా ఉంది. కానీ అదే సమయంలో సాగర్ బిజినెస్ స్కూల్ లో కలకలం. కాంపౌండ్, కారిడార్ లో లైట్లు వెలుగుతున్నాయి.
విశాలమైన రిసెప్షన్ హాల్లో కిటకిటలాడుతూ జనం.ప్రిన్సిపాల్.కమిటీ మెంబర్లు, , కమిటీ హెడ్ ఆశాలత, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, తల్లిదండ్రులు, స్కూల్ ఆవరణం మొత్తం జనం.
విశాల్ పవర్ సిస్టమ్స్ సి.ఎమ్.డీ హరీష్ రావు శిల్పం లా నిలబడి ఉన్నాడు. అతని ప్రక్కనే బల్ల మీద విశాల్ అచేతనంగా పడి ఉన్నాడు. తలకు కట్టిన బ్యాండేజ్ సన్నగా స్రవిస్తున్న రక్తం తో ఎర్రగా ఉంది. విశాల్ హరీష్ రావు పెద్ద కొడుకు. విశాల్, పవన్, అరవింద్ మిత్ర త్రయం లో ఒకడు.
విశాల్ ఉదయం మూడు గంటల సమయం లో అడ్మిన్ బ్లాక్ నాలుగో అంతస్తు నుంచి క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాల్ తల్లి, తమ్ముడు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. హరీష్ రావ్ కొడుకు ను కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు కళ్ళు స్రవిస్తూ కళ్ళు మసక బారుతున్నాయి. అప్పుడప్పుడు తుడుచుకుంటూ ఉన్నాడు. ఏడుపు మాత్రం రావటం లేదు. మెదడు మొద్దు బారింది. కమిటీ హెడ్ ఆశాలత అనునయంగా హరీష్ రావు భుజంపై చెయ్యి వేసింది. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు.
" హాస్టల్ లో స్టూడెంట్స్ డ్రగ్స్ వాడుతున్నారని విశాల్ మరణం తో మీకు తెలిసింది. అంటే నువ్వు, నీ కమిటీ మెంబర్లు మొద్దు నిద్ర పోతున్నారు. కాలేజీ వ్యవహారాలన్నీ ఆ పనికి మాలిన ప్రిన్సిపాల్ కు వదిలేశారు ". హరీష్ ప్రతి మాటా నిప్పు రవ్వలా దూసుకొచ్చింది. ప్రిన్సిపాల్ భయంతో, అవమాన భారంతో తొలి ఎత్త లేదు. ఆశాలత తలదించక తప్పలేదు.
" స్టేట్ లోనే మీ "బి" స్కూల్ కు ఎంతో పేరుంది. ఆ నమ్మకం తోనే మా వాడిని చేర్చాను. మీవి పైపై మెరుగులేనని ఇప్పుడు తెలిసింది. ఏ మాత్రం బాధ్యత లేని వ్యక్తులు సంస్థలు నడిపితే ఇలాగే ఉంటుంది."
ఆశాలతకు భూమిలోకి కుంచించుకు పోతున్నట్లు అనిపించింది. ఆమె పరిస్థితి చూసి ఆదిత్య కు జాలేసింది. ధైర్యం చేసి అడుగు ముందుకు వేశాడు.
" సార్ ! డ్రగ్స్ రాకెట్ నడుపు తున్న వాళ్ళు సామాన్యులు కారు. వాళ్ళ కు మిలిటెంట్ సపోర్ట్ ఉంది. ఎంతో కట్టుదిట్టం గా ప్లాన్ చేశారు. ఎవరికీ అనుమానం రాలేదు. మాకూ నాలుగు రోజుల క్రితం ఈ డ్రగ్స్ రాకెట్ విషయం తెలిసింది.
జాగ్రత్త పడే లోపల ఘోరం జరిగిపోయింది. "
" ఇప్పుడు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. ప్రయోజనం ఏమిటి ? మా వాడు తిరిగి రాడుగా.?" ఆ ప్రశ్న కు ఆదిత్య కూడా జవాబివ్వలేదు.
" సార్ ! మా ఫార్మాలిటీస్........ పూర్తి చేయలేకపోయాడు.పోలీసాఫీసరు.
" తీసుకెళ్ళండి" ఆపై మాట్లాడలేక పోయాడు హరీష్ రావు. గుండె కదిలింది. ఏడుపు తన్నుకు వచ్చింది. నిలబడలేక పోయాడు. ఏడుపు అతి కష్టమ్మీద నిగ్రహించుకొని ఆసరా కోసం ఆదిత్య భుజం పై చెయ్యి వేశాడు. ఆదిత్య ఆ చేతిపై తన చేతిని ఓదార్పు గా ఉంచాడు.
" సర్ ! విశాల్ హిప్ పాకెట్ లో ఈ లెటర్ ఉంది." నాలుగు మడతల తెల్లకాగితం ఒకటి హరీష్ రావు కు ఇచ్చాడు పోలీసాఫీసర్. వణుకు తున్న చేతులతో ఆ ముడతలు విప్పాడు హరీష్ రావు.
" డాడీ ! ఇలాంటి పరిస్థితి వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. నేనే ఊహించలేదు. డ్రగ్స్ కు అలవాటైన మొదట్లో ఎంతో మజా ఉండేది. ఇది మాటల్లో చెప్పలేని థ్రిల్.
కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మా పరిస్థితి మాకు అర్థమైంది.
ఊబి లో దిగపడిపోతున్నట్లు అనిపించింది. డ్రగ్స్ మానటం మా వల్ల కాలేదు. ఒక్క రోజు లేకపోయినా నరకం లా ఉండేది. ఎవరితో చెప్పుకోలేని బాధ. మా ఫ్రెండ్స్ సర్కిల్ లో అందరి పరిస్థితి ఇలాగే ఉంది. కానీ నా పరిస్థితి మరీ చెయ్యి దాటి పోయింది.
నేను మామూలు మనిషి కాలేనన్న విషయం తేలిపోయింది. నాకు ఈ నరకం నుండి రిలీఫ్ కావాలి. ఇరవై పూర్తి కాకుండానే చివరి మజిలీ చేరుకుంది ఇందుకే. రిలీఫ్ కోసం.
డాడీ ! మాది చాలా ఖరీదైన జీవితం. నాకు, తమ్ముడికి అడిగినవన్నీ ఇచ్చారు. ఏ కష్టం తెలియకుండా పెంచారు. కానీ మమ్మల్ని ఏ.సీ రూంలో నాలుగు గోడల మధ్య కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టారు. ఖరీదైన సెల్ ఫోన్ లు చేతిలో పెట్టారు. మీకు బిజినెస్ ఆరో ప్రాణం. మమ్మీకి సోషల్ సర్వీస్ హాబీ.
అన్నీ ఉన్నా భయంకరమైన ఒంటరితనం. మా ఫీలింగ్స్ షేర్ చేసుకునే వాళ్ళు లేక రోబోల్లా తయారయ్యాం. మీతో సరదాగా గడిపిన రోజులు సంవత్సరం లో ఎన్ని ? వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. పైగా నాకు హాస్టల్ లో లభించిన స్వేచ్ఛ నన్ను మృగాన్ని చేసింది.
తమ్ముడి సంగతేమో కానీ నేనిలా తయారైనందుకు మిమ్మల్ని, మమ్మీని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు మీకే. తెలియదు.
మీరు మీ అలవాట్లు, పద్ధతులు మార్చుకోలేరు. మీ చుట్టూ గీచుకున్న సర్కిల్ నుండి బయటపడలేరు.
మా క్లాస్ లో అరవింద్ అని మంచి బాలుడు ఉన్నాడు. మేమంతా అలాగే పిలిచి వాడిని ఆట పట్టిస్తూంటాం. వాడిని కదిలిస్తే చాలు.....మా ఊరు, మా పచ్చటి పొలాలు, మా మామిడి తోటలు, అమ్మా, నాన్న, అక్కయ్య లు, అన్నయ్యలు, మామయ్య లు, బాబాయ్ లు, తరచూ ఇంటికి వచ్చే అంకుల్స్, పండుగలు, పుట్టిన రోజులనీ తెగ ఊదర కొట్టేవాడు.
మొదట్లో వాడి గోల సోది అనిపించేది. విసుక్కనేవాళ్ళం. కానీ వాడికి ఏ అలవాటు లేదు. ఎప్పుడూ తృప్తిగా , సంతోషం గా ఉండేవాడు. వాడి తృప్తికి, సంతోషానికి కారణం వాడి కుటుంబం. ఆ కుటుంబం తో వాడి అటాచ్ మెంట్. ఇలా వెళ్ళిపోతున్నందవెళ్ళిపోతున్నందుకు సారీ ! కనీసం తమ్ముడినైనా జాగ్రత్త గా చూసుకోండి .
విశాల్
సాంతం ఉత్తరం చదివి నిలబడలేక కుర్చీ లో కూలబడి పోయాడు. భార్యను పిలిచి ఉత్తరం చేతిలో పెట్టాడు.
" విశాల్ ఆత్మ హత్య చేసిందో లేదు. మనమే చంపాం ."
ఆమె కన్నీళ్లు తుడుచుకొని ఉత్తరం చదవసాగింది. హరీష్ రావు ముఖాన్ని చేతులతో కప్పుకున్నాడు. ఆయన బింకం, గాంభీర్యం ఆ క్షణం లో కన్నీటి వరదలో కరిగిపోయాయి.
తెలతెలవారుతుండగా మీడియా జనం బిలబిలమంటూ
దిగిపోయారు. వారి రంగ ప్రవేశం తో వాతావరణం వేడెక్కింది. హరీష్ రావ్ ను కలవాలని విశ్వ ప్రయత్నం చేశారు. కానీ, పోలీసు వలయాన్ని ఛేదించలేక బయటే ఉండిపోయారు.
" మీరిలా ఆపటం పద్ధతి కాదు . మాకు నిజానిజాలు కావాలి. మేము హరీష్ రావు ను కలవాలి. " ఓ సీనియర్ పాత్రికేయుడి ఆగ్రహం.
" మేము నిజాలే చెబుతాం. ‌‌‌‌‌‌‌‌హరీష్ రావు ను కలవకూడదు."
కటువుగా సమాధానం చెప్పాడు పోలీసాఫీసర్.
ఉత్తరం చదివి కుప్పకూలిపోయింది హరీష్ రావు భార్య. ఆమెను మెల్లగా లేవదీసి సోఫా లో కూర్చో బెట్టారు. హరీష్ రావ్ ఆమె ప్రక్కనే కూర్చున్నాడు. ఆమె రెండో కొడుకు ను పిలిచి గుండె కు హత్తుకుంది. కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. హరీష్ రావ్ వారిద్దరినీ దగ్గరకు తీసుకున్నాడు.
ఆ దృశ్యం అక్కడున్న వారందరినీ కలచివేసింది.
" అరవింద్ ఎవరు ?" హరీష్ రావ్ ఆదిత్య ను అడిగాడు.
" మా తమ్ముడు ".
" విశాల్ అరవింద్ గురించి ఉత్తరం లో రాశాడు." ఉత్తరం ఆదిత్య అందుకున్నాడు.

************************************************
కొనసాగించండి 41 లో