Those three - 5 books and stories free download online pdf in Telugu

ఆ ముగ్గురు - 5

ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు సాయంత్రం అలీకి స్పృహ వచ్చింది. మెడ దగ్గర సూదులు గుచ్చినట్లు భరించలేనట్లు బాధ . ఒక్క క్షణం ఆ రాత్రి ని తలచుకున్నాడు. నీడలా వెంటాడే పీడకల . ఒళ్ళు జలదరించింది.
" హౌ ఆర్ యూ ఫీలింగ్ ?" స్వరం గంభీరంగా ఉన్నా మాటల్లో మెత్తదనం. కళ్ళు తెరిచాడు అలీ. బెడ్ పక్కన నిలుచున్న ఓ సీనియర్ ఆఫీసర్, ప్రశాంత మైన చూపులు.
చిరునవ్వు. వయసుతో , అనుభవం తో నిండిన ఫలిత కేశాలు-- నిండైన రూపం.
బాగుందంటూ నెమ్మదిగా తల వూపాడు అలీ.
" నౌ యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. బాగా రెస్ట్ తీసుకో. భయపడకు. నీ బాధ్యత పూర్తిగా మాదే." భుజం తట్టాడు ఆఫీసర్.
ఆ పొడవాటి కారిడార్ లో చకచకా నడుస్తున్న ఆఫీసర్ తో ఇద్దరు జూనియర్స్ పరుగులాంటి నడకతో ఆఫీసర్ చెప్పేది శ్రద్ధగా వింటున్నారు." అగ్రెసివ్ గా లేడు. పాజిటివ్ ఆటిట్యూడ్ కనపడుతోంది . మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్
సులభంగా సంపాదించవచ్చు.
"" యస్.సర్. అతడి రెస్పాన్సెస్ చాలా నేచురల్ గా ఉన్నాయి." ఒక ఆఫీసర్ రెస్పాన్స్.
" లెటజ్ హోప్ సో " ఆఫీసర్ తన ఛాంబర్ ముందు ఆగాడు.
అలీ స్ప్రృహ లోకి వచ్చిన రోజు కాక, మరుసటి రోజు
సాయంత్రం అన్వర్ బిలాస్ పూర్ బస్టాండ్ లో ఉన్నాడు.
చుట్టూ అంగళ్ళతో, ప్రయాణీకుల తో రద్దీగా ఉంది ఆ చిన్న
బస్టాండ్..
చాలా కాలం తర్వాత అన్వర్ నాగరిక ప్రపంచంలో అడుగు పెట్టాడు. మనసు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ తన ఉనికి ఎవరూ పసిగట్టలేరు..తను రాడార్ పరిథికి అవతల ఉండటం ఎలా జరిగిందో ? తను ఆ రాత్రి దాదాపు కొండ చివర ఉన్నాడు. అక్కడ నుంచే కొండ వాలు ప్రారంభమవుతుంది. తన కదలికల్ని సీక్రెట్ కెమెరా రికార్డు చేయకపోవడం కేవలం అల్లా దీవెన.
అలీ వెంట్రుక వాసిలో బులెట్ గురి తప్పించుకోవడం కూడా ఒక అద్భుత మే . అతడికి టైమ్లీ ట్రీట్మెంట్ కూడా అంది ఉంటుంది. అతడు జీవించి ఉండటం డిఫెన్స్ అథారిటీస్ కు చాలా అవసరం. అందుకోసమైనా అతడిని కాపాడుతారు.
అలీ పూర్తిగా కోలుకొని తన వివరాలు చెప్పేలోపు హైదరాబాద్ చేరుకోవాలి.తన " మాస్టర్స్" రక్షణ లోకి వెళ్ళాక ఏ ప్రమాదమూ ఉండదు.
గడ్డం తీయించుకున్నాడు . క్రాఫ్ స్టైల్ మార్చాడు. ఓ ఫెల్ట్
హ్యాట్ , రెడీమేడ్ డ్రెస్ కొన్నాడు. ఓ చిన్న లాడ్జ్ తీసుకుని
ట్రిమ్ గా తయారయ్యాడు. ఇప్పుడు అన్వర్ అందరిలా
సాదాసీదా మనిషి . ముందు రూపానికి, ఇప్పటి రూపానికి ఏ మాత్రం పోలికే లేదు. తనపై పబ్లిక్ ప్లేసెస్ లో నిఘా ఉంటుందని తెలుసు. అందుకే రూపం మార్చాడు.
ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. వెంటనే హైదరాబాద్ కు ఫోన్ చేశాడు.
" హలో, రాహుల్ "
" హలో ,ఎవరండీ ?" ఆవైపు రాహుల్.
" నేను రా , నరసింహాన్ని ". అన్వర్ జవాబు.
" హలో ! బావా ! ఎక్కడ నుండి మాట్లాడుతున్నావ్?"అక్కయ్య బాగుందా ?" రాహూల్ ఉరఫ్ రహీం.
" బిలాస్ పూర్ నుండి మాట్లాడుతు న్నాను.నేను కులు- మనాలి ట్రిప్ కు వెళతానన్న విషయం మరిచిపోయావా ?"
" సారీ బావా ! నిజంగానే మర్చిపోయాను. అక్కయ్య ట్రిప్ కు రాలేదు కదా ?"
" మీ అక్కయ్య కు ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయట." ఆవిడ ఓ ఎన్.జీవో కార్యదర్శి కదా. రాలేనంది. అయినా మీ అక్కయ్య ను ఎవరూ మార్చలేరు. ఆమె ధోరణి ఆమెది . అన్ లక్కీ ఫెలో. నేను మాత్రం ట్రిప్ ను ఎంజాయ్ చేశాను.
" అది సరే ! నేను చెప్పిన నాలుగు వస్తువులు కొన్నావా ? మరిచిపోయావా ? రాహుల్ గుర్తు చేశాడు.
" కొన్నానురా ! కాని ఓ పొరపాటు జరిగింది. బస్సులో నేను జోగుతున్నప్పుడు ఎవడో ఒకడు బ్యాగు కొట్టేశాడు.సారీ !
" ఏమిటి? బ్యాగు మొత్తం గల్లంతు అయిందా ? మరీ అంత నిర్లక్ష్యం ఏమిటి బావా ? సర్లే, ఈ నెంబరు కు ఓ అయిదు వేలు టి.ఎమ్.ఓ చేస్తాను. నేరుగా హైదరాబాద్ వచ్చెయ్. లాడ్జ్ అడ్రస్ చెప్పు."
అన్వర్ లాడ్జ్ అడ్రస్ చెప్పాడు.
" నాతో వస్తున్న నలుగురు పహారా సైనికులు కాల్పులకు బలైపోయారు.నేనొక్కడినే మిగిలాను.పైకం పంపితే హైదరాబాద్ వస్తాను."
ఇదీ అన్వర్ రహీం కు కోడ్ భాషలో చెప్పింది. రాహుల్ ( రహీం) తెమ్మన్న నాలుగు వస్తువులు నలుగురు మిలిటెంట్స్.
అలీ పూర్తిగా కోలుకున్నాడు. క్యాంప్ హాస్పిటల్ వాతావరణం. అక్కడి సిబ్బంది, వారి క్రమశిక్షణ, పని పట్ల వారి శ్రద్ధ, తన పట్ల వారి ప్రవర్తన, సానుభూతి అతడి మనసుపై బలమైన ముద్ర వేసింది.
" మీ రొటీన్ చెక్ పూర్తయిందా ? కెన్ ఐ టాక్ టు హిమ్ ?
బ్రిగేడియర్ రావు ప్రశ్న కు డాక్టర్ అంగీకారం గా తలవూపాడు.

contd......,6

షేర్ చేయబడినవి

NEW REALESED