Read Those three - 6 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 6

" గుడ్ మార్నింగ్ అలీ ! "
" గుడ్ మార్నింగ్ సర్ ! " అలీ సర్దుకుని నిటారుగా కూర్చున్నాడు.
" ఫీల్ ఫ్రీ " అని భుజం తట్టి ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
అలీ చెప్పేది రికార్డు చేసేందుకు ప్రక్కనే ఉన్న కుర్చీలో ఉన్న జూనియర్ ఆఫీసర్, తలుపు దగ్గర సాయుధుడైన సెక్యూరిటీ, పరిస్థితి అర్థ మయింది అలీకి. తను అందుకు సిద్ధంగా ఉన్నాడు.
" వెంట్రుక వాసిలో చావు తప్పించుకోవడం కేవలం నీ అదృష్టం. నీ ఆలోచన, జీవించే పద్దతి మార్చుకోవడానికి ఇదొక అవకాశం. మాతో సహకరించి, మాకు కావల్సిన సమాచారం ఏదీ దాచకుండా పూర్తిగా చెబితే నీకు అన్ని విధాలా మంచిది." అలీ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు రావ్.

" తప్పకుండా ! మీరు నా ప్రాణం కాపాడారు. మీకు సహకరించటం నా ధర్మం."
" వెరీ గుడ్. దట్ ఈజ్ ఎ గుడ్ గెశ్చర్." రావ్ ముఖంలో ప్రసన్నత.

అలీ ముందు తన గురించి, తన కుటుంబం గురించి వివరంగా చెప్పాడు.
" సో.....మీ నాన్న గారు ,తాత గారు దేశం కోసం పోరాడారు.
మరి నువ్వెలా ఉగ్రవాదివైనావు ?"
" ఆర్థిక పరిస్థితులు........నా పెన్షన్ ఓ మూలకు చాలేది కాదు. చుట్టూ సమస్యలు. మా కుటుంబం బాగుండాలి.
....... నేనేమై పోయినా ఫర్వాలేదు అన్న తెగింపు. నాకు
అవకాశం చూపని సమాజం పై కసి, స్నేహితుల ఒత్తిడి, .....
ఈ కారణాలే నన్ను ఉగ్రవాది ని చేశాయి."
" మీరు హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు ?"
" ఆపరేషన్ జన్నత్ అన్న మిషన్ తరపున పని చేయటం
మా డ్యూటీ."
" ఆపరేషన్ జన్నత్ " అప్రయత్నంగా రావ్ పెదవులు ఆ పదాన్ని పలికాయి.
" ఆ మిషన్ వివరాలు ఏమిటి ?"
" ఆ వివరాలు మాకు తెలియవు. కాని ఒక్కటి మాత్రం నిజం. ఇస్లాం విస్తరణ కు ఇప్పటి వరకు అనుసరించిన
పద్దతుల కు ఈ మిషన్ పూర్తిగా వ్యతిరేకం."
" మీ నలుగురిలో లీడర్ ఎవరు ?"
" మేం నలుగురం కాదు. అయిదుగురం. మా టీం లీడర్
అన్వర్. అతడు తప్పించుకున్నాడు. అదిరిపడ్డాడు రావ్.
" మీరు అయిదుగురా ? మీ లీడర్ తప్పించుకున్నాడా ?"
బుల్లెట్స్ లా వచ్చాయి ప్రశ్నలు.
" అవును, సార్ ! ఆ రాత్రి బుల్లెట్స్ తగిలి ముగ్గురు చనిపోయారు. అతడి కసలు బుల్లెట్ తగల్లేదు. పహారా సిబ్బంది మా వైపు రావటం చూసి కొండ వాలు నుండి దిగి పోయాడను కుంటాను."
" కొండ వాలా ?" రావ్ ఆశ్చర్యం గా అడిగాడు.
" మేం అయిదుగురు ఒక్క సారిగా ' నో మ్యాన్ ల్యాండ్' లో
అడుగు పెట్ట లేదు. మనిషి మనిషికీ మధ్య కనీసం వంద అడుగులు దూరం ఉండేలా నిలబడి పి.ఓ.కే కంచె దాటాం.
అన్వర్ కొండ వాలు దగ్గర ఉండి పోయాడు. ఆ సమయం లో మంచు బాగా పడుతోంది. అన్వర్ మాకు కనపడలేదు.
మీ సిబ్బంది ఆ ప్రదేశమంతా చాలా సేపు వెదికారు. అన్వర్ బాడీ కానీ, అన్వర్ కానీ కనిపించలేదు. " వివరంగా చెప్పాడు అలీ.
రావ్ అలీ మాటలు విన్నా బదులు పలక లేదు. ఆలోచన లో పడిపోయాడు. ఒక వ్యక్తి తప్పించుకున్నాడు. చేరవలసిన చోటుకు చేరిపోయాడు. జనం లో కలిసి పోయిన ఆ వ్యక్తి అన్వేషించటం అంత సులభం కాదు. సమయం, అవకాశం ..... రెండూ చెయ్యి దాటి పోయాయి.
" మీ లీడర్ ఎలా ఉంటాడో చెప్పగలిగితే ఓ ఇమేజ్ తయారు చేయ గలం "
" అలాగే , సర్ "
" రెస్ట్ తీసుకో. మళ్ళీ కలుద్దాం. " మళ్ళీ భుజం తట్టి బయటకు వెళ్ళాడు రావ్.
‌..............
రాహుల్ ఉరఫ్ రహీం అన్వర్ ను హైదరాబాద్ లో కలిశాడు.
టాక్సీలో ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఓం పాష్ ఏరియాలో
ఓం విలాసవంతమైన భవనం ముందు టాక్సీ ఆగింది.
ఆ భవనం చివరి అంతస్తు లో గెస్ట్ రూం లో అన్వర్ బస.
బెల్ కొడితే అటెండర్ వస్తాడు. నీకేం కావాలన్నా అతడే
తెచ్చి పెడతాడు. రూం లో టీ.వీ , కంప్యూటర్ అన్నీ ఉన్నాయి. మూడు రోజులు మూడు గంటల్లా గడిచి పోతాయి."
" అంటే ! మూడు రోజుల పాటు తను హౌస్ అరెస్ట్. సిటీ లోకి వెళ్ళే అవకాశం లేదు." అన్వర్ నిట్టూర్చాడు. నీకేం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. మూడు రోజుల తర్వాత నీవో సమావేశం అటెండ్ కావాలి. ఆ తర్వాతే ప్లాన్ ఆఫ్ యాక్షన్."
అతడి వాలకం,. మాట తీరు చూస్తుంటే తనకంటే బాగా చదువుకున్నట్లుంది . అతడి కదలికలు , విషయం వివరించే విధానం ప్రత్యేకం గా ఉంది.
Contd.............7