Those three - 11 books and stories free download online pdf in Telugu

ఆ ముగ్గురు - 11

ఏ.సి.పీ ఇంతియాజ్ కారు ఓ విశాల భవనం ముందు ఆగింది . మెయిన్ గేటు గోడ మీద " పరాంకుశరావు " అనే అక్షరాలు బ్లాక్ గ్రానైట్ ప్లేట్ మీద బంగారు రంగులో మెరిసిపోతున్నాయి .
గేటు ముందు సెక్యూరిటీ సిబ్బంది పహారా బలంగా ఉంది .
పరాంకుశరావు ఆ రాష్ట్ర హోం మినిస్టర్ .
" గుడ్ ఈవినింగ్ సార్ " ఇంతియాజ్ విష్ చేశారు .
ఏదో ఫైలు చూస్తున్న పరాంకుశరావు తలెత్తి చూశాడు .
" హలో ఇంతియాజ్ ! హౌ ఆర్ యూ ?" చిరునవ్వు తో పలకరించాడు పరాంకుశరావు .
" ఫైన్ సార్ ! " ఎదురుగా కూర్చున్నాడు ఇంతియాజ్ .
ఆ విశాలమైన , ఖరీదైన గదిలో అన్నీ పొందికగా అమరి ఉన్నాయి . ఏ. సి చల్లదనం హాయిగా ఉంది .
" ఈ మధ్య నువ్వు మన ఊరికి వెళ్ళావా ?" ఫైలు మూసి వెనక్కు వాలుతూ అడిగాడు .
" అవును సార్ ! అమ్మా , నాన్న ను చూసి చాలా రోజులైంది . అమ్మ బాగున్నారా ? ఈ మధ్య ఒంట్లో బాగాలేదని అన్నారు .
" ఇప్పుడు బాగానే ఉన్నారు . సార్ ! కాకపోతే కాస్త నీరసంగా ఉన్నారు .
కాలింగ్ బెల్ నొక్కాడు పరాంకుశం . అటెండర్ క్షణాల్లో వచ్చి నిలుచున్నాడు. టీ తెమ్మన్నాడు .
" అన్వర్ ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు కదా ?"
" ఎస్ సార్ " తలవంచుకున్నాడు .
నీ ప్రయత్నం లో ఎలాంటి లోపం లేదని నాకు తెలుసు .
కాని అలా అనుకొని సమాధాన పరుచుకుంటే సమస్య తీరదు గా !"
ఇంతియాజ్ మౌనం !
" సి. ఎమ్ గారు ఇప్పటికే రెండుమార్లు హెచ్చరించారు .
సి ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ . సెంట్రల్ హోం మినిస్ట్రీ నుండి ఫాలో అప్ యాక్షన్ డిమాండ్ చేస్తూ నాలుగు రిమైండర్ లు వచ్చాయి .
" లోకల్ మిలిటెంట్ ID files జల్లెడ పట్టాం . క్లూ దొరకలేదు. పబ్లిక్ ప్లేసెస్ లో హైఅలర్ట్ కంటిన్యూ అవుతోంది . నగర శివార్లలో సెక్యూరిటీ టైటన్ చేశాం . నైట్ పెట్రోలింగ్ ముమ్మరంగా ఉంది . "
" కాదనలేదు . కానీ .. అన్వర్ జాడ దొరకందే ఆపరేషన్ పూర్తి కాదు . ఈ విషయం లో ఏదో ఒకటి చేయాలి . అన్వర్
ఆచూకీ తెలుసుకోవాలి . ఆపరేషన్ జన్నత్ వివరాలు తెలియాలంటే అతడు పట్టుబడాలి . అంతవరకు రాష్ట్రం లో
శాంతి భద్రతలు గాలిలో దీపాలే " తేల్చి చెప్పాడు పరాంకుశరావు .
" అన్వర్ జాడ తెలిశాకే మిమ్మల్ని కలుస్తాను , సార్ " బింకంగా అన్నాడు ఇంతియాజ్ .
" హోం మినిస్టర్ చిరునవ్వు నవ్వాడు.
" బట్ ఎట్ ది అర్లియస్ట్ ....ఆల్ ది బెస్ట్ ఇంతియాజ్ ."

టైం ఏడుగంటలు . నగరంపై చీకటి పూర్తిగా ఆవరించుకుంది . ఇంతియాజ్ ఇంటికి వెళ్ళి రిలాక్స్ కాలేదు . తిరిగి ఆఫీస్ దారి పెట్టాడు . మొహంలో ఉద్వేగం . ఏ.సి కారులో ఉన్నా చిరు చెమటలు . అసిస్టెంట్ విహారి కి ఫోన్ చేసి ఆఫీసుకు రమ్మన్నాడు . కారు కన్నా అతడి ఆలోచనలు వేగంగా దూసుకు వెళుతున్నాయి .
" ఏంటి సార్ ! మళ్ళీ ఆఫీసు కు రమ్మన్నారు .
రివాల్వింగ్ ఛెయిర్ కాలితో తన్ని కిటికీ దగ్గర నిలుచున్నాడు ఇంతియాజ్ .
బాస్ చాలా కోపంగా ఉన్నాడని విహారి పిల్లిలా మౌనంగా ఉండి పోయాడు . కొన్ని క్షణాలు గడిచాయి . ఉద్వేగ తీవ్రత
కాస్త తగ్గింది. వచ్చి కుర్చీలో కూర్చున్నాడు .
" ఏమైంది సార్ ?" మెల్లగా అడిగాడు విహారి .
" అన్వర్ జాడ ఇంకా తెలుసుకోలేని "హోం" మెత్తగా చురకలు వేశాడు ."
అన్వర్ జాడ తెలుసుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం కదా !"

" పెద్దవాళ్ళకు కావాల్సింది ప్రయత్నాలు కాదు ఫలితాలు . అన్వర్ జాడ తెలుసుకోకపోతే రాష్ట్ర శాంతి భద్రతలు గాలిలో దీపాలని తేల్చి చెప్పారు పరాంకుశరావు ."
విహారి కి ఏం చెప్పాలో తోచలేదు .
" హౌ టు బ్రేక్ ది ఐరన్ కర్టెన్ ." పేపర్ వెయిట్ ఇంతియాజ్ వేళ్ళ మధ్య సుళ్ళు తిరుగుతోంది .అతడి అసహనానికి ప్రతీకలా.
ఇక ఒక్కటే మార్గం. చీకట్లో నాలుగు రాళ్ళు వేయాలి .ఏదో ఒకటి తగులుతుంది .
" చీకట్లో రాళ్ళు ".... విహారి మాటలకు మెరుపులా స్పందించాడు ఇంతియాజ్.
విహారి వింతగా చూశాడు .
" Some meaningful assumptions . ఏ క్లూ దొరికినప్పుడు కొన్ని ఊహల ఆధారంగా ముందుకు వెళ్ళాలి"
" యు ఆర్ రైట్సార్ ఏమిటి సార్ మీ assumptions." కుతూహలంగా అడిగాడు విహారి. .
ఓ అరనిమిషం ఆలోచించాడు ఇంతియాజ్ .
" ఏదో కారణం గా మన అన్వర్ భాయ్ ఇంట్లోంచి పారిపోయాడు . తెగిన గాలిపటం లా ఉన్న అతడిని మిలిటెంట్ ఆర్గనైజేషనన్స్ చేరదీసి ఉండాలి . అలాంటప్పుడు లోకల్ మిలిటెంట్ ఆనవాళ్ళ తో అన్వర్ వి ట్యాలీ అవుతాయి. ? ఇంతియాజ్ విహారిని సాభిప్రాయంగా చూశాడు.

" ఈ ఐడియా వర్కవుట్ అవుతుందా ! మెల్లగా అడిగాడు విహారి .
" అవుతుందో లేదో నేను మాత్రం ఎలా చెప్పగలను ? ఇటీజ్ ఎ డెస్పరేట్ ట్రయల్ . ఇంతకన్నా వేరే దారి లేదు . ఇది మిస్ ఫైర్ అయితే మరోటి చూద్దాం .
విహారి అవునన్నట్లు తొలి ఊపాడు . ఇంతియాజ్ మళ్ళీ ఆలోచన లో పడిపోయాడు.
" చాలామందిని ఉగ్రవాదులు గా మార్చేది పేదరికం .మన మిత్రుడు కూడా పేదవాడే కావచ్చు . ఇంటి పరిస్థితులు , తన చుట్టూ ఉండే సమాజం , ఊహలు , ఆశలు , అతడి ఆలోచనలను దారి మళ్ళించి ఉండాలి . ఇలాంటి తెగిన గాలిపటాల కోసం ఉగ్రవాద సంస్థలు డేగ కళ్లతో చూస్తుంటాయి .
" ప్లీజ్. కంటిన్యూ." విహారి తొందర చేశాడు . ఇంతియాజ్ మందహాసం.
" అన్వర్ నే ఆపరేషన్ జన్నత్ కోసం పంపడంలో బోలెడు లాజిక్ ఉంది . ఇతడు ఇక్కడే పుట్టి పెరిగాడు . టీనేజ్ లో ఇల్లు వదిలిపోయాడనుకుదాం.అన్వర్ ఉర్దూ, తెలుగు మాట్లాడగలడు . ఇక్కడి సామాజిక వాతావరణం., పద్ధతులు, మనుషుల ఆలోచనలు , అలవాట్లు, ఇలా చాలా విషయాల్లో పరిచయం ఉంది. ఈ మహానగరంలో నుంచి జనస్రవంతిలో చాలా సహజంగా కలిసిపోగలడు . నాకు తెలిసి ఆపరేషన్ జన్నత్ కు ఇలాంటి వ్యక్తి అవసరం ఉంది. వారిది కచ్చితంగా వెపన్ అటాక్ కాదు.ఏదో వ్యూహం. వారిది లాంగ్ టర్మ్ టార్గెట్స్. అందుకే ఏడాది గడిచినా కదలికలు బయటపడలేదు. చాప కింద నీరులా ఏదో ప్లాన్.చాలానిశ్శబ్దంగా , పకడ్బందీగా సాగిపోతోంది . ఏమై ఉంటుంది ?" అసహనంగా పిడికిలి తో నుదురు కొట్టుకున్నాడు ఇంతియాజ్. విహారి కన్నార్పకుండా ఇంతియాజ్ నే చూస్తున్నాడు .
" అన్వర్ నుంచి ట్రేస్ చేయడం ఎలా ?" కీ ప్రశ్న తో కళ్ళు తెరిచి విహారిని ప్రశ్నార్థకంగా చూశాడు .
" అవును సార్ .ఎలా ? విహారి ఎదురు ప్రశ్న .
విహారి ని చిన్నగా తలమీద మొట్టాడు.

" కాస్త చురుగ్గా ఆలోచించు" కొడుకు ఇల్లు వదిలి పోతే తండ్రి ఏం చేస్తాడు ?"
"కొడుకు కోసం వీధి వీధి, ఊరు ఊరు గాలిస్తాడు."
" అంతేనా" రెట్టించాడు ఇంతియాజ్.
" పోలీసు రిపోర్ట్...... సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయాడు . క్షణం ఇంతియాజ్ ను చూశాడు ." సార్ అర్థమైంది. ఈ సిటీ లోని పోలీస్ స్టేషన్స్ లో ఉన్న పాత రికార్డులను తిరగేస్తే మన మిత్రుడు దొరుకుతాడు . కాకపోతే ఇది హిమాలయన్ టాస్క్. టీం వర్క్ తో చేసే పని ".
" మొత్తానికి దారిలో పడ్డావు . రేపటి నుంచి మన ఆపరేషన్
ఆరంభం అవుతుంది . నువ్వు , సురేష్, ఆంథోనీ ...మీ ముగ్గురే ఈ ఆపరేషన్ మెంబెర్స్ . ఇప్పుడున్న పరిస్థితుల్లో
డిపార్ట్మెంట్ లో అందరినీ నమ్మలేం . ఇట్ షుడ్ బి ఇన్ సైడ్ ది కెమెరా ". అవునన్నట్లు తల వూపాడు విహారి .
" ముందు పాతబస్తీలో ప్రారంభిస్తాం . ఆ తర్వాత నగర శివార్లలో ( దిగువ మధ్యతరగతి ముస్లిం కుటుంబాలు) జల్లెడ పడదాం . బట్ ....బీ కేర్ ఫుల్ ."
" ఓకే సార్ ! సర్ ! చిన్న సందేహం. మిషన్ జన్నత్, ఆపరేషన్ జన్నత్ , ఒకటి కావు అని తేలిపోయింది . మిషన్ జన్నత్ ఎట్ ఇట్స్ గ్రేట్ హైట్స్ . మరి జన్నత్ కామన్ ఐడెంటిటీ ఎలా అయింది ?"
" జస్ట్ టు మిస్ లీడ్ అజిత్ " . కాకపోతే ఓ సందేహం . మిషన్ జన్నత్ ఊపిరి పోసుకోక ముందే జన్నత్ అనే పదం పి,ఓ.కే ఉగ్రవాద శిబిరాల వరకు ఎలా వెళ్ళింది ...... తీవ్రంగా ఆలోచించ వలసిన విషయం . ".

" అవును సార్ ! Most key angle of the problem . " ఇంతియాజ్ విహారి ని ప్రసన్నం గా చూశాడు.
ఇప్పుడు తను చాలా రిలాక్స్ డ్ గా ఉన్నాడు .


‌‌
‌‌. ‌‌.‌‌ కొనసాగించండి. 12














ంంంంంం



షేర్ చేయబడినవి

NEW REALESED