Featured Books
  • అరె ఏమైందీ? - 21

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 12 - లక్కవరం.శ్రీనివాసరావు

ఎంతటి మేధావి నైనా అప్పుడప్పుడు హెచ్చరించేవారు లేకపోతే వారి మెదడు చైతన్యం తగ్గి మందగిస్తుంది . బద్ధకం పని వేగాన్ని , వ్యూహాన్ని తగ్గిస్తుంది . ఇంతియాజ్ విషయంలో అదే జరిగింది. తిరిగి పరాంకుశరావు మందలింపు తో ఉలిక్కిపడి దారిలో పడ్డాడు .
ఇంతియాజ్ ఊహ అక్షరాల నిజం . ఆపరేషన్ జన్నత్ లక్ష్యం వెపన్ అటాక్స్ కాదు . వారి వ్యూహం చాప కింద నీరులా సిటీ ని మెల్ల మెల్లగా అల్లుకుంటోంది . ఈ ఆపరేషన్ కు అవసరమైన గుణాలు పుష్కలంగా ఉన్నవాడు అన్వర్ హుస్సేన్. నగర జనవాహిని లో చాలా సులభంగా , సహజంగా కలిసిపోయాడు. చాలా సామాన్యుడు . పబ్లిక్ ప్లేసెస్ లో , స్లమ్స్ లో, తోపుడు బండి మీద చిన్న చిన్న రోజు వారీ వస్తువులను మారుబేరానికి అమ్మే మొబైల్ వెండార్ పేరు అనంత్ రామ్.
ఇంతియాజ్ ఊహా చిత్రం అనంత్ రామ్ ప్రస్తుత అవతారానికి అతికి నట్లు సరిపోతుంది . ఈ చిల్లర వర్తకుడికి
అప్పగించిన కొండంత బాధ్యత చాలా జాగ్రత్తగా , చిత్త శుద్ధి తో నిర్వహిస్తున్నాడు . కనుక నే ఇంతవరకు నిఘా వర్గాల దృష్టిలో పడలేదు . మరి సాధువు హితం బోధ పరివర్త మాటేమిటి ? కాలమే సమాధానం చెప్పాలి .
*****************
అనంత్ రామ్ ఉరఫ్ అన్వర్ నాలుగు వాటాల " సమతా సదన్" కు " సంబరాల రాంబాబు" . పిలిస్తే క్షణం లో పలికే నేస్తం . అతడు లేందే సమతా సదన్ సభ్యులకు కాలం ఆగిపోయినట్లే . అతడి జోక్యం లేకుండా అక్కడ గాలైనా కదలదు . అంతగా వారు అతడిపై ఆధారపడిపోయారు . ఎక్కడి నుండి వచ్చాడో, అతడి వివరాలు ఏమిటో ఎవ్వరికీ తెలియదు . తెలుసుకోవాలనుకోరు . ఇతడు ప్రతి పనిలో
నీడలా మసలుతుంటే చాలు . కేవలం నెలల పరిచయం తో ఆత్మ బంధువు అయిపోయాడు .
' సమతా సదన్' ---రెండు అంతస్తులు ---- నాలుగు వాటాలు ..... చుట్టూ చిన్న ప్రహరీ గోడ. ...గోడ వెంబడి అందమైన పూల మొక్కలు . ఒక్క మాటలో చెప్పాలంటే సమతా సదన్ ఓ బొమ్మరిల్లు .
యజమాని ఓ రిటైర్డ్ మేజర్ .సుఖదేవ్ సింగ్ . సర్దార్ జీ .
నిలువెత్తు భారీ కాయంతో , ఉరుములాంటి స్వరం తో , ఎలాంటి వారినైనా మంత్రించినట్లు ఆపగలడు . కనీ...ఆ గంభీరాకృతి వెనుక మెత్తటి మనసు, గిలిగింతలు పెట్టే హాస్యం , మెరుపుల్లా మెరిసి మాయమవుతుంటాయి .
శుభ్రత విషయంలో ఛండశాసనుడే . ఏ మాత్రం తేడా వచ్చినా అసలు ఊరుకోడు . కథాకళి చేస్తాడు . ఆ ఒక్క విషయం లో మినహాయిస్తే సుఖదేవ్ ఆపదలో ఆపద్బాంధవుడు .
క్రింది అంతస్తులో ఎడమవైపు సుఖదేవ్ కాపురముంటే , కుడివైపు ఒక తెలుగు మాష్టారు ఉంటున్నాడు. పేరు విశ్వనాథ శాస్త్రి. శుచి , సాంప్రదాయం త్రికరణశుద్ధిగా పాటించే వ్యక్తి. మరీ ఛాందసుడేం కాదు. మెత్తటి మనసు, మృదు స్వభావం. తను,. తన భార్య , కూతురు , కొడుకు.- ఫక్తు సగటు మనిషి.
పై రెండు వాటాల్లో ఒక ముస్లిం కుటుంబం , ఉన్నత మధ్య తరగతి కి చెందిన ఓ రాజుల కుటుంబం ఉంటున్నాయి. రెండు కుటుంబాల యజమాన్లు చదువుకున్న వారు. ప్రభుత్వోద్యోగులు., నాలుగు వాటాల వారికి ఆలోచనల్లో, ఆచరణలో , విశ్వాసాల్లో స్పష్టమైన అంతరాలు ఉన్నా
కలగలిసి పోవటంలో , ఆ అభ్యంతరాలను ఏ మాత్రం ఖాతరు చేయరు. ఈ సంఘీభావం వెనుక సుఖదేవ్ చొరవ
పెద్ద మనసు కృషి ఎంతో ! అక్షరాల ఆ నాలుగు వాటాల లోగిలి సమతా సదనే.
ఆ సమతాసదన్ పైన , వాటర్ ట్యాంక్ క్రింద పెన్ట్ హౌస్.అందులో అనంత్ రామ్ నివాసం. ఆకుచాటు పిందెలా, అతి సామాన్యుడిలా సమతాసదన్ లో ఒదిగిపోయిన అన్వర్ నిఘా వర్గాల డేగ కళ్లకు ఎలా కనిపిస్తాడు ?
ఎప్పటి లాగే ఆ రోజు వారికి తెల్లవారింది. ఉషోదయపు ప్రశాంతత సమతా సదన్ అణువణువులో ప్రతిఫలిస్తోంది.
విశ్వనాథ శాస్త్రి హాల్లో పీట మీద కూర్చుని ఆసీనుడై సంధ్య
వారుస్తున్నారు.
గాయత్రీ మంత్రం పెదవులపై నాట్యం చేస్తోంది. సుదీర్ఘ కాలపు అభ్యాసం, శ్రద్ధ ఉచ్ఛారణ లో స్పష్టం గా కనిపిస్తున్నాయి.
ఇంతలో ప్రక్క వాటా లోంచి పెద్దగా అరుపు........... పిలుపు.
". అమలా ! అమలా !
సంధ్య వారుస్తున్న విశ్వనాథ శాస్త్రి ఉలిక్కిపడ్డారు. " అమలా ! అమలా !
" అమ్మాయ్ !"
తండ్రి పిలుపు కు ఎదురుగా వచ్చి నిలబడింది అమల." ప్రక్క వాటా లో ఐరావతం ఘీంకరిస్తోంది. ఏం ముంచుకొచ్చిందో వెళ్ళి
చూసిరా !" ఆయన గొంతులో చిరాకు. అమలా పెదవులపై చిరునవ్వు.
అమలా బయటకు వచ్చింది. అక్కడి దృశ్యాన్ని చూసి అమలకు నవ్వొచ్చింది. బలవంతంగా ఆపుకుంది.
" నా అవతారం చూస్తే నీకు నవ్వొస్తుందా ?" సుఖదేవ్ మాటల్లో ఉక్రోషం తన్నుకొచ్చింది.
అమలా జవాబుగా రెండు చేతులూ జోడించి దీనంగా చూసింది.
పై అంతస్తులో దండెం మీద నీళ్ళోడుతున్న టర్కీ టవల్ ఆర
వేశారు.
గాలికి టవలు కదిలినప్పుడల్లా సుఖదేవ్ పై నీటి చుక్కలు పడుతున్నాయి. శివుడి తలపై నీటి ధారలా తొలి తడిసి పోతున్నా అంగుళం కూడా కదల్లేదు ఆ మానవుడు. అమలా అతికష్టం మీద ఆ భారీ కాయాన్ని రెండు చేతులతో ఆ నీటిధార నుండి తప్పించింది. మళ్ళీ త్వ మేవ శరణం భంగిమలో దీనంగా చూసింది. సర్దార్జీ శాంతించాడు.
" ఇది ఆ పై రాజుగారి పనేనా ?"
లేదన్నట్లు తలూపింది. రెండు చేతులూ తన వైపు చూపించుకుంది.
" అయినా టర్కీ టవల్ సరిగా పిండకుండా ఆలాగే ఆరేస్తారా ?"
జవాబుగా తప్పన్నట్లు చెంపదెబ్బలు వేసుకుంది.
" ఆ మూగ సైగలేంటి ? సుఖదేవ్ చిరాకు.
అమలా ముని భంగిమలో కళ్ళు మూసుకుంది.
" ఓహో ! ఆదివారం కదూ ! మౌనవ్రతం." నుదురు కొట్టుకున్నాడు .
" సర్లే ! పైకి వెళ్ళి టవల్ పిండి ఆరేయి "
అలాగే అని తలూపి మెట్ల వరకు వెళ్ళి నాలుక బయటపెట్టి వెక్కిరించింది.సుఖదేవ్ కొడతా అన్నట్లు చెయ్యి పైకెత్తి ముందుకు కదిలాడు. అమలా మెరుపులా మెట్లపై తుర్రుమంది. సర్దార్జీ పెదాలపై మొలక నవ్వు.

మొదటి అంతస్తులో తన వాటా ముందు రెహమాన్.
" ఏం తల్లీ ! సర్దార్జీ బాగా తల అంటారా ?" మెట్లెక్కి వస్తున్న అమలతో అన్నాడు .
అమలా చిరునవ్వు.
తన వాటాలో కూర్చొని పేపర్ తిరగేస్తున్నాను జనార్ధన్ రాజు.
". అయినా భాయ్ ! శుభ్రత విషయంలో ఎందుకింత పట్టుదల సుఖదేవ్ జీ కి ?". ఆవగింజంత తేడా వచ్చినా అసలు తట్టుకోలేడు. కథాకళి చేస్తాడు ".
రాజు మాటలకు రెహమాన్ నవ్వాడు.
రిటైర్ అయ్యారు. చేతినిండా పని లేదు. పైగా వేపకాయంత
వెర్రి. అందుకే మనల్ని ఇలా విసిగిస్తాడు. ఇక్కడ ఏ మూలైనా చిన్న కాగితం ముక్క కనిపిస్తే చాలు చిందులేసిన పరిశుభ్రత క్యాసెట్ వినిపిస్తాడు.
సర్దార్ జీ వెర్రి వేపకాయ కాదు గుమ్మడికాయ అని అభినయించి చూపింది అమల. అమలా అభినయానికి రెహమాన్, రాజు గిలగిల నవ్వారు. తనూ అదే స్థాయిలో నవ్వింది. కాని, నవ్విన మరుక్షణమే చెంపలు వేసుకుంది....వ్రత భంగమైనందుకు.
.......,,...................... కొనసాగించండి 13