Read Those three - 34 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 34

ఓ saintly personality ని కలిసిన అనుభూతి కలిగింది ఇంతియాజ్ కు . అలాంటి వ్యక్తి కి ఆపరేషన్ జన్నత్ విషం సంస్కృతి ఎలా చెప్పాలి ? ఇంతియాజ్ ధర్మ సంకటం.
ఆపరేషన్ జన్నత్...ఈ పేరు ఎక్కడైనా విన్నారా ?
" లేదే ? ఈ సంస్థ ఎవరిది ? "
" ఎవరిదో మాకూ తెలియదు..........అలా ప్రారంభించి విషయం క్లుప్తం గా వివరించాడు ఇంతియాజ్. తలపట్టుకుని కూర్చున్నాడు ఇనాయతుల్లా
" ఆ సంస్థ నుండి మాకు విరాళాలు అందుతున్నాయా. ఆ సంస్థ మాస్టర్ మైండ్ మా డోనరా ? నమ్మలేకుండా ఉన్నాను. ఒక జాతి యువకుల కోసం మరో జాతి యువకుల ను మత్తుకు బానిస లు చేయటమా ? ఇదేమి సాంఘిక న్యాయం ?"
" గంజాయి మత్తు కన్నా భయంకరమైనది మతం మత్తు. గంజాయి కి విరుగుడు ఉంది. మతానికి లేదు. ఆ మత్తు తలకెక్కిన వాడు తను నాశనం అవుతాడు. సమాజాన్ని నాశనం చేస్తాడు.
" నువ్వన్నది నిజమే. కానీ ఉగ్రవాదం కేవలం ఇస్లాం కే పరిమితం కాలేదు. చరిత్ర పుటలు తిరగేస్తే మతాల పేరుతో జరిగిన దారుణాలు మనల్ని కదిలించి వేస్తాయి. హిందూ మతము లో అగ్ర వర్ణాల వారు అమాయక శ్రామిక జీవులను
" పంచములు" అన్న పేరుతో ఊచ కోత కోశారు. జంతువుల కన్నా హీనంగా చూశారు.
తమకు అనుకూలంగా వేదాలకు వక్ర భాష్యాలు చెప్పి మతం పేరుతో ఇష్టా రాజ్యాన్ని ఏలారు. నేటికీ ఉత్తర కొన్ని చోట్ల ఈ విష సంస్కృతి అవశేషాలు ఉన్నాయి.
కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం అగ్రవర్ణాల వారిని సమర్థిస్తున్నారు. అటు పశ్చిమ దేశాల్లో బైబిలు ఇంగ్లీష్ అనువాదం జరిగే వరకు మతాధికారులు చక్రవర్తుల అండ తో పేట్రేగి పోయారు. ప్రొటెస్టెంట్స్ వారి ఆగడాలు తగ్గాయి.
తమలో ఉన్న బలహీనతలు, అవలక్షణాలు, అహం కప్పి పుచ్చుకోవడానికి ప్రతి మతంలో స్వార్థపరులు మృతి గ్రంథాలను తమ ఆయుధంగా వాడుకున్నారు. హిందూ సమాజం నుండి మిషన్ జన్నత్ లో చేరిన ఎందరో అభాగ్యులు ఇలాంటి మృగాల చేతిలో సగం చచ్చిన
వారే . మళ్ళీ ఈ అంటువ్యాధి ఇస్లాం పేరుతో ఈ సంస్థకు కూడా సోకిందా ?" ఇనాయతుల్లా పూర్తిగా ఢీలా పడిపోయాడు. "
" మీరు బాధపడకండి మామూ ! త్వరలోనే మీ జన్నత్ లో ఉన్న విషపు మొక్కను ఏరి పారేస్తాము. అంతవరకు ఈ రహస్యం తెలియనట్లే ఉండండి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వారు జాగ్రత్త పడిపోతారు. "
అలాగేనని తలవూపాడు ఇనాయతుల్లా.
" మీ డోనార్స్ లిస్ట్ ఇస్తారా ? స్టడీ చేయాలి. మరో విషయం మీరు మిషన్ జన్నత్ గురించి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వకముందే ఆపరేషన్ జన్నత్ ఊపిరి పోసుకుంది. తమ దందా సాఫీగా సాగేందుకు పీ. ఓ.కే మిలిటెంట్ ట్రైనీ క్యాంపు నుండి ఉగ్రవాదులను దిగుమతి చేసుకున్నారు సంస్థ సభ్యులు. అంటే మిషన్ జన్నత్ చర్చల స్థాయిలో ఉన్నప్పుడు ఎవరెవరు మీతో ఆలోచనలు పంచుకున్నారో కచ్చితంగా వారిలో ఒకరు ఆపరేషన్ జన్నత్ మూలస్థంభం ".
నమ్మలేనట్లుగా చూశాడు ఇనాయతుల్లా. ఆ ప్రొఫెసర్ కు తల తిరిగి పోయింది.
" నేనొక ఆదర్శం తో మన యువకుల ను బాగుచేయాలని
చూస్తుంటే ఆపరేషన్ జన్నత్ ఇస్లాం పేరుతో నన్నొక పావులా వాడుకుంటోంది " నిట్టూర్చాడు ఇనాయతుల్లా.
" మిషన్ జన్నత్ ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో స్థాపించాలని వారి మాస్టర్ ప్లాన్. ఆ ప్రపోజల్ తో మిమ్మల్నేవరైనా కలిశారా "
" ఇంతవరకు లేదు . బహుశా త్వరలోనే ఆ వ్యక్తి నన్ను కలవొచ్చు. నాకు చాలా వ్యక్తుల నుండి, ఎన్.జీ.వో లో నుండి ఆహ్వానాలు అందుతున్నాయి మరిన్ని శాఖలు ప్రారంభించాలని. ఇంత మూమెంట్ వచ్చింది కనుక అలాంటి వారికి అవకాశమివ్వకుండా వ్యవస్థ మొత్తం తన చేతిలోనే
ఉండాలని ఆ వ్యక్తి తప్పక వస్తాడు. వెంటనే నీకు తెలియజేస్తాను. "

రాత్రి పడుకోబోయే ముందు అమ్మ కు ఇవ్వవలసిన మందు లిచ్చి, మెల్లగా పడుకోబెట్టి దుప్పటి సరిజేసింది మెహర్. తను బెడ్ మీద ప్రశాంతంగా కూర్చుంది. ఏదో ఇంగ్లీష్ నెలలు చదవసాగింది.
పది నిమిషాల తర్వాత సెల్ మోగింది. అటువైపు ఆదిత్య అయిదు నిమిషాలు మాట్లాడాడు.
" అమ్మా ! " మెల్లగా పిలిచింది మెహర్. ఆమె కళ్ళు తెరిచింది.
" ఆదిత్య వాళ్ళకు బాగా కావలసిన వ్యక్తి కి యాక్సిడెంట్ అయిందట. చాలా రక్తం పోయిందట. అతడికి అవసరమైనంత రక్తం ఆసుపత్రిలో లేదట. నా బ్లడ్ గ్రూపు
సరిపోతుందట. రక్తం ఇవ్వగలవా అని అడుగుతున్నాడు
నీతో మాట్లాడి చెప్పమన్నాడు " వివరంగా చెప్పింది మెహర్ " నీ బ్లడ్ గ్రూప్ ఆదిత్య కెల్లా తెలుసు. " నవ్వుతూ అడిగింది మెహర్ తల్లి.
" మా I.D కార్డ్స్ లో ఉంటుంది గా. ఇప్పుడు ఏం చేయమంటావ్? మెహర్ స్వరం లో సందేహం.

***************************************************

‌‌‌కొనసాగించండి 35