Read Those three - 35 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • అరె ఏమైందీ? - 21

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 35

" ఒక వ్యక్తి ప్రమాదం లో ఉన్నప్పుడు మనం తప్పకుండా సహాయం చేయాలి కదా ! సందేహం ఎందుకు ? బ్లడ్ ఇవ్వు"
" మరి ఇంత రాత్రి...........? "
" ఆ దిత్య మనకెంతో కావలసిన వాడు . అతడి విషయంలో నాకెలాంటి భయాల్లేవు."
తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మెహర్.
ఆదిత్య వచ్చాడు. చనువుగా బెడ్ పైన కూర్చున్నాడు.
" నా మీద మీ కున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్. మీ మంచి
మనసు మీ అబ్బాయిని త్వరగా మీ దగ్గరకు చేరుస్తుంది. ఇది ముమ్మాటికీ నిజం." ఆదిత్య మాటలకు ఆమె నవ్వింది.
రాత్రి పదిగంటల వేళ . చలికాలం. సన్నగా మంచు పడుతోంది. బుల్లెట్ వేగానికి గాలి తీవ్రత పెరిగింది. వెనుక కూర్చున్న మెహర్ అప్రయత్నంగా ఆదిత్య కు అతుక్కు పోయింది. కళ్ళు మూసుకుని అతడి భుజం పై వాలి పోయింది. అతడి స్పర్శ లో అనుభూతి ఆమెను గిలిగింతలు పెడుతోంది. ఆమె వెచ్చని ఊపిరి అతడి భుజాలకు తగిలి
అతడూ తన్మయత్వంలో ఉన్నాడు.
నిమిషాల వ్యవధిలో బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం, బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగిపోయాయి. అప్పటికే పేషెంట్ బ్లడ్ ట్రాన్ఫ్యూషన్ లో ఉన్నాడు. మెహర్ ది అదనంగా తీసుకున్న రక్తం.
స్పెషల్ వార్డ్ కారిడార్ లో మెహర్ ఆదిత్య మెయిల్స్ లో కూర్చుని ఉన్నారు. అరగంట చాలా నెమ్మదిగా గడిచింది.
సర్జన్ వచ్చాడు. ఆదిత్య, మెహర్ నిలుచున్నారు.
" ఇక భయం లేదు. ప్రాణాయామం తప్పింది. సాధారణంగా " హిట్ అండ్ రన్" కేసులో హెడ్ ఇంజ్యురీ బలంగా ఉంటుంది. కానీ ఈ కేసులో తలకు పెద్ద గాయం కాలేదు.
రక్తం ఎక్కువ పోవటం వల్లే కేసు క్రిటికల్ అయింది.
మెడికల్ ఎయిడ్ అందటం కాస్త ఆలస్యం అయింది. ఎనీ వే వియ్ నీడ్ నాట్ వర్రీ . "
నవ్వుతూ ఆదిత్య ్. భుజం తట్టాడు సర్జన్. ఆదిత్య, మెహర్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.
" పేషెంట్ ను ఒకసారి చూసి నేను బయలు దేరుతాను.
ఆదిత్య కదిలాడు. మెహర్ అతడిని అనుసరించింది.
" మీకు దగ్గర బంధువులా ? " అడిగింది మెహర్. ఆదిత్య ఏమీ మాట్లాడలేదు.
ఇద్దరూ ICU. ఛాంబర్ లోకి అడుగు పెట్టారు. పేషెంట్ ను చూసి అదిరి పడింది మెహర్. ఆదిత్య వైపు అయోమయం
గా చూసింది. ఆదిత్య మౌనంగా ఉండి పోయాడు. ఎడమ కనుబొమ మీద గాయం మచ్చ చూసి ఆమె కదిలి పోయింది.

ఏడుపు ఉప్పెనలా తన్నుకు వచ్చింది. బేలగా ఆదిత్య గుండెలపై వారి మౌనంగా రోదించింది. ICU లో నర్సులు ఆమెను జాలి గా చూశారు.
బొమ్మ లా చలనం లేకుండా కూర్చుని ఉంది మెహర్. ఆ క్షణంలో సంతోషించాలో, బాధపడాలో ఆమెకు అర్థం కాలేదు.
" ఆ దారిలో నేను రావడం quite accidental.. ఆ గల్లీ చివరి నా చిన్న నాటి స్నేహితుడు ఒకడున్నాడు. చాలా కాలమైంది అతనిని కలిసి. తిరిగొస్తుంటే ఫుట్ పాత్ పై స్పృహ లేకుండా పొడి ఉన్నాడు అన్వర్. అతడిని నేను చూడటం కేవలం గాడ్స్ మిరాకిల్. వెంటనే అంబులెన్స్ పిలిపించటం, హాస్పిటల్ లో అడ్మిట్ చేయటం జరిగి పోయాయి.
భయ్యా ! మీకు కనిపించక పోతే తన పరిస్థితి ఏమిటి ? " ఆలోచనతో, భయంతో మెహర్ వణికిపోయింది.
" మీ అమ్మ గారి మమకారమే మీ భయ్యాను కాపాడింది.
ఈ ఉదయమే అతడుండే గదిని ట్రేస్ చేయగలిగాను. రేపు ఉదయం కలవాలని నా ప్లాన్. కానీ దేవుడు మా ఇద్దరినీ ఇలా కలిపాడు. " నిట్టూర్చాడు ఆదిత్య.
" అన్నయ్య కు ఇంకా ఫర్వాలేదు కదా " మెహర్ లో సందేహం, భయం తొలగి పోలేదు.
" డాక్టర్ చెప్పింది మీరు విన్నారుగా. ఇంకా సందేహం ఎందుకు ? ముందు గా మీ అన్నయ్య ను ఇంతియాజ్ కంటబడకుండా కాపాడాలి. పోలీసులు అరెస్టు చేయకముందే మీ అమ్మ, అన్నయ్య కలవాలి." ఆలోచిస్తూ అన్నాడు.
అన్వర్ ను వదిలి వెళ్ళ లేకపోయింది మెహర్. కంటి రెప్ప
ఆర్పలేదు. ఉంటే బావిలా ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ నే ఉంది.
జ్నాపకాల దొంతరతో మనసు నిండి పోయింది. గుండె బరువెక్కింది.
" అమ్ౠ ! మీ అమ్మాయి దయ వల్ల మా వాడి ప్రాణాలు నిలిచాయి. మీకు నేనెంతో ఋణపడి ఉన్నాను. మీ ఋణం ఎక్కువ రోజులు ఉంచుకోను. మీ అన్వర్ తోనే ఇంటికి వస్తాను. రాత్రి పూట బైక్ మీద మెహర్ని ఇంటి కి తీసుకు రావటం మంచిది కాదు. ఉదయమే దిగబెడతాను. " మెహర్ తల్లికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు.
అంతసేపు మెలకువ గా ఉన్న మెహర్ తల్లి నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రపోయింది.
తెలతెలవారుతుండగా కొద్దిగా కదిలాడు అన్వర్. మొహం లో బాధ కనిపించింది.
డ్యూటీ నర్సు తక్కువ మోతాదులో డాక్టర్ పర్మిషన్ తో మత్తు ఇంజెక్షన్ అన్వర్ కు ఇచ్చింది. మెహర్ ను ఇంటి దగ్గర దిగబెట్టి మళ్ళీ హాస్పిటల్ కు బయలుదేరాడు ఆదిత్య.

*************************కొనసాగించండి 36 లో ****