Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 26 - లక్కవరం శ్రీనివాసరావు

శుక్రవారం పగలు పదకొండు  గంటలు , సాగర్ 'బి' స్కూల్ మెయిన్ గేట్  దగ్గర యాదగిరి.  షేర్ ఆటో కోసం నిరీక్షణ .  ఆ రోడ్డు చివర ఒక ఆటో నిలిచి ఉంది . యాదగిరిని చూడగానే మెరుపులా  కదిలి  క్షణాల్లో  లో వచ్చి  అతడి ముందు నిలి చింది .  యాదగిరి ఎక్కడు . ఆటో కదిలింది . ముందే ఆటో లో ఇద్దరున్నారు . వారిద్దరి మధ్య యాదగిరి కూర్చున్నాడు . 

శుక్రవారం రాహుకాలం ఘడియాల్లో లక్ష్మీ దేవి పూజ చేస్తే అనుకున్నది సిద్ది స్తుందని  వాళ్ళ వూరి పెద్ద పూజారి  యాదగిరి తో చెప్పాడు . అందుకే ప్రతి శుక్రవారం మసీదు కెళ్ళి మరీ పెద్ద  పూజారి  చెప్పినట్లు తంతు  తూ . చ  తప్పకుండా జరిపిస్తున్నాడు యాదగిరి ఉరఫ్ యాకూబ్  ! ఎంత నిష్ట . !

పది నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత  రద్దీ లేని చోటికి వచ్చి  ఆటో ఆగింది . ఆటో  డ్రైవర్ మెరుపులా 'yoo' టర్న్ తీసుకొని  అభిముఖం గా వేగంగా వెళ్ళ సాగాడు . 

" ఎందుకు యూ టర్న్ తీసుకున్నావ్ ? నేను వెళ్ళ వలసింది  ఇటు కాదు .  " కంగారుగా అన్నాడు యాదగిరి 

" అరవకుండా నోరు మూసుకొని కూర్చో " యాదగిరి కి ఎడమ వైపు ఉండే వ్యక్తి  యాదగిరి చెవిలో కటువుగా  గుసగుసలాడాడు .  అతడి చేతిలోని పిస్టల్ మోనా యాదగిరి డొక్కలో  గుచ్చుకుంటోంది . కుడి వైపు ఉన్న వ్యక్తి అతడి కుడి చేతిని వాటేసుకున్నాడు . ఎటూ కదల్లేని పరిస్తితి . 

యాదగిరి కి పరిస్థితి అర్థమైంది. తను పోలీస్ ట్రాప్ లో ఉన్నాడు . నోరు మూసుకొని కూర్చోవటమే  తనకు మంచిది . 

గంట ప్రయాణం చేసి ఓ కాలనీ లోకి ప్రవేశించింది ఆటో . కొత్తగా ఏర్పడుతున్న కాలనీ . ఇల్లు అక్కడక్కడా విసిరేసినట్లున్నాయి . ఒక పెద్ద మేడ  ముందు  పోర్టికోలో ఆగిడి ఆటో . 

యాదగిరి ని లోపలికి తీసికెళ్లారు . విశాలమైన హాలు. డూప్లెక్స్ .  ఒక వైపు మూడు గదులు . యాదగిరిని ఓ గదిలోకి తీసుకొచ్చారు .   విశాలం గా ఉంది ఆ గది  .  ఒక టేబిల్, నాలుగు కుర్చీలు ఉన్నాయి .  గోడకు ఆన్చి ఒక బరువైన ఐరన్ కుర్చీ ఉంది . యాదగిరి ని అందులో అరదండలతో బంధించి కూర్చోపెట్టారు . 

ఐదు నిమిషాలు మౌనం గా గడిచాక ఆ గదిలోకి ఇంతియాజ్ అడుగు పెట్టాడు . అతడి వెనకే చిరు నవ్వు తో  ఆదిత్య .

" ప్రయాణం బాగా జరిగిందా యాదగిరి ఉరఫ్..........? ఇంతియాజ్ అడిగాడు . 

నోరు మెదపలేదు యాదగిరి. "యాదగిరి ఉరఫ్.. "   రెట్టించాడు ఇంతియాజ్ . 

" ఉరఫ్ యాకూబ్  " గొణిగాడు యాదగిరి . 

అదిత్యను  మింగేసేలా చూశాడు .

 "చూపులతో చంపేస్తావా  యాదగిరి ?"

యాదగిరి చిరునవ్వు తో నే ప్రసన్నంగా  అడిగాడు . 

యాదగిరి తలవంచుకున్నాడు . " నేనెవరో నీకు తెలుసు .. మీరు మా టార్గెట్ అయినప్పుడు మీరు మా కదలికలు ప్రతి క్షణం గమని స్తుంటారు . మీ హై కమాండ్ మా గురించి అన్నీ వివరాలు చెప్పి హెచ్చరించి ఉంటుంది . 

అవుననలేదు . కదనలేదు యాదగిరి . 

" ఈ ఆదిత్య సాయం తో కూపీ లాగి నన్ను  పట్టుకున్నారు. దాని వల్ల ప్రయోజనం జీరో . మీ వలలో పడ్డ చిరు చేపను నేను " యాదగిరి నవ్వాడు . 

" ఆవగింజయంత దొరికినా చాలు. కొ సవరకు అల్లుకు పో గలము .  నీ చేత నిజాలు ఎలా కక్కించాలో తెలుసు . "

" నిజాలు .. నో ప్లూరల్ ఓన్లీ సింగులర్ " మళ్ళీ నవ్వాడు యాకూబ్ . " నాకు తెలిసిన నిజం ఒక్కటే .  I am only a tool. ----hacker . అనంతరామ్  అనే వ్యక్తి నుండి మాల అందుకుంటాను . ఇవ్వవలసిన వాళ్ళకు ఇచ్చి డబ్బు వసూల్ చేస్తాను .  నా కమీషన్ పోను మిగతా పైకం అనంతరామ్ కు పైసా పోకుండా చెల్లిస్తాను . "

" అనంతరామ్ మరో ఉరఫ్.. అవునా ?"

నాకు తెలియదు . నాకు సరుకు వేసే వ్యక్తి అనంతరామ్ గానే పరిచయం అయ్యాడు . "

ఈసారి ఇంతియాజ్ నవ్వాడు . 

" దాదాపు  పడినేలాల క్రితం జరిగిన సంఘటన . ఎల్. ఓ. సీ దాటుతున్న మిలిటెంట్లను సరిహద్దు భద్రతా దళాలు టార్గెట్ చేశాయి . వాళ్ళలో నలుగురు చనిపోయారు . ఒకడు తప్పించుకొని ఇక్కడకు చేరాడు . ఆపరేషన్ జన్నత్ కు అతడు గుండె లాంటి వాడు . .. అన్వర్ హుస్సేన్ ." 

ఆదిత్య  ఉలిక్కిపడ్డాడు . ఇంతియాజ్ ను నమ్మలేనట్లు  చూశాడు . ఇంతియాజ్ ఆదిత్యను గమనించాలడు . అతడి దృష్టి యాకూబ్ పైనే ఉంది . 

యాకూబ్ పెదవులపై మళ్ళీ చిరునవ్వు . " థాంక్స్ ఏ. సీ. పీ గారు ! నాకు తెలియని చాలా విషయాలు చెబుతున్నారు . అనంతరామ్ అన్వర్ అయి ఉండవచ్చు .  కచ్చితం గా చెప్పలేను . "

ఆనంతరమే అన్వర్ అని యాకూబ్ కు తెలుసు . కావాలనే అలా చెప్పాడు . 

" నీ ధైర్యం నాకు నచ్చింది యాకూబ్ !  రియల్లీ వెల్ trained  యు ఆర్ .పట్టుబడ్డానన్న కంగారు  నీలో లేదు . యు ఆర్ రెడీ టు ఫేస్ యువర్ ఫేట్ ."

కొన్ని క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు యాకూబ్  . " మా ఆర్గనైజయశం లో మాకు అలాగే ట్రైనింగ్ ఇచ్చారు . ఇందులో డబ్బుకోశం చేరాము . కానీ---ఆశయం మా ఊపిరి . మా అప్రోచ్ లో హింస లేదు . ప్లానింగ్ ఉంది .  పేద  ముస్లిం   యువకుల్ని  ప్రయోజకులు గా మార్చటం మా సంస్థ యొక్క లక్ష్యం ." యాకూబ్ మాటల్లో  గర్వం స్పస్టం గా  వినిపించింది .

" ఒక జాతి యువకుల కోసం మరో జాతి యు వకులను పాడు చేస్తున్నారు .   మట్టుకు బానిసల్ని చేస్తున్నారు ." 

" చేతి నిండా డబ్బు, హద్దుల్లేని స్వేచ్చ .. ఏ రెండూ  ఉంటే ఏ జాతి యువత చెడిపోదు  ? ఎవరూ మినహాయింపు కారు . అలాంటి వారే మా టార్గెట్ . వారిని పనిగట్టుకొని పాడుచేయవలసిన పని లేదు .  ఏ కారణం చేతనైనా  వారి దారి లోంచి  మేము తప్పుకుంటే  మాలాంటి వారికోసం వారే వెదుక్కుంటారు  సార్ ! చేతులు ముడుచుకొని కూర్చొరు ." 

అతడి ధైర్యం మాట తీరు ఇంతియాజ్ కు కోపం తెప్పించాయి . కానీ అతడి లాజిక్ కరెక్ట్ అనిపించింది . అందుకే మాట్లాడలేకపోయాడు . అతడికెదురుగా కుర్చీ లో 

  కూర్చున్నాడు . 

"నువ్వు చాలా తెలివైన వాడివి. ఏమి చదువుకున్నావు ?"

" మా నాన్న ఓ మారుమూల గ్రామం లో చిన్న టైలర్ . నలుగురు ఆడపిల్లల తర్వాత నేను పుట్టాను . నన్నేం చదివించగలాడు ? ఇంటర్ కే  చేతులెత్తేశాడు .  ఆ తర్వాత కరెస్పాండెంస్  కోర్స్  పుణ్యమా అని ఎం . కామ్ వరకు లాగించాను .  ఎంత చదివినా ఉద్యోగాలేవి  ? ఓటు బ్యాంక్ రాజకీయాలు మా దారులన్నీ మూసేశాయి . పధకాల పేరు తో ప్రజలకు డబ్బులు పంచుతూ వారిని సోమరులను చేస్తున్నారు . నో డెవలప్మెంట్. నో జాబ్స్  అందుకే ఇలా అడ్డదారులు దాటవలసి  వచ్చింది  .