Featured Books
  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 25 - లక్కవరం శ్రీనివాసరావు

 

 

తన పరిస్థితికి  కరువుతీరా  ఏడవాలనిపించింది  .  బాధను పంచుకునే నేస్తం అలీ దూరమయ్యాడు . రహీమ్ తన వింగ్ లీడర్ రోబో లాంటి వాడు .  బిజినెస్ తప్ప మరో విషయం మాట్లాడడు . అతడికి ఇచ్చిన శిక్షణ  అలాంటిది .  అన్వర్ ఇంటి వరకు వెళ్ళే సాహసం చేయలేదు . తల్లితండ్రుల మొహం చూసే ధైర్యం లేదు . పైగా తన మీద గట్టి నిఘా ఉంది . ఇంటికి వెళ్ళి  , తన ఉనికి డిపార్ట్మెంట్ కు తెలిసి తను పట్టుపడితే , తల్లిదండ్రులకు సమాజం లో స్థానం ఉండదు . తనకు జీవితమే ఉండదు . అందుకే ఆ ప్రయత్నం చేయరాదనుకున్నాడు . ఆ రోజు పెద్దగా పని లేదు .  సాయంత్రం వరకు  అడ్డదిడ్డంగా   ఊరంతా తిరిగి  అర్థరాత్రి ఇల్లు చేరుకున్నాడు .  విశ్వనాధ శాస్త్రి ఇంట్లో  శాస్త్రి, సునీత , అమల దిగాలుపడి  కూర్చుని ఉన్నారు .  ఇల్లు నిశ్శబ్దంగా ఉంది . 

అన్వర్ ను చూడగానే అమల ఒక్క పరుగులో అతడి దగ్గరకు వచ్చింది .  అన్నయ్యా  " అంటూ బావురుమంది . అన్వర్ కంగారు పడి పోయాడు . " ఏమైందమ్మా  ?"

" తమ్ముడు  అమ్మ తిట్టిందని  ఉదయం  అనగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు . ఇంతవరకు రాలేదు ." కళ్ళు  తుడుచుకుంటూ చెప్పింది . 

" పెద్దగా ఏమీ అనలేదు అనంత్  ! ఎందుకు రా ప్రతిదానికి అక్కను ఏడిపిస్తావు  అని గట్టిగా  అంది.  అంతే  మాట మాట పెరిగింది . వాడు పిచ్చి కోపం లో మాట తూలాడు . 

ఈవిడ చేయి చేసుకుంది .  వాడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు . ఇంతవరకు రాలేదు .  విశ్వనాధం జరిగినది మూడుముక్కల్లో  చెప్పాడు,  కొడుకు కనిపించక పోవడం  తో డీలా పడిపోయాడు .  ఆనాటి  తన పరిస్థితి  కళ్ళ  ముందు  మెదిలింది అన్వర్ కు . సునీతను చూశాడు , రాజు, రెహమాన్  , సుఖదేవ్ ల అర్థాంగి త్రయం ఆమెను ఓదార్చే విఫల  ప్రయత్నం చేస్తున్నారు . 

 సునీత శోకదేవతలా ఉంది .  ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఇంకి పోయాయి .  ఆమెను కదిలించాలంటే అన్వర్ కు భయంగా ఉంది . అన్వర్ ను చూడగానే ఒక్క ఉదుటు న దగ్గరకు వచ్చింది . మాటల్లేవు . వట్టి బేలచూపులే .  విశ్వనాథం వాళ్లీ ద్దరి దగ్గరకు  వచ్చాడు . " రాజు ,  రెహమాన్ జీ , సుఖదేవ్  జీ వాడిని వెదికే పని లో ఉన్నారు . మా టీచర్లు కూడా . నేనే  కాలు చేయి ఆడక మీ అక్కయ్యాను ఓదారుస్తూ కూర్చున్నాను. అయినా ఈ మహానగరం లో ఎక్కడని వెదకటం ?" శాస్త్రి గారి కళ్ళల్లో మరో మారు నీళ్ళు సుళ్ళు  తిరిగాయి .  తుడుచుకున్నాడు . అన్వర్ కు తన తల్లిదండ్రులు మరోసారి గుర్తుకొచ్చారు .  తను కనిపించకుండా పోయినప్పుడు ఇలాగే నరకం చూసి ఉంటారు . సునీత లో ఆనాటి ఆమ్మీజాన్  స్పష్టం గా కనిపిస్తోంది .

" ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మీ అక్కయ్యకు నీ మీదే నమ్మకం. నే కోసమే చూస్తోంది .  నీకోసం చాలాసార్లు ఫోన్ చేశాం . స్విచ్ ఆఫ్ అని  వచ్చింది " విశ్వనాధ  శాస్త్రి అర్థం కానట్లు చూశాడు .  నుదురు కొట్టుకున్నాడు అన్వర్. ఊరంతా బలాదూర్ గా తిరుగుతూ డిస్టర్బ్  కాకూడదని స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు తను . 

క్షణం ఆలస్యం చేయలేదు . వెంటనే రహీమ్ కు ఫోన్ చేశాడు . 

" వివరాలు మనం కలిసినప్పుడు  చెబుతాను. నాకు అర్జెంట్ గా ఒక బైక్ కావాలి . ట్యాంక్ ఫుల్ చేసి పంపించు . పది నిమిషాల్లో మన సెంటర్ కు వస్తాను ."

" అక్కా ! నందూ తోనే  తిరిగొ స్తాను ."  సుడిగాలిలా వెళ్ళిపోయాడు . 

తెల తెలవారుతుండగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ మెట్టు మీద జోగుతున్న నందకుమార్ ను చూశాడు . షాపులన్నీ మూసి ఉన్నాయి .  ఆ కాంప్లెక్స్ కారిడార్ లో నిశ్శబ్దం తాండవిస్తోంది .   బండి శబ్దం తో ఉలిక్కిపడి లేచాడు నందు .   అన్వర్ ను చూడగానే సుడిగాలిలా వచ్చి వాటేసుకున్నాడు . తెరలుతెరలుగా తన్నుకొస్తున్న ఏడుపు .``శబ్దం బయటకు రావటం లేదు . వెక్కిళ్లు తప్ప. కాసేపు ఓదార్పుగా వీపు నిమురుతూ ఉండిపోయాడు . 

"పద" కదిలాడు అన్వర్. 

' అమ్మ" భయంతో. సందేహం తో ఆగాడు నందు . 

 " అమ్మంటే అంత భయమా ? మరి చెప్పకుండా పారిపోయావు .? అమ్మ అక్కడ గుండె పగిలేలా ఏడుస్తోంది . వేషాలు వద్దు  . బండెక్కు  " కొంచెం కటువుగానే అన్నాడు. పిల్లిలా అడుగులో అడుగులేసుకుంటూ వచ్చి అన్వర్ వీపుకు అటుక్కు పోయాడు . బండి బాణం లా ముందుకు దూసుకెళుతుంది , 

అరగంట లో సమతా సదన్  చేరుకున్నరు . వరండా లో వాలుకుర్చీ లో సుఖదేవ్ జీ జోగుతున్నాడు . సగం మడ చిన బెడ్ షీట్ మీద . నిద్ర సుఖమేరుగాడు అన్నట్లు రెహమాన్ గుర్రు పెడుతున్నాడు .  రాజు గోడకు జారగిలపడి  కునుకుపాట్లు  పడుతున్నాడు .  శాస్త్రి వాటా ముఖద్వారం కొంచెం తెరిచే ఉంది . లోపల హాల్లో ఉన్నవారి పరిస్తితి  బయట వారికి  మల్లే  ఉంది . మగతకు, మె లుకువకు మధ్య త్రిశంకు స్వర్గం లో ఉన్నారు . ఏడ్చి, ఏడ్చి అలసిన సునీత ఒళ్ళు   తెలీని స్థితి లో ఉంది . 

ఈ ఉద్విగ్న పరిస్తితి లో నిద్ర ఆమెకు ఒక వరం. 

దగ్గరకు వెళ్ళి మెల్లగా ' అక్కా' అన్నాడు అన్వర్ . ఆ చిరు సవ్వడికే ఉలిక్కిపడి లేచింది సునీత . 

" నందు" గుమ్మం దగ్గర బిత్తర చూపులు చూస్తున్న నందును చూపాడు అన్వర్ . 

అంతే .. ఒక్కసారిగా వాతావరణం లో మార్పు వచ్చింది . సునీత నందును వాటేసుకోవటం, వాడు వలవల ఏడవటం , అందరూ తేలికైన మనసులతో వారిద్దరి చుట్టూ చేరటం , అన్వర్ పై అందరి ప్రశంశల జల్లు .. అన్నీ అతి సహజం గా వరుస క్రమం లో జరిగిపోయాయి .

ఈ మొత్తం సన్నివేశాల  అనుభూతుల్ని ఆనాటి తన పరిస్తితికి  అన్వయించుకున్నాడు అన్వర్ . 

 తల తిరిగి పోయింది .ఎంత ప్రేమను, అనుభూతిని పోగొట్టుకున్నాడు తను . 

ఎంత బాధను గుండె బరువును తన వాళ్ళకు మిగిల్చాడు . 

ఇన్నాళ్ళు వెనకడుగు వేయిస్తున్న  సందేహాలు  గాలికేగిరె దూదిపింజెల్లా తేలిపోయాయి . ఇంటికి తిరిగి వెళ్లాలన్న కోరిక అన్వర్ మనసులో హిమాలయం లా పెరగసాగింది