Are Amaindi book and story is written by sivaramakrishna kotra in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Are Amaindi is also popular in థ్రిల్లర్ in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
అరె ఏమైందీ? - నవలలు
sivaramakrishna kotra
ద్వారా
తెలుగు థ్రిల్లర్
నేను రాసిన 'నులివెచ్చని వెన్నెల' ఎంతో చక్కగా ఆదరించినందుకు కృతజ్ఞతలు. ఆ ఆదరణ చూసి ఆనందపడే నేను ఈ 'అరె ఏమైందీ?' నవల వ్రాసి సిరీస్ గా పబ్లిష్ చేస్తూ వున్నాను. నా 'నులివెచ్చని వెన్నెల' ని ఆదరించినట్టుగానే ఈ నవలని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. నేను రాసే పుస్తకాలకన్నిటికీ ఇంగ్లిష్ లోనూ, తెలుగు లోనూ కూడా నేనే ఎడిటర్ ని. ఇంకెవరైనా నా పుస్తకాలని ఎడిట్ చేస్తే నాకు రచయితనన్న ఫీలింగ్ రాదు. నా రచనలన్నిటినీ నేనే ఎడిట్ చేసుకుంటాను. అందువల్ల కొంతవరకూ తప్పులకి అవకాశముంది. కాబట్టి మీకెక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఇతర రకాలైన మిస్టేక్స్ కానీ కనిపిస్తే దయచేసి మన్నించండి.
మాతృభారతి పాఠకులకి, నేను రాసిన 'నులివెచ్చని వెన్నెల' ఎంతో చక్కగా ఆదరించినందుకు కృతజ్ఞతలు. ఆ ఆదరణ చూసి ఆనందపడే నేను ఈ 'అరె ఏమైందీ?' నవల వ్రాసి సిరీస్ గా పబ్లిష్ చేస్తూ వున్నాను. నా 'నులివెచ్చని వెన్నెల' ని ఆదరించినట్టుగానే ఈ నవలని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. నేను రాసే పుస్తకాలకన్నిటికీ ఇంగ్లిష్ ...మరింత చదవండితెలుగు లోనూ కూడా నేనే ఎడిటర్ ని. ఇంకెవరైనా నా పుస్తకాలని ఎడిట్ చేస్తే నాకు రచయితనన్న ఫీలింగ్ రాదు. నా రచనలన్నిటినీ నేనే ఎడిట్ చేసుకుంటాను. అందువల్ల కొంతవరకూ తప్పులకి అవకాశముంది. కాబట్టి మీకెక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఇతర రకాలైన మిస్టేక్స్ కానీ కనిపిస్తే దయచేసి మన్నించండి. రచయిత కొట్ర శివ రామ కృష్ణ రచయిత పరిచయం రచయిత ఒక రొమాంటిక్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్. ఈయన వ్రాసిన నలభై అయిదు ఇంగ్లీష్ పుస్తకాలు ఈ బుక్స్ గా, ఇంకా
అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అది చాలా కాలం కిందట మేము చిన్నపిల్లలుగా వున్నప్పుడు. అదే చిరాకుతో అన్నాడు మనోజ్. తరువాత తనెంత పొగరుగా బిహేవ్ చేసేదో నీకూ తెలుసు. మనవైపు కన్నెత్తి చూసేది కూడా కాదు. అలాంటి ...మరింత చదవండిఅమ్మాయికి ఆ పొగరు ఇంకా అందాన్ని పెంచుతుందే కానీ తగ్గించదు. అయినా గులాబీ రేకులంటి ఆ అందాన్ని అనుభవించే అదృష్టం ఆ నింరంజన్ గాడు కొట్టేసాడు. వాడిగురించి ఆలోచిస్తూంటేనే నాకు అసూయగా వుంది. నాకు మాత్రం చాలా చిరాగ్గా వుంది. మరోసారి కోపంగా అరిచాడు అనిరుధ్. నువ్వసలు నా సమస్యకి ఎమన్నా పరిష్కారం చూపిస్తావా లేదా? నీ సమస్యని మర్చిపోలేదు. అక్కడికే వస్తున్నా. గట్టిగా నిట్టూర్చి కుర్చీలో అడ్జస్ట్ అయ్యాడు మనోజ్. నువ్వు ఆ సర్వేశ్వరాన్ని మరోసారి కలుసుకో. ఇంత మొత్తం అప్పు వారం రోజుల్లో తీర్చడం నీ వల్ల అయ్యే
అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ కాకపోతే సర్వేశ్వరం అదృష్టం అన్ని విషయాల్లోనూ కలిసి రాలేదు. మంజీరకి పన్నెండేళ్ల వయసు వున్నపుడు కాబోలు, నిర్మల చనిపోయింది. ఎందుకనో ఆ సమయంలో ఆవిడ పిచ్చి బాగా పెరిగి, బ్లడ్ ప్రెజర్ బాగా పెరిగి, ఎదో విపరీతం జరిగి చనిపోయిందని ...మరింత చదవండిఅసలు ఎం జరిగిందో అనిరుధ్ కి తెలియదు కానీ, ఆ కుటుంబంలో మాత్రం ఆ తరువాతనుండి చాలా మార్పులు వచ్చాయి. అప్పటివరకూ తన తండ్రితో ఎంతో స్నేహంగా వుండే సర్వేశ్వరం తన తండ్రితో మాట్లాడడం మానేసాడు. నిర్మల చనిపోవడంతో తన తల్లికి ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. నిజంగా ఎక్కువమార్పు మంజీరలోనే వచ్చింది. తను వాళ్ళింటికి వెళ్లి పలకరించినా తనతో మాట్లాడడం మానేసింది. తను ఆ విషయం తన తల్లితో అప్పట్లో ఫిర్యాదు చేసాడు కూడా. ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నకొద్దీ మగపిల్లలతో అంతా
అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నువ్వు చెప్పిందీ నిజమే అయినా, నేను ఏమీ ఆలోచించకుండా తనని పెళ్లి చేసేసుకోలేను. నాతో తన పెళ్ళికి వాళ్ళు అంతగా ఆలోచిస్తూండడంలో ఏదో పెద్ద రహస్యం వుందనిపిస్తూంది. అదేమిటో మొదట తెలుసుకోవాలి. అనిరుధ్ సాలోచనగా అన్నాడు. ...మరింత చదవండిఒక మార్గం వుంది. ఇది వర్క్ అవుట్ కావచ్చు కూడా. అదేమిటో ముందు చెప్పు. నువ్విలా సస్పెన్స్ మైంటైన్ చెయ్యాల్సిన అవసరం లేదు. చిరాగ్గా అన్నాడు అనిరుధ్. నువ్వా నిరంజన్ ని కలుసుకుని మాట్లాడు. నీకూ మంజీర కి పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయని చెప్పు. మంజీరని వదులుకోవడానికి వాడు అంత తేలికగా ఒప్పుకుంటాడని నేను అనుకోను. అందుగురంచయినా వాడు నీకు విషయం అంతా చెప్పొచ్చు. వాడి మొహం చూడ్డం అంటేనే నాకు చిరాకు. వాడిని కలుసుకుని మాట్లాడ్డం నాకసలు ఇష్టం లేదు. చిరాగ్గా అన్నాడు అనిరుధ్. కానీ
అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ ఇంక నేను వెళ్లివస్తాను. కుర్చీలోనుండి లేచి అన్నాడు అనిరుధ్. నీ లక్ష్యం కేవలం ఐ ఏ ఎస్ మాత్రమే అని నాకు తెలుసు. కానీ నీ గురించి ఎవరన్నా ఫీల్ అవుతూ వుంటే అది తెలుసుకునే ...మరింత చదవండిచెయ్యి. ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్ అయిన తరువాత కూడా ఆడతోడు లేకుండా మాత్రం జీవితం గడపవు కదా. తనూ లాప్ టాప్ తో పాటుగా కుర్చీలోనుండి లేచి అంది ప్రమీల. నీ ఉద్దేశం నాకు అర్ధం అయింది. నీ మనసులో అభిప్రాయం కనిపెట్టలేనంత బ్లైండ్ కాదు నేను. చిరునవ్వు నవ్వాడు అనిరుధ్. కానీ ఒక్క విషయం స్పష్టంగా చెప్తాను. మనోజ్ నిన్నెలా చూస్తాడో నేనూ అలాగే చూస్తాను. నిన్నా దృష్టితో ఎప్పుడూ చూడలేను. నువ్వూ మంజీర ఏ కాదు, మనిద్దరం కూడా చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం.