సమయం : ఉదయం 10:00 గంటలుస్థలం : విజయవాడ జిల్లా సెషన్స్ కోర్టు.
కోర్టు బయట కేమెరా ముందు TV - 6 న్యూస్ చానల్ యాంకర్ నించోని మాట్లాడుతుంది.
టీ.వి - 6 న్యూస్ యాంకర్ :
"బ్రేకింగ్ న్యూస్..."
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ సిట్ అధికారి ఏ.సి.పి అజయ్, సి.ఐ ప్రవీణ్ మరియు దివంగత ఎం.ఎల్.ఎ దేవేంద్ర రెడ్డి కుమారుడు అరవింద్ రెడ్డిలను కాసేపట్లో విజయవాడ సెషన్స్ కోర్టులో హాజరుపరచనున్నారు. మరి కాసేపట్లొ కోర్టు మొదటి హీరింగ్ మొదలవ్వబోతుంది.
టీ.వి - 6 న్యూస్ యాంకర్ :
వీరిపై...
డ్రగ్స్ మాఫియాతో కుమ్మక్కు...
బూటకపు ఎన్‌కౌంటర్లు...
డా. రాఘవరావు హత్య...
తులసి హత్య...
ఇంజినేరింగ్ స్టూడెంట్ పల్లవిపై అత్యాచారం, హత్య...
జూనియర్ డాక్టర్లు హరీష్, పద్మ కిడ్నాప్...
డాక్టర్ పద్మపై అత్యాచారం, హత్య...
డాక్టర్ శ్వేతపై హత్యాయత్నం...
పోనికెగూడెం కుట్ర...
వంటి అత్యంత తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి.
టీ.వి - 6 న్యూస్ యాంకర్ :
ఈ కేసులో అత్యంత సంచలన విషయం ఏమిటంటే...
మూడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిందని అందరూ భావించిన సంజీవిని ఫౌండేషన్ జునియర్ డాక్టర్ మరియు చనిపోయిన ఆ సంస్థ్ చైర్మేన్ డా. రాఘవరావు కుమార్తె అయినటువంటి శ్వేత బ్రతికే ఉన్నట్లు సిట్ అధికారులు ధృవీకరించారు.
ఆమె ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఈరోజు కోర్టులో వాంగ్మూలం ఇవ్వనున్నారు.
టీ.వి - 6 న్యూస్ యాంకర్ :
డాక్టర్ శ్వేతతో పాటు...
జూనియర్ డాక్టర్ హరీష్...
పొనికగూడెం గిరిజన గ్రామ యువకుడు సాంబయ్య...
కూడా ఈ కేసులో కీలక ప్రత్యక్ష సాక్షులుగా కోర్టుకు హాజరవుతున్నారు.
ఇప్పటికే సిట్ అధికారులు వేలాది పేజీల పత్రాలు, ఫోరెన్సిక్ నివేదికలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ఆధారాలు, సాక్షుల జాబితాను కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.
టీ.వి -6 న్యూస్ యాంకర్ చివరిగా... :
ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
అధికార పార్టీకి చెందిన దివంగత ఎమ్మెల్యే దేవేంద్ర రెడ్డి, సీనియర్ నాయకుడు సూర్యనారాయణలపై నమోదైన ఆరోపణలతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
టీ.వీ -6 న్యూస్ చానల్ వాళ్ళు ప్రతిపక్ష పార్టి అయిన యుజన పార్టీ ఎం.ఎల్.ఎ మరియు ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు అయినటువంటి "గంటా జనార్ధన్ "లైన్ లొకి వచ్చి మాట్లాడుతున్నాడు.
ఎం.ఎల్.ఎ గంటా జనార్ధన్ : ఇన్ని సంవత్సరాలు మేము చెబుతున్నదే ఇప్పుడు నిజమవుతోంది. రూలింగ్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని దారుణాలు చేసిందో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసు పూర్తిగా బయటపడే వరకు ప్రభుత్వం మీదకు నిరసనకు దిగుతాం
కాసేపటికి విజయవాడ జిల్లా సెషన్స్ కోర్టు వద్దకు కొన్నీ వాహనాలు వచ్చి ఆగాయి.
కోర్టు బయట భారీ పోలీసు బందోబస్తు.
మీడియా...ప్రజలు...
దేశవ్యాప్తంగా వచ్చిన వార్తా సంస్థల కెమెరాలు...
పూర్తి ప్రాంగణం ఉద్రిక్త వాతావరణంలో ఉంది.
అప్పుడే...
ఒక పోలీస్ వ్యాన్ నెమ్మదిగా కోర్టు ప్రధాన ద్వారం ముందు వచ్చి ఆగింది.
వెంటనే మీడియా కెమెరాలు ఆ వ్యాన్ వైపు తిరిగాయి. వ్యాన్ తలుపు తెరుచుకుంది.
ముందుగా...
ఏ.సీ.పి అజయ్ దిగాడు తన ముఖంలో గంభీరత...
అతని వెనక...
సీ.ఐ ప్రవీణ్ దిగాడు. పోలీస్ షూటౌట్ లొ కలిగిన గాయాల నుంచి కోలుకున్నా ఇంకా బలహీనంగా కనిపిస్తున్నాడు.
చివరగా...
దేవేంద్ర రెడ్డి కొడుకు అరివింద్ రెడ్డి. తలను కిందకు వంచుకొని దిగాడు. సిట్ అధికారులు ముందు తనని దేవేంద్ర లెడ్డి హత్య కేసులొ అనుమానితుడిగా అరెస్ట్ అయ్యి బైల్ మీద బయటకు వచ్చినా. తను ఇంతకు ముందు ఇంజినేరింగ్ స్టుండెంట్ పల్లివిపై అత్యాచారం, హత్యా నేరం, మరియు ఏ.సీ.పి అజయ్ తొ కలిసి మాధక ద్రవ్యాల సరఫరా కేసులలొ మళ్ళి అరెస్టయ్యాడు.
మీడియా వాళ్ళు మైకులతొ ఒక్కసారిగా వాళ్ళ ముందుకు దూసుకొచ్చారు..
"Mr. అజయ్... మీపై చేన ఆరోపణలు నిజమేనా...? తులసిని మీరు ఎందుకు చంపారు..?"
"Mr. ప్రవీణ్ మీరైన చెబుతారా...? పొనికెగూడెం గిరిజనంలొ గ్రామంలొ మీరేం ఏం చేశారు..? అక్కడ వాళ్ళ నీటి వనరులలొ నిజంగా విష రసాయనాలు కలిపారా...?"
"Mr. అరివింద్ రెడ్డి మీపై మొపబడిన ఆరోపణులకు మీరేమంటారు.?"
ఇలా వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నా వాళ్ళు ఎవ్వరు దేనికి సమాధానం చెప్పకుండా మౌనంగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఈలోపు పోలీసువాళ్ళు వచ్చి మీడియా వాళ్ళని వెనక్కి నెడుతున్నారు.
"బ్యాక్... బ్యాక్.. "
ముగ్గురినీ వేగంగా కోర్టులోకి తీసుకెళ్లారు.
అదే సమయంలో...
తెల్లని SUV కార్ ఒకటి కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించింది. దానిలో నుంచి డాక్టర్ శ్వేత దిగింది.
ఆకుపచ్చరంగు డ్రెస్...
సాధారణ రూపం...
కానీ కళ్లలో ధైర్యం.
ఆమెను చూసిన మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
"డాక్టర్ శ్వేత...!"
"నిజంగానె ఆమె బ్రతికే ఉంది..."
ఫ్లాషులు వరుసగా మెరుస్తున్నాయి. ఆమె వెనకాల...
డాక్టర్ హరీష్...
సాంబయ్య...
దిగారు. చివరగా...
సిట్ హెడ్ సాగర్ వర్మ
అతని వెంట...
ఎస్.ఐ జాన్ బాబు మరియు ఎస్.ఐ సుందర్ నడుచుకుంటూ వస్తున్నారు. ఒక రిపోర్టర్ పరుగెత్తుకుంటూ వచ్చాడు.
న్యూస్ రిపోర్టర్ : సర్...డాక్టర్ శ్వేత ఎలా బ్రతికారు...?
సాగర్ ఒక్కసారి అతని వైపు చూసి...
సాగర్ వర్మ : నో.. కాంమెంట్స్
అని మాత్రమే చెప్పి ముందుకు నడిచాడు.
సాంబయ్య చుట్టూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
ఇంత పెద్ద కోర్టు...
ఇంత మంది పోలీసులు...
ఇంత మంది మీడియా...
తన జీవితంలో ఇదే మొదటిసారి.
హరీష్ అతని భుజంపై చేయి వేసి...
జూ.డా. హరీష్ : భయపడకు...
అన్నాడు.
సాంబయ్య చిన్నగా తల ఊపాడు.
అందరు కోర్టులొ హాజరయ్యారు.
కోర్ట్ ఆఫీసర్ గట్టిగా ప్రకటించాడు.
"ఆల్ రైజ్" అని అనగానె కోర్టులొ అందరూ లేచారు. కాసేపటికి జడ్జి లోపలికి వచ్చి జడ్జి బెంచ్ మీద కూర్చున్నాడు.
జడ్జి : Be Seated.
అని చెప్పగా. అందరూ కూర్చున్నారు. తరువాత కోర్టు క్లర్క్ కేసు వివరాలు చదివాడు.
కోర్టు క్లర్క్ : స్టేట్ వెర్సస్ మెంతాడ అజయ్ కుమార్ , మగడాల ప్రవీణ్, మరియు ఎందోరు అరవింద్ రెడ్డి
జడ్జ్ కేసు ఫైల్ తిరగేస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైపు చూశాడు.
జడ్జ్ : ప్రాసిక్యూషన్... మీరు ప్రారంభించండి.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : మై లార్డ్ ఇక్కడ నించున్న ఈ ముగ్గురు నేరస్తులు విడి విడిగా చేసిన నేరాల కంటె కలిసి చేసిన నేరాలె అధికంగా. అది మాధక ద్రవ్యాల విషయంలొ కాని, అబద్దపు ఎన్కౌంటర్లతొ మనుషుల ప్రాణాలు తీసిన విషయంలొ కాని, అంతకంటె మించి పొనికెగూడెం విషయంలొ కాని వీళ్ళు చేసిన నేరాలు సాధారణమైనవి కావు.
జడ్డజి నిశితంగా వింటున్నాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : మై లార్డ్ రోజు మొదటి విచారణలో (1st Hearing) పొనికెగూడెం కుట్రకు సంబంధించి ప్రాసిక్యూషన్, నిందితులు మెంతాడ అజయ్ కుమార్, మగడాల ప్రవీణ్ మరియు ఎందోరు అరవింద్ రెడ్డి పై నమోదైన ప్రధాన కుట్ర మరియు సంబంధిత నేరాలకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలను కోర్టు రికార్డులో ప్రవేశపెడుతున్నాం.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : ఈ కేసు కేవలం ఒక హత్య కేసు కాదు... ఒకే కుట్రను దాచిపెట్టడానికి వరుసగా జరిగిన హత్యలు, అపహరణలు, అత్యాచారాలు, సాక్ష్యాల ధ్వంసం మరియు ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి సంబంధించిన కేసు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : ప్రాసిక్యూషన్ వీటన్నిటికి సంబంధించి క్రింది డాక్యుమెంట్లను కోర్టు ముందు సమర్పిస్తోంది.
అని చెప్పి ఒక ఫైల్ జడ్జికి ఇస్తాడు.
తర్వాత...
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : ఈ ఫైల్‌లో...
SET – A : పోనికెగూడెం కుట్ర (Ponikegudem Conspiracy)
• SIT దర్యాప్తు నివేదిక
• కాలుష్య నియంత్రణ మండలి నివేదిక
• ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక
• నీటి నమూనాల రసాయన విశ్లేషణ నివేదిక
• సంజీవిని రూరల్ హెల్త్ ఫౌండేషన్ వైద్య సర్వే
• డా. రాఘవరావు తుది పరిశోధన పత్రాలు
• డా. హరీష్ ల్యాబ్ పరిశోధన నివేదిక
• సంఘటన స్థల ఫోటోలు
• ఉపగ్రహ (Satellite) చిత్రాలు
• రెవెన్యూ శాఖ భూ రికార్డులు
• గనుల శాఖ (Mining Department) పత్రాలు
• బ్యాంకు లావాదేవీల వివరాలు
• చనిపోయిన ఎం.ఎల్.ఏ దేవేంద్ర రెడ్డి అనుచరులు శివ, వివేక్ మరియు సూర్యనాయాణ పీ.ఎ రవికుమార్ ఈ ముగ్గురు ఇచ్చిన వాంగ్మూలాలు
SET – B : డా. రాఘవరావు హత్య & ఆధారాల తారుమారు (Dr. Raghava Rao Murder & Cover-up)
• హత్య దర్యాప్తు నివేదిక
• మొదటి పోస్టుమార్టం నివేదిక
• సవరించిన / తప్పుడు పోస్టుమార్టం నివేదిక
• పోస్టుమార్టం నివేదికలో మార్పులపై ఫోరెన్సిక్ అభిప్రాయం
• శవ పరీక్ష ఫోటోలు
• సంఘటన స్థల ఫోటోలు
• సాక్షుల వాంగ్మూలాలు
• కాల్ డేటా రికార్డులు (CDR)
• డిజిటల్ ఆధారాలు
• హత్య జరిగిన ప్రదేశానికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు
SET – C : డాక్టర్ శ్వేతపై హత్యాయత్నం (Attempt to Murder Dr. Swetha)
• ప్రమాద స్థల దర్యాప్తు నివేదిక
• వాహన ఫోరెన్సిక్ నివేదిక
• డా. శ్వేత వైద్య చికిత్స రికార్డులు
• ప్రమాదం ఉద్దేశపూర్వకమని నిరూపించే ఫోరెన్సిక్ ఆధారాలు
• ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు
• CCTV దృశ్యాలు
• డిజిటల్ కమ్యూనికేషన్ రికార్డులు
SET – D : డాక్టర్లు హరీష్ & పద్మ అపహరణ (Kidnapping of Harish & Padma)
• అపహరణ దర్యాప్తు నివేదిక
• ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు
• మొబైల్ లొకేషన్ విశ్లేషణ
• CCTV రికార్డులు
• వాహనాల కదలికల వివరాలు
• కాల్ డేటా రికార్డులు
• డిజిటల్ ఆధారాలు
SET – E : డాక్టర్ పద్మపై సామూహిక అత్యాచారం & హత్య (Gang Sexual Assault & Murder of Dr. Padma)
• పోస్టుమార్టం నివేదిక
• DNA విశ్లేషణ నివేదిక
• ఫోరెన్సిక్ జీవ ఆధారాలు
• లైంగిక దాడి వైద్య పరీక్ష నివేదిక
• శవం వెలికితీత పంచనామా
• నిందితుల DNA సరిపోలిక నివేదిక
• సాక్షుల వాంగ్మూలాలు
• ఫోటోగ్రాఫిక్ ఆధారాలు
ఈ పొనికె గూడెం కుట్రకి సంబంధించి చుట్టు జరిగిన దారణులు, హత్యలు తాలుకు ఆధారలు మొత్తం 5 విభాగాలగా విభజించిన 482 పత్రాలు ఉన్నాయి.
Judge తల ఊపుతాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : ఈ పత్రాలన్నింటినీ Exhibit P-1 నుండి Exhibit P-482 వరకు నమోదు చేయాలని ప్రాసిక్యూషన్ కోరుతోంది.
జడ్జి : Allowed.
కోర్టు క్లర్క్ : Exhibits marked.
తర్వాత Prosecutor నేరుగా విషయానికి వస్తాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : విజయవాడ నగరానికి సుమారు 40 కి.మీ దూరంలో కొండపల్లి కొండలు అడవుల వెనుక ఉన్న ఒక మారుమూల గిరిజన గ్రామమె ఈ పొనికె గూడెం. ఈ గూడెం మరియు దీనికి ఆనుకొని ఉన్న చుట్టు ప్రక్కల గూడాల పరిసరాల్లో అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని 10 ఏళ్ళ క్రితం జరిగిన భూగర్భ సర్వేల్లో బయటపడింది.
జడ్జి శ్రద్దగా వింటున్నాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : అక్కడ గిరిజనులను చట్టబద్ధంగా ఖాళీ చేయించడం అసాధ్యం. 3 ఏళ్ళ పాటు వారికి నయానొ భయానొ నచ్చ చెప్పి పంపించాలని చూశారు కాని వారు కదలలేదు. అందుకే వారిని నెమ్మదిగా అంతం చేసే ప్రణాళిక రూపొందించారు. వారి తాగునీటి వనరుల్లో హార్మోన్లపై ప్రభావం చూపే విషపూరిత రసాయనాలను అతి తక్కువ మోతాదుల్లో సంవత్సరాల తరబడి కలిపారు. ఆ రసాయనం మనిషిని వెంటనే చంపదు. కానీ మెల్లగా...
పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను...
స్త్రీల్లో గర్భధారణ సామర్థ్యాన్ని...
తరతరాలపాటు నాశనం చేస్తుంది.
లక్ష్యం ఒక్క మనిషిని చంపడం కాదు ఒక తరం ముగియడం.
కోర్టు మొత్తం షాక్‌లో ఉంటుంది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : కానీ ఈ కుట్ర బయటపడింది డాక్టర్ రాఘవరావు వల్ల. ఆయన అక్కడ 6 ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లొ అక్కడి గిరిజనులకి వైద్య పరీక్షలు నిర్వహించారు.
రక్త నమూనాలు...
నీటి నమూనాలు...
గర్భస్రావాల గణాంకాలు...
వంధ్యత్వ నివేదికలు...
అన్నింటినీ సేకరించారు. ఆయన దగ్గర ఈ కుట్రను నిరూపించే 147 శాస్త్రీయ ఆధారాలు సిద్ధమయ్యాయి. అదే ఆయన మరణ శాసనం అయ్యింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన విషయాలను డిఫెన్స్ లాయర్ శ్రద్దగా వింటు ముఖ్యమైన విషయాలు నోట్ చేసుకుంటున్నాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : డాక్టర్ రాఘవరావు గారు ఆయన ఇంట్లొ ఒంటరిగా ఉన్న సమయంలొ దేవేంద్ర రెడ్డి, సూర్యనారాయణ తమ మనుషులను ఎవరికి తెలియకుండా ఆయన ఇంట్లోకి పంపించి పాలిథీన్ కవర్తొ మొహం మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపి తరువాత ఆధారాల కోసం ఇల్లంతా గాలించారు గాని కనబడలేదు. హత్య జరుగుతున్నప్పుడు ఆ ఇంటికి అరకిలోమీటర్ దూరంలొ అజయ్ మరియు ప్రవీణ్ ఇద్దరు అక్కడె కారులొ ఉన్నారు. హత్య చేసిన తరువాత దానిని గుండెపోటుతో చనిపోయినట్లు చూపించారు. కానీ అది సహజ మరణం కాదు. పక్కా ప్రణాళికతో చేసిన హత్య. హత్య చేసిన తర్వాత ఈ అజయ్ మరియు ప్రవీణ్ సహాయంతొ పోస్ట్‌మార్టం రిపోర్ట్ మార్చబడింది. మెడికల్ రికార్డులు మార్చబడ్డాయి. ఆధారాలు మాయం చేశారు కేసు మూసివేశారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళిద్దరి పేర్లు ఎత్తగానె అజయ్ మరియు ప్రవీణ్ తలదించుకున్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : కానీ ఒక విషయం వాళ్లు ఊహించలేదు డాక్టర్ రాఘవరావు తన దగ్గరున్న అన్ని ఆధారాలను అంతకుముందె తన కూతురు డాక్టర్ శ్వేత దగ్గర భద్రపరిచారు. ఈ విషయం తెలియగానె వాళ్ళు
రెండో టార్గెట్ గా డాక్టర్ శ్వేతను ఎంచుకున్నారు. రోడ్డు ప్రమాదంలా కనిపించేలా ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించారు కానీ అదృష్టం కొద్ది ఆమె చనిపోకుండా బ్రతికింది. కొన ఊపిరితొ ఉన్న తనని సీ.ఐ మురళి సహాయంతొ సాగర్ వర్మ కాపాడుకోగలిగాడు.
శ్వేత గురించి చెప్పినప్పుడు సాగర్ వర్మ తన అర చేతిని శ్వేత అరచేతిపై వేసి తట్టాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : ఆమె బ్రతకడమే ఈ కేసును బ్రతికించింది. డాక్టర్ శ్వేత అదృశ్యమైన తర్వాత ఆమెతో కలిసి పరిశోధన చేసిన ఇద్దరు జూనియర్ డాక్టర్లు...
హరీష్...
పద్మ...
కిడ్నాప్ చేయబడ్డారు. ఆధారాల కోసం అరవింద్ రెడ్డి మరియు అతని మనుషులు హరీష్ ని చిత్రహింసలు గురిచేశారు. పద్మ అంతకంటే దారుణం అనుభవించింది. ఆమెను అతి దారుణంగా హింసించడమె కాకుండా సామూహిక అత్యాచారం చేసి తర్వాత చంపేశారు. తరువాత మృతదేహాన్ని అక్కడె భూమిలో పాతిపెట్టారు.
తన స్నేహితురాలు పద్మ గురించి చెప్పినప్పుడు శ్వేత కళ్ళల్లొ నీళ్ళు వచ్చాయి. అది చూసి హరీష్ ఆమె భుజాన్నీ తట్టాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : కానీ సిట్ అధికారులు తప్పిచుకొని పారిపోయి వచ్చిన హరీష్ ద్వారా నిజం తెలుసుకొని పద్మ మృతదేహాన్ని వెలికితీశారు. ఆ తరువాత ఆ శవానికి DNA మరియు పోస్ట్‌మార్టం నిర్వహించారు
ఫోరెన్సిక్ పరీక్షల ప్రతి ఆధారం ఇది హత్యేనని నిరూపించింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : మై లార్డ్ ఇవి ఐదు వేర్వేరు నేరాలు కావు. ఒకే కుట్రను దాచిపెట్టడానికి ఒక్కొక్కరిని వరుసగా తొలగించిన నేరాల గొలుసు.
పబ్లిక్ ప్రాసీక్యూటర్ చెప్పిన ప్రతిదానికి ఆధారాలతొ పాటు ప్రత్యక్ష సాక్ష్యులైన శ్వేత, హరీష్, సాంబయ్యతొ పాటు దేవేంద్ర రెడ్డి మనుషులు శివ, వివేక్ మరియు సూర్యనారాయణ పీ.ఎ రవికుమార్ సాక్ష్యాల ద్వారా పొనికె గూడెం కుట్ర చుట్టు జరిగిన దారణులాను నిరూపించాడు.
తరువాత డిఫెన్స్ లాయర్ అధారాలను పున: పరీశీలన చేశాడు మరియు సాక్ష్యులను క్రాస్ ఎక్సామినేషన్ చేశాడు.
కాసేపటికి జడ్జి రెండవ హీయరింగ్ వచ్చె నెల 5వ తారికున ఉంటుందని చెప్పాడు.
తరువాత జరిగిన రెండవ హీయరింగ్ లొ అజయ్, ప్రవీణ్, మరియు అరవింద్ రెడ్డి కలిసి మాధక ద్రవ్యాల ముఠాతొ చేతులు కలిపి చేసిన చీకటి వ్యాపారం గురించి మరియు బూటకపు ఎన్కౌంటర్ల గురించి మాట్లాడి వాటి తాలుకు సాక్యాధారాల అపయినటువంటి
SET – F : నేరపూరిత కుట్ర & నేరాల గుట్టుచప్పుడు కాకుండా దాచివేత (Criminal Conspiracy & Cover-up)
• ఆధారాల తారుమారు దర్యాప్తు నివేదిక
• బూటకపు ఎన్‌కౌంటర్ కేసుల దర్యాప్తు ఫైళ్లు
• అక్రమ ఆర్థిక లావాదేవీల వివరాలు
• మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధాల ఆధారాలు
• అప్రూవర్లైన శివ, వివేక్, రవికుమార్ వాంగ్మూలాలు
• డిజిటల్ కమ్యూనికేషన్ రికార్డులు
• బ్యాంకు లావాదేవీల ట్రైల్
• వాయిస్ రికార్డింగ్స్
• స్వాధీనం చేసుకున్న ఆధారాల సంరక్షణ (Chain of Custody) పత్రాలు
ప్రాసిక్యూషన్ తరుపున కోర్టు సమర్పించారు.
దీని మీద కూడా డిఫెన్స్ లాయర్ ఆ అధారాలను పున: పరీశీలన చేసి తరువాత సాక్ష్యులను క్రాస్ ఎక్సామినేషన్ కూడా చేశాడు.
జడ్జి మళ్ళి 3వ హీయరింగ్ కి అదె నెల 20వ తారికున కుదిర్చాడు.
ఈసారి జరిగిన 3వ హీయరింగ్ లొ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్ మరియు ప్రవీణ్ ఇద్దరు కలిసి చేసిన తులసి హత్య కేసును మరియు అరవింద్ రెడ్డి తన స్నేహితులతొ కలిసి పల్లవిపై సామూహిక అత్యాచారం మరియు హత్య తాలుకు కేసు గురించి వివరించాడు. తరువాత వాటికి సంబంధించి
SET – G : తులసి హత్య కేసు (Tulasi Murder Case)
• హత్య దర్యాప్తు నివేదిక
• పోస్టుమార్టం నివేదిక
• థాలియం విష ప్రయోగ ఫోరెన్సిక్ నివేదిక
• వైద్య చికిత్స రికార్డులు
• DNA మరియు జీవ ఆధారాలు
• సాక్షుల వాంగ్మూలాలు
• కాల్ డేటా రికార్డులు
• డిజిటల్ ఆధారాలు
SET – H : ఇంజినీరింగ్ విద్యార్థిని పల్లవి సామూహిక అత్యాచారం & హత్య కేసు (Engineering Student Pallavi Gang Rape & Murder Case)
• హత్య దర్యాప్తు నివేదిక
• పోస్టుమార్టం నివేదిక
• DNA నివేదిక
• లైంగిక దాడి వైద్య పరీక్ష నివేదిక
• సంఘటన స్థల ఫోరెన్సిక్ ఆధారాలు
• ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు
• నిందితులపై శాస్త్రీయ ఆధారాలు
• డిజిటల్ ఆధారాలు
• CCTV & మొబైల్ లొకేషన్ రికార్డులు
ఈ సాక్ష్యాధారలను ప్రాసిక్యూషన్ తరుపున కోర్టుకి సమర్పించారు.
ఈ 3వ హియరింగ్ లో కూడా డిఫెన్స్ లాయర్ ఆ అధారాలను పున: పరీశీలన చేసి అనుమానాలేమైన ఉంటె అడిగి నివృత్తి అయ్యాక నోట్ చేసుకొని తరువాత సాక్ష్యులను క్రాస్ ఎక్సామినేషన్ కూడా చేశాడు.
జడ్జి : జరిగిన 3 హియరింగ్స్లొ ప్రాసిక్యూషన్ సమర్పించిన పత్రాలు, ఫోరెన్సిక్ నివేదికలు, శాస్త్రీయ ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, అలాగే డిఫెన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ మొత్తాన్ని కోర్టు పరిశీలించింది. ప్రస్తుత దశలో కోర్టు ఎలాంటి తుది నిర్ణయానికి రావడం లేదు. అయితే రికార్డులో ఉన్న ఆధారాలను బట్టి నిందితులు మెంతాడ అజయ్ కుమార్, మగడాల ప్రవీణ్ మరియు ఎందోరు అరవింద్ రెడ్డి పై నమోదైన నేరాలకు సంబంధించిన ప్రైమ్ ఫేశియా (prima facie) కేసు ఉందని కోర్టు అభిప్రాయపడుతోంది.
తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : మై లార్డ్... ప్రాసిక్యూషన్ ఈ మూడు విచారణల ద్వారా ఒక విషయం స్పష్టంగా నిరూపించింది. నిందితులు చేసిన నేరాలు ఇక్కడితో ముగియలేదు. ఈ నేరాల వెనుక ఉన్న అసలు కుట్ర ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. ప్రత్యేకించి... దివంగత ఎమ్మెల్యే ఎందోరు దేవేంద్ర రెడ్డి... మరియు దివంగత మిడతల సూర్యనారాయణ హత్యలకు సంబంధించిన కుట్ర, ప్రణాళిక, హత్య జరిగిన పరిస్థితులు, ఆయుధాలు, సహకరించిన వ్యక్తులు, ఆధారాల ధ్వంసం వంటి అంశాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
జడ్జి : అయితె....?
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : అయితె ఈ ముగ్గురు నిందితుల నుండి మరింత సమాచారం సేకరించడం దర్యాప్తుకు అత్యంత అవసరం. అందువల్ల CrPC ప్రకారం వీరిని 15 రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని ఈ గౌరవ న్యాయస్థానాన్ని కోరుచున్నాం.
దానికి డిఫెన్స్ లాయర్ అడ్డు చెబుతూ
డిఫెన్స్ లాయర్ : మై లార్డ్... మూడు హియరింగ్స్ పూర్తయ్యాయి. వేలాది పేజీల ఆధారాలు సమర్పించారు. ఇప్పుడు పొలీసు కస్టడి అడగడం చట్ట విరుద్ధం. కస్టోడియల్ ఇంటరాగేషన్ పేరుతో వేధించడానికే ఈ ప్రయత్నం.
దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరణ ఇస్తూ..
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : పోలీసు కస్టడి అనేది శిక్ష కాదు. దర్యాప్తులో మిగిలిపోయిన రెండు అత్యంత కీలక హత్యల వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయడానికి మాత్రమే.
ఇద్దరి వాదనలు విన్న జడ్జి
జడ్జి : ప్రస్తుత కేసు సాధారణ కేసు కాదు. రాష్ట్రాన్ని కుదిపేసిన కుట్ర. ప్రజాప్రతినిధుల హత్య మరియు ప్రభుత్వ యంత్రాంగ దుర్వినియోగం. భారీ స్థాయి నేరపూరిత కుట్రకు సంబంధించిన కేసు. దర్యాప్తు సంస్థ సమర్పించిన కారణాలను పరిశీలించిన తర్వాత...
నిందితులు మెంతాడ అజయ్ కుమార్, మగడాల ప్రవీణ్ మరియు ఎందోరు అరవింద్ రెడ్డిని 15 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఈ కోర్టు ఆదేశాలు జారీ చేస్తోంది.
తరువాత పోలిసులు ముగ్గురుకి సంకెళ్ళు వేసి కోర్టు బయటకు తీసుకొచ్చారు. కోర్టు బయట మీడియా వాళ్ళు వీళ్ళని ఫోటోలు, వీడియోలు తీస్తూ మైకులు ముందు పెట్టి ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించారు కాని పోలీసులు వాళ్ళని అడ్డుకొని పోలీసు వ్యాన్లోకి ఎక్కించారు.
తరువాత మీడియా వాళ్ళంతా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు డిఫెన్స్ లాయర్ వద్దకు వెళ్ళి వాళ్ళను ప్రశ్నలు అడిగారు వాళ్ళద్దరు కోర్టులొ జరిగింది మీడియా వాళ్ళకి చెప్పారు.
పోలీసు వ్యానులొ ఉన్న అరవింద్ రెడ్డి నవ్వతూ అజయ్ మరియు ప్రవీణ్ వంక చూస్తాడు.
అరవింద్ రెడ్డి : మీరిద్ధరు కలిసి మొత్తం అన్నీ నేరాలు నా మీదె మొపేసి తప్పించుకుందామని చూశారు. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతం ఉంది... హా..హా....హా
అజయ్ కోపంగా తల తిప్పుకొని ఏమి మాట్లాడడు. తరువాత ప్రవీణ్
ప్రవీణ్ : దేవేంద్ర రెడ్డి మరియు సూర్యనారాయణలను చంపింది ఎవరనేది ఈ లోకానికి ఇంకా తెలియకుండా పోవచ్చు.
ఆ మాట వినగానె అరవింద్ రెడ్డి నవ్వు ఆగిపోతుంది.
వ్యానులొ కొన్ని క్షణాలు నిశ్శబ్దం...
ఇప్పుడు అజయ్ మరియు ప్రవీణ్ ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వడం ప్రారంభిస్తారు వెటకారంగా...
ఏ.సీ.పి అజయ్ : ఏంటి తెలుసుకోవాలని ఉందా....?
అరివింద్ రెడ్డి అయొమయంగా వాళ్ళ వైపు చూసి
అరవింద్ రెడ్డి : ఎవరు...?
అజయ్ మరియు ప్రవీణ్ ఇద్దరు ఒక్కసారిగా బిగ్గరగా నవ్వుతారు.😄😄