Part - 15
సమయం - ఉదయం 10:30 గంటలు
మోరీస్పేట, తెనాలి.
ఒక టీ కొట్టి దగ్గర ఏ.సి.పి అజయ్ తన స్నేహితుడు శ్రవణ్ తొ కలిసి టీ తాగుతున్నారు.
ఏ.సీ.పి అజయ్ : నీకున్న ఈ చర్మ వ్యాది తగ్గిపోతుందిలె రా...
టీ - కొట్టు వాడు : ఏ ఊరండి మీది..? ఏంటి సమస్య ..?
ఏ.సీ.పి అజయ్ : మాది విజయవాడ. మా వాడికి ఏదొ చర్మ వ్యాదిలా వచింది. ఎర్రగా చేతిపై నుంచి మొదలై వీపు వరకు పాకేసింది. మంట బాగా పుడుతుంది కూడా. ఎన్నీ మందులు వాడిన తగ్గలేదు. మాకు తెలిసిన వాళ్ళు చెబితె ఇక్కడికి తీసుకొచ్చాం.
టీ - కొట్టు వాడు : అయితె మీరు సరైన చోటుకె వచ్చారు. ఈయన చాలా మంచి హస్త వాసి ఉన్న వ్యక్తి. ఇంగ్లీషు మందులకి కూడా అందని ఏ రోగమైన ఇట్టె నయం చేయగలరు.
ఏ.సీ.పి అజయ్ : అవును ఈయన గురించి అడిగిన వాళ్ళందరు కూడా ఇదె చెప్తున్నారు. ఇంతకి ఈయన ఇక్కడ ఎంత కాలం నుంచి ఉంటున్నారు.
టీ - కొట్టు వాడు : దాదాపు 30 ఏళ్ళు పైన అవుతుంది. చాలా మంచి వ్యక్తి అండి డబ్బులు ఇచ్చుకోలేని పేదవాళ్ళకి కూడా ఈయన ఉచితంగా వైద్యం చేస్తారండి. నేను కూడా నా చిన్నప్పటి నుంచి ఏ ఆరోగ్య సమస్య వచ్చిన ఈయన వద్దె చూపించుకునె వాడిని. నేనె కాదు మా కుటుంబంలొ అందరూను.
అజయ్ మరియు తన స్నేహితుడు శ్రవణ్ ఇద్దరు టీ తాగేశారు. లేచి టీ - కొట్టు వాడికి డబ్బులు ఇచ్చి. అక్కడ నుంచి ముందుకు కదిలారు.
ఎదురుగా అయుర్వేద క్లినిక్ ఉంది. బయట బోర్డు మీద
(ధన్వంతరి ఆయుర్వేదిక్ క్లీనిక్)
DHANVANTARI AYURVEDIC CLINIC
Dr. Madhav, BAMS, MD (Kayachikitsa), MD (Dravyaguna), MD (Rasashastra & Bhaishajya Kalpana)
Consulting Ayurvedic Physician
Since 1995
అని వ్రాసి ఉంది.
అజయ్ మరియు శ్రవణ్ ఇద్దరు లోపలికి వెళ్ళారు. అదొక పెద్ద ఇల్లు దానిని క్లినిక్ క్రింద మార్చారు.
ఇంటి ముందర పెద్ద రేకుల షెడ్డు వేసి ఉంది. దాని క్రింద 3 వరుసలలొ కుర్చీలు పేర్చి ఉన్నాయి. షుమారు 20 మంది వరకు వచ్చి ఉన్నారు అక్కడ. వాళ్ళందరు తమ వంతు వచ్చెవరుకు అలా కూర్చొని ఎదురు చూస్తున్నారు. అజయ్ మరియు శ్రవణ్ కూడా ఆ వారుసలొ కూర్చున్నారు.
షుమారు 2 గంటలు తరువాత వీళ్ళిద్దరి వంతు వచ్చింది లోపలికి వెళ్ళారు. లోపరికెళ్ళగానె ముందు ఒక పెద్ద గది వస్తుంది. డా. మాధవ్ రోగులకు చీకిత్స అక్కడె అందిస్తున్నాడు.
వయసు 62 ఏళ్ళు తెల్లటి జుట్టు. మీసంతొ సహా నున్నగా గీసిన గెడ్డం. నుదటిపై చిన్న కుంకుం బొట్టు.
సాధారణ దస్తులు చొక్క మరియు ప్యాంట్ ధరించి ఉన్నాడు.
ప్రతి ఒక్కరిని షుమారు ఒక అరగంట పాటు పరీక్షిస్తున్నాడు. వాళ్ళు చెప్పె సమస్యలన్నీ శ్రద్దగా విని ఒక చోట వ్రాసుకుంటున్నాడు. తరువాత వాళ్ళ నాడి మరియు కళ్ళు అవి చూసి పరీక్షించి చికిత్స చేసి మందులు వ్రాసి ఎలా వాడాలొ చెప్పి పంపిస్తున్నాడు.
అతను అజయ్ మరియు శ్రవణ్ వైపు చూసి "రండి" అన్నట్టు సైగా చేశాడు. వీళ్ళు అతని వద్దకు వెళ్ళారు. అజయ్ డా. మాధవ్ కి ఎదురుగా టేబుల్ కి ఇటువైపు ఉన్న కుర్చిలొ కుర్చున్నాడు.
శ్రవణ్ వచ్చి డా. మాధవ్ ప్రక్కన ఉన్న స్టూలు మీద కూర్చున్నాడు.
అజయ్ ఏమీ తెలియనట్టుగా అలా చూస్తూ ఉన్నాడు.
తన స్నేహితుడు శ్రవణ్ ని డా. మాధవ్ పరీక్షిస్తున్నాడు.
చేతి పై నుంచి వీపు వరకు పాకిన ఆ ఎర్రటి మచ్చను గమనిస్తున్నాడు.
నాడి చూశాడు.
కొన్ని ప్రశ్నలు అడిగాడు.
మందులు వ్రాశాడు.
అజయ్ చుట్టూ ఇల్లంతా గమనిస్తున్నాడు.
పుస్తకాలు.
పాత ఫోటోలు.
కొన్ని మూలికలు.
పాత మ్యాపులు.
కానీ అతని ముఖంలో ఏ మార్పూ లేదు.
డా. మాధవ్ : పది రోజుల తరువాత మళ్ళి తీసుకురండి. అప్పటి వరకు మందులు ఇచ్చాను.
ఏ.సి.పి అజయ్ : అలాగెనండి.
అని చెప్పి వెళ్తూ...
అజయ్ చూపు గోడ మీద వేలాడుతున్న ఒక పాత ఫోటోపై పడింది.
ఆ ఫోటోలో...
ఇద్దరు మధ్యవయస్కులు.
మరియు...
దాదాపు పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న ఒక బాలుడు. ఉన్నారు
అజయ్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.
ఆ మద్య వయస్కులలొ ఒకరు డా. మధవ్ అయితె ఇంకొకరు డా. రాఘవ రావు.
ఆ బాలుడు ఎవరని మాత్రం తెలియలేదు కాని ఎక్కడొ చూసిన మొఖంలా అనిపించింది.
అజయ్ వెంటనే తన భావోద్వేగాన్ని దాచుకున్నాడు.
ఏ.సి.పి అజయ్ : పాత ఫోటోలా ఉందె..
డా. మాధవ్ వెనక్కి తిరిగి చూశాడు. కొద్దిసేపు ఆ ఫోటో వైపు చూస్తూ ఉన్నాడు.
డా. మాధవ్ : అవును. చాలా పాతది. దాదపు 16 ఏళ్ళ క్రితం నాటిది.
ఏ.సి.పి అజయ్ : మీ కుటుంబ సభ్యులా...?
డా.మాధవ్ స్వల్పంగా నవ్వాడు.
డా.మాధవ్ : అందరూ కుటుంబ సభ్యులే అనుకోవచ్చు.
అని మాత్రమే చెప్పాడు.
అజయ్ ఇంకేమీ అడగలేదు.
కాని అతని మనసులో ఒక్కటే ప్రశ్న తిరుగుతోంది.
క్లినిక్ నుంచి బయటకు వచ్చిన తరువాత...
ఏ.సి.పి అజయ్ మరియు అతని స్నేహితుడు శ్రవణ్ నెమ్మదిగా రోడ్డు వైపు నడిచారు.
వాళ్ళ కారును సమీపించి బండి ఎక్కి కొంత దూరం వెళ్ళాక
శ్రవణ్ : ఒరేయ్ మనం నిజంగా ఆయుర్వేద వైద్యం కోసమె వచ్చామా..?
అజయ్ స్వల్పంగా నవ్వాడు.
ఏ.సి.పి అజయ్ : నీకు ఎందుకు రా ఆ అనుమానం వచ్చింది.?
శ్రవణ్ : క్లినిక్ లొ నీ చూపులను బాగా గమనించాను రా. దేనికోసమొ వచ్చిన వాడిలా ఇల్లంతా చూస్తున్నావు.
ఏ.సి.పి అజయ్ : పర్లేదురా నీకూ బుర్ర ఉంది.
శ్రవణ్ : అలా అనకు నేను కూడా పోలీసువాడినె.
ఏ.సి.పి అజయ్ : అవును అవును ట్రాఫిక్ పోలీసువాడివి కదా.. (నవ్వుతూ)
శ్రవణ్ : సరెలె చెప్పరా..
ఏ.సి.పి అజయ్ : అవును ఒక కేసు పని మీద నీ వంక పెట్టుకొని. ఇక్కడ వచ్చాను.
శ్రవణ్ : అనుకున్న లేదంటె నా మీద నీకు ఇంత ప్రేమ ఎక్కడ ఉంది.
ఏ.సి.పి అజయ్ : కేసు విషయమైన నీకు మంచె కదరా జరిగింది. గత 5 ఏళ్ళ నుంచి బాధ పడుతున్నావు. ఈయన వల్ల కచ్చితంగా తగ్గుతుందిలె.
శ్రవణ్ : ఇంతకి ఏం కేసు రా..
అజయ్ డాష్ బోర్డు మీద ఉన్న తన మొబైల్ తీసి ఒక నంబర్ స్క్రీన్‌పై చూపించాడు.
ఏ.సి.పి అజయ్ : ఇదే అసలు కారణం.
శ్రవణ్ స్క్రీన్ వైపు చూశాడు.
శ్రవణ్ : ఈ నంబర్ ఎవరిది రా..?
ఏ.సి.పి అజయ్ : డాక్టర్ రాఘవ రావు ది
శ్రవణ్ ఆశ్చర్యపోయాడు.
శ్రవణ్ : అంటే చనిపోయిన ఆ డాక్టర్ గారిదా...?
అవునన్నట్టు అజయ్ తల ఊపాడు.
ఏ.సి.పి అజయ్ : దేవేంద్ర రెడ్డి కొడుకు అరవింద్ రెడ్డి ఫొన్ కి వచ్చె ఇన్‌కమింగ్ కాల్స్‌లో కొన్ని ఈ నంబర్‌కి డైవర్ట్ అయ్యాయి.
శ్రవణ్ : ఏ మాట్లాడుతున్నావు రా..?
ఏ.సి.పి అజయ్ : అవును. మొదట నేను కూడా నమ్మలేదు. కాని కాల్ డేటా రిపోర్టులు అబద్ధం చెప్పవు కదా.
అజయ్ స్వరం గంభీరంగా మారింది.
ఏ.సి.పి అజయ్ : రాఘవ రావు చనిపోయిన కూడా ఇంకా ఆ నంబర్ యాక్టీవుగా ఉంది. అంటె ఎవరొ దానిని వాడుతున్నారు అని అర్ధమయ్యింది. ఆ నంబర్ తాలుకు కాల్ డేటా మరియు లోకేషన్ ప్యాటర్న్స్ ని గమనిస్తె ఎక్కువుగా ఈ లోకేషనె చూపిస్తుంది. పైగా ఆ నంబర్ చివరిసారిగా కనిపించిన లొకేషన్ క్రింద కూడా మళ్ళి ఇదే ప్రాంతాన్ని చూపించింది.
శ్రవణ్ : అంటే ఈ కాలనీనా...?
అని శ్రవణ్ ధన్వంతరి క్లినిక్ తాలుకు విజిటింగ్ కార్డు వైపు చూశాడు.
శ్రవణ్ : డా.మాధవ్‌ని అనుమానిస్తున్నావ రా...?
అజయ్ వెంటనే తల అడ్డంగా ఊపాడు.
ఏ.సి.పి అజయ్ : లేదు. అనుమానించడం లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నా ఎంక్వైరీలో డా.మాధవ్ గురించి ఒక్క చెడు మాట కూడా వినలేదు.
అతను కొద్దిసేపు ఆగాడు.
ఏ.సి.పి అజయ్ : ఆయన వయసు అరవై రెండు ఏళ్ళు. ముప్పై ఏళ్ళకు పైగా ఇక్కడే వైద్యం చేస్తున్నాడు. పేదలకు ఉచితంగా వైద్య మందులు ఇస్తున్నాడు. ఆయన చేతి మందు బాగా పనిచేస్తుందని ఇప్పటికీ ప్రజలు నమ్ముతారు. ఆ కాలనీలో అడిగిన ప్రతి వ్యక్తి అతని గురించి మంచి మాటే చెప్తున్నాడు.
శ్రవణ్ ఆశ్చర్యంగా చూశాడు.
శ్రవణ్ : మరి అలాంటి వ్యక్తికి దేవేంద్ర మరియు సూర్యనారాణలను హత్య చేసిన వాడికి సంబంధం ఉంటుందా..?
అజయ్ కూడా అదే ప్రశ్నను తనలో తాను ఎన్నోసార్లు వేసుకున్నట్టుగా నిశ్శబ్దంగా ఉంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు.
ఏ.సి.పి అజయ్ : అదే నేను తెలుసుకోవాలి. డాక్టర్ రాఘవ రావు నంబర్... ఈ డా.మాధవ్ క్లినిక్ పరిసరాల్లో ఎందుకు కనిపిస్తోంది...? అరవింద్ కాల్స్ ఆ నంబర్‌కి ఎందుకు డైవర్ట్ అయ్యాయి..? అరవింద్‌కి గాని సూర్యనారాయణ , దేవేంద్రలకు గాని డా. మాధవ్ గురించి తెలుసా...? లేక...
అజయ్ వాక్యం మధ్యలో ఆపేశాడు.
శ్రవణ్ : ఆ...? లేక...? ఏంటి రా ఆగిపోయావు..?
అజయ్ డ్రైవింగా చేస్తూ ముందుకు చూస్తూ అన్నాడు.
ఏ.సి.పి అజయ్ : మనకి తెలియని ఇంకెవరో ఈయనకి వాళ్ళకి మధ్య ఉన్నాడా..?
అతని కళ్లలో అనుమానం మరింత పెరిగింది.
ఎందుకంటే...
అతను ఇప్పటివరకు వెతికింది ఒక ఫోన్ నంబర్ మాత్రమే.
కాని ఆ నంబర్...
ఇప్పుడు అతన్ని పూర్తిగా కొత్త దారిలోకి తీసుకెళ్తోంది.
మరియు...
ఆ దారి చివర్లో డా. మాధవ్ ఉన్నాడా...
లేక ఇంకెవరైనా ఉన్నారా...
అనే విషయం ఇంకా అతనికే తెలియదు.
ఇలా ఉండగా
అదె రోజు మద్యాహ్నం సాగర్ వర్మ మరియు ఇతర SIT అధికారులు. పొనికె గూడెం వెళ్ళి అసలు సమస్య ఏంటొ తెలుసుకొని తిరిగి అక్కడ నుంచి విజయవాడకు వచ్చేస్తున్నారు.
కారు లోపల నిశ్శబ్దం.
డాక్టర్ రాఘవ రావు ఆడియో క్లిప్స్ ఇంకా అందరి మనసుల్లో తిరుగుతున్నాయి.
సాగర్ కిటికీ బయట చూస్తూ ఉన్నాడు.
కొద్దిసేపటి తరువాత...
ఎస్.ఐ సుందర్ : సార్... ఇప్పుడు ఏం చేద్దాం...?
సాగర్ వర్మ : ముందు ఆ రిపోర్ట్స్‌ని పూర్తిగా పరిశీలించాలి. రాఘవ రావు గారు ఏ ల్యాబ్‌లో పరీక్షలు చేయించారో కనుక్కోవాలి. ఆ ల్యాబ్ వాళ్ళతో మాట్లాడాలి.
ఎస్.ఐ జాన్ బాబు : సార్... ఒకవేళ నిజంగానే నీరు సహజంగా కాకుండా వేరొకరి నిర్లక్ష్యం వల్ల కలుషితమై ఉంటే...?
సాగర్ వర్మ : అప్పుడు అది పెద్ద నేరం అవుతుంది.
ఎస్.ఐ జాన్ బాబు : కాని నీరు కలుషితం ఎలా అవుతుంది సార్. అక్కడ ఎటువంటి రసాయినిక ఫ్యాక్టరీలు గట్రా లేవు గా.?
సాగర్ వర్మ : కేవలం ఫ్యాక్టరీల వల్లె నీరు కలుషితం అవ్వదు జాన్ గారు. కావాలని ఎవరైన కలిపిన కూడా కలుషితం అవుతుంది.
ఎస్.ఐ జాన్ బాబు : ఎవరు చేస్తారు..? ఇలా వాళ్ళకెం వస్తుంది.
సాగర్ వర్మ : అదె మనం కనిపెట్టాలి.
అప్పుడే...
సాగర్ ఫోన్ మోగింది. ఆ కాల్ చేసింది మళ్ళీ వంశినె.
సాగర్ వర్మ : చెప్పు వంశి.
హ్యాకర్ వంశి : సార్...ఆ ఫోల్డర్‌లో ఇంకా కొన్ని ఫైల్స్ డిలీట్ చేయబడ్డాయి.
సాగర్ వర్మ : రికవర్ చేయగలవా...?
హ్యాకర్ వంశి : ప్రయత్నిస్తున్నాను సార్. ఒక 30 నిమిషాలు. కానీ మీరు ఇక్కడ ఇంకొ విషయం తెలుసుకోవాలి .
సాగర్ వర్మ : ఏంటి...?
హ్యాకర్ వంశి : ఆ ఫోల్డర్ చివరిసారిగా ఓపెన్ చేయబడింది డాక్టర్ రాఘవ రావు చనిపోయే రెండు రోజుల ముందు.
సాగర్ కళ్ళు చిన్నబడ్డాయి.
సాగర్ వర్మ : అంటే... ఆయన చనిపోవడానికి ముందు కూడా ఈ కేసు మీదే పని చేస్తున్నారు. ఓకె వంశి వీలైనంత త్వరగా వాటిని రికవరి చెయ్యి.
హ్యకర్ వంశి : సరె సార్..
కాల్ కట్ అయ్యింది.
సాగర్ వర్మ : జాన్ గారు ...
ఎస్.ఐ జాన్ బాబు : సార్ ..?
సాగర్ వర్మ : మనం విజయవాడకు చేరుకున్నాక. దేవేంద్ర రెడ్డి మరియు సూర్యనారాయణల గత 10 ఏళ్ళ తాలుకు అక్రమ వ్యాపార లావాదేవీల గురించి మరియు వాళ్ళు ఎవరెవరితొ రహస్యంగా కాంట్రాక్ట్లు కుదుర్చుకున్నారు. వీటి వివరాలన్ని నాకు కావాలి.
సాగర్ వర్మ : సుందర్ గారు. మీరు దేవేంద్ర రెడ్డి ముఖ్య అనుచరులైన శివ మరియు వివేక్ లను. వాళ్ళతొ పాటు సూర్యనారాయణ పీ.ఏ రవి కుమార్ వీళ్ళ ముగ్గురు మీద నిఘా పెట్టండి.
ఎస్.ఐ సుందర్ : అలాగె సార్.
సాగర్ వర్మ : వాళ్ళ మీద 24 గంటలు మీ నిఘా ఉండాలి
"ఎవరితో కలుస్తున్నారు..."
"ఎక్కడికి వెళ్తున్నారు..."
"డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది..."
అన్నీ వివరలు నాకు తెలియాలి.
ఎస్. ఐ సుందర్ : సరె సార్...?
సాగర్ వర్మ : జాగ్రత్త వాళ్ళపై నిఘా పెట్టినప్పుడు మన ఐడెంటిటటి బయటపడకుండా చూసుకోండి. తరువాత డీ.జి.పి గారితొ మాట్లాడి వాళ్ళపై ఎరెస్టు వారెంట్ ని తీసుకువస్తా... ఎరెస్టయ్యాక మనం వాళ్ళని మన పద్దతిలొ విచారణ చేస్తె మొత్తం కక్కుతారు..
ఎస్. ఐ సుందర్ : ఏ కేసులొ వాళ్ళపై ఎరెస్ట్ వారెంట్ తీసుకువస్తారు సార్. దానికి అధారాలు కూడా కావాలిగా
సాగర్ వర్మ : ఆ మాత్రం నాకు తెలియదా. వాళ్ళ పుట్టు పూర్వత్రాలు మొత్తం తెలిసిన వాడిని. నా దగ్గర ఆధారాలు లేకుండా ఉంటాయ చెప్పండి.
కారు విజయవాడ వైపు దూసుకుపోతోంది. సాగర్ కిటికీ బయట చూస్తున్నాడు.
అరగంట తరువాత...
వంశి నుంచి సాగర్ కి మరో వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది.
ఒకే ఒక్క పీ.డి.ఎఫ్ ఫైల్ (PDF File).
సాగర్ దానిని తెరిచాడు.
అందులో... ఒక ఫొటొ. దాంట్లొ ముగ్గురు నించోని ఉన్నారు.
డా. రాఘవ రావు.
డా. మాధవ్.
వీళ్ళద్దరు వయసులొ ఉన్నప్పటిది
అంతెకాదు...
వాళ్ళిద్దరి మద్యన మరొ వ్యక్తి ఉన్నాడు. అతనికి షుమారు ఒక 50 సంవత్సరాలు వరకు ఉంటాయి.
ఆ పీ.డి.ఎఫ్ ఫైల్ (PDF File) ని పైకి స్క్రోల్ చేస్తె
ఫోటో వెనుక భాగంలో చేతితో రాసిన అక్షరాలు కనిపించాయి.
(మెడికల్ ట్రైబల్ సర్వె టీమ్ - 1995)
Medical Tribal Survey Team - 1995
Dr. Madhav (డా. మాధవ్)
Dr. Raghava Rao (డా. రాఘవ రావు)
Dr. Anirudh Sen (డా. అనిరుద్ సేన్)
అని ఉంది.
ఆ చివరి వ్యక్తి పేరు చూడగానే...
సాగర్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
అదె సమయంలొ సమాంతరంగా మరొ చోట విజయవాడలొ ఏ.సి.పి అజయ్ తన ఆఫీసులొ ఉండగా. తనకి సీ.ఐ ప్రవీణ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది.
ఏ.సి.పి అజయ్ : ప్రవీణ్ చెప్పు. ఎంత వరకు వచ్చింది పని. డా. మాధవ్ కి సంబంధించిన వివరాలన్ని అన్నీ కనుకున్నావ.?
సీ.ఐ ప్రవీణ్ : నేను నీకు ఈమేయిలొ కొన్ని రిపోర్ట్సు పంపించా. ఒకసారి తెరిచి చూడు.
ఏ.సి.పి అజయ్ : సరె...
అని కాల్ కట్ చేసి.
తన ఆఫిసులొ ఉన్న కంప్యూటర్ లొ ఈమేయిల్ ఓపెన్ చేసి చూస్తున్నాడు.
S.I ప్రవీణ్ నుంచి మెయిల్ వచ్చింది.
Subject : Madhav Background Files
అజయ్ వెంటనే ఓపెన్ చేశాడు.
లోపల పలు పాత డాక్యుమెంట్లు ఉన్నాయి.
అందులో ఒక ఫోటో కూడా ఉంది
అతను ముందు ఫైల్ తెరిచి మొత్తం చదవడం మొదలుపెట్టాడు.
కొన్ని నిమిషాల తరువాత...
ఒక విషయం అతని దృష్టిని బలంగా ఆకర్షించింది.
Dr. Madhav (డా. మాధవ్)
1995 నుంచి ప్రతి సంవత్సరం కనీసం 1-2 నెలలు పాటు గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించెవారు.
ఫ్రీక్వెంట్ విజిట్స్ (Frequent Visits) :
• ఒడిషా గిరిజన ప్రాంతాలు (Odisha Tribal Belt)
• ఛత్తీసగడ్ లోని బస్తర్ ప్రాంతం (Bastar region in Chattishgarh)
• ఝార్ఖండ్ అటవి ప్రాంతాలు (Jharkhand Forest Regions)
• ఈశాన్య భారత ప్రాంతాలు (North East Indian regions)
అజయ్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి.
ఏ.సి.పి అజయ్ : "నార్త్ ఈస్ట్ ఇండియా...?"
అతను తదుపరి పేజీ ఓపెన్ చేశాడు.
అందులో ఇంకో లైన్ ఉంది.
2004 - 2014 మధ్య డా.మాధవ్ మరియు డా. అనిరుద్ సేన్ ఇద్దరు కలిసి పలు వైద్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు..
ఏ.సి.పి అజయ్ : అనిరుద్ సేన్...?
తరువాత అజయ్ ఈమేయిల్ ఉన్న ఒకె ఒక్క ఫొటొని ఓపెన్ చేసి జూమ్ చేశాడు.
ఫోటో క్రింద ఇలా వ్రాసి ఉంది.
(మెడికల్ ట్రైబల్ సర్వె టీమ్ - 1995)
Medical Tribal Survey Team - 1995
Dr. Madhav (డా. మాధవ్)
Dr. Raghava Rao (డా. రాఘవ రావు)
Dr. Anirudh Sen (డా. అనిరుద్ సేన్)
అని ఉంది.
అజయ్ కళ్ళు ఒక్కసారిగా పదునయ్యాయి.
ఏ.సి.పి అజయ్ : రాఘవ రావు...? మళ్ళీ నువ్వేనా...
అని తనలో తానే అనుకున్నాడు.
అజయ్ కుర్చీలో వెనక్కి వాలాడు.
అతని మనసులో ఒక కొత్త ప్రశ్న పుట్టింది.
ఏ.సి.పి అజయ్ :
"డా. రాఘవ రావు..."
"డా. మాధవ్..."
వీళ్ళతొపాటు ఇప్పుడు ఇంకొ కొత్త వ్యక్తి
"డా. అనిరుద్ సేన్..."
ఈ ముగ్గురిని కలిపేది నిజంగా వైద్య సేవలేనా... ? లేక...
ఇంకేదైనా ఉందా...?
అని అనుకున్నాడు.
మొదటిసారి...
డా. మాధవ్ కేవలం ఒక ఆయుర్వేద డాక్టర్ కాదేమో అన్న అనుమానం అజయ్ మనసులో మొలకెత్తింది.