Featured Books
  • వెంటాడే నీడలు - 5

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • ఎవరు....? - 11

    Part - 1102-జులై-2018మద్యాహ్నం 2:10 గంటలునిత్యం పర్యాటకుల సం...

  • యంత్రం వెనుక మనసు - 13

    "ఇంకేం చేస్తాం అమ్మ.. ఈ అర్ధరాత్రి పూట ఎవరు తింటారు? తీసుకెళ...

  • వెంటాడే నీడలు - 4

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • THE GHOST - 1

    **చీకటి రాత్రి - భయానక ప్రారంభం**స్టోరీ ఓపెన్ చేస్తే... ఒక చ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

యంత్రం వెనుక మనసు - 13

"ఇంకేం చేస్తాం అమ్మ.. ఈ అర్ధరాత్రి పూట ఎవరు తింటారు? తీసుకెళ్లి చెత్తబుట్టలో పారేద్దాం" అన్నాడు ఆర్య అలసటగా ముఖం పెట్టి."వద్దు అన్నయ్యా! అలా అస్సలు చేయొద్దు" అని నీల గట్టిగా వారించింది. "భోజనం దొరకక బయట ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. దాన్ని వృథా చేయకూడదు" అంది ఎంతో జాలిగా.ఒకపక్క ఆకలితో అలమటించే నిరుపేదలు, మరోపక్క మిగిలిపోయిన తిండిని ఏం చేయాలో తెలియక పారేసే స్థితిమంతులు. దేశం రాకెట్ ల ముందుకు వెళ్తోంది  కానీ, ఇప్పటికీ ఆకలితో అలమటించే వాళ్లు ఉంటూనే ఉన్నారు. ఒకవైపు తిండి ఎక్కువై పారేసేవాళ్లు ఉంటే... ఇంకోవైపు కనీసం ఒక్క పూట గంజి దొరికినా చాలు అనుకునే అభాగ్యులు ఉన్నారు. మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుందని పెద్దలు అంటారు అన్నయ్యా! కానీ, పొగరు పట్టి ఆ దేవుడు రాసిన అన్నాన్ని అలా కాళ్లతో తన్నే వాళ్లు కూడా ఈ సమాజంలో ఉన్నారంటే అది అతిశయోక్తి కాదేమో అన్నయ్యా!  అందుకే ఈ అన్నాన్ని పారేయకుండా... ఆకలితో అలమటించే వాళ్లకు పెట్టి కడుపు నింపుదాం అన్నయ్యా!" అంది నీల.చెల్లెలి మాటలకు ఆర్య కళ్లలో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. పక్కనే ఉన్న వాళ్ల అమ్మ సుస్మిత... తన కూతురు నీల వైపు ఎంతో ప్రేమగా చూస్తూ తల నిమిరింది."కానీ ఈ నడిరాత్రి పన్నెండు గంటల సమయంలో ఎవరు వెళ్తారు నీలా?" అని అడిగింది సుస్మిత ఆందోళనగా."ఎవరో ఎందుకు.. నేను, అన్నయ్య ఇద్దరం వెళ్లి రోడ్డు పక్కన ఉన్న పేదవాళ్లకు పంచేసి వస్తాం" అంది నీల ఎంతో ఉత్సాహంగా.ఆర్య కాసేపు విసుక్కుంటూనే, "సరే, నేను వెళ్లి బట్టలు మార్చుకుని వస్తాను" అని చెప్పి తన గదిలోకి వెళ్లాడు.నీల వంటలన్నీ ప్యాక్ చేసి సిద్ధంగా పెట్టుకుని అన్నయ్య కోసం ఎదురుచూస్తోంది. పావుగంట అయింది.. అరగంట అయింది.. అయినా ఆర్య బయటకు రాలేదు. విసిగిపోయిన నీల నెమ్మదిగా వాడి గదిలోకి వెళ్లి చూసింది. అక్కడ ఆర్య బట్టలు కూడా మార్చుకోకుండా మంచం మీద హాయిగా పడుకుని, గుర్రక పెట్టి నిద్రపోతున్నాడు!అది చూసి నీలకు ఎక్కడలేని కోపం వచ్చింది. వాడి దగ్గరకు వెళ్లి భుజం పట్టి బలంగా ఊపేస్తూ, "ఒరేయ్ అన్నయ్యా! లేవరా! బయటకు వెళ్దాం అని చెప్పి ఇక్కడ పడుకుని ఏం చేస్తున్నావ్?" అని గట్టిగా అరిచింది. అయినా ఆర్య అస్సలు కదలలేదు, గాఢనిద్రలోకి జారుకున్నాడు.ఆర్య నిద్రపోయాక, నీల ఒక్కతే బయటకు వెళ్లడానికి భయపడుతున్న సమయంలో అన్నయ్య ఎంతకీ లేవకపోవడంతో నీల నిరాశగా వెనక్కి తిరిగింది. అంతలో గది తలుపు సందులో నుండి అయాన్ లోపలికి నడిచి వచ్చాడు. వాడు నీల వైపు చూశాడు. ఆ చూపులో ఎప్పుడూ లేని ఒక కొత్త ఆత్మీయత, ఎనలేని ప్రేమ దాగి ఉన్నాయి.వాడు అలా చూడగానే.. నీల మనసు ఒక్కసారిగా ప్రకృతిలోని సరికొత్త అందాల లోకంలోకి జారుకుంది. ఆ మూసి ఉన్న గదిలోనే.. హఠాత్తుగా చల్లని మలయమారుతం వీచినట్టు, వసంత కాలంలో తోటంతా మల్లెపూలు ఒకేసారి వికసించి ఆ సువాసనలు తనను చుట్టేసినట్టు ఆమెకు అనిపించింది. అయాన్ కళ్లల్లోని ఆరాధనను చూస్తుంటే.. ఆకాశం నుండి కురిసే తొలి చినుకు నేలను తాకినప్పుడు పుట్టే ఒక మధురమైన అనుభూతి ఆమె హృదయాన్ని తాకింది. చుట్టూ ఉన్న చీకటి అంతా మాయమై, శరదృతువు నాటి వెన్నెల కురుస్తున్నట్టు, ఆ వెన్నెల్లో తను మాత్రమే గాల్లో తేలిపోతున్నట్టు ఒక అందమైన ఊహ నీల మనసును కమ్మేసింది. ఒక యంత్రం కళ్లల్లో ప్రకృతిని మించిన ఇంతటి ప్రేమని తను చూడగలనని నీల అస్సలు అనుకోలేదు.నీలా..." అని అయాన్ పిలిచాడు. ఆ పిలుపులో ఎప్పుడూ లేని ఒక వింతైన ఆర్ద్రత, ఏదో తెలియని అమూల్యమైన ప్రేమ ధ్వనించింది.నీల ఒక్కసారిగా వెనక్కి తిరిగి అయాన్ వైపు తీక్షణంగా చూసింది. ఎప్పుడూ లేనంతగా ఈరోజు వాడు ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. ఆ ముఖం నుండి కళ్లు తిప్పుకోవడం నీలకు అస్సలు సాధ్యం కావడం లేదు. 'వీడు గనుక నిజమైన మనిషి అయి ఉంటే ఎంత బాగుండేది? వాడి రూపాన్ని చూసి ఆ మన్మథుడే కుళ్లుకునేవాడు!' అని మనసులో అనుకుంటూ అలా స్తంభించిపోయింది.అయాన్ సైతం నీలను అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు. వాడి అంతర్గత వ్యవస్థలోని సమాచారంలో (Data) నీల పట్ల ఒక కొత్త అనుభూతి ప్రాణం పోసుకుంది. అది మనుషులు పిలిచే 'ప్రేమ' అనే భావనే అని ఆ యంత్రానికి తెలియదు, కానీ నీల ముఖం వాడి సిస్టమ్‌లో ఒక శాశ్వత ముద్రగా మారిపోయింది. తెలియకుండానే ఇద్దరూ అలా ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు.అంతలో హఠాత్తుగా గది తలుపు శబ్దం కావడంతో నీల ఉలిక్కిపడి తన ఆలోచనల నుండి బయటకు వచ్చింది. ఎదురుగా సుస్మిత నిలబడి ఉంది. "ఏమైంది నీలా? ఇంకా బయల్దేరలేదా?" అని అడిగింది."లేదు అమ్మ.. అన్నయ్య ఎంత లేపినా లేవడం లేదు, గాఢనిద్రలో ఉన్నాడు" అంది నీల నిరాశగా."సరేలేమ్మా.. పొద్దుటి నుండి పనులన్నీ చేసి చేసి వాడు బాగా అలసిపోయాడు. నువ్వు ఒక్కదానివి వెళ్లొద్దు. అయాన్ నీతో పాటు వస్తాడు, వాడు నీకు సహాయంగా ఉంటాడు. ఇద్దరూ జాగ్రత్తగా వెళ్లి రండి" అని చెప్పింది సుస్మిత.