ఆర్య ఆఫీస్ నుండి ఇంటికి రాగానే, సుస్మిత వడ్డించిన భోజనం తింటూ ఉదయం నుండి జరిగిన విషయాలన్నీ వింటున్నాడు. సుస్మిత చెబుతున్న మాటలు ఒక ఎత్తైతే, ఆర్య ఆలోచనలు మరొక ఎత్తులో ఉన్నాయి. తన చెల్లి నీలా ప్రవర్తనలో కనిపిస్తున్న ఆ మార్పు అతనికి అంతుచిక్కడం లేదు.మరుసటి రోజు ఉదయం.. సూర్యుడు తన పనుల్లో తాను బిజీగా ఉన్నట్టే, ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. నీలా కాలేజీకి రెడీ అయి హాల్‌లోకి రాగానే ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడ సోఫాలో షీలా, అయాన్ కూర్చుని ఏదో సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. అది చూసి చూడనట్టుగా షీలాను పలకరించి, లోపలికి టిఫిన్ చేయడానికి వెళ్ళింది నీలా.టిఫిన్ తింటున్నట్టు నటిస్తోందే కానీ, నీలా మనసు లోపల ఉప్మా లాగా ఉడికిపోతోంది. తన అయాన్‌తో షీలా అంతలా ఏం మాట్లాడుతోంది? ఆర్య తన గదిలో ఉన్నాడని తెలిసి, తన కోపాన్ని బయట పడకుండా మేనేజ్ చేస్తూ కాలేజీకి బయలుదేరింది. కానీ కాలేజీలో పాఠాలు వింటున్నా, నీలా కళ్ల ముందు మాత్రం అయాన్, షీలా మాత్రమే కనిపిస్తున్నారు.సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ అదే దృశ్యం! షీలా అయాన్ పక్కనే కూర్చుని ముచ్చట్లు పెడుతోంది. నీలా సహనం నశించింది."ఏమిటి షీలా.. ఈ మధ్య మా ఇంట్లోనే ఎక్కువగా కనిపిస్తున్నావు?" అని కొంచెం నిలదీస్తున్నట్టు అడిగింది నీలా."ఏమీ లేదు నీలా.. అయాన్ నుండి ఒక చిన్న సహాయం కోరుతున్నాను" అంది షీలా చాలా క్యాజువల్‌గా."ఏం సాయం?" నీలా గొంతులో ఆత్రుత, భయం రెండూ ఉన్నాయి."అదే.. అయాన్‌తో ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటున్నాను. తనతో నా టైమ్ స్పెండ్ చేయాలని ఉంది" అని తాపీగా చెప్పింది.నీలాకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది. "ఫ్రెండ్‌షిప్? దానికోసం అడుగుతున్నావా?""అవును నీలా.. నువ్వు ఎందుకు అంత వర్రీ అవుతున్నావు? నీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా?" అని షీలా అడిగేసరికి నీలా దగ్గర సమాధానం లేదు. "అది.. అది కాదు.. ఇంతకీ అయాన్, నువ్వు ఏమన్నావు?" అని దీనంగా అయాన్ వైపు చూసింది.అప్పుడు అయాన్ తన యాంత్రిక గొంతుతో, "నేను నా సార్ (రాజు గారూ) ఆర్డర్ ప్రకారం నడుచుకోవాలి. నాకంటూ సొంత ఆలోచనలు ఉండవు" అన్నాడు. ఆ మాటతో నీలాకు ప్రాణం లేచి వచ్చినట్టయింది.అప్పుడే అక్కడకు వచ్చిన ఆర్య, "ఏమైంది షీలా? అయాన్‌తో నీకు ఫ్రెండ్‌షిప్ ఎందుకు?" అని అడిగాడు."ఆర్య.. నాకు రోబోల మీద రీసెర్చ్ చేయడం అంటే ఇష్టం కదా! అందుకే అయాన్ తో కొన్ని ప్రయోగాలు చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ అయాన్ మాత్రం మీ నాన్న గారి పర్మిషన్ ఉండాలంటున్నాడు" అని షీలా చెప్పింది."దానిదేముంది షీలా.. నేను నాన్నగారితో మాట్లాడి నిన్ను ఒప్పిస్తాను. అప్పుడు నువ్వు అయాన్‌ను నీతో పాటు తీసుకువెళ్లొచ్చు" అని ఆర్య నవ్వుతూ అన్నాడు.ఆర్య మాటలు వినగానే నీలా గొంతులో ఏదో అడ్డుపడినట్టయింది. మనసులోనే అన్నయ్యను ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంది. తన అయాన్‌ను వేరే వాళ్లకు ఇవ్వడమేంటి?షీలా నీలా ముఖం చూసి, "నీలా.. ఏమైంది నీకు? అలా డల్ గా ఉన్నావు?" అని అడిగింది."అదేం లేదు.. అయినా అయాన్ ఎందుకు? నువ్వు వేరే రోబో మీద పరిశోధన చేయొచ్చు కదా?" అని నీలా తన అసహనాన్ని బయటపెట్టింది."ఇప్పుడు నేను ఇంకా జూనియర్‌ని నీలా.. నాకు కొత్త రోబోలను ఇవ్వరు. అదే అయాన్ అనుకో, తనకి అన్ని తెలుసు కాబట్టి నాకు చాలా హెల్ప్ అవుతాడు" అని షీలా కొంచెం సిగ్గుపడుతూ చెబుతుంటే.. నీలాకు ఒళ్లు మండిపోయింది.'నా అయాన్ నీకు కావాలా?' అనుకుంటూ నీలా ఆవేశంగా వెళ్లి షీలా గూబ మీద ఒక్కటి లాగి కొట్టింది!షీలా కళ్లు తేలేసింది"నీలా..నీలా.. ఏమైంది నీకు? ఎందుకు అలా మూల స్తంభాల ఉండి పోయావు?" అని అరిచింది.అప్పుడే నీలాకు స్పృహ వచ్చింది. అంతా తన భ్రమ! తాను నిజంగా కొట్టలేదు, కేవలం ఊహించుకుంది. "ఏమీ లేదు షీలా.. ఏదో ఆలోచనలో ఉన్నాను" అని నీళ్లు నములుతూ చెప్పి, లోపలికి పరుగు తీసింది.
ఆ రాత్రి అయాన్ దూరమైపోతాడన్న భయంతో ఆలోచిస్తూ నీలా ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు. నాన్నగారు అయాన్ చేతిని పట్టుకుని షీలాకు అప్పగిస్తున్నారు. "వద్దు! అయాన్ నన్ను వదిలి వెళ్ళకు!" అని అరుస్తూ నీలా ఉలిక్కిపడి లేచింది. తీరా చూస్తే ఇది అంత కల! టైమ్ చూస్తే తెల్లవారుజామున 4 గంటలు. "తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంటారు.. అంటే అయాన్ నిజంగానే నన్ను వదిలి వెళ్ళిపోతాడా?" అన్న భయం ఆమెను నిద్రపోనివ్వలేదు.
అందరి కంటే ముందే లేచి కాఫీ తాగుతున్న నీలాను చూసి సుస్మిత ఆశ్చర్యపోయింది"ఏమైంది నీలా? లేపితే కానీ లేవని దానివి.. ఈ రోజు వర్షమేమీ పడటం లేదు కదా, ఇంత త్వరగా లేచావేంటి?" అని అడిగింది. అప్పుడు ఆర్య వచ్చాడు నేను కాదు నీ కొడుకు పుణ్య మని వర్షం కురిపిస్తాడు ఏమిటో బారెడు పొద్దు ఎక్కిన లేవదు అలాంటిది రెడీ అయే వచ్చాడు అని ఆటపట్టించింది . కానీ నీలా కళ్లలోని నీరసాన్ని చూసి, "ఏమైంది నీలా? నీ కళ్లు అలా ఉన్నాయి ఏంటి?" అని ఆందోళనగా అడిగాడు. "ఏం లేదు అన్నయ్యా" బాగానే ఉంది అని నీలా చెప్పింది సరే వెళ్ళి రెడీ అవ్వు నిన్ను కాలేజీలో దింపి నేను నాన్న గారి ఆఫీస్ కి వెళ్లి రావాలి అని అన్నాడు నీలా లోపలికి వెళిపోయింది.
నీలా వెళ్లిన వైపే చూస్తున్న ఆర్యను చూసి సుస్మిత, "ఏమైందిరా ఆర్య? ఎందుకు అలా చూస్తున్నావు?" అని అడిగింది.
ఆర్య నెమ్మదిగా, "ఏం లేదమ్మా.. కాలేజీలో ఆ ఎదవ (పాత గొడవ గురించి) మళ్ళీ చెల్లిని ఏడిపిస్తున్నాడా అని భయంగా ఉంది. మళ్ళీ ఏమైనా పాత గొడవలు స్టార్ట్ అవుతాయేమో.." అనేసరికి, సుస్మిత చేతిలోని కాఫీ కప్పు కింద పడిపోయింది. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆమె కంగారు పడుతుంటే.. ఆర్య ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి, "అమ్మా! నువ్వేమీ కంగారు పడకు. నేనున్నాను కదా, చెల్లిని నేను చూసుకుంటాను" అని ధైర్యం చెప్పాడు.