The mind behind the machine book and story is written by swathi in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The mind behind the machine is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
యంత్రం వెనుక మనసు - నవలలు
swathi
ద్వారా
తెలుగు Love Stories
పీఠిక :టెక్నాలజీ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. మనం తినే ఆహారం నుండి, పడుకునే పడక వరకు అంతా యంత్రమయం. కానీ, మనిషికి మాత్రమే ఉండే 'మనసు', ఆ యంత్రానికి కూడా ఉంటే? ప్రోగ్రామింగ్‌తో నడిచే రోబో, ప్రేమని కూడా ప్రోగ్రామ్ చేసుకోగలదా? ఆధునిక యుగంలో ఒక యువతికి, ఒక రోబోకి మధ్య చిగురించిన వింతైన, సున్నితమైన ప్రేమకథే ఈ 'యంత్రం వెనుక మనసు'.యంత్రం వెనుక మనసు:అధ్యాయం 1: మారుతున్న కాలం.. మారని మనసుసంవత్సరం 2050. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఒక అద్భుత లోకంలా ఉంది. పాతబడ్డ రోడ్ల మీద ఇప్పుడు ఎగిరే వాహనాలు (Drone Taxis) రయ్యిమంటూ దూసుకుపోతున్నాయి. నగరం నిండా ఎటు చూసినా ఆకాశాన్ని తాకే గాజు భవనాలు.. సాయంత్రం అయితే చాలు, ఆ భవనాల మీద వెలిగే లేజర్ లైట్లు నగరాన్ని ఒక రంగుల కలలా మారుస్తున్నాయి.అప్పట్లో మనుషులు పనుల కోసం ఉరుకులు పరుగులు పెట్టేవారు. కానీ
పీఠిక :టెక్నాలజీ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. మనం తినే ఆహారం నుండి, పడుకునే పడక వరకు అంతా యంత్రమయం. కానీ, మనిషికి మాత్రమే ఉండే 'మనసు', ఆ యంత్రానికి కూడా ఉంటే? ప్రోగ్రామింగ్‌తో నడిచే రోబో, ప్రేమని కూడా ప్రోగ్రామ్ చేసుకోగలదా? ఆధునిక యుగంలో ఒక యువతికి, ఒక రోబోకి మధ్య చిగురించిన ...మరింత చదవండిసున్నితమైన ప్రేమకథే ఈ 'యంత్రం వెనుక మనసు'.యంత్రం వెనుక మనసు:అధ్యాయం 1: మారుతున్న కాలం.. మారని మనసుసంవత్సరం 2050. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఒక అద్భుత లోకంలా ఉంది. పాతబడ్డ రోడ్ల మీద ఇప్పుడు ఎగిరే వాహనాలు (Drone Taxis) రయ్యిమంటూ దూసుకుపోతున్నాయి. నగరం నిండా ఎటు చూసినా ఆకాశాన్ని తాకే గాజు భవనాలు.. సాయంత్రం అయితే చాలు, ఆ భవనాల మీద వెలిగే లేజర్ లైట్లు నగరాన్ని ఒక రంగుల కలలా మారుస్తున్నాయి.అప్పట్లో మనుషులు పనుల కోసం ఉరుకులు పరుగులు పెట్టేవారు. కానీ
నీలా ! నువ్వు ఏది అడిగినా అమ్మ ఎప్పుడూ నీకు సపోర్ట్ చేస్తుంది కదా, నేనేమైనా అన్నానా చెప్పు? మరి ఇప్పుడు నాన్న నాకు సపోర్ట్ చేస్తే నువ్వెందుకు కుళ్ళుకుంటున్నావు?" అని నీలా తన అన్న ఆర్య నీ ఆటపట్టించింది.రాజు నవ్వుతూ, "సరే సరే ఇంకా చాలు.. ఇప్పటికే మీ అల్లరి ఎక్కువైంది. నీలా! ...మరింత చదవండిఆ రిమోట్‌లో బటన్ నొక్కు" అన్నాడు. నీలా బటన్ నొక్కగానే.. కొంచెం 'కిర్' అనే శబ్దం వచ్చి ఆగింది. రాజు వెంటనే "ఆ బ్లూ కలర్ బటన్ కూడా ప్రెస్ చేయి" అని చెప్పగానే నీలా అది నొక్కింది. వెంటనే ఆ బాక్స్ లో నుండి ఒక రోబో బయటకు వచ్చాడు. అతన్ని చూడగానే నీలా అలా ఉండిపోయింది. ఆరడుగుల ఎత్తు, ఆపిల్ పండు లాంటి ఛాయ, నీలం రంగు కళ్లతో అతను అచ్చం మనిషిలాగే ఉన్నాడు. మనీషా ఇంతకి రోబో నా ?
మరుసటి రోజు ఉదయం.. ఇంట్లో వాతావరణం ఎప్పటిలాగే సందడిగా ఉంది. అయాన్ ఇంటి పనులన్నింటినీ ఎంతో చకచక చేసేస్తున్నాడు. వంటగదిలో సుస్మిత టిఫిన్ చేయడంలో నిమగ్నమై ఉండగా, రాజు గారు అక్కడికి వచ్చారు."ఏమిటి సుస్మిత.. ఇవాళ ఏం టిఫిన్? ఈ దోశలు ఎప్పుడూ నీ ముద్దుల కొడుకు కోసమేనా లేక మా కోసం కూడా ...మరింత చదవండిమిగిల్చావా?" అని రాజు గారు సరదాగా అడిగారు. సుస్మిత నవ్వుతూ, కంటి సైగతో పక్కనే ఉన్న హాట్ బాక్స్‌ని చూపించింది.అందులో వేడివేడి పూరీలు పక్కనే పూరి కూర్మ చూసి రాజు గారు మురిసిపోతూ, "థాంక్యూ మై బెటర్ హాఫ్!" అంటూ ఆమె బుగ్గ గిల్లుతుండగా.. సరిగ్గా అదే సమయానికి నీల అక్కడికి వచ్చింది. అమ్మానాన్నల అన్యోన్యతను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెనుతిరిగింది.బయటకు రాగానే అయాన్ ఎదురై, "గుడ్ మార్నింగ్ నీల!" అన్నాడు. ఆ పిలుపు వినగానే నీల గుండెలో ఏదో
"ఏమిటో చెప్పు ఆర్య, తప్పకుండా చేస్తాను" అన్నాడు అయాన్ తన మెకానికల్ వాయిస్‌లో."మా చెల్లి ఉంది చూడు.. ఎప్పుడూ నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. ఈసారి నేను దాన్ని ఆటపట్టించాలి. ఏం చేసినా తనే గెలుస్తోంది, నేనే ఓడిపోతున్నాను. తనకి నా మీద భయం పుట్టాలి. నా పేరు వింటేనే గజగజ వణికిపోయేలా ఏదైనా ఐడియా ...మరింత చదవండిచెప్పు" అని అడిగాడు. అలా తన పేరు చెప్పగానే నీల భయపడిపోవాలని ఊహించుకుంటూ ఆర్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు.వెనుక నుండి నీల వచ్చి ఆర్య నెత్తి మీద ఒక్కటి చరిచింది."అది ఎప్పటికీ జరగదు లేరా అన్నయ్య! ముందర రా.. అమ్మ టిఫిన్ తినడానికి రమ్మంటోంది" అంటూ గట్టిగా నవ్వుతూ అక్కడి నుండి పారిపోయింది. తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆర్య నోరెళ్లబెట్టాడు.అందరూ టిఫిన్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ప్లేట్లలో వేడివేడి దోశలు ఆవిర్లు కక్కుతున్నాయి. నీల పక్కనే కూర్చున్న ఆర్య, ఆమె వైపు
ఇదంతా బయట నిలబడి చూస్తున్న అయాన్, ఆ దృశ్యాలను తన మెమరీలో సేవ్ చేసుకున్నాడు. మనుషుల మధ్య ఉండే ఈ విడదీయరాని బంధాన్ని, ఒకరు లేనప్పుడు మరొకరు పడే ఆ వేదనను చూసి.. ఒక యంత్రమైనా సరే, అయాన్ లోపల ఏదో తెలియని అనుభూతి కలిగింది.రాజు గారు వెళ్తూ.. "అయాన్! నేను ఇంట్లో ఉండను ...మరింత చదవండినువ్వే అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి" అని బాధ్యత అప్పగించారు. "అలాగే సార్!" అని అయాన్ ఆయన సూట్‌కేస్ కారులో పెట్టి, సాగనంపి తిరిగి అపార్ట్‌మెంట్‌లోకి వచ్చాడు.అయాన్ లిఫ్ట్ దగ్గరకు రాగానే, అక్కడ ఉన్న కొందరు అమ్మాయిలు అతడిని చూసి ఆశ్చర్యపోయారు. "ఎవరీ హ్యాండ్‌సమ్ బాయ్?" అనుకుంటూ అతని చుట్టూ చేరారు. లిఫ్ట్ ఎక్కనివ్వకుండా అతడిని ప్రశ్నలతో ముంచెత్తారు. "ఎవరు నువ్వు? ఏ ఫ్లాట్ మీది?" అని అడుగుతుంటే అయాన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలబడ్డాడు.అంతలో కొందరు ఆకతాయి అబ్బాయిలు కూడా అక్కడికి వచ్చారు.