Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

యంత్రం వెనుక మనసు - 8

సుస్మిత ఆ పాత సంఘటనను తలచుకుంటూ దీర్ఘాలోచనలో పడిపోయింది. సుస్మిత కు గతం గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి.అప్పుడు నీలా కాలేజీలో కొత్తగా చేరిన రోజులు. కాలేజీలో ఒక ఆకతాయి నీలాను నిరంతరం వేధిస్తూ ఉండేవాడు. కానీ నీలా ఆ విషయాన్ని ఎప్పుడూ ఇంట్లో చెప్పలేదు. ఒకవేళ చెబితే, తన తల్లి పాతకాలం మనిషి కాబట్టి, ఎక్కడ తన చదువు ఆపేసి ఇంట్లో కూర్చోబెడుతుందో అన్నది నీలా భయం. కానీ ఆ రోజు ఆ ఆకతాయి శృతి మించి ప్రవర్తించాడు.సరిగ్గా అదే సమయంలో, నీలా మరిచిపోయిన లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఆర్య కాలేజీకి వచ్చాడు. అక్కడ తన చెల్లిని ఒకడు అసభ్యంగా వేధిస్తుండటం చూసి ఆర్య రక్తం మరిగిపోయింది. పిడుగుల్లాంటి దెబ్బలతో వాడిని చితకబాదేశాడు. నీలా కు ఆర్య కు ఎన్ని  గొడవలు ఉన్న చెల్లిని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు నీలా కూడా అంతే ఎంత ఏడిపించిన తనే ఏడిపించాలి కానీ  ఇంకొకరు ఆర్య జోలికి వస్తె ఊరుకోదు. తన చెల్లెలి నీ ఎవరు ఎమన్నా సహించని ఆర్య ఇప్పుడు చెల్లెలు నీ ఈ పరిస్థితి లో చూసి ఇంకా ఊరుకుంటాడా? ఆర్య, ఆ రోజు వాడి ప్రాణాలు తీసేంత పని చేశాడు. చుట్టూ ఉన్నవారంతా ఆర్యను ఆపి, వాడిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు.ఆర్య నీలాను తీసుకుని ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం అంతా తల్లి సుస్మితకు చెప్పి, "మళ్ళీ చెల్లిని కాలేజీకి పంపవద్దు!" అని ఖచ్చితంగా చెప్పేశాడు. కోపంతో ఊగిపోతున్న ఆర్యను చూసి, "ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా?" అని సుస్మిత అడిగితే.. "వాడిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లారట కదా! వాడు ఇంకా బతికే ఉంటే, ఇంకోసారి నా చెల్లి వైపు చూడకూడదని వార్నింగ్ ఇచ్చి వస్తాను!" అని గర్జిస్తూ వెళ్ళిపోయాడు.

హాస్పిటల్‌లో ఉన్న ఆకాష్ దగ్గరకు వెళ్ళిన ఆర్య, "ఇంకొకసారి నా చెల్లెలి జోలికి వచ్చావో.. నువ్వు ప్రాణాలతో ఉండవు!" అని హెచ్చరించాడు.కానీ ఆకాష్ ఏమాత్రం తగ్గకుండా నవ్వుతూ, "రేయ్ ఆర్య! నా మీద చేయి చేసుకున్నావు కదా.. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు నీ చెల్లెలే కోసం వెతుక్కుంటూ వచ్చి, నువ్వే నా కాళ్ల మీద పడి 'మా చెల్లెలిని పెళ్లి చేసుకో బావా' అని అడుక్కునేలా చేయకపోతే నా పేరు ఆకాష్ కాదు!" అని సవాల్ విసిరాడు.ఆ మాటలకు ఆర్యకు మళ్ళీ కోపం వచ్చి, వాడిని రెండు పీకాడు. చుట్టూ ఉన్నవారు ఆర్యను ఆపి, "ఇంకా కొడితే వాడు చస్తాడు.. అప్పుడు నువ్వు జైలుకు వెళ్లాల్సి వస్తుంది" అని చెప్పి అతన్ని అక్కడి నుండి పంపించేశారు. ఇంటికి వచ్చి జరిగినదంతా చెప్పిన ఆర్య, నీలాను ఇక కాలేజీకి పంపవద్దని గట్టిగా చెప్పాడు. అప్పుడు తండ్రి రాజు గారు, "ఈ సంవత్సరంతో తన చదువు పూర్తవుతుంది కదా.. అది అవ్వగానే పెళ్లి చేసేద్దాంలే" అని నచ్చజెప్పారు.ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి సుస్మిత మౌనంగా ఉండిపోయింది. ఆమె భయాన్ని గమనించిన ఆర్య, "అమ్మా! నువ్వు ఏమీ కంగారు పడకు. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను" అని ధైర్యం చెప్పాడు.అప్పుడే నీలా రెడీ అయి హాల్‌లోకి వచ్చింది. తల్లి, కొడుకు సీరియస్‌గా మాట్లాడుకోవడం చూసి, "ఏమిటి అన్నయ్యా.. మీ ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు?" అని అడిగింది.ఆర్య వాతావరణాన్ని తేలిక చేయడానికి నవ్వుతూ, "ఏం లేదు నీలా.. నీకు వచ్చే ఆస్తి వాటా నాకు ఇచ్చేయమని అమ్మను అడుగుతున్నాను" అన్నాడు.దానికి నీలా అంతే సీరియస్‌గా, "నా వాటా నీకు ఎందుకు ఇస్తాను అన్నయ్యా? అక్కడ ఒక బిల్డింగ్ కట్టి, అనాథ పిల్లలను దత్తత తీసుకుని చూసుకోవాలని నా కోరిక అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా!" అని బదులిచ్చింది.
నీల మాటలు విన్న ఆర్య పగల బడి నవ్వుతున్నాడు. కొంచెం నవ్వును ఆపుకొని అయిన నీకు ఎన్ని సార్లు చెప్పినా వినవా నీకు అవేమీ వద్దు నీ చదువు అవ్వగానే పెళ్ళి చేసేయొచ్చు అని మేము అనుకుంటే నువ్వు అనాథ పిల్లలు లను దత్తత తీసుకోవాలని వాళ్లను చేరదియాలనీ అంటున్నావు అని ఆర్య అంటే నీలా కళ్ళలోకి చూస్తూ సీరియస్‌గా ఇలా అంది:"నిజం అన్నయ్యా.. సొంత వాళ్లు ఉండి కూడా ఒంటరిగా మిగిలిపోయే వాళ్ళు కొందరైతే, పుట్టగానే లోకంతో సంబంధం తెగిపోయిన అనాథలు మరికొందరు. వాళ్ళకి ఆస్తిపాస్తులు అక్కర్లేదు అన్నయ్యా.. అమ్మ అని పిలవడానికి ఒక పిలుపు, తలదాచుకోవడానికి ఒక నీడ, 'మేమున్నాం' అని ధైర్యం చెప్పే ఒక చిన్న భరోసా ఉంటే చాలు.ఎండలో ఎండుతూ, వానలో నానుతూ, ఆకలితో అలమటించే ఆ పసి ప్రాణాల కళ్ళల్లో ఏదో వెతుకులాట కనిపిస్తుంది. ఆ వెతుకులాటలో ఒక ఆత్మీయత దొరికితే, వాళ్ళే ఈ సమాజానికి గొప్ప పౌరులవుతారు. నా ఆస్తి వాటా నాకు ముఖ్యం కాదు, ఆ వాటాతో నలుగురు పిల్లల జీవితాల్లో వెలుగు నింపగలిగితే.. అదే నేను ఈ జన్మకి పొందే అతిపెద్ద ఆస్తి."నీల మాటలకు ఆర్య కళ్ళు చెమర్చాయి. అప్పటివరకు సరదాగా ఉన్న వాతావరణం కాస్తా ఒక్కసారిగా గంభీరంగా, ఎమోషనల్‌గా మారిపోయింది.
నీల మాటల గంభీరంలో అందరూ మునిగిపోయి ఉండగా.. అప్పుడే అక్కడికి అయాన్ వచ్చాడు. తన నడకలో తడబాటు, కళ్ళలో ఏదో తెలియని శూన్యం. అతని దగ్గర నుండి ఒక వింతైన శబ్దమో లేక ఏదో 'కిర్.. మణి' అనే మెకానికల్ సౌండ్ వస్తున్నట్టు అనిపించింది. అది గమనించిన నీల ఒక్కసారిగా కంగారు పడిపోయింది."ఏమైంది అయాన్? నీకు ఏమైంది? ఆ శబ్దం ఏంటి?" అంటూ ఆందోళనగా అడిగింది.అప్పుడు ఆర్య తల పట్టుకుని నీరసంగా ఇలా అన్నాడు, "నీలా.. సర్వం తుడిచిపెట్టుకుపోయింది. అయాన్ మెమరీలోని డేటా అంతా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు వాడికి మన పేర్లు తప్ప మరేమీ గుర్తులేదు."ఆ మాట వినగానే నీల గుండె ఆగిపోయినంత పని అయింది. తన కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కుంగిపోయినట్లు, చుట్టూ ఉన్న ప్రపంచం కూలిపోతున్నట్లు అనిపించింది. నిన్నటి వరకు ఎంతో చురుగ్గా ఉన్న అయాన్, ఇప్పుడు ఒక ఖాళీ యంత్రంలా మారిపోయాడన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఆర్య నీలా నీ పద కాలేజీకి వెళదాం. నిన్ను కాలేజీ దగ్గర దింపి, నేను అయాన్‌ని తీసుకుని నాన్నగారి ఆఫీస్‌కు వెళ్లాలి. అక్కడ ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి" అన్నాడు.