Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 7

ఇసుకలో ట్రాక్టర్ నడిపే అతను..అక్క ఒక్కతే ట్రాక్టర్ లో పేసిన మట్టి రోడ్డు మీద పోయటానికి వెళ్లినపుడు. అతను ఇలా అన్నాడంట..
"నువు నాకు నచ్చావ్..నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని
అక్కకు భయం తో ఏం చేయలో తెలియలేదు...
అమ్మ నాన్న కు చెబితే గొడవ అవుతుంది అని..

అక్క మా అక్కకు , అన్నలకు చెప్పింది

దానితో మా అన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అతనికి...
అతను  మా అన్నను చూసి బయపడిపోయాడు.

దానికి మా అన్న ఏదో సాధించినట్టు తెగ సంతోష పడుతున్నాడు.
ఏదేమైనా మాకు వచ్చిన ప్రాబ్లంను అమ్మ నాన్న కు తెలియకుండా మేమే పరిష్కరించుకున్నాము.

ఇలా కొన్ని రోజులు గడిచినా తరువాత నా 4వ తరగతి కూడా అదే వూరిలో గడిచిపోయింది. ఎండాకాలం సెలవులలో అమ్మ వాళ్ళతో..పనికి వెళ్ళేది.

అదే వూరిలో  పొలాల దగ్గర వుండే బావి  మట్టి తెచ్చి గంగలో పోసేవారు.
ఆ పల్లెటూరిలో బావి దగ్గర వాతావరణం చాలా బాగుండేది.
ఎండాకాలం టైం కాబట్టి ముంజకాయలను తినడం...
గంగలో నీళ్లు తక్కువగా వుండడం తో అందరం ఈత కొట్టడం..
ఎక్కడయినా తక్కువ నీళ్లు వుంటే అక్కడ బురుదలో చేపలు పట్టడం..
ఒక చేపను పట్టిన సరే.. కప్ కొట్టినంత ఆనందం వేసేది.

ఒకరోజు  సాయంత్రం గంగా లో  వున్నపుడు  ఆ రోజు పగటి పుట అంతా ఎండ బాగా కొట్టింది.

సాయంత్రం 3 గంటల సమయానికి ఒక్కటే గాలి దుమారం ...ఆ టైంలో గంగా లో నాన్న నేను మాత్రమే వున్నాం అక్కడ ..
గాలి బాగా వస్తుంది అని నాన్న గోదావరి నుంచి నన్ను ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు..

ఇద్దరం గోదావరిలో గాలికి ఎదురుంగ నడుచుకుంటూ వెళ్తున్నాం..
నాకు ఆ గాలి వేగాన్నికి...ఆ ఉరుముల సౌండ్ కి చాలా భయం వేసింది.
ఆ గాలి వేగానికి నేను కొట్టుకపోతను కావచ్చు అనిపించింది.
ఆ భయానికి నేను నాన్న చేయ్ గట్టిగా పట్టుకున్నా ..కానీ నిజానికి నాన్న కు కూడా గాలి వాన అంటే చాలా భయం.

చుట్టూ ఎటూ చూసిన ఉరుములు ,మెరుపులు..వేగంగా వచ్చే  గాలి వాన నుంచి మేము తప్పించుకోలేక పోయాం..

ఇంటికి వెళ్ళే సరికి పూర్తిగా నానిపోయాం..

ఆ చిన్న తనంలో మొదటిసారిగా నేను గాలి వానను చూసి ఎందుకు బయపడినానో తెలియదు కానీ... ఇప్పటికీ ఉరుములు , మేరుపులు వస్తె నేను ఏక్కడ వున్న వచ్చి ఇంట్లో వుండాలి..
ఆ భయం ఇప్పటికీ నన్ను వదలలేదు.

వాన పడిన మరసటి రోజు అందరం కలిసి పొద్దున ట్రాక్టర్ లో ఎప్పటి లాగానే పనికి వెళ్తున్నాం...ఇంక కాసేపు అయితే గోదావరి లోపలికి వెళ్లే వాళ్ళము.

అది ఎండ కాలం కాబట్టి ఉదయం 7 గంటల వరకు పని దగ్గరకు వెళ్ళేది.

మేము వెళ్తున్న దారిలో ఒక పెద్ద అడవి పందుల గుప్పు..మా ట్రాక్టర్ కి ఎదురుగా వచ్చింది.
ట్రాక్టర్ సౌండ్ కి భయపడి అటు ఇటు పరిగెత్తుంతూన్నాయి.

వాటిని చూసిన తరువాత మా వాళ్ళు ఆగుతారా..

ఎవరి చేతికి ఏది దొరికితే అది పట్టుకొని వాటీని పట్టటానికి వెళ్లారు.

ఒకరూ పారా..ఒకరు గడపరా..ఒక్కరు రాయి..పట్టుకొని
వాటి వెనుకే పరిగెత్తారు .

మా నాన్న గడపారా విసిరేస్తే వెళ్లి ఒక పందికి వెనుక నడుము దగ్గర తగిలింది.
అటు ఇటు చేసి ఒకదాని దొరక పట్టారు.

చనిపోయిన దానిని ట్రాక్టర్ లో వేసుకొని పని దగ్గరకు తీసుకొని వెళ్ళి..కొందరు పని చేస్తూ వుంటే కొందరు  దానిని కాల్చి ,కోయడం చేశారు.

మధ్యానం వారికే పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లి ఎవరిది వాళ్ళు వండుకొని తినారు.

అడవి పంది అయ్యే సరికి ..అక్కడ పని చేయించే పెద్ద పెద్ద సర్ వాళ్ళు కూడా మాకు కూడా కొంచం కూర పెట్టండి మేము కూడా వండుకొని తింటాము అని తీసుకొని వెళ్లారు.

ఆ గోదావరిలో పని చేసే పెద్ద సర్  డ్రైవర్ వాళ్లకు అన్నం పెట్టడం కోసం ..ఆ గోదావరిలో ఒక మంచి గుడిసె వేసి..అక్కడ ప్రతిరోజు  వంటలు వండి పెడుతారు.

అది పల్లె టూర్ కాబట్టి అక్కడ ఎక్కవగా హోటల్స్ వుండవు...పని చేసే వరకు ఫుడ్ కి కష్టం అవుతుంది అని అక్కడే వండే వారు.

గోదావరిలో పని బాగా జరగడం తో పక్క వూరి వాళ్ళు..ఒక చిన్న కిరాణం కూడా అక్కడ గోదావరి లో పెట్టారు. 
మేము అప్పుడపుడు అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళి కొనుక్కొనే వాళ్ళము.

అడవి పంది పడింది అని వూరిలో వాళ్లకు కూడా తెలిసి కొందరు ఇంటికి వచ్చి ఎవరికీ తెలియ కూడా తీసుకొని వెళ్లే వారు.
ఇతర దేశాలలో పందులు తినడం వారికి తప్పేమీ కాదు..
కానీ మన దేశం లో పంది మాంసం తింటారు అంటే అది ఏదో పెద్ద తప్పుల చూస్తారు..
మళ్ళీ మా కులం వారు మాత్రమే తింటారు అని మమల్ని కూడా చిన్నచూపు చూస్తారు.

కానీ యిప్పుడు వున్న పరిస్థుతులలో మా కులం వారు మొత్తం తినడమే మానేశారు.
కానీ ఎక్కువుగా అగ్ర కులం వారే తింటున్నారు.

(తప్పుగా  అనిపిస్తే క్షమించండి)

కానీ మా కులం వారికి పంది మాంసం మీద వున్న ఇష్టం వల్లనా .. ఎన్నో కుటుంబాలు బలి అయినాయి.
అది ఎలా అంటే..

ఒకసారి కొంత మంది మా వూరి నుంచి కనీసం ఒక 5 కుటుంబాలు వేరే వూరు అయిన  ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర బార్డర్ కి దగ్గరలో ఒక పల్లెటూరికి  పనికోసం వెళ్లారు.
ఇక్కడి వాతావరణం అక్కడి వాతావరణం కొంచం వేరుగా వుండేది.
అక్కడి మనషులు, భాష , వేషం కూడా కొంచం వేరుగా ఉంటుంది.
కొన్ని రోజుల పని కోసం అక్కడికి వెళ్ళారు..కొన్ని రోజులు పని బాగా నడిచింది.అయితే వచ్చిన డబ్బులతో ఒక పంది నీ తెచ్చుకున్నారు.

అక్కడ చుట్టూ కొండలు మధ్యలో ఇల్లులు వున్నాయి..
వారు వున్న ఇంటి దగ్గర కోస్తే  అందరు చూస్తారు  అని ...వూరి చివరికి వెళ్లి అక్కడ పందిని కోసారు.

కోసిన పంది బొక్కను నరకడం కోసం ఏమి లేదు...అని అటు ఇటు చూస్తున టైం లో అక్కడ కొంచం దూరం లో ఒక చెక్క కనిపించింది వారికి..
ఆ చెక్కను  ఒక వైపు బొమ్మల చెక్కారు ..  ఒక వైపు మామూలుగా వుంది.
అది చాలా పాతది ల తుప్పు పట్టినట్టు కనిపించింది వారికి.

పనికి రాని కట్టే అనుకొని దాన్ని మీద పంది బొక్కను కొట్టి ..తరువాత అందరు ఇంటికి వెళ్లి ఆ మాంసని వండుకొని తిన్నారు.

ఆ రాత్రి అందరు బాగానే పడుకున్నారు..కానీ తెల్లవారే సరికి అందరికీ బాత్రూం పెట్టడం స్టార్ట్ అయింది.

అందరు డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు తెచ్చుకోవడం వేసుకోవడం కానీ అస్సలు తక్కువ అవుతా లేదు..

అప్పటికే 2,3 రోజులు అవుతుంది..ఎందుకు ఇలా అవుతుంది అని ఒక అడ మనిషి ఆ వూరిలో వుండే ఒక ముస్లిం బాబా  దగ్గరికి వెళ్లి  జరిగింది అంతా చెప్పింది.

విషయం అంతా విని అతను ఇలా అన్నాడు..

ఏదో గాలి కావచ్చు నేను ఈ తయితా కాడుత ఏం కాదు తక్కువ అవుతాది అని చెప్పాడు.
తయితా కట్టుకున తరువాత ఆమెకు మోష్షన్స్, విరోచనాలు తక్కువ అయినాయి.

ఇంటికి వచ్చిన తరువాత  పందిని ఏ కొసరు?.. ఎలా కోసరు? అని అన్ని అడిగింది ఆమె..

దానితో వాళ్ళు జరిగిందంతా చెప్పారు.

దానితో ఆమె కోపానికి వచ్చి...ఎంత పెద్ద తప్పు చేశారు...పనికి రాని కట్టే అని మీరు బొక్క కొట్టిన కట్టే ఆది ఇక్కడి వారు కొలిచే దేవుడి విగ్రహం.

మనం రాళ్ళ రూపం లో దేవుడిని కొలిస్తే ఇక్కడి వాళ్ళు చెక్క రూపంలో కొలుస్తారు అంట..

మీరు చేసింది చిన్న తప్పు కాదు అని చెప్పింది.

మిగితా వారు కూడా ఈమె చెప్పిన మాటలు విని అందరు భయపడి..
అందరు కలిసి ముస్లిం అతని దగ్గరికి వెళ్లి తయితాలు కట్టించుకున్నారు.
తయిత తో అందరికీ మోషన్స్ ,విరోచనాలు అన్ని తక్కువ అయినాయి.

వీరి అందరికీ తక్కువ అయిన తరువాత ముస్లిం కుటుంబం లోని వారి అందరికీ కూడా మోషన్స్ ,విరోచనాలు మొదకు అయినాయి.

దానితో ముస్లిం బాబా అమ్మ ఈ శక్తి చాలా పెద్దగా వుంది...మీకు సాయం చేసి నందుకు నన్ను యిప్పుడు ఇబ్బంది పెడుతుంది..

మీరు ఈక్కడ వుండకుండా మీ వూరికి  వెళ్ళిపొండి అని చెప్పాడు బాబా .

దానితో అందరు భయపడి.. రాత్రికి రాత్రే వారి సొంత వూరికి వచ్చారు.

అందరు సమాను సర్దుకొని ట్రాక్టర్ లో వారి వూరికి వచ్చారు కానీ ..వచ్చిన తర్వాత కూడా వారికి వారి సమస్య పోలేదు.

అక్కడ ఇక్కడ తిరిగి కొంత మంది దేవుడు వచ్చే వారిని అడిగితే..
ఒక దేవత మీరు చేసిన పనికి మీ మీద పగా పట్టింది.

మీరు ట్రాక్టర్ తో ఏ గాలి రాకుండా వుండాలి అని.. కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు తొక్కించిన ఆ గాలి ట్రాక్టర్ కడ్డీలు పట్టుకొని మీతో పాటే వచ్చింది.

తను "బలి కోర్కుంటుంది "
మీరు చేసిన తప్పుకు అని చెప్పారు. 

స్వామీజీ వాళ్ళు చెప్పినా ప్రకారమే కనీసం ఒక 5 గురు కొన్ని రోజుల వరకు మోషన్స్ , విరోచనాలు తో బాధ పడి పడి..చనిపోయే ముందు పిచ్చి పిచ్చి గా చేసి చనిపోయారు.

కొందరు స్వామీజీ చెప్పిన పూజలు చేసి చావు నుండి బయట పడ్డారు.
కానీ ప్రతి ఒక కుటుంబంలో ఒకరు చనిపోయారు...
ఆడవారు..మగవారు..చిన్న పిల్లలు కూడా ఆ దేవతా కోపానికి బలి అయ్యారు.

కొన్ని కొన్ని సార్లు మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పుల్లు మన ప్రాణం మీదకు వస్తాయి..
వారి తెలియని ప్రాంతం లోకి వెళ్లి తెలియక చేసిన తప్పు చాలా మందిని బలి తీసుకుంది.

ఇలా పంది మాంసం మీద వున్న ఇష్టం తో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు..
ఆ సంఘటన తో చాలా వరకు మా కులం వారు పంది మాంసం తినడం మానేశారు...

ఇంక వుంది....