ఈ కథ రాయడానికి ముఖ్య ఉద్దేశం.
గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలు తెలుసుకోవడం కాకుండా వెనుకబడిన వర్గాల వారి జీవిత చరిత్ర తెలుసుకొని
వారి జీవన విధానం ఎలా ఉంది .వారు పడిన బాధలు ఎలా ఉన్నాయి. వారు వారి జీవితంలో వచ్చే ఆటుపోటులను అడ్డుకొని ఎలా నిలబడ్డారు.
అని అందరికీ తెలియడం కోసమే ఈ మట్టిలో మాణిక్యం కదా రాస్తున్నాను.
భాగం 1 తరువాత,
అమ్మానాన్న దగ్గర నుంచే మేము పేకాట ఆడడం నేర్చుకున్నాము.
అందరి దృష్టిలో అది ఒక వ్యసనం లాంటి ఆట కానీ మాకు మాత్రం అది ఒక కాలక్షేపం కోసం ఆడే ఆట మాత్రమే.
పని లేని టైం లో గుడిసెల వుండే మిగితా వారు డబ్బులు పెట్టీ పేకాట ఆడేవారు . ఇక్కడ వున్న వారు అందరు వారి వయసు తో సంబంధం లేకుండా అందరూ ఆడే వారు.
ఈ ఆట అమ్మ వాళ్ళ దగ్గరి నుంచి నేర్చుకున్నాం. కానీ నాన్నకు మాత్రం ఇలాంటి ఆటలు డబ్బులు పెట్టీ ఆడడం అస్సలు ఇష్టం వుండేది కాదు.
కానీ మేము నాన్న లేని సమయంలో ఆడుకునే వాళ్ళము.
ఇక్కడ గుడిసెల్లో వుండే పెద్ద వారికి ప్రతి ఒక్కరికీ ఒక సైకిల్ వుండేది.
ఎవ్వరీ సైకిల్ మీద వాళ్ళు వారి భార్యలను తీసుకొని ..ఎంత దూరం అయిన తొక్కుకుంటూ పనికి వెళ్లేవారు.
వారితే పాటు ఒక్క పారా , గడపారా అన్నం టిఫిన్ ఇంక తట్టలు.. ఇవ్వని తీసుకొని పనికి వెళ్లే వారు .
కొందరు అయితే 1 సంవత్సరం లోపు చిన్న పిల్లలను కూడా పనికి తీసుకొని వెళ్లే వారు.
ఎందుకంటే వాళ్ళను చూసుకోటానికి ఇంటి దగ్గర ఎవ్వరూ వుండేవారు కాదు ...
చూసుకునే వారు వున్న .. వీళ్ళు వెళ్ళేది ఒక్కోసారి దూరం పని అయితే ..పిల్లలు పాలకు ఏడుస్తారు.. అనీ తీసుకొని వెళ్లే వారు కాదు.
మా వాళ్ళలో ఆడవారు, మగ వారి కంటే కూడా ఎక్కువ పని చేస్తారు అందుకే...
పని చేయించుకునే సార్ వాళ్ళు ..ఆడవాళ్ళు పిల్లలను తీసుకొని వచ్చిన ఏం అన్నారు.
పిల్లలను తీసుకొని పనికి వెళ్లడం మాకు కొత్తేమీ కాదు.
కానీ ..ఒకసారి ఇలాగే పనికి మా తమ్ముని తీసుకొని వెళ్ళింది మా చిన్నమ్మ .
మేము వేరే వూరికి పని కోసం వెళ్ళాము .
మేము చేసే పని ఒక పెద్ద చెరువు కట్ట పని.ఆ కట్ట కోసం ట్రాక్టరు లో మట్టిపోసి తీసుకురావాలి.
అందుకోసం అనీ ఒక బావి దగ్గర తీసిన మట్టి ట్రాక్టర్ లో పొస్తునాం. అప్పుడు మా తమ్మునికి ఆరు నెలలు అనుకుంటాను.
మా చిన్నమ్మ మా తమ్ముడు ఏడుస్తుంటే అప్పుడే పాలు ఇచ్చి పక్కకు కూర్చో పెట్టీ ,తను ఆడుకుంటుంటే లేచి కొంచం దూరం వచ్చింది.
వీళ్ళు మట్టి నిప్పే చోటునే వాణ్ణి కూర్చోబెట్టింది.
మట్టి నిప్పిన ట్రాక్టర్ మట్టినీ చేరువు కట్టకు పోయటానికి వెళ్ళింది.
నేను ఇంకా మిగితా పిల్లలం అందరం కొంచం దూరం లో అడుకుంటున్నాము.
ఇందులో మా చిన్నమ్మ తమ్ముని అక్కడ కూర్చో పెట్టీ జరగగానే పెద్ద మట్టి పేడ్డ 15 పిట్ల ఎత్తు నుంచి మా తమ్ముణ్ణి మీద పడింది..
ఒకసారిగా
అక్కడ వున్నవారు అందరు అలానే చూస్తూ ఉండిపోయారు .
అస్సలు అక్కడ ఏం జరిగిందో కూడా అర్థం అవ్వటానికి కొంచం టైమ్ పట్టింది.
వెంటనే మా చిన్నమ్మ "రాజు అంట్టు బోరున ఏడుస్తుంది".
ఇంతలో మా నాన్న ..ఇంక మా బాబాయ్ అక్కడ పని చేసే ఇంక కొంత మంది .. టకటకా మా తమ్ముని మీద పడిన మట్టి పెడ్డలు అన్నీ తీసేస్తున్నారు.
కనీసం ఒక 3 ట్రాక్టర్ లా మట్టి వాడి మీద పడింది. మేము అందరం చాలా ఏడుస్తూన్నం..
మా చిన్నమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. పక్కకు వున్న వారు అందరు "పిలగాడు బతకడు.. అంతా మట్టి పడ్డది తొందరగా తీయండి" అంటున్నారు .
ఇంతలో
మా నాన్న తొందరగా పారా తీసుకొని టకటకా పారా తో మట్టి తియ్యడం మొదలు పెట్టాడు .
ఇంతలో వాడి అంగీ కొంచం కనిపించింది.
వెంటనే వాడి మీద పడిన మట్టి చేతితో తీసి పక్కకు అని..
వాడిని బయటికి తీసాడు కానీ వాడు అప్పటికే సృహ కోల్పోయాడు.
వాడిని చేతులాల్లో పట్టుకొని అందరు ఒకరువెనుక ఒకరు పరుగెత్తుతున్నాము.
మేము పని చేసే చోటు వూరికి చాలా దూరం లో వుంది .
ఇంతలో దేవుడి దయ వలన మట్టి తీసుకొని వెళ్ళిన ట్రాక్టర్ వస్తూంది...
వస్తున్న ట్రాక్టర్ ను ఆపి అందులో అందరం తమ్ముని తీసుకొన్ని హాస్పటల్ కి వెళ్ళాం.
టైం కి అక్కడ డాక్టర్ వుండడం వల్లనా మా తమ్ముడు మాకు దక్కాడు.
ఇలాంటి పరిస్థితులు ఎన్నో వుంటాయి మా జీవితాలలో కానీ బతుకు పోరాటం కోసం ఎంత కష్టం వచ్చిన సాగిపోతూనే వుంటాం.
మళ్ళీ కరీంనగర్ స్టొరీ కి వస్తే.
పనికి వెళ్ళిన అమ్మ నాన్న ఇంటికి వచ్చేసరికి కూలీ పని అవుతే 4 గంటలకు అవుతుంది.
సొంతం పని అవుతే..
ఇంటికి వచ్చేసరికి 5 అవుతాది.
గుత్తా పని అయితే తొందరగా వస్తారు.
అప్పుడు కూలీ ఒకరికి 100 రూపాయలు చొప్పున వుండేది. గుత్తా అయితే ఎక్కువ డబ్బులు వచ్చేవి.
సాయంత్రం అమ్మ వాళ్ళు పని నుంచి ..
మేము స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వాళ్ళము.
అమ్మ తొందరగా వస్తె మేము హోంవర్క్ చేసుకొని ఆడుకునే వాళ్ళము .
అమ్మ కొంచం లేట్ అవుతే ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేవాళ్ళము.
రాత్రి అయితే ప్రతి గుడిసెలో కిరోసిన్ ఆయిల్ సిసాలో పోసి దానికి ఒక వత్తి పెట్టీ అన్నం వండుకొని,తిని పడుకొనే దాకా వెలిగించేది అమ్మ.
అన్నం తిని పడుకునే టైం కి అర్పేసే వాళ్ళము.
కానీ మా నాన్న దగ్గర ఒక రేడియో వుండేది.
నాన్నకు పాటలు, సినిమాలు అంటే చాలా ఇష్టం.
రాత్రి పూట రేడియోలో పాటలు వింటూ మేము పడుకొనే వాళ్ళము .
9 గంటలు వరకు పాటలు వచ్చేవి తరువాత హిందీ లో వార్తలు వచ్చేది.
అప్పుడు రేడియో ఆఫ్ చేసి పడుకొనే వాళ్ళము.
నాన్నకు చదువు మీద వున్న ఇష్టం వలన మమల్ని స్కూల్ కి పంపించేవారు.
కానీ ఆ గుడిసెల లో మా వయసు వున్న వారు చాలా వరకు పనికి వెళ్లే వారు.
మా గుడిసెలకు అనుకొని ఒక పెద్ద కిరణం వుండేది.
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. సాయంత్రం అయితే అక్కకు పది రూపాయలు.. నాకు పది రూపాయలు ఇచ్చేది అమ్మ ..
ఆ డబ్బులతో ఇద్దరం చేరొకటి మజ్జా సీసా తెచ్చుకోనీ తాగేవాళ్ళము.
ఉదయనే అక్కకు నాకు చాయ్ లోకి ఒక డబల్ రొట్టె.స్కూల్ కి వెళ్ళే టైంకి చేరి 2 రూపాయలు ఇచ్చేది.
ఆ రెండు రూపాయలు తీసుకొని నేను స్కూల్ కి వెళ్ళే దారిలో " కార"(మిస్సర్) తీసుకొని స్కూల్ డ్రెస్ జేబులో పోసుకొని తినుకుంటు స్కూల్ కి వెళ్లేదానిని .
స్కూల్ లో 1 పిరియడ్ కాగానే "madam water" అంటూ నీళ్ళకు వెళ్లేదానిని.
ప్రతిరోజు ఇలాగే చెయ్యడం తో madam కి కోపం వచ్చి "రోజు ఏమి తిని వస్తున్నావు ఇంకోసారి 1 క్లాస్ కి వాటర్ అంటే దెబ్బలు పడుతాయి." అనీ గట్టిగా తిట్టింది.
దానితో రోజు కార కాకుండా వేరే కొనుక్కొని వెళ్లే దానిని.
క్లాస్ లో మాత్రం ఏప్పుడు ఫస్ట్ వుండే దాన్ని.
నేను చదవడం, రాయడం అన్ని చాలా బాగా నేర్చుకున్నాను. నేను ఏదీ చెప్పిన త్వరగా నేర్చుకొనే దానిని.
టీచర్స్ కి అందరికీ నేను బాగా నచ్చేది .
ఫస్ట్ క్లాస్ అయిపోయిన తరువాత సెకండ్ క్లాసు కి వచ్చాను.
మా స్కూల్ ఇప్పుడు వున్న చోటు నుంచి వేరే చోటుకు మార్చారు.
దానితో మాకు స్కూల్ చాలా దూరం గా వుండేది.
అయినా రోజు నడుచుకుంటూ స్కూల్ కి వెళ్లి వచ్చేవాళ్లం.
మా నాన్న ఏదయినా కొత్త సినిమా వచ్చిందటే ఖచ్చితం గా అది చూసే వరకు నిద్రపోయే వాడు కాదు.
నాన్న తో పాటు మమల్ని సినిమాకు తీసుకొని వెళ్లేవాడు.
మా నాన్న సైకిల్ మీద మేము నలుగురం సినిమాకు వెళ్ళే వాళ్ళము.
మా అక్క సైకిల్ మీద ముందు కడ్డీ మీద కూర్చునేది.
అమ్మ నన్ను ఎత్తుకొని వెనుక వున్న కడ్డీ మీద కూర్చునేది.
ఎంత దూరం అయిన నాన్న మమ్మల్ని సైకిల్ మీద సినిమాకు తీసుకొని వెళ్ళి తీసుకు వచ్చేది.
ఎక్కువుగా రాత్రి సమయంలో సినిమాకు వెళ్ళేది.
ఉదయం ఎవరి పనులు వారికి వుండేవి.మాకు స్కూల్ వుండేది.
నెలకు కనీసం 3,4 సినిమాలు చూసేది దీనికి కారణం మా నాన్నకు వున్న" సినిమా పిచ్చి".
చిన్న చిన్న గా మాకు కూడా సినిమాలు అంటే ఇష్టం పెరిగింది.
గుడిసెలో గడిచిన క్షణాలు ఇప్పటికే నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి .
తెలిసి తెలియని వయసులో ఎండాకాలం వచ్చిన.. చలికాలం అయినా ..వర్షాకాలమైన ..అదో రకమైన ఆనందాన్ని వేతుకొనే వాళ్ళము.
ఎక్కడ ఏదైనా అమ్మడానికి వస్తే అందరం కలిసి తీసుకోవడం .
ఏదైనా గొడవ జరిగితే అందరం కలిసి దాన్ని సరి చేసుకోవడం .
అందరి మధ్య ఐకమత్యం అనేది ఉండేది .ఒక గుడిసెలో భార్యాభర్తలు గొడవ పెట్టుకున్న అందరం వెళ్లి వాళ్లకు సర్ది చెప్పేవాళ్లము.
ఒకసారి మా గుడిసెలో దొంగతనం కూడా జరిగింది.
ఒక దొంగ వచ్చి... ఒక గుడిసెలో పడుకున్న అమ్మాయి దగ్గరకు వచ్చి తన మెడలో వున్న గొలుసును లాక్కెళ్ళాడు.
ఆమె దొంగ దొంగ అని గట్టిగా అరవడం తో
రాత్రి అందరం లేచి అతని దొరకపట్టి స్తంభానికి కట్టేశారు. అందరు అతనిని బాగా కొట్టారు.
గుడిసెలో లైట్లు ఉండవు కదా ..ఒక చిన్న దీపం పెట్టుకొని వాళ్ళుము .
అందుకని దొంగ సులభంగా దొంగతనం చేయొచ్చు అనుకున్నాడు .
కానీ ఒక గుడిసె నుండి ఒక గుడిసెకి పిలిస్తే వినబడేంత దగ్గరలో ఉన్నారు కాబట్టి ఆ దొంగ దొరికిపోయాడు.
ఇంకో విషయం ఏంటంటే — నేను నిజంగా ఒక దెయ్యం శబ్దం కూడా విన్నాను.
మా గుడిసెలో పక్కనే ఒక ఖాళీ స్థలం ఉండేది. అక్కడ అందరూ బాత్రూం కోసం ఆ స్థలాన్ని వాడుకొనేవారు.
ఒక రోజు రాత్రి అక్కడ ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నేను చాలా భయపడ్డాను.
మా అమ్మా నాన్న ఆ శబ్దం గురించి మాట్లాడుకుంటూ,
“అగో చూడు దెయ్యం ఎట్లా ఏడుస్తుంది ..అది ఖచ్చితంగా దెయ్యమే” అని అనుకుంటున్నారు.
మా నాన్న కు కూడా దెయ్యాలు అంటే చాలా భయం .మా అమ్మ కొంచం ధైర్యం గా వుండేది.
ఆ రాత్రి నాకు భయం ఎక్కువైపోయింది. నేను అమ్మని గట్టిగా పట్టుకొని పడుకున్నాను.
ఆ ప్లేసులో ఒక దెయ్యం ఉంది అని గుడిసెలో వాళ్ళు, వీళ్ళు చెప్పుకునేవారు.
ఇద్దరు–ముగ్గురు రాత్రి టైంలో బాత్రూంకి వెళ్లినప్పుడు కూడా అలాంటి శబ్దం విన్నారని మా గుడిసెలో వాళ్లు మాట్లాడుకునేవారు.
అందుకే రాత్రి టైంలో మేము ఎక్కువగా బయటకి వెళ్లే వాళ్లం కాదు.
ఎవరికైనా బాత్రూం అవసరం వచ్చినా, భయం వేసి వెళ్లకుండా ఇంట్లోనే ఆగిపోయేవాళ్లు కూడా ఉండేవారు.
కానీ నేను మాత్రం స్వయంగా ఆ శబ్దం విన్నాను. నాకు తెలిసి అది నిజంగానే దెయ్యమే అనిపించింది.
ఆ రాత్రి నుంచి పగటి పూట కూడా ఆ స్థలానికి వెళ్ళడానికి నేను చాలా బయపడేదానిని.
పగలు అయినా, రాత్రి అయినా ఆ వైపు ఒంటరిగా వెళ్లాలన్నా గుండె బలంగా కొట్టుకుంటూ ఉండేది.
ఇలా చెప్పుకుంటూ పోతే మా గుడిసెలో గడిపిన అనుభవాలు చాలా ఉన్నాయి.
ప్రతి రోజు కొత్తగా ఏదో ఒక జ్ఞాపకం, కొత్తగా ఏదో ఒక అనుభవం.
కొన్ని భయపెట్టేవి, కొన్ని నవ్వించేవి, మరికొన్ని ఎప్పటికీ మర్చిపోలేనివి.
కానీ మన జీవితం ఒక్క దగ్గరే ఉండదు కదా.
మా జీవితాలు అలాంటివే —
ఒక ఊరి నుంచి ఒక ఊరికి పని కోసం తిరుగుతూనే ఉండేవారు.
బతుకుదెరువు కోసం ఎంత దూరమైనా, ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చేది.
మా వాళ్ళలో కొందరికి వ్యవసాయ భూములు కూడా వున్నాయి .
కానీ అవి తగినంత ఆదాయంనీ ఇచ్చేవి కావు..అందుకే కొందరు వారి అమ్మ నాన్నకు వ్యవసాయం విడిచిపెట్టి వీళ్ళు పని కోసం బయటకు వచ్చేవారు.
పనిలో వచ్చిన పైసలు నెల నెల చిట్టి లు అందరు కలిసి వేసుకొనే వారు. ఎవరి అవసరానికి వారు తరువాత పెద్ద మొత్తంగా డబ్బులు తీసుకొనేవారు.
మా అమ్మ వాళ్ళ తమ్ముడు కూడా ఇదే గుడిసెలో వుండేవాడు.మా మామయ్య కు మా తాత సంపాదించిన ఆస్తి కొద్దిగా వుండేది.
అందుకనే మా నాన్నని ఎప్పుడు చిన్నచూపు చూసేవాడు.
మా నాన్న మొదటిసారి పనిచేసిన డబ్బులతో వెయ్యి రూపాయలు పెట్టి ఒక నోకియా ఫోన్ తీసుకున్నాడు.
మొదటిసారి ఫోన్ చూడడం నాకు చాలా సంతోషం వేసింది.
"నాన్న ఒకసారి నేను చూస్తాను" అని నాన్న దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాను.
అనుకోకుంట ఫోన్ కింద పడి పగిలిపోయింది....
ఇంక వుంది