అమ్మతో తో గొడవ చేసిన నాన్న మాత్రం... అక్క ను నన్ను మాత్రం ఏం అనేవాడు కాడు.
కానీ అమ్మ కళ్ళ నుంచి వచ్చే కన్నిలను చూసి మా కళ్లలో కన్నీలు వచ్చేవి.
తెలిసి తెలియని వయసులో అమ్మ ను ఎలా ఓదార్చాలో తేల్చేది కాదు.
కానీ అమ్మ,నాన్న గొడవ తరువాత త్వరగానే కలిసిపోయి మాట్లాడుకునే వారు.
ఇటు పక్క
నా మూడో తరగతి చదువు సాఫీగా సాగిపోయింది.
ఎండాకాలం హాలిడేస్ కూడా వచ్చాయి.
ఎండాకాలం అన్ని రోజులు అమ్మ వాళ్ళతో సంతోషంగా ఆడుతూ పాడుతూ పనికి వెళ్ళేది.
మా పెద్దమ్మ కొడుకు మా అన్న ఒక డీవీడీ ప్లేయర్ కొనుక్కొని వచ్చి మేము వున్న ఇంట్లో పెట్టాడు..
ప్రతి రోజూ మా అన్న పెట్టే పాటలతోనే మేము నిద్ర లేచే వాళ్ళము.
మా అందరికి పాటలు అంటే చాలా ఇష్టం వుండేవి.
ఎక్కువగా మేము అక్కడ బంగారం,జై చిరంజీవ , లక్ష్మి మూవీ సాంగ్స్ వింటూ కాలక్షేమం చేసేవాళ్ళము.
నేను మాత్రము ఇలా ఎంజాయ్ చేస్తూ వుంటే ఇంకో పక్క మా అక్క
ఎండాకాలం మొత్తం పనికి వెళ్ళింది.
అక్క రోజు పనికి వచ్చినందుకు అమ్మ ..అక్క చేసిన పనికి వచ్చిన డబ్బులలో కొని డబ్బులు అక్క ఖర్చులకు ఇచ్చేది.
వాటితో అక్క తనకు నచ్చిన్న డ్రెస్ లు కొనుకునేది.
కొన్ని రోజులకు ఋతువులు మరే కొద్దీ వర్షాకాలం వచ్చింది.
వర్షాకాలం ..ఆరుద్ర కార్తి లో మేము ఎక్కడ వున్న వన భోజనాలకు వెళ్లడం మాకు అలవాడు.
అదే అలవాటుతో మేము వున్న ఊరిలోనే మేము అందరం కలిసి చెట్ల తీర్థాలు వెళ్ళాము.
ఆ వన దేవతలకు వర్షాలు పడాలి అని కోరుకొని మొక్కులు తీర్చి ..అక్కడే భోజనాలు చేసి సంతోషంగా కాసేపు అన్ని బాధలు పక్కకు పెట్టీ మనస్పూర్తిగా ..
పెద్దవారు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆటలు.. పాటలు.. ఆడుకొని ఆ సూర్యుడు అస్తమించక ముందే ఇంటికి చేరుకున్నాము.
కొన్ని రోజుల తరువాత శ్రావణమాసం వచ్చేసింది.
శ్రావణ మాసం లో మేము ప్రతి సంవత్సరం బోనాలు చేస్తాము.
మేము బోనాలు మాత్రం మా సొంత వూరికి వెళ్ళి అక్కడే చేస్తాం.
ఎందుకంటే మా సొంత వూరిలో మాత్రమే చెయ్యడం మాకు ఆనవాయితీ.
మా వూరు గురించి చెప్పే ముందు మా కుటుంబం గురించి పూర్తి గా చెప్పాలి.
(అందుకే నేను పుట్టక ముందు జరిగినవి....పుట్టిన తరువాత జరిగిన విషయాలు అన్ని కలిపి చెబుతా మీరు కొంచం అర్థంచేసుకుని చదవండి ఫ్రెండ్స్ )
మా నాన్నమ్మకు మా తాతకు ఐదుగురు కొడుకులు అని మీకు ముందే తెలుసు..
అయితే మా నాన్నమ్మ కు మా చిన్న బాబాయ్ పుట్టిన కొన్ని ఏళ్ళ తరువాత నాన్నమ్మ ఆరోగ్యం పాడైపోయింది.
మా నాన్నమ్మ ఆరోగ్యం చూసి ఇంటి పక్క వాళ్ళు.." చెట్ల మందులు వాడితే నయం అవుతుంది "అని చెప్పారట .
వాళ్ళ మాటలు విని తాత చెట్ల మందులు తెచ్చి పోశాడు .
దానితో ఆ మందులు నాన్నమ్మ కు పడకపోవడం తో పూర్తిగా నాన్నమ్మ ఆరోగ్యం పాడైపోయి కేవలం మంచానికే అంకితం అయింది.
అప్పటికే మా నాన్నమ్మ కొడుకులకు పెద్దనాన్న ,నాన్న , చిన్నానకి ముగ్గురికి పెళ్లికి అయినాయి .
వాళ్లకు పిల్లలు కూడా పుట్టారు.
ఇంక ఇద్దరు బాబాయలకి పెళ్లి కావాల్సి వుంది . కానీ వాళ్లు ఇంక చిన్నపిల్లలు మాత్రమే.
నాన్న వాళ్లకు పెళ్లి అయిన తరువాత ముగ్గురు అన్నతమ్ములు కలిసి పొత్తులో వున్న ఇంటి స్థలం అమ్మి ఇంకో దగ్గర అదే వూరిలో 4 గుంటల ఇంటి స్థలం కొన్నారు.
అది కూడా మహబూబాబాద్ లో మెయిన్ రోడ్డు కు చాలా దగ్గరగా తీసుకున్నారు.
యిప్పుడు మాకు వున్న ఆస్తి ఇది మాత్రమే.
ఈ స్థలంలోనే కొన్ని రోజులకు మూడు రూమ్లు ఇంటిని మట్టితో కట్టారు.
అవి చూడటానికి మట్టి ఇల్లు అయిన అవే మాకు ఇంద్ర భావనం తో సమానం.
నాన్న వాళ్ళు కట్టిన ఇంటిలో తాత.. నాన్నమ్మ వుండే వారు .
వారితో పాటు మా అక్క ,పెద్దన్న ,ఇద్దరు బాబాయిలు,చెల్లె.
మొత్తం 5గురు పిల్లలు ఇక్కడే వుండి స్కూల్ కి వెళ్లే వారు.
అక్కకు 5 సంవత్సరాలు వున్నపుడు నుంచే నాన్నమ్మ దగ్గర వుంచాడు నాన్న .
"కరీంనగర్ లో అక్క మాతో వుంది అని మీకు అనిపించెచ్చు కానీ నాన్నమ్మ చనిపోయిన తరువాతనే అక్క మా దగ్గరకు వచ్చింది"
తాత పిల్లలకు ,నాన్నమ్మ కు వండి పెట్టుకుంటు వారిని స్కూల్ కి పంపించేవారు.
నాన్న ,బాబాయ్, పెదనాన్న వాళ్ళు మనిషికి 200 చెప్పిన మొత్తం 600 వందలు చొప్పున ప్రతి నెల తాతకు పంపించేవాళ్ళు.
ఆ డబ్బులతో తాత ఇంటి ఖర్చులు చూసుకొనే వాడు.
వాటితో పాటు మా ఇంటి ముందు చాలా కాళీ ప్లేస్ వుండడం తో కూరగాయలు పండించే వాడు.
ఆ కూరగాయలు మేము తినటానికి పనికి వచ్చేవి..అమ్మితే డబ్బులు కూడా వచ్చేవి. వాటితో ఇల్లు మంచిగా గడిచేది.
మా ఇంటి ఖాళీ ప్లేస్ లోనే నీళ్ల కోసం ఒక బావి కూడా తొవ్వరు నాన్న వాళ్ళు అందరు కలిసి..దానితో మాకు నీటికి ఎలాంటి ఇబ్బందీ వుండేది కాదు.
కానీ నాన్నమ్మ మాత్రమే ఎప్పుడు మంచల్లోనే పడుకొని వుండేది.
తినడం ..బాత్రూంకి వెళ్లడం కూడా అన్ని మంచం లోనే చేసేది.
నాన్నమ్మ కు మాఅక్క అంటే చాలా ఇష్టం వుండేది.
అక్క, నానమ్మ ను జాగర్తగా చూసుకొనేది.అందుకే నాన్నమ్మ కు అక్క అంటే యిష్టం.
మేము ప్రతి పండుగకు అందరం ఇంటికి మాత్రం వచేవాళ్లం.
ఎవరు ఎక్కడ పని చేసిన ప్రతి పండుగకు ఇంటికి వచ్చేవాళ్ళము.
మాది ఒక అందమయిన ఉమ్మడి కుటుంబం.
ఎవరు సంపాదన వారిదే అయిన ఇంటికి వస్తె అందరం ఒకే కుండలో వండుకొని తినేవాళ్ళం.
ఖర్చులు అందరం సమానంగా పెట్టుకొనే వాళ్ళము.
ప్రతి బోనాల పండగలకు ఇంటికి వచ్చేవాళ్లము.
మేము అందరం ఇంటికి వస్తెచాలు ఇల్లు అంతా సందడి సందడిగా పండుగ వాతావరణం లా కనిపించేది.
ఇంట్లో బోనము వండి .. అందరము కొత్త డ్రెస్ లు వేసుకోను ..నాన్న చేతిలో కోడిని పట్టుకొని .. సాయంత్రం బోనం ఎత్తుకొని వూరికి చివర వున్న గుడికి డబ్బుసప్పులతో వూరు వూరు బయలుదేరి వెళ్ళేది.
ఒక రోజు నేను మా అమ్మ ను తెలిసి తెలియని వయసులో ఇలా అడిగాను.
"అమ్మ మనం బోనం చేసి పెడుతునాము కానీ నిజంగా ఆ పోచవ తల్లి వచ్చి తింటుందా అమ్మ...
" అస్సలు నిజంగా ఆ అమ్మవారు వున్నారా "అని అడిగాను.
అప్పుడు మా అమ్మ ఇలా అంది .."తప్పు తప్పు అలా అనకూడదు ముందు చెప్పలు వేసుకో ఈ తల్లి గురించి నీకు ఏం తెలుసు అమ్మ ...
ఇక్కడ నిజంగా ఒక సంఘటన జరిగింది అది నీకు చెబుతా వినూ "అంది
కొన్ని రోజుల కిందట ఇప్పటి లాగానే అందరు ఎంతో సంబరంగా బోనాలు ఎత్తుకొని.... డప్పు చప్పుడుతో అంగరంగ వైభవంగా అందరు బోనాలు ఎత్తుకొని వచ్చి
ఇక్కడ ఆ తల్లికి సమర్పించి...కోడి పిల్లలతో ఆ తల్లికి మొక్కును అప్పా జెమ్మి వెళ్లేవారు.
అందరు ఎవరి వారి మొక్కలు అన్ని ఆ తల్లికి అప్పజెప్పి తిరిగి బోనం ఎత్తుకొని ఎవరింటికి వారు ఏళ్ళారు.
అయితే ఒక మామూలు వ్యక్తి కోడిని కొయ్యటానికి కత్తిని తెచ్చి. .కోడిని కోసి తిరిగి ఇంటికి వెళ్ళిన తరువాత..తను కోడిని కోసిన కత్తిని మరిచిపోయాను అని .
అతను తిరిగి కత్తి కోసం గుడికి వచ్చాడు.
అప్పటికే చాలా చీకటి అయింది .
గుడి దగ్గర ఎవరు లేరు.
ఇతను వెళ్లి అక్కడ ఒక అందమయిన దృశ్యం చూసాడు అతను.
ఒక నిమిషం తనని తనే మర్చిపోయేలా చేసేది ఆ దృశ్యం.
తను వెళ్లే సరికి గుడి లోపల 7 గురు అమ్మవారు ...అందరు కూర్చొని అక్కడ చెల్లించిన బోనం పడి అన్నమును తింటున్నారు .
వాళ్లను చూసి ఒక సరిగా కళ్ళు చీకటి కమ్మాయి అతనికి.
ఆ అమ్మవారు కూడా అతడిని చూశారు...చూసి అతనితో ఇలా అన్నారట ..
"ఒరే బాబు..మమల్ని చూస్తే చూసావు కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకు ...నువ్వు ఎవరికయినా ఈ విషయం చెబితే నీ తల పగిలి చస్తావ్ "అని చెప్పారట...
దానికి సరే అని అమ్మవారికి మొక్కుకోని ..
తన కత్తి తీసుకొని ..ఎంతో సంతోషం నిండిన కళ్ళతో ఊరిలోకి వచ్చాడు.
అతను చూసింది మామూలు విషయం కాదు కదా ..
ఊరిలోకి రాగానే ...అతను సంబరం ఆపుకోలేక ..
ఏదురుగా కనిపించిన వారికి జరిగింది అంత చెప్పాడంట.దానితో అతను అక్కడి కాక్కడే తల పగిలి చనిపోయాడు .
ఇది అంతా ఇక్కడ నిజంగా జరిగింది అనీ అప్పట్లో అందరు అనుకున్నారు.
అందుకే ఇప్పటికీ కూడా బోనం చెల్లించిన తరువాత చీకట్లో ఇక్కటికి ఎవరు రారు.."
అని అమ్మ చెప్పింది.
అప్పుడు నాకు నిజంగా దేవుడు వున్నాడు అని నమ్మకం కుదిరింది.
ఎంతో సంతోషంగా బోనాల పండుగ అయిపోయింది.
పండుగ తరువాత మేము మళ్ళీ పనుల కోసం వేరే వూరికి వెళ్ళేము.
కొన్ని రోజులు తర్వాత నాన్నమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది.
అది ఎండాకాలం ఆ సంవత్సరం ఎండలు బాగా కొట్టడం తో నాన్నమ్మ శరీరం ఆ ఎండను తట్టుకోలేక పోయింది దానితో ఆమె కన్నుమూసింది.
నాన్నమ్మ చనిపోయినప్పుడు మేము కరీంనగర్‌లో ఉన్నాం.
అందరం రాత్రికి రాత్రే మా ఊరికి చేరుకున్నాం.
నాన్నకు నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె మరణాన్ని నాన్న తట్టుకోలేకపోయాడు.
నాన్నమ్మ దేహంపై పడి నాన్న బాగా ఏడ్చాడు.
నాన్నమ్మ చివరి రోజులో తనతో లేకుండా పోయాను అని నాన్న ఎంతో బాధ పడ్డాడు.
ఆ సంఘటనకు మా కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరు అయింది.
చిన్న పిల్లల మైన మేము కూడా నాన్నమ్మ లేని లోటును తట్టుకోలేక పోయాము.
మేము కూడా చాలా ఎక్కువగా ఏడ్చాము.
మా ఇంటికి దగ్గరలోనే ఒక చెరువులో అంత్యక్రియలు జరిపించాము.
నాన్నమ్మ అంత్యక్రియలు ఎంతో బాధాకరంగా జరిగాయి.
మా ఊరి పెద్దలు, బంధువులు అందరూ వచ్చి చివరి వీడ్కోలు ఇచ్చారు.
నాన్న ఆమెను చివరిసారి చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.
మేము పిల్లలము అందరం నాన్నమ్మ కనిపించకపోవడం వల్ల బాగా ఏడ్చాము.
మా అమ్మ, నాన్న ఊరి పెద్దల సహాయంతో అన్ని ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ అంత్యక్రియలను పూర్తి చేశారు.
కాలం గడిచిన కొద్దీ ఆ లోతైన బాధ నుంచి మేము కొద్దికొద్దిగా బయట పడ్డాము.
జీవితం మళ్లీ తన దారిలో తను నడవడం ప్రారంభించింది.
ఎండకు ఎండిపోయిన చెట్టు తిరిగి వర్షానికి చిగురిస్తుంది అన్నటుగా
ఒక సంవత్సరం తర్వాత మా ఇంట్లో ఒక శుభకార్యం జరగడంతో మా కుటుంబం మళ్లీ కొంత ఆనందాన్ని ఆస్వాదించింది.
ఇంక వుంది....
.