Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 6

మన నాలుగో బాబాయ్‌కి పెళ్లి కుదరడంతో  అందరం పెళ్లి పనుల్లో చాలా బిజీ అయ్యాము.

మా బాబాయ్ కి పెళ్లి అనేసరికి మా కళ్ళలో ఎక్కడలేని సంతోషం ..మంచిగా ఆడుకోవచ్చు..సరదాగా అందరితో గడపవచ్చు అని మేము చాలా సంతోష పడినాము. 

మా కుటుంబం లో మాకు ఒక సంప్రదాయం వుంది.

అది ఎప్పటినుంచో ఆచారంగా వస్తోంది.

పెళ్లి కొడుకును లేదా...పెళ్లి కూతురును చేసే రోజు మేము మా కుల దైవం అయిన ఎల్లమ్మ తల్లికి సత్తాన బోనం చేయడం అలవాటు.

పెళ్లి కొడుకును చేసే రోజు ఇంటి పెద్ద లేదా ..పెళ్లి కొడుకు  తల్లి  ఆ రోజు ఒకపొద్దు వుండి..ఒక కుండలో ఎల్లమ్మ తల్లికి బోనం వండాలి.

వండిన బోనం చల్లారిన తరువాత ఒక కొత్త సాప వేసి దాని మీద కొన్ని బీయ్యం పోయాలి..

తరువాత  దాని మీద బోనం పెట్టాలి 
బోనం పెట్టిన తరువాత 

పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు పెళ్లి బట్టలు అన్ని తెచ్చి ఆ బోనం మీద పెట్టాలి.

బోనం మీద పెట్టిన తరువాత ఒక 3గురు లేదా 5గురు ఆడవారు కలిసి ఆ బోనం ను  ఒక వేలు మాత్రమే తాకెలగా పట్టుకోవాలి.
బోనం మీద పెట్టిన బట్టలు కింద నేలకు అనకూడదు.

అందరు కలిసి బోనం పట్టుకొని ఆ తల్లికి ఇలా మొక్కుతారు.

పెళ్లి కాబోయే వారి పెళ్లి జీవితం బాగుండాలి..వారికి పిల్లలు మంచిగా కలిగి ..వారి జీవితం సుఖసంతోషాలతో  బాగుండాలి అని కోరుకుంటారు.

అలా మొక్కుకున్న తరువాత ఆ బోనం  కుండా గుండ్రంగా ఒక చుట్టూ రైయ్ మని తిరుగుతుంది.

మగ వారు బోనం పట్టుకుంటే తిరగదు.

మేము పెట్టిన బోనం తిరుగుతే అదే అమ్మ ఆశీర్వాధం అనుకొని పెళ్లిని సంతోషంగా జరిపిస్తాము.

ఇంత వరకు మా ఇంట్లో నాకు తెలిసిన దగ్గరి నుంచి కనీసం  5 పెళ్లిళ్లు అయినాయి ఆ ఐదు పెళ్ళిలకు ఆ తల్లి ఆశీర్వాదం ఇచ్చింది.

అందరి పెళ్లికి అలాగే చేస్తాం..

  ఆ తల్లి కొంచం అటు ఇటు అని  కొంచం లేట్ చేసిన సరే ఖచ్చితం గా తిరుగుతుంది.

మొదటిలో నేను కూడా ఇది నమ్మలేదు కానీ నా కళ్ళారా  చూసిన తరువాత నేను నమ్మాను.

మా ఇంట్లో మా బాబాయ్ వాళ్ళ రూంలో ఒక పెద్ద  పుట్ట కూడా వుంది.
అప్పుడపుడు ఒక పాము వస్తూ వెళ్తూ వుండేది . 

అయినా మేము అందులోనే పడుకొనే వాళ్ళము.

ఎందుకంటే మాకు మా ఎల్లమ్మ తల్లి మీద నమ్మకం.

మాకు ఆ ఎల్లమ్మ తల్లి ఏప్పటినుంచి కుల దైవంగా వుంది. అందుకే 
మేము ఎల్లమ్మ తల్లికి పెద్ద పట్నాలు వేస్తాము.

దాన్ని గురించి నేను తరువాత పూర్తిగా చెబుతాను.

సత్తానా బోనం చేసిన తరువాత బాబాబు ని పెళ్లి కొడుకును చేసి పెళ్లి పనులు మొదలు పెట్టాము.

పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తం పెదనాన్న ,నాన్న,బాబాయ్ ముగ్గురు కలిసి పెట్టుకున్నారు.

తాత ఒక్కడే పెళ్లి చేసే పరిస్థితి లేదు కాబట్టి ముగ్గురు కలిసి బాబాయి పెళ్లి జరిపించారు.

మా పెద్ద నాన్న ఒక తాగుబోతు..ఏప్పుడు తాగుతూ అందరి మీదా అరుస్తూ వుంటాడు.

పెదనాన్న బాధ్యత లేకుండా వుండడం తో ఇంటి బాధ్యత అంతా నాన్న చూసుకొనే వాడు.

అందుకని పెద్ద నాన్న ,నాన్న తో ఏప్పుడు గొడవ పెట్టుకొనే వాడు.
నాన్నని ఒక్కోసారి కొట్టే వాడు కానీ నాన్న మాత్రం పెద్ద నాన్న ఎంత కొట్టిన ఒకసారి కూడా ఏదురు తిరగలేదు.

"తాగిన మైకంలో ఇలానే చేస్తాడు"..అని నాన్నకు తనను రోజు చూసి చూసి అలవాటు అయిపోయింది.

మా కుటుంబం లో అందరికీ తన గురించి తెలుసు అందుకే అతను ఎంత గొడవ చేసినా ఎవరం ఏం అనము.

ఆటో ఈటో  బాబాయి పెళ్లి మాత్రం చాలా బాగా పిన్ని వల్ల వూరిలో జరిగింది.

రాత్రి భరత్ దగ్గర అందరం చిన్న పెద్ద తేడా లేకుండా డ్యాన్స్ లు కూడా చేసాము.

ఎంతో ఆనందం నిండినా కళ్ళ తో చిన్నమ్మ కు స్వాగతం పలికాము.

మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా ,ఏ ఫంక్షన్ జరిగిన మేమంతా ఒకే చోట వండుకుంటాం, కలిసి కట్టుగా ఉంటాం. మా మధ్య ఎన్ని గొడవలు, తగాదాలు వచ్చినా మాకు మేమే చూసుకుంటాం.

చిన్నపిల్లలమైన మేము ఆ రోజుల్లో చాలా బాగా ఎంజాయ్ చేశాము.
మా బాబాయ్ పెళ్లి అయిపోయిన తర్వాత అందరం కలిసి సినిమాకి వెళ్ళాం. 
మహబూబాబాద్‌లో ఏ సినిమా వచ్చినా మేము పిల్లలం అందరం నడుచుకుంటూ వెళ్లి సినిమా  చూసి, మళ్లీ అందరం కలిసి నడుచుకుంటూ ఇంటికి వచ్చేవాళ్లం.

మాతో పాటు "మా కిట్టు "గాడు కూడా మాతో పాడు మా వెనకాలే సినిమా టాకిస్ దగ్గరి వరకు వచ్చేది..

కానీ లోపలికి రాణించే వారు కాదు.

కిట్టు అంటే ఎవరో అనుకుంటున్నారా ...మేము పెంచుకున్న కుక్క పిల్ల..

అందరిగి అది అంటే చాలా యిష్టం...

ఏప్పుడు మాతోనే వుండేది...దానికి మనషుల లాగా ఒక అలవాటు కూడా వుంది.

మంగళవారం వస్తె ఆ రోజు అస్సలు ఏం తినకుండా ఉపవాసం వుండేది.

అన్నం ఆ రోజు అస్సలు తినకపోయేది.
మనుషుల లాగా  కుక్కలు కూడా దేవుడి మీద నమ్మకం వుంటుందా ఫ్రెండ్స్

మా అన్నయ్యలు, మా బాబాయ్‌లు  కూడా మాతోపాటు సినిమా కు వచ్చేవారు. 

అందువల్ల మేము ఎంత రాత్రి అయినా, చీకట్లోనైనా భయపడకుండా నడుచుకుంటూ ఇంటికి వచ్చే వాళ్లం.

రాత్రి సమయంలో అలా ఎవరు లేని తరుణం లో నిశ్శబ్దం వాతావరణం లో నడుచుకుంటూ...మాకు మేమే నవ్వుకుంటూ..పరిగెత్తుకుంటూ సరదాగా ఇంటికి చేరే వాళ్ళము.

ఇంటికి వచ్చిన తరువాత... సైలెంటుగా వుండీ అమ్మ వాళ్లూ లేవకుండా ఎవ్వరూ మంచం లో వాళ్ళము..ఆరుబయట పడుకొనే వాళ్ళము.

ఉదయం సూర్యడు నెత్తి మీదకు వచ్చి.. ఇంకా పడుకొనే వుంటవా.. లేస్తావా.. 
అని
లెపేదాక పడుకొని వుండి
ఆ ఎండ వేడికి తట్టుకోలేక నిద్ర లేచే వాళ్ళము.

నిద్రలేచి ముఖం కడుక్కుని..పక్కనే వున్న టిఫిన్ సెంటర్ కి అమ్మ దగ్గర  డబ్బులు తీసుకొని వెళ్లి కొనుక్కొనే వాళ్ళం.

ఒకరం కొనుకుంటే ఎంకొకరం వూరుకొనే వాళ్ళమా..
ఎవరి పేరెంట్స్ నీ వాళ్ళు ఆడుకొని...అందరం కలిసి ఎంతో 😋 టేస్టీ గా వుండే బోండాలు కొనుక్కొని తినే వాళ్ళము.

బాబాయి పెళ్లి జరిగిన తరువాత మళ్ళీ కొన్ని రోజులకు  ఎవరి పనులకు వారు వేరే  వూరికి వెళ్లారు.

ఇలా గడిచిన ఒక  సంవత్సరం తరువాత తాత ఆరోగ్యం బాగాలేక పోవడం వలన మళ్ళీ అందరం వచ్చి తాత ను హాస్పటల్ లో కొన్ని రోజులు వుంచి..
కొంచం ఆరోగ్యం కుదుట పడిన తరువాత ఇంటికి ఇసుకొని వచ్చాము.

ఇన్ని రోజులు ఇంటి దగ్గర 4వ బాబాయ్ పెళ్లి తరువాత బాబాయ్ ,పిన్ని  ఇద్దరు తాత తో ఇక్కడే వున్నారు.

మన ఐదు వేళ్ళూ ఒకేలా వుంటాయా...వుండవు కదా..అలాగే అందరు కోడన్లు ఒకేలా ఉండరు కదా..

యిప్పుడు వచ్చిన కొత్త పిన్ని వలన మాకు చాలా గొడవలు జరిగాయి.
తను మా ఫ్యామిలీ తో కలవలేక పోయింది.

ఇంతక ముందు వున్న ముగ్గురు తోటికోడన్లు అక్క చెల్లెళ్ల లాగా కలిసి వుండేవారు.

వారి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చిన మళ్ళీ అందరు తొందరగానే కలిసి పోయేవారు.

కానీ యిప్పుడు వచ్చిన చిన్నమ్మ మా ఉమ్మడి కుటుంబాని మొత్తం ముక్కలు ముక్కలుగా చేసింది.

తాతను ఇంటికి తీసుకు వచ్చిన తరువాత కొన్ని రోజులకు తన ఆరోగ్యం బాగా చేడిపోయి  ఒక రోజు తన చివరి శ్వాస విడిచాడు.

తనతో పడే మా ఆనందాలను కూడా తీసుకొని వెళ్లి పోయాడు.

తాత అంత్యక్రియలు పూర్తి చేసిన తరువాత ...

మా ఇంటికి కీడు వచ్చింది అని ఒక రోజు ఇల్లు వదిలి పెట్టీ వెళ్ళని అని అయ్యగారు చెప్పారు.

దానితో ఒక రోజూ అందరం కలిసి వూరి చివరికి వెళ్లి అక్కడే చెట్లలో వన బోజనాలు వెళ్లి నట్టుగా మా కుటుంబం అంతా కలిసి వెళ్లి  అక్కడే వండుకొని ..తిని సాయంత్రం వరకు అక్కడే వున్నాము

చీకటి పడిన తరువాత అందరం కలిసి సినిమాకు వెళ్లి...
సినిమా చూసిన తరువాత..అందరం కలిసి రైల్వే స్టేషన్ కి వెళ్లి ఆ రాత్రి అక్కడే పడుకొని ..తెల్లవారు జామున ఇంటికి చేరుకున్నాము.

తాత నెల రోజుల దిన కార్యం చేసిన తరువాత  4వ బాబాయ్ వాళ్ళను..అలాగే 5వ బాబాయ్ నీ 

నాన్న మాతో పాటు తీసుకొని వచ్చి ఇప్పుడు వున్న చేగ్యం వూరిలో పని జరిగే చోటుకు తీసుకొని వచ్చాడు.

తాత నాన్నమ్మ లేకపోవడంతో మా ఇల్లు చిన్నపోయింది.
ఏప్పుడు కలకల లాడుతూ వుండే మా ఇంటి వాతావరణం.. యిప్పుడు వెలుగు లేని దీపంలా మారిపోయింది.

తాత, నానమ్మ మాతో లేకున్నా .. వారు ఏప్పుడు మా జ్ఞాపకాల్లో నిత్యం వుంటారు...
వారు చెప్పిన మాటలు మాకు మార్గ ధర్శాలు ...

నాన్నమ్మ తాత మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం.

తిరిగి చెగ్యం వూరికి వస్తె..4 వ బాబాయి,పిన్ని,5వ బాబాయ్ వీరు ముగ్గురు కలిసి వుండేవారు.

మా దగ్గరే వుండేవారు కానీ వాళ్ళది వల్లే వండుకొని తినే వారు...వారి డబ్బులు వారే తీసుకొనే వారు.

పెళ్లి కానీ బాబాయ్ కూడా వారితోనే వుండి చేసిన డబ్బులు వాళ్ళకే ఇచ్చేవాడు.

ఇలా కొన్ని రోజులు గడిచినా తరువాత ..నాన్నకు పని మీద కొన్ని డబ్బులు రావడం తో మా వూరిలో ఇంకో చోట 1 గుంట భూమి కొన్నాడు.

మా ప్రయాణం కొద్దీ కొద్దిగా మెరుగు పడుతూ వస్తుంది.

గోదావరిలో వర్షాకాలం వర్షాలు బాగా పడితే పని నడిచేది కాదు..
అలాంటి సమయం లో అందరు కొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉన్నారు...
మొత్తానికే నెలలు నెలలు ఇంటి దగ్గర వుంటే పొట్టకు తిండి ఎట్లా అనీ..
ఆ ఊరిలోనే ఏ పని దొరికితే ఆ పని చేసే వాళ్ళు.

ఒక రోజు ఆడవారు అందరు కలిసి అదే వూరిలో  పొలం పనులకు కూడా వెళ్లారు.
మా వాళ్లకు అన్ని పనులు వచ్చు.

మగవారు వూరిలో ఏదయినా మట్టి పని దొరికితే చేసేవారు.

వర్షా కాలం అయిపోయిన తరువాత మళ్ళీ గోదావరి పని మొదలు అయింది.
ఇటు పక్క నా 4 వ తరగతి ఎంతో చురుకుగా సరిపోతుంది.

వూరిలో చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు.
వారితో పాటు ఇంటికి వచ్చిన తరువాత ఆడుకునే వాళ్ళము.

స్కూల్ లోనే టైం లో వారితో పాటు పత్తి ఎరటానికి వెళ్లే వాళ్ళము.

ఇక్కడే నా ఫ్రెండ్స్ తో కలిసి మొదటి సారి పొలం పనులకు వెళ్ళాను నేను..

ఆ అనుభవం నాకు చాలా బాగా నచ్చింది.

ఎడ్ల బండిలో వెనుక కూర్చొని... ఓంప్పులు, ఓరేలు,వాగులు దాటుకుంటూ వెళ్లి పత్తి యెరడం.

తిరిగి ఇంటి వచ్చే టైంలో రేగు పండ్లు, కందికాయ తెంప్పుకొని తీనుకుంటు ఇంటికి రావడం ..ఎంతో సరదాగా అనిపించేది.

కానీ ఒక రోజు ఇసుక క్యారిలో ట్రాక్టర్ నడిపే ఒక అతను మా అక్కతో  ఇలా అన్నాడంట...

ఇంక వుంది...

అతను మా అక్కతో ఏం అని వుంటాడు ఫ్రెండ్స్  మీకు ఏమి అనిపిస్తుందో కామెంట్ చేయండి