4వ - భాగం
సికింద్రబాదు నగరం, హబ్సిగూడ లో రాత్రి 10 గంటలకి ఓ ఇంటి డోర్ బెల్ మొగింది.
ఆ ఇంట్లొ ఉన్న వ్యక్తి వచ్చి "ఈ సమయంలొ ఎవరై ఉంటారా" అని తలుపు తీసాడు.
తెలుపు తెరవగానె ఎదురుగా తన స్నేహితుడు నించోని ఉండడం చూసి
"ఒరెయి సురేష్ నువ్వా? ఎంట్రా ఇంత సడన్ గా? అది రాత్రి పూట? లోపలికి రా."
సురేష్ : ఏరా సూర్య ఎలా ఉన్నావు?
సూర్య : నేను బానె ఉన్నాను రా. కాని నువ్వేంట్రా ఇంత సడన్ వచ్చావు? వస్తున్నావని కనీసం ఫోను అయిన చెయ్యలేదు.? అవును నీకు నిశ్చితార్దం అన్నావు కదా రా మరి పెళ్ళి ఎప్పుడు?
సురేష్ : వైజాగ్ లొ చిన్న సమస్య రా దాని వల్ల ఆ నిశ్చితార్దం కూడా ఆగిపోయింది. అందుకె కొన్ని రోజులు నీ దగ్గర ఉందామని వచ్చాను. నీకు ఏం అబ్యంతరం లేదుగా?
సూర్య : నాకేం అబ్యంతరం లేదులే రా. ఎలాగో మా ఆవిడ కాన్పుకి అని పుట్టింటికి వెళ్ళింది. 3 - 4 నెలలు వరకు రాదులె.
సురేష్ : చాలా ఠ్యాంక్స్ రా.
సూర్య : దానిది ఏం ఉందిలె గాని. నీ సంగతి చెప్పు? సమస్య అన్నావు ఏమైంది? అసలు నిశ్చితార్ధం అగిపోయేంతల ఏం జరిగింది?
సురేష్ గత నెల రోజులు గా జరిగిన సంఘటనలు మొత్తం సూర్య కి చెప్పాడు.
సూర్య : ఇంత గోలా జరిగిందా? అయిన నువ్వు నాకొక కాల్ చెయ్యాల్సిందిరా?
సురేష్ : ఎలా చెయ్యమంటావు రా ఈ గోలలొ.
పైగా మీ ఆవిడ కడుపుతొ ఉంది ఇవన్ని చెప్పి నా తల నొప్పి నీకు ఎందుకు అంటించడం అని ఆగా.
సూర్య : సర్లె. ఇంతకి ఏమైన తిన్నావా?
సురేష్ : బస్ స్టాండ్ దగ్గర ఏదొ చిన్న హోటల్ ఉంటె అక్కడ టిఫిన్ చేసా లే.
సూర్య : సరె అయితె ఇప్పటికె బాగా లేటయింది. వెళ్ళి ఫ్రెషప్ అయ్యి పడుకొ. రేపు పొద్దున్న లేచాక మాట్లాడుకుందాం.
సురేష్ : సరే రా.
సూర్య : ఒరేయి ఇంతకి ఎవ్వరు రా ఆ అమ్మాయి నిన్ను తగులుకుంది. ఏం పేరు అన్నావు?
సురేష్ : ఏమొ రా వీళ్ళు నన్నె ఎందుకు తగులుకున్నారొ నాకు ఇప్పటికి అర్ధంకాలేదు. ఇంకా ఆ అమ్మాయి పేరు అంటావా మేఘన. వాళ్ళ నాన్న పేరు విక్రమ్.
సూర్య : ఎవరు మేఘనా.........?
అంటు ఆశ్చర్యంగా సురేష్ వైపు చూసాడు.
సురేష్ : అవును. ఏం రా అలా అడిగావు నీకేమైన తను తెలుసా?
సూర్య : నాకా .......? నాకు ఎలా తెలుస్తుంది?. సరె సరె నువ్వు వెళ్ళి ఫ్రెషప్ అవ్వు నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటా.
అని కోంచెం కంగారుగా బెడ్రూము లోకి వెళ్ళిపొతాడు. అది సురేష్ పెద్దగా గమనించ లేదు.
సురేష్ తన స్నేహితుడు సూర్య ఇంటికి వచ్చి దాదాపు 4 రోజులు అవుతుంది. ఇన్ని రోజులు తను తన ఫోన్ ని స్విచ్చాఫ్ చేసి ఉంచాడు. అవసరానికి అప్పుడప్పుడు సూర్య వద్ద ఉన్న రెండొ ఫోన్ ని వాడుకునె వాడు అంతె.
తన తల్లిదండ్రులకి కూడా కాల్ చేయలేదు.
ఇప్పుడు తన ఫోన్ ని ఆన్ చేసి ముందుగా వాళ్ళ నాన్న కి కాల్ చేసాడు.
ఫోన్ మొగుతున్నాది గాని తన తండ్రి కాల్ ఎత్తడం లేదు.
మళ్ళి తిరిగి కాల్ చేసాడు. ఈసారి కూడా మొగుతున్నాది కాని ఎత్తడం లేదు. కాల్ కట్ చేసె సమయానికి వాళ్ళ నాన్న ఎత్తాడు.
రాము (సురేష్ తండ్రి) : హలో సురేష్ .......?
సురేష్ : హలొ నాన్న. ఎలా ఉన్నారు.?
రాము (సురేష్ తండ్రి) : నా సంగతి పక్కన పెట్టు రా. అసలు నువ్వు ఇంతకి ఎక్కడున్నావు?. చెప్పాపెట్టకుండా అలా ఎలా వెళ్ళిపోయావు రా.? మేమంత ఎంత కంగారు పడ్డామొ తెలుసా.
సురేష్ : క్షమించండి నాన్న అప్పటికి నాకు వేరె దారి కనిపించలేదు. నాకు ఏం చెయ్యాలొ అర్ధం కాలేదు.
రాము (సురేష్ తండ్రి) : మరి నీ ఫోన్ ఎందుకు స్విచ్చాఫ్ చేసి పెట్టుకున్నావు ఈ 4 రోజులు?
సురేష్ : కొన్ని రోజుల వరకు నేను ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియకూడదు అని. మీకు ఫోన్ చేస్తె నేను ఎక్కడ ఉన్నానొ వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకె ఫోన్ స్విచ్చాఫ్ చేసి పెట్టుకున్నా.
రాము (సురేష్ తండ్రి) : ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు?
సురేష్ : నేను నా స్నేహితుడు సూర్య ఇంట్లొ ఉన్న నాన్న. సరె ఇంతకి అక్కడ వాతావరణం ఎలా ఉంది ?
రాము (సురేష్ తండ్రి) : 2రోజులు క్రితం ఆ మేఘన మరియు వాళ్ళ నాన్న మన ఇంటికి వచ్చారు రా. నీ గురించి అడిగారు. ఎక్కడికి వెళ్ళావొ తెలియదన్నాను. నువ్వు పెట్టిన మెసేజ్ చూపించా కూడా.
సురేష్ : దానికి వాళ్ళు ఏమన్నారు ?
రాము (సురేష్ తండ్రి) : ఏం అనలేదు. 'సరె' అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను ఇంకా వాళ్ళు పెద్ద గొడవ చేస్తారేమొ అనుకున్న.
సురేష్ : ఏమి అనకపోవడం ఏంటి.? కొంప తీసి వాళ్ళేమి పోలీసు కేసులాంటివి మళ్ళి పెట్టడం లేదు కదా.?
రాము (సురేష్ తండ్రి) : ఏమొ రా. వాళ్ళు వెళ్ళిన తరువాత ఇప్పటి వరకు ఎటువంటి కబురు రాలేదు. బహుషా వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోయుండచ్చు.
సురేష్ : వాళ్ళు తిరిగి వెళ్ళినట్టె అయితె చాలా మంచిది. నేను ఇంకా కొన్ని రోజులు సూర్య దగ్గరె ఉంటాను నాన్న. ఈలోపు వాళ్ళ గురించి ఏ సమాచారం రాకపోతె మన ఇంటికి వచ్చెస్తా.
రాము (సురేష్ తండ్రి) : సరే రా జాగ్రత్త.
సురేష్ : సరే నాన్న ఉంటాను.
ఫోన్ పెట్టేసిన తరువాత మళ్ళి ఫోన్ స్విచ్చాఫ్ చేసి తన బ్యాగు లొ పెట్టెశాడు.
వాళ్ళ నాన్నతొ మాట్లాడిన దగ్గర నుంచి సురేష్ మెదడులొ ఎన్నో ఆలోచనలు మెదిలాయి.
తను అక్కడ లేను అని తెలిసిన తరువాత కూడా మేఘన వాళ్ళు ఎందుకు గొడవ చేయలేదు? అసలు వాళ్ళ ఉద్దేష్యం ఏంటి? అసలు ఇన్ని రోజులు తననె ఎందుకు టార్గెట్ చేసారు.?
ఇలా ఆ రోజంతా ఆలోచిస్తు ఉన్నాడు.
ఇంట్లొ సూర్య లేడు తన భార్యని చూసి రాత్రికల్లా వచ్చేస్తాను అని చెప్పి ఆ రోజు తెల్లారె ఊరు వెళ్ళాడు. దాంతొ సురేష్ ఒక్కడె ఇంట్లొ ఉన్నాడు. ఒంటిరిగా ఉండి విసుగు పుట్టి అలా సినిమా చూసి బయటె భోజనం చేసి వద్దామని సూర్య బైక్ తీసుకొని వెళ్ళాడు.
హాల్లొ సినిమా చూస్తున్నాడె గాని బుర్రంతా అవె ఆలోచనలు సురేష్ కి. సినిమా అయ్యాక బయట రెస్టారెంట్ లొ ఆ రాత్రికి భోజనం చేసి ఇంటికి బయలుదేరాడు.
దారిలొ హోరున పెద్ద వర్షం. తడవకుండా తలదాచుకోడానికి ఎక్కడ చోటు కనబడకపోయెసరికి ఆగకుండా అలా బైక్ నడుపుతున్నాడు. పైగా చీకటి వల్ల ఆ వర్షం లొ తనకి రోడ్డు సరిగ్గ కనిపించడం లేదు .
ఈ లోపు ఎదురుగు పెద్ద లారి హై బీమ్ లైట్సు ఆన్ చేసుకొని వస్తుంది. ఆ లైట్ కళ్ళ మీద పడి సరిగ్గ కనిపించడం లేదు తనకి. సరిగ్గా అదె సమయంలొ ఒక కుక్క తన దారికి అడ్డుపడింది. అది దగ్గరకి వస్తె గాని ఆ కుక్క కనబడలేదు. సురేష్ దాన్ని గమనించి వెంటనె సడన్ బ్రేకు వేసాడు. అంతె అసలె తడి రోడ్డు దాంతొ బైక్ స్కిడ్ అయ్యి పక్కనె ఉన్న స్తంబానికి గుద్దుకొని పడ్డాడు.
ఆ పడ్డప్పుడు తన తల ఒక రాయికి గట్టిగా తగిలింది. అదృష్టం కొద్ది తన తలకి హెల్మెట్ ఉండడంతొ సురేష్ కి ప్రాణాపయం తప్పింది.
కాని హెల్మెట్ ఉన్నా కూడా . తన తలకి బలంగా ఆ రాయి తగలడంతొ సగం స్పృహ కోల్పోయాడు.
అప్పటికె కొంచెం వర్షం తగ్గడంతొ అటుగా కారులొ వెళుతున్న ముగ్గురు వ్యక్తులు. సగం స్పృహలొ ఉండి అవస్తపడుతున్న సురేష్ ని చూసి దగ్గర లొ ఉన్న హాస్పెటల్ కి వాళ్ళ కారులొ తీసుకువెళ్ళారు.
అక్కడ హాస్పెటల్ లొ ఉన్న డాక్టర్ సురేష్ గాయలకి ప్రధమ చికిత్స (first aid) చేసాక. నొప్పులు తగ్గడానికి అని ఇంజెక్షన్ ఇచ్చాడు.
డాక్టర్ : మరేం పరవలేదు అంత తివ్రమైన గాయలు ఏమి తగల్లేదు ఇతనికి.
సరె ఇంతకి ఇతన్నీ ఇక్కడికి తీసుకు వచ్చింది ఎవరు?
సహాయకుడు-1 : డాక్టర్ గారు మేమె రొడ్డు మీద గాయలతొ పడి ఉన్న ఇతన్ని ఇక్కడికి తీసుకు వచ్చాం.
డాక్టర్ : మంచి పని చేసారు. ప్రస్తుతానికి అంతా బానె ఉంది. ఇప్పుడు ఇతనికి పూర్తిగా విశ్రాంతి అవసరం. కాని మా హాస్పెటల్లొ మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ బెడ్సు ఏమి పెద్దగా ఖాళి లేవు. అందుకని ఇతన్ని తన ఇంటి దగ్గర దిగబెట్టెస్తె మంచిది.
సహాయకుడు-1 : అలాగె డాక్టర్.
సహాయకుడు-2 : ఒరేయి ఇతని సెల్ ఫోన్ ఒకసారి తీసి చూడు. తన వాళ్ళకి కాల్ చేస్తె చెప్పేస్తె వాళ్ళె వచ్చి ఇతన్ని తీసుకెళతారు.
సహాయకుడు-3 : ఒరేయి ఇందాకలె అతని జేబులన్ని వెతికి చూసా రా. సెల్లుఫోన్ అంటు ఏం కనబడలేదు లేదు.
సహాయకుడు-1 : ఇతను రోడ్డు మీద పడ్డప్పుడు అది ఎక్కడొ పడిపోయుంటిది లేరా.
సహాయకుడు-2 : మరి ఇప్పుడు ఎలా?
సహాయకుడు-1 : ఒక్క నిమిషం ఉండు.
అని చెప్పి మగతలొ ఉన్న సురేష్ ని తన ఇంటి అడ్రస్సు ని అడుగుతారు. అప్పుడు సురేష్ తన ఇంటి అడ్రస్సు తొ పాటు అక్కడికి ఎలా వెళ్ళాలొ చెప్తాడు.
సహాయకుడు-1 : ఒరేయ్ ఇతను చెప్పిన అడ్రస్సు మనం వెళ్ళే దారిలోనె ఉంది. పైగా నాకు ఆ ఇల్లు కూడా ఐడియా ఉంది. ఎందుకంటె దానె ప్రక్కనె ఉన్న విజన్ అపార్ట్మెంట్సు కి ఒకరోజు పని మీద వెళ్ళాను.
సహాయకుడు-2 : అయితె ఇంకెం మనం వెళ్తూ మన కార్లొ ఇతన్ని తన ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోదాం
సహాయకుడు-1 & సహాయకుడు-3 : సరే రా.
అలా వాళ్ళు సురేష్ ని తమ కారులొ ఎక్కించుకొని బయలుదేరారు. కాసేపటికి వాళ్ళ కారు ఒక ఇంటి ముందు ఆగింది.
సహాయకుడు-1 : ఒరేయి ఇతను చెప్పిన అడ్రస్సు ఇదేరా. పట్టండి రా ఇతన్ని తన ఇంటి దగ్గరకి తీసుకెళదాం.
ముగ్గురు కలసి సురేష్ ని తన ఇంటి వద్దకు తీసుకువచ్చి డోర్ బెల్ కొడతారు. కాసేపటికి తలుపు తెరుచుకుంటుంది. ఎదురుగా మేఘన.......
దెబ్బలతొ మరియు సగం స్పృహ లొ ఉన్న సురేష్ ని చూసి కంగారు పడి "అయ్యయ్యొ ఏమైదండి మీకు" అని అడుగుతుంది.
1) అసలు సురేష్ చెప్పిన అడ్రస్సు ఉన్న ఇంట్లొ మేఘన ఎందుకు ఉంది......?
2) లేక ఆ ముగ్గురు సురేష్ చెప్పిన అడ్రస్సుకి తీసుకురాకుండా మేఘన ఉన్న ఇంటికి తీసుకువచ్చారా.......?
3) ఆ ముగ్గురికి మేఘన మరియు సురేష్ తెలుసా........?
4) అసలు మేఘన నిజంగానె సురేష్ భార్యా? లేక వేరె ఇంకేదైనా నా?
ఈ ప్రశ్నలకి అన్నింటికి సామాధానం మీరు తరువాత బాగం లొ తెలుసుకుంటారు.