సాగర తీరానికి ఆనుకొని ఉన్న నగరం విశాఖపట్టణం. ఆ నగరం లోని గాజువాక లొ ఓ ఇంటి మేడ పై ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు.
అబ్బాయి పేరు సురేష్ వయసు 34 ఏళ్ళు వైజాగ్ కోకా కోలా (Coca cola Vizag) కంపెనీలొ చార్టెడ్ అకౌంటెట్ (CA) గా పని చేస్తున్నాడు.
అమ్మాయి పేరు భవ్య వయసు 28 ఏళ్ళు వైజాగ్ లోని బుల్లయ్య కాలేజి లొ కెమిష్ట్రి లెక్చరర్ (Chemistry lecturer) గా పని చేస్తుంది.
అక్కడ వీళ్ళిద్దరికి పెళ్ళి చూపులు జరుగుతున్నాయి. కాసేపటికి మైడ పై నుంచి వీళ్ళు క్రింద కి వచ్చి అక్కడ ఉన్న వీళ్ళ పెద్దవాళ్ళకి తమ అభిప్రాయాన్నీ తెలిపారు.
రాము (సురేష్ తండ్రి) : మీ అమ్మయి మా అబ్బాయి తొ సహా మా అందరికి నచ్చింది. మరీ మీ మీ అభిప్రాయాలు ఏంటి.?
శేషాచలం (భవ్య తండ్రి) : మరోలా అనుకోకండి ఎంతైన ఆడపిల్ల తండ్రిని కదా వెంటనె చెప్పలేను మా వాళ్ళందరితొ ఒకసారి మాట్లాడి ఏ విషయం అనేది మీకు 2 రోజుల్లొ ఫోన్ చేసి చెప్తాము.
రాము (సురేష్ తండ్రి) : సరే మీ ఇష్టం. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరి ఇంక మేము బయలుదేరుతాం.
అలా సురేష్ తన తల్లిదండ్రులు మరియు చెల్లి తొ ఇంటికి కారులొ బయలుదేరారు.
వాసవి (సురేష్ తల్లి) : ఏవండి వాళ్ళు 2 రోజులు సమయం ఎందుకు అడిగారు?. మన సంబంధం వాళ్ళకి నచ్చలేదా.?
రాము (సురేష్ తండ్రి) : ఏమొ! చెప్పలేము. వాళ్ళ అనుమానాలు వాళ్ళవి. మనం ఏం చేయగలం ఎదురు చూడడటం తప్పా.
వాసవి (సురేష్ తల్లి) : అవ్వక అవ్వక ఇంతకాలానికి వీడికి మొదటిసారి పెళ్ళి చూపులు అయ్యాయి. దీనికె 5 సంవత్సరాలు పట్టింది. ఇంక వీడి పెళ్ళి కి ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో.
లక్ష్మీ (సురేష్ చెల్లి) : అవుతుంది లే అమ్మా. ఇదికాక పోతె ఇంకొ సంబంధం. అయిన ఇప్పటి వరకు అన్నయ్య కు పెళ్ళిచూపలె కాలేదు. ఇప్పుడు అయ్యింది. కాబట్టి పెళ్ళి త్వరలోనె అవుతుంది.
2 రోజులు తరువాత అమ్మాయి తండ్రి తనకి తెలిసిన వాళ్ళ ద్వారా సురేష్ గురించి పూర్తిగా తన ఆఫీసులొ వాకబు చేయిస్తాడు.
2 రోజులు కాస్తా వారం రోజులు గడిచాయి. ఆడపిల్ల వాళ్ళ తరుపునుంచి ఎటువంటి కబురు రాలేదు.
వాళ్ళకి తమ సంబంధం నచ్చలేదు ఏమొ అని సురేష్ ఇంట్లొ వాళ్ళు అనుకున్నారు.
ఇంకొ 3 రోజులు తరువాత అంటె సరిగ్గా 10 రోజులకి భవ్య తండ్రి అయిన శేషాచలం వీళ్ళకి కాల్ చేస్తాడు.
శేషాచలం (భవ్య తండ్రి): హలో రాము గారు. ఎలా ఉన్నారు.
రాము (సురేష్ తండ్రి) : చెప్పండి శేషు గారు. 2 రోజులు అని చెప్పి 10 రోజులు తరువాత కాల్ చేసారి ఏంటండి?
శేషాచలం (భవ్య తండ్రి): నన్ను క్షమించండి ఎక్కువ రోజులు తీసుకున్నందుకు. మాకు మీ సంబంధం అంగీకారమె.
రాము (సురేష్ తండ్రి) : అలాగ చాలా సంతోషం. ఇన్నీ రోజులు మీ నుంచి జవాబు రాకపోయెసరికి మీకు మా సంబంధం నచ్చలేదెమొ అనుకున్న. ఇంతకి ముహుర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం.?
శేషాచలం (భవ్య తండ్రి): మాకు తెలిసిన పంతులుతొ మాట్లాడి మీకు చెబుతాను అండి. ఉంటాను.
సురేష్ పెళ్ళి సంబంధం కుదురడంతొ వాళ్ళ ఇంట్లొ సందడి మొదలైయ్యింది. కాని వీళ్ళకి తెలియదు ఈ సంతోషం ఎక్కువ రోజులు ఉండదని.
10 రోజుల తరువాత సురేష్ కి తన ఇంట్లోనె నిశ్చితార్ధం జరుగుతోంది.
కొడుక్కి ఇంతకాలినికి పెళ్ళి కుదిరి నిశ్చితార్ధం జరగతుండడం చూసి సురేష్ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు.
కాని వాళ్ళ సంతోషాన్నీ ఆవిరి చేయడానికి ఒక అమ్మాయి ఓ 6 ఏళ్ళ బాబుని వెంటవేసుకొని ఆ ఇంటికి వచ్చింది.
జరుగుతున్న తతంగాన్నీ చూసి సరిగ్గ నిశ్చయ తాంబులాలు మర్చుకునె సమయానికి ఆ కార్యక్రామాన్నీ ఆపమని చెబుతుంది.
రాము (సురేష్ తండ్రి) : ఎవరమ్మా నువ్వు శుభకార్యం జరుగుతున్న చోటికి వచ్చి ఆపమని చెబుతున్నావు.?
కొత్త అమ్మాయి : నేను ఎవరొ తరువాత చెబుతాను ముందు ఈ నీశ్చితార్ధం మాత్రం ఆపండి ఇది జరగకూడదు.
శేషాచలం (భవ్య తండ్రి) : ఎందుకు జరగకూడదు.?
కొత్త అమ్మాయి : ఎందుకంటె ఇదివరకె ఒకసారి పెళ్ళైన వ్యక్తి తొ నిశ్చితార్ధం జరగకూడదు కాబట్టి.
రాము (సురేష్ తండ్రి) : ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు?
కొత్త అమ్మాయి : నిజం మాట్లాడుతున్నా. మీ అబ్బాయికి ఇదివరకె పెళ్ళి అయ్యి 7 ఏళ్ళు అవుతుంది. అది జరిగింది ఎవరితోనొ కాదు నాతోనె.
రాము (సురేష్ తండ్రి) : ఏ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు? మా వాడికి నీకు 7 ఏళ్ళ క్రితమె పెళ్ళైందా? ఒరేయి సురేష్ ఎవర్రా ఈ అమ్మాయి? నీ భార్యను అంటుంది.
సురేష్ : నాన్న ఆ అమ్మయి ఎవరో నాకు తెలియదు. ఇదె మొదటిసారి చూడడం.
తరువాత ఆ అమ్మాయి వంక తిరిగి
సురేష్: ఏ ఎవరు నువ్వు? నా భార్య వి అంటావు?. మతి గాని చెడిందా?
కొత్త అమ్మాయి : ఏవండి నేను మీ భార్య మేఘనాని. నేను ఎవరొ తెలీదు అంటారేంటి? ఈ బాబు మన వాడు మనకి పుట్టిన వాడు. వీడిని చూసైన నిజం చెప్పండి.
అంటు తన 6 ఏళ్ళ కొడుకు ని చూపించి తన భార్యె అని చెబుతుంది 30 ఏళ్ళ మేఘన.
అక్కడ జరుగుతున్నది అంతా కామ్ గా వింటున్న భవ్య తండ్రి శేషాచలం కలుగజేసుకొని.
శేషాచలం : నువ్వు అతని భార్యవె అనడానికి ఆధారం ఏంటి.
అని అడగగానే మేఘన తన బ్యాగులోంచి తన సెల్ ఫోను మరియు ఒక కవరు బయటకు తీస్తుంది.
సెల్ ఫోనులొ వీళ్ళిద్దరు దిగిన పెళ్ళి ఫొటోలు అందరికి చూపిస్తుంది. తరువాత ఆ కవరు తీసి అందులొ వాళ్ళ పెళ్ళి తాలుకు మ్యారేజి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూపిస్తుంది.
మేఘన : చూడండి మా ఇద్దరికి పెళ్ళి అయ్యింది అనడానికి ఇవె అధారాలు. ఇప్పటికైన నిజం ఒప్పుకొండి నేను భార్యను వీడు బాబు అని.
తను అవి చూపించగానె అందరు సురేష్ వైపె కోపంగా చూస్తున్నారు.
సురేష్ : నాన్న ఆమె చెప్పేదంతా అబద్దం నిజంగా నాకు తను ఎవరో నాకు తెలియదు. ఆ ఫోటోలన్ని మొర్ఫింగ్ చేసినవి నిజం ఫొటోలు కావు. ఆ మ్యారేజి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా నకిలిది. దయజేసి నన్ను నమ్మండి నాన్న.
వాసవి (సురేష్ తల్లి) : ఏవండి మనవాడు ఎలాంటి వాడొ మనకి తెలియదా ఒక ఆడదాన్ని మోసం చేసెవాడు కాదు.
లక్ష్మి (సురేష్ చెల్లి) : అవును నాన్న అన్నయ్య అలాంటి వాడు కాదు.
రాము(సురేష్ తండ్రి) : అవును మా వాడు గురించి నాకు బాగా తెలుసు వాడు కచ్చింతంగా తప్పు చేసి ఉండడు. నిజం చెప్పు ఎవరు నువ్వు మర్యాదగా చెప్పక పోతె పోలీసులను పిలవాల్సి వస్తుంది.
మేఘన : పిలిపించండి వాళ్ళె తేలుస్తారు అసలు నిజం ఏంటొ.
శేషాచలం (భవ్య తండ్రి) : చూడండి రాము గారు ఈ గోడవేంటొ తేలె వరకు మనం నిశ్చితార్ధం ఆపేయడం మంచిది.
రాము(సురేష్ తండ్రి) : ఒక్కనిమిషం శేషు గారు నిజంగా మా అబ్బాయి అలాంటి వాడు కాదు. దయచేసి నిశ్చితార్ధాన్నీ ఆపకండి.
శేషాచలం (భవ్య తండ్రి) : క్షమించండి ఆడపిల్ల తండ్రి గా మా భయాలు మాకు ఉంటాయి. అయిన ఆ అమ్మాయి నిజమె చెప్తున్నాదేమొ ఎవరికి తెలిసి.
భాగ్యశ్రీ (భవ్య తల్లి) : అయిన ఇంత వయసు వచ్చిన మీ అబ్బాయి కి ఇంకా ఏ సంబంధం ఎందుకు కుదరలేదొ మాకు ఇప్పుడు అర్ధం అవుతుంది.
వాసవి (సురేష్ తల్లి) : ఆ లెక్కన మీ అమ్మాయి కూడా ఇంత వయసు వచ్చిన ఎందుకు పెళ్ళి చేయలేదొ మేము ఏమైన అడిగామా.
భాగ్యశ్రీ (భవ్య తల్లి) : మా అమ్మాయి ఏం అలాంటిది కాదు. నిజా నిజాలు తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడకండి.
రాము (సురేష్ తండ్రి) : అమ్మా దయచేసి గొడవలు వద్దు. శేషు గారు మీరు అన్నట్టె ఈ నిశ్చితార్ధాన్ని ఆపేద్దాం.
కాసేపటికి అక్కడకు వచ్చిన వాళ్ళందరు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లొ సురేష్, తన తల్లిదండ్రులు, తన చెల్లి బావ మరియు మేఘన , తన కొడుకు మాత్రమె ఉన్నారు.
అందరు మౌనంగా ఉన్నారు. ఆ ఇల్లంతా నిశబ్దం ఆవిరించి ఉంది.
లక్మీ (సురేష్ చెల్లి) : ఏ ముందు ఇక్కడి నుంచి ఈ పిల్లాడిని తీసుకొని బయటకి వెళ్ళు లేకపోతె పోలీసులని పిలవాల్సి వస్తుంది.
మేఘన : నన్ను తన భార్యగా ఒప్పుకునేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను.
మేఘన కదలక పోయెసరికి సురేష్ తల్లి మరియు చెల్లి కలిసి ఆమెతొ వాగ్వాదానికి దిగుతారు. అది కాస్తా పెద్ద గొడవగా మారుతుంది. ఆ గొడవలొ లక్మీ (సురేష్ చెల్లి) మేఘనని ఇంటినుంచి బయటకు నెడుతుంది.
సరిగ్గా అదె సమయానికి మేఘన తండ్రి విక్రమ్ అక్కడికి వస్తాడు.
మేఘన: చూడండి నాన్న ఆయన నేను ఎవరొ తెలియదు అంటున్నారు.
విక్రమ్ : జరిగింది అంతా నేను చూసాను. వీళ్ళు మర్యాదగా చెబితె వినరు. ఏ చెయ్యాలొ నాకు బాగా తెలుసు.
అని చెప్పి విక్రమ్ తన కూతురు మేఘన ని మనవడు ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.