Read Nijam - 2 by Suresh Josyabhatla in Telugu నాటకం | మాతృభారతి

Featured Books
  • నిజం - 2

    2వ - భాగంఆ సంఘటన జరిగిన తరువాత ఆ రోజు సురేష్ ఇంట్లొ అందరు బా...

  • సరయు

    అర్జున్ అతని కార్ లో, తన భార్య (అనిత) మరియు అయదు సంవత్సరాల క...

  • అంతం కాదు - 61

    సత్యయుగ గ్రహం: కల్కి కోసం శిక్షణఇక అక్కడ కట్ చేస్తే, మళ్ళీ హ...

  • అర్ధం కాని ప్రేమ”

    చదువంటే భయపడే ఒక యువకుడి జీవితంలోకి అనుకోని అతిథిలా అడుగుపెట...

  • K A.U

    చార్మినార్ రక్తపాతం (The Bloodbath of Charminar) దృశ్యం 1: చ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 2

2వ - భాగం

ఆ సంఘటన జరిగిన తరువాత ఆ రోజు సురేష్ ఇంట్లొ అందరు బాధ తొ కూర్చొని ఆలొచిస్తున్నారు.

వాసవి (సురేష్ తల్లి) : (ఏడుస్తూ) కుదరక కుదరక వీడికి ఒక పెళ్ళి సంబంధం కుదిరితె. అది కాస్తా చెడిపోయింది. ఇంక ఈ జన్మలొ నా కొడుకు పెళ్ళిని చూస్తానొ లేదొ. 

రాము (సురేష్ తండ్రి) : అబ్బ ఏడవకె ఇప్పుడు ఏమయ్యింది? ఈ సంబంధం కాకపోతె ఇంకొకటి. ఇప్పుడు అది కాదు సమస్య అసలు ఎవరా అమ్మాయి? సురేష్ నె ఎందుకు వెత్తుక్కుంటూ వచ్చి తన భర్త అని చెప్పింది.

లక్ష్మి (సురేష్ చెల్లి) : నాది అదె అనుమానం నాన్న. అది కాకుండా అన్నయ్యతొ పెళ్ళైనట్టు ఫొటోలు కూడా చూపించింది. చూస్తుంటె తను అన్నయ్యని ఎందుకొ టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.

రాము (సురేష్ తండ్రి) : ఒరేయి సురేష్ అసలు ఏం జరిగిందొ ఒకసారి గుర్తుచేసుకొరా. గతంలొ ఆ అమ్మయిని ఎప్పుడైన ఎక్కడైన చూసావేమొ.? ఆ అమ్మాయితొ గొడవ ఎమైన పడ్డావేమొ అందుకె నీ మీద పగతీర్చుకోడానికి ఈ నాటకం ఆడుతుందెమొ.?

సురేష్ : అదె నేను చాలా సేపటినుంచి ప్రయత్నిస్తున్నా నాన్న. కాని తను ఎవరొ నాకు ఇంకా గుర్తుకు రావడం లేదు.

రాము (సురేష్ తండ్రి) : సర్లె ఈసారి ఆ అమ్మాయి వచ్చాక చూసుకుందాంలె నువ్వు ఏమి కంగారు పడకు. హాయిగా భోజనం చేసి పడుకొ పో. మళ్ళి రేపు నువ్వు డ్యూటి కి వెళ్ళాలిగా.

లక్ష్మీ (సురేష్ చెల్లి) : నాన్న చెప్పింది కరక్ట్ అన్నయ్య నువ్వు ఇవేమి బుర్రలొ పెట్టుకోకు. నువ్వు ఎలాంటి వాడివొ మా అందరికి తెలుసు. నీ మీద పూర్తి నమ్మకం ఉంది. 

ఆ తరువాత 4 రోజులు వరకు ఎటువంటి సంఘటన జరగలేదు మరియు మేఘన గాని తన తండ్రి గాని మళ్ళి వాళ్ళకి కనిపంచలేదు. 

తాము గట్టిగ నిలబడె సరికి మేఘన కి అర్ధమై ఇంక రాదు అని అనుకున్నారు.

కాని ఏది మనం అనుకున్నట్టు జరగదు కదా. 

ఒక రోజు ఆఫీసు లొ ఉన్న సురేష్ కి పోలీసు స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. 

పోలీసు కానిస్టోబుల్ : హలో సురేష్ గారేనా మాట్లాడేది?

సురేష్ : అవును మీరు ఎవరు?

పోలీసు కానిష్టేబుల్ : నేను 2 టౌన్ పోలీసు స్టేషన్ కానిష్టేబుల్ ని మాట్లాడుతున్న మీపైన కంప్లైంట్ వచ్చింది మీరు ఒకసారి పోలీసు స్టేషన్ కి రావాలి.

సురేష్ : కంప్లైంటా?ఎందుకు? ఎవరు ఇచ్చారు?

పోలీసు కానిష్టేబుల్ : మీ భార్య మేఘన మరియు మీ మావగారు విక్రమ్ ఇద్దరు కలిసి ఇచ్చారు. 

సురేష్ : ఆమె నా భార్య కాదు సార్. తను ఎవరొ నాకు తెలియదు. 

పోలీసు కానిష్టేబుల్ : చూడండి మీరు ఏం చెప్పాలి అనుకున్న దయచేసి స్టేషన్ కి వచ్చి చెప్పండి.

అని చెప్పి ఫోను పెట్టేశాడు.

వెంటనె సురేష్ తన ఇంటికి కాల్ చేసి తన తండ్రి రాము కి జరిగిన సంగతి అంతా చెప్పాడు. 

రాము (సురేష్ తండ్రి) : నువ్వు ఏం భయపడకు రా ధైర్యంగా వెళ్ళు నేను కూడా బయలుదేరి స్టేషన్ వస్తున్న.

సురేష్ : సరే నాన్న నేను స్టేషన్ కి వెళుతున్న.

కాసేపటికి సురేష్ మరియు తన తండ్రి ఇద్దరు పాలీసు స్టేషన్ చేరుకుంటారు.

సురేష్ తనకి ఫోన్ చేసిన కానిష్టేబుల్ కి కాల్ చేసి తాము వచ్చిన సంగతి చెప్తాడు. ఆ కానిష్టేబుల్ వచ్చి వాళ్ళిద్దరిని ఆ స్టేషన్ సి.ఐ సంతోష్ వద్దకు తీసుకువెళతాడు. అప్పటికె అక్కడ మేఘన తన తండ్రి విక్రమ్ తొ కలిసి కూర్చొని ఉంది.

వాళ్ళను చూడగానె సురేష్ కి కోపం వచ్చింది. కాని తన తండ్రి తనను తమాయించుకోమని వారిస్తాడు. దాంతొ తను కోపం తగ్గించుకొని సి.ఐ సంతోష్ వైపు తిరిగి ఏం మాట్లాడకుండా నించుంటాడు..

సి.ఐ సంతోష్ : రండి కూర్చోండి. సురేష్ అంటె మీరె నా?

అని సురేష్ వంక చూసి అడుగుతాడు. సురేష్ అవును అన్నట్టు తల ఊపుతాడు.

రాము (సురేష్ తండ్రి) : నమస్తె సార్ నా పేరు రాము తను మా అబ్బాయె. 

సి.ఐ సంతోష్ : నమస్తె. చెప్పండి ఏంటి సమస్య మీ అబ్బాయి ఎందుకు ఆ అమ్మాయి తన భార్య కాదని ఆ బాబు తన కొడుకు కాదని అసలు తను ఎవరొ తెలియదు అంటున్నాడు?

రాము (సురేష్ తండ్రి) : నిజమె సార్ మా అబ్బాయి కి నిజంగా తను ఎవరొ తెలియదు.

సి.ఐ సంతోష్ : ఆ ముక్క మీ అబ్బాయిని చెప్పమనండి.

సురేష్ : అవును సార్ మా నాన్న చెప్పేది నిజం. ఆమె ఎవరొ నాకు అసలు తెలియదు. ఇదివరకు ఎప్పుడు నేను చూడలేదు. ఆ అమ్మాయి చెప్పేది అంతా అబద్దం.

మేఘన : అబద్దం చెప్పకండి. నేను ఎవరొ మీకు తెలియదా? 
సార్ నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా ఆయనె నా భర్త నా బిడ్డకి తండ్రి.

విక్రమ్ (మేఘన తండ్రి) : సార్ వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టు రిజిష్టార్ అఫిసు లొ ఇచ్చిన మ్యారేజి సర్టిఫికేట్ మరియు పెళ్ళి అప్పుడు దిగిన ఫోటోలు మీకు ఇంతకుముందె చూపించాను. 

సురేష్ : అవన్ని తప్పుడు అధారాలు. సార్ వాటిని నమ్మకండి.

సి.ఐ సంతోష్ : ఆ ఆధారాలు నిజమైనవొ కావొ మేము ఎంక్యైరి చేసి తెలుసుకుంటాం. అంతె కాదు ఆ బాబు నీ కొడుకా కాదా అని తెలుసుకోడానికి డి.ఎన్.ఏ పరీక్ష చేయిస్తాం. మరీ ఆ డి.ఎన్.ఏ పరీక్ష కి నువ్వు సిద్దమేనా?

సురేష్ : సిద్దమె సార్. నిజం నా వైపు ఉంది కాబట్టి నేను ధైర్యంగా ఈ పరీక్ష కి ఒప్పుకుంటున్నా.

సురేష్ ఆ మాట అనగానె అది విని మేఘన షాక్ అయింది. 

మేఘన : ఏం మాట్లాడుతున్నారండి? డి.ఎన్.ఏ పరీక్ష కి వెళతాను అంటారేంటి? వీడు మన కొడుకె అని మీకు తెలియదా? ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు?

సురేష్ : చూసారా సార్ డి.ఎన్.ఏ పరీక్ష అనగానె తను ఎలా మాట మారుస్తుందొ. అదె జరిగితె విళ్ళు ఆడె నాటకం బయటపడిపోతుంది కదా.

విక్రమ్ (మేఘన తండ్రి) : నాటకం ఆడతుంది మేము కాదు నువ్వు. డి.ఎన్.ఏ పరీక్ష జరిగితె నీ గుట్టె బయటపడేది. 

సి.ఐ సంతోష్ : దయచేసి కామ్ గా ఉండండి. ఏ అమ్మా మేఘన నువ్వు ఈ పరీక్ష కు ఒప్పుకుంటున్నావ లేదా?.

మేఘన : (బాధ మరియు కోపంతొ సురేష్ వంక చూస్తూ) ఒప్పుకుంటున్నాను. 

సి.ఐ సంతోష్ : అయితె మీరు ఈ పరీక్షకు అంగీకరిస్తున్నట్టు లిఖితపూర్వకంగా వ్రాసి సంతకం పెట్టండి. సాక్షి సంతకాలు క్రింద మీ ఇద్దరి నాన్న గార్లని పెట్టమనండి.

సి.ఐ సంతోష్ చెప్పినట్టె డీ. ఎన్. ఏ పరీక్ష కి సురేష్ మేఘన ఇద్దరు లిఖితపూర్వక అంగీకారం (written consent) ఇచ్చారు. దానిపై సురేష్ వాళ్ళ నాన్న రాము మరియు మేఘన తండ్రి విక్రమ్ సాక్షి సంతకాలు చేసారు. 

సి.ఐ సంతోష్ : సరే రేపు ఉదయం 9 గంటలకి మీరందరు కే.జీ.హెచ్ హాస్పెటల్ కి రండి. అక్కడ పిల్లాడితొ పాటు మీ ఇద్దరిది కూడా రక్త నమూనాలు సేకరిస్తారు. 

ఆ మరుసటి రోజు మేఘన బాబు ని తీసుకొని తన తండ్రి తొ కలిసి కే.జీ.హెచ్ హాస్పెటల్ కి చేరుకుంటుంది. అప్పటికె సురేష్ తన తండ్రి తొ కలిసి హాస్పెటల్ కి వచ్చి ఎదురు చూస్తున్నాడు.

మెడికల్ ఆఫీసర్ వచ్చి సురేష్, మేఘన మరియు బాబు ని లోపలికి తీసుకు వెళ్ళి వాళ్ళ యొక్క రక్త నమూనాలను సేకరిస్తాడు.

తరువాత సేకరించిన నమూనాలను మద్దిలపాలం లొ ఉన్న రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (RFSL) కి పంపిస్తారు. 

లక్ష్మీ (సురేష్ చెల్లి) : నాన్న రిపోర్టు ఎప్పుడు వస్తుంది అంటా?

రాము (సురేష్ తండ్రి) : 15 నుంచి 45 రోజులు పట్టచ్చు అంటా. 

లక్ష్మీ (సురేష్ చెల్లి) : అవునా.....
------------------------------------------------------------------------
మద్దిలపాలం బస్టాండ్ వద్ద ఒక వ్యక్తి నించొని ఎవరి కోసమొ ఎదురు చూస్తున్నాడు. 

కొంచెం సేపటికి ఆ వ్యక్తి కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. 

వ్యక్తి : హలో మీరు చెప్పినట్టె మద్దిలపాలం బస్టాండ్ దగ్గర ఉన్నాను.

ఫోన్ లోని వ్యక్తి : నీ ఎదురు గా రోడ్డు కి అవతలి పక్క నలుపు రంగు టాటా నిక్సన్ కారు కనిపిస్తుంది కదా?.

వ్యక్తి : హా కనిపిస్తుంది.

ఫోన్ లోని వ్యక్తి : నేను ఆ కారులోనె ఉన్నా ఎవరు చూడకుండా వచ్చేయి.

ఫోన్ లొ చెప్పినట్టు గానె ఆ వ్యక్తి ఆ కారు ఎక్కాడు. 

వ్యక్తి : నమస్తె విక్రమ్ అంకుల్ ఎలా ఉన్నారు? 

విక్రమ్ (మేఘన తండ్రి) : నేను బాగున్నాను హరి. నువ్వు ఎలా ఉన్నావు?

హరి : నేను బాగున్నా అంకుల్. చెప్పండి మేఘన విషయమై నన్ను రహస్యంగా కలవాలి అన్నారు దేనికి?

విక్రమ్ (మేఘన తండ్రి) : చెప్తాను. అంతకంటె ముందు మనం ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు దారిలొ నీకు అన్ని వివరంగ చెప్తా. 

గంట తరువాత కారులొ వాళ్ళిద్దరు తిరిగి మళ్ళి మద్దిలపాలం బస్టాండ్ దగ్గర ఆగారు.

విక్రమ్ (మేఘన తండ్రి) : నేను చెప్పింది నీకు గుర్తుంది గా హరి. 

హరి : గుర్తుంది అంకుల్ మీరు చెప్పినట్టె చేస్తా. 

విక్రమ్ (మేఘన తండ్రి) : సరె ఇందా ఈ 2 లక్షలు ఉంచు.

హరి : అయ్యొ ఎందుకు అంకుల్ చిన్న పనె గా దీనికి ఎందుకు డబ్బులు. 

విక్రమ్ (మేఘన తండ్రి) : పరవాలేదులె హరి ఉంచు.

హరి : సరె అంకుల్ 

డబ్బుతీసుకొని హరి కారు దిగి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
---------------------------------------------‐--------------------------
10 రోజుల తరువాత డి.ఎన్.ఏ పరీక్ష తాలుకు రీపోర్టు పోలీస్ స్టేషన్ కి వచ్చింది. సి.ఐ సంతోష్ అందరిని పోలీసు స్టేషన్ రమ్మని కబురు చేస్తాడు.

రాము (సురేష్ తండ్రి) : సార్ ఇంతకి ఈ రిపోర్టులొ ఏమని తేలింది? మా వాడు ఆ బిడ్డకి తండ్రి కాదు అనెగా?

సి.ఐ సంతోష్ : లేదు మీ వాడె ఆ బిడ్డకి తండ్రి అని ఉంది. అంతె కాదు మీ అబ్బాయి తొ పాటు మేఘన డి.ఎన్.ఏ కూడా బాబు తొ కుదిరింది. అంటె వీళ్ళిద్దరికె ఈ బాబు పుట్టాడు అని రుజువు అయ్యింది.