3వ - భాగం
సురేష్ : ఏం మాట్లాడుతున్నారు సార్ అలా జరగడానికి వీల్లేదు.
సి.ఐ సంతోష్ : నేను నిజమె చెప్తున్నా. ఈ రిపోర్టు లొ అలాగె ఉంది. అంతె కాదు వీళ్ళు ఇచ్చిన మ్యారేజి సర్టిఫికేట్ గురించి కూడా మేము ఎంక్యైరి చేసాం. అది కూడా నిజమైనదె అని తేలింది.
రాము (సురేష్ తండ్రి) : మా వాడు తప్పు చేసాడు అంటె నేను నమ్మలేక పోతున్న.
సి.ఐ సంతోష్ : అధారాలు అన్నీ బలంగా ఉన్నాయండి. మర్యాదగా మీ అబ్బయిని తప్పు ఒప్పుకొని భార్య ని బిడ్డని తీసుకువెళ్ళమనండి. లేదంటె చార్జ్ షీట్ ఫైల్ చెయ్యాల్సి ఉంటుంది. అప్పుడు మీ సమస్య కోర్టు వరకు వెళతుంది.
సురేష్ : చేయండి నేను కోర్టు వరకు వెళ్ళడానికి సిద్దంగ ఉన్న.
సి.ఐ సంతోష్ : చూడు సురేష్ ఇంకొసారి బాగా ఆలొచించుకొ ఆధారాలన్ని పక్కాగా ఉన్నాయి. కోర్టుకు వెళ్ళిన లాభం లేదు. తిరిగి నీపైనె కేసు మరింత బలంగా మారుతుంది.
సురేష్ : పరవలేదు నాకు నమ్మకం ఉంది. నిజం ఏంటొ కచ్చితంగా బయటపడుతుంది.
ఏం నాన్న మాట్లాడవేమి?
రాము (సురేష్ తండ్రి) డి.ఎన్.ఎ రిపోర్టు లొ వచ్చిన ఫలితాన్ని విని నిశ్చేష్టుడైపొయాడు. ఇప్పుడు తనకి కొడుకుని నమ్మాలొ లేక మేఘనని నమ్మాలొ అర్ధంకావడం లేదు.
సురేష్ : నాన్న ఏం మాట్లాడరేంటి?
రాము (సురేష్ తండ్రి) : సార్ దయచేసి మాకు ఒక 2 రోజులు సమయం ఇస్తారా. ఏ నిర్ణయం తీసుకోవాలొ కొంచెం ఆలోచించుకోవాలి.
సి.ఐ సంతోష్ : ఏం విక్రమ్ గారు మీరేమంటారు? వాళ్ళకి ఓ 2 రోజులు సమయం ఇస్తె బాగుంటుంది. అప్పటికి ఒప్పుకోకపోతె చార్జ్ షీట్ ఫైల్ చేద్దాం సరేనా?
విక్రమ్ (మేఘన తండ్రి) : మాకు అబ్యంతరం లేదు. 2 రోజులు కాకపోతె వారం రోజులు తీసుకొమనండి. చివరికి నా కూతురిని మనవడిని కాపురానికి తీసుకెళితె చాలు.
సి.ఐ సంతోష్ : విన్నారు గా రాము గారు?. మీరు అడిగినట్టె ఆలోచించుకోడానికి సమయం 2 రోజులు ఇస్తున్నాం. సమస్య కోర్టు వరకు వెళ్ళకుండా శాంతియుతంగా పరిష్కరించుకుంటారు అనుకుంటున్నా.
రాము (సురేష్ తండ్రి) : చాలా ఠాంక్స్ అండి. ఇంక బయలుదేరుతాం.
అని చెప్పి సి.ఐ సంతోష్ కి మరియు విక్రమ్ కు నమస్కారం పెట్టి లేచి అక్కడ నుంచి బయలుదేరారు.
సురేష్ తన తండ్రిని ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా రాము (సురేష్ తండ్రి) బండి స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు.
అదె సమయంలొ మేఘన మరియు విక్రమ్ (మేఘన తండ్రి) ఇద్దరు స్టేషన్ నుంచి బయటకు వచ్చి.
విక్రమ్ (మేఘన తండ్రి) : చూడు అల్లుడు కోర్టుకెళ్ళి ఎందుకు మన ఇంటి పరువుని రచ్చకీడుస్తావు చెప్పు. ఇప్పటికైన మేఘన నువ్వు కలిసిపోయి హాయి గా కాపరం చేసుకోండి.
మేఘన : ఏవండి. మీరు ఇంకా ఎందుకు అంత మొండిపట్టు పడుతున్నారు. దయచేసి ఇప్పటికైన మారండి నిజం ఒప్పుకోండి.
సురేష్ ఏం మాట్లాడకుండా కోపంగా బండి తీసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
మేఘన : నాన్న ఆయన ఇంకా ఒప్పుకునెలా కనిపించడం లేదు.
విక్రమ్ (మేఘన తండ్రి): బాధపడకమ్మా ఒప్పుకోకుండా ఇంకెంత కాలం ఉండగలడు. ఇప్పుడు కాకపోయిన 4 రోజులు తరువాత అయిన మన వద్దకు రావలిసిందె.
సురేష్ ఇంటికి చేరెసరికి అందరు హాల్లో మౌనంగా కూర్చొని ఉన్నారు. సురేష్ చెల్లి లక్ష్మీ కూడా వచ్చింది. తను కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది.
సురేష్ : అదేంటి నాన్న పిలుస్తుంటె ఆగకుండా వచ్చేశారు.? అయిన వాళ్ళని 2 రోజులు సమయం ఎందుకు అడిగారు.? కోర్టులొ తేల్చుకునె వాళ్ళంగా? మనం మంచి లాయరుని పెట్టుకుని కోర్టుకు వెళదాం నాన్న.
ఎవ్వరు ఏం మాట్లాడరు అందరిది అదె మౌనం.
సురేష్ : ఏం మాట్లాడరు ఏంటి నాన్న? ఏమైంది.?
రాము (సురేష్ తండ్రి) కోపంగా లేస్తు కొడుకు సురేష్ చంప పై గట్టిగా కొడతాడు.
సురేష్ : నాన్న.......?
రాము (సురేష్ తండ్రి) : నాన్ననె రా అందుకనె అక్కడ నిన్ను ఏమి అనలేక. ఇంటికి వచ్చి నీ చంపపై కొట్టాను.
సురేష్ : నాన్న మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేను ఎలాంటి వాడినొ మీకు తెలియదా? నామీద నమ్మకం లేదా?
రాము (సురేష్ తండ్రి) : ఎలా నమ్మగలం రా.? అన్ని ఆధారాలు చూసాక కూడా?
సురేష్ : నాన్న నన్ను నమ్మండి. కచ్చితంగా ఆ మేఘన మరియు దాని తండ్రి విక్రమ్ కలిసి ఆ డి.ఎన్.ఎ రిపోర్టు విషయంలొ ఎదో ఒకటి చేసి ఉంటారు.
అమ్మ, లక్ష్మీ (సురేష్ చెల్లి) మీరైన నమ్మండే.
లక్ష్మీ (సురేష్ చెల్లి) : ఏం నమ్మమంటావు? అయిన నాన్న నీ జాతకాన్నీ చూపించిన ప్రతి జ్యోతిష్కుడు "నీకు ఈపాటికె పెళ్ళైపావాలి ఇంకా అవ్వలేదా? ఏంటి? " అన్నప్పుడె మాకు అనుమానం రావాలి.
సురేష్ : ఒసేయి నా గురించి అన్నీ తెలిసిన మీరె నన్ను నమ్మకపోతె ఇంక ఎవరు నమ్మతారె.?
రాము (సురేష్ తండ్రి) : ఎలా నమ్మమంటావు రా?
అప్పుడు సురేష్ మొకాళ్ళపై కూర్చొని తండ్రి చేతులను మరియు తన తల్లి చేతులను పట్టుకొని
సురేష్ : నాన్న, అమ్మా చిన్నప్పటి నుంచి నేను ఏంటొ మీకు బాగా తెలుసు. వాళ్ళ చూపించిన ఆధారాలను కాదు నన్ను నమ్మండి. మనం మంచి లాయర్ని పెట్టుకొని కోర్టుకి వెళదాము.
రాము (సురేష్ తండ్రి) : సరేరా మేము నిన్ను నమ్మతున్నాం. వాళ్ళతొ మనం కోర్టులోనె తేల్చుకుందాం.
2 రోజులు తరువాత మళ్ళి అందరు 2 టౌన్ పోలీసు స్టేషన్ కి వచ్చారు.
సి.ఐ సంతోష్ : రండి. ఇంతకి ఏం నిర్ణయానికి వచ్చారు. మీ వాడు ఆమెను భార్యగా అంగీకరించడానికి ఒప్పుకున్నాడా?
రాము (సురేష్ తండ్రి) : లేదు సార్. మేము ఈ ఆధారాలని ఏమి నమ్మడంలేదు. మా వాడి సంగతి నాకు బాగా తెలుసు. వాడు ఏ తప్పు చేసి ఉండడు. ఈ విషయం మీద మేము కోర్టుకు వరకు వెళ్ళడానికి సిద్దమె.
సి.ఐ సంతోష్ : సరె మీ ఇష్టం కోర్టు మెట్లు ఎక్కాలని అంత ఆశ ఉంటె మేము మాత్రం ఏం చేస్తాం.
ఏ రంగయ్య (స్టేషన్ రైటర్) ఇతని మీద చార్జి షీట్ ఫైల్ చెయ్యి.
సురేష్ పై చార్జి షీట్ ఫైల్ అయిన 2 రోజులకి కేసు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళింది. కోర్టు లొ సురేష్ తరపు లాయరు వాదిస్తున్నాడు.
సురేష్ లాయర్ : సార్ ఆ డి.ఎన్.ఎ రిపోర్టు పై మాకు అనుమానాలు ఉన్నాయి. మళ్ళి ఆ డి.ఎన్.ఎ పరీక్ష చేయించమని కోరుతున్నాం. అంతెకాకుండా పెళ్ళికి సంబంధించిన మ్యారేజి సర్టిఫికెట్టు మరియు ఫొటోలు కూడా నకిలీవి అని మా అనుమానం. వాటిని కూడా పునఃపరిశీలించాలని మా మనవి.
కాని మేఘన తరుపు లాయరు మాత్రం ఆ అనుమానాలను కొట్టిపారేస్తు.
మేఘన లాయర్ : సార్ సదరు డి.ఎన్.ఎ పరీక్ష కోసం రక్త నమూనాలు సేకరించిన మెడికల్ ఆఫీసర్ తను పోలీసులు మరియు మిగిలిన వాళ్ళందరి సమక్షంలోనె సేకరించిన నమూనాలను మద్దిలపాలం లొ ఉన్న రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (RFSL) కి పంపించారు.
కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు లొ అవకతవకలు జరిగె సమస్య లేదు.
జడ్జి : మరి మ్యారేజి సర్టిఫికెట్ ?
మేఘన లాయర్ : సార్ ఆ మ్యారేజి సర్టిఫికెట్ పైన పోలీసులు ఎంక్వైరి చేసి అది నకిలిది కాదు నిజమైనదె అని రిపోర్టు ఇచ్చారు. అది కోర్టువారికి ఇది వరికె సమర్పించాను.
జడ్జి : ప్రతివాది తరుపు లాయర్. దీని పై మీ సామధానం ఏంటి ?
సురేష్ లాయర్ : నా సమాధానం ఒకటె సార్. ఆ ఆధారాలను అన్నిటిని ఇంకొసారి పునఃపరిశీలించాలి.
జడ్జి : తీర్పును వచ్చె వారానికి వాయిదా వేస్తున్నా.
వారం తర్వాత కోర్టులొ కేసు తుది తీర్పుకి వచ్చింది.
జడ్జి : ఆధారాలు అన్ని చూసాక. వాటిపై ప్రతివాది వేసిన అనుమానాలను కొట్టివేస్తు. అవి నిజమైనవె అని కోర్టు విశ్వసిస్తుంది. కావున సదరు సురేష్ అనె వ్యక్తి 15 రోజుల్లోగా తన భార్య అయినటువంటి మేఘనను మరియు కొడుకును అంగీకరించాలి లేదా నిజం ఒప్పుకొని విడాకులకైన వెళ్ళాలి.
ఈ తీర్పు వినగానె సురేష్ ఒక్కసారిగా చితికిలపడిపోయాడు.
తరువాత కోర్టు బయట ఆవరణ లొ విక్రమ్ (మేఘన తండ్రి) సురేష్ వద్దకు వచ్చి
విక్రమ్ (మేఘన తండ్రి) : ఏం అల్లుడు అమ్మాయిని బాబుని మీ ఇంటికి ఎప్పుడు పంపించమంటావు?. మంచి రోజు ఎప్పుడొ మీరు చూస్తారా లేక నేనె చూసుకొని పంపించనా?.
ఆ మాటలు వినగానె సురేష్ కి కోపం నషాళానికి అంటింది. విక్రమ్ (మేఘన తండ్రి) పై చెయ్యి ఎత్తబోతుంటె రాము (సురేష్ తండ్రి) అడ్డుకొని కొడుకుని ఆపాడు.
రాము (సురేష్ తండ్రి) : విక్రమ్ గారు మేము ఇంటికి వెళ్ళాక మంచి రోజు చూసి మీకు ఫోన్ చేస్తాం.
అని చెప్పి కోపంగా ఉన్న సురేష్ ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్ళాక సురేష్ కోపంగా తన గదిలోకి పోయి తలుపు వేసుకోని మంచం పై చారబడ్డాడు.
ఆ రోజు అంతా గది నుంచి బయటకి రాకుండా బాగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు.
ఇంట్లొ వాళ్ళు కూడా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ రోజంతా తనని బయటకు పిలవలేదు.
మరుసటి రోజు తెల్లవారి వాసవి (సురేష్ తల్లి) కొడుకు గది వద్దకు వెళ్ళి తలుపు కొడదామని చూసింది. కాని తలుపు తీసె ఉండడం తొ లోపలికి వెళ్ళి చూసింది. లోపల సురేష్ లేడు. బాత్రూం లొ ఉన్నాడేమొ అని చూసింది అందులొ కూడా లేడు.
వెంటనె రాము (సురేష్ తండ్రి) ని లేపి జరిగిన విషయం చెప్పింది. రాము (సురేష్ తండ్రి) కొడుకు సెల్లు ఫోన్ కు కాల్ చేసాడు అది స్విచాఫ్ అని వచ్చింది.
తిరిగి చేద్దాము అనుకొని తన మొబైల్లొ చూస్తె కొడుకు పంపిన మెసేజ్ కనిపించింది.
"నేను కొన్ని రోజులు పాటు ఎవరికి కనిపించను నన్ను ఎవరు వెతక్కండి" అని
2 గంటల క్రితం పంపించిన మెసేజ్ కనిపించింది .