రుద్ర ప్రళయం, శకుని హెచ్చరిక
వెంటనే రుద్ర తన చేతిని గట్టిగా విదిలించడంతో రెండు మూడు బ్లాక్ పాంథర్లు గాల్లోకి ఎగిరి కింద పడ్డాయి. దూరంగా భైరవ గట్టిగా నవ్వుతూ, "మీ అందరి గుట్టు తెలిసిపోయింది!" అని ఎగతాళి చేశాడు. మాయ రుద్రను ఆకాశంలోకి ఎగరేసింది. రుద్ర ఎగిరి ఎగరకముందే భైరవ గొంతు పట్టుకుని, "ఎవడు పంపించాడు? వాడికి చెప్పు! ఇక్కడున్నది రుద్ర! ఇక్కడ ఎవరిని తాకాలన్నా మొదటిగా నన్ను తాకాలి!" అంటూ గట్టిగా గొంతు పిసికాడు. ఆ బ్లాక్ పాంథర్ ఒక గాలిలా మారి నల్లటి పొగలా అదృశ్యమైంది. వెళ్ళిపోతూనే, "శకుని తిరిగి వచ్చాడు!" అని గట్టిగా నవ్వుతూ మాయమైపోయింది.
మాయ కూడా సగానికి సగం బ్లాక్ పాంథర్ మూకను అంతం చేసింది. అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా బిత్తరపోయారు. అక్షర తన కడుపులో బిడ్డను గట్టిగా అదుముకుని, "ఏం జరుగుతుంది?" అని అడుగుతూ రుద్రను గట్టిగా హత్తుకుంది.789ఓ
అంతలో భైరవ నవ్వుతూ, "మీ గుట్టు నాకు తెలిసిపోయింది! రేపటితో మీ అడ్డు తొలగిస్తాను!" అని గట్టిగా అరిచి వెళ్ళిపోయాడు. రుద్ర, అక్షరను చిన్నగా నిమురుతూ, ".యుగ పురుషుల సిద్ధాంతం: యుద్ధం ఎవరిది?
భైరవ అదృశ్యమైన తర్వాత, రుద్ర, అక్షరను పట్టుకుని ధైర్యం చెప్పాడు. "భయపడకు, నేనున్నాను కదా? నేను ఉన్నంతవరకు మీకు ఎవరికీ ఏమీ కానివ్వను," అన్నాడు. కొంచెం దూరం జరిగి, రుద్ర మరోసారి "హనుమా!" అని గట్టిగా అరిచాడు. హనుమంతుడు ఒక్కసారిగా ప్రత్యక్షమై, "ఏమైంది రుద్ర? ఎందుకు అలా అరుస్తున్నావ్?" అని అడిగాడు. సామ్రాట్ కూడా "ఏమైందిరా?" అన్నాడు.
ఏం జరిగిందో పూర్తిగా చెప్పిన తర్వాత హనుమంతుడు తీవ్రంగా, "ఏంటి ఇంత త్వరగా వచ్చేస్తున్నాడు వాడు? ఇక యుద్ధానికి సిద్ధం అవ్వండి! ఇప్పుడు మీరు స్టెప్పులేసిన ఇదే పాటకు రేపు యుద్ధం చేయాలి!" అన్నాడు. "అవును రుద్ర, నువ్వు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక చిన్న ఝలక్ ఇచ్చి యుద్ధానికి సిద్ధమని చెప్పి రా," అని సూచించాడు హనుమంతుడు.
అప్పుడే అశ్వద్ధామ కూడా వచ్చి, "అవును, ఇదే కరెక్ట్. మనం యుద్ధం చేయబోయే ముందు వాళ్ళకు కచ్చితంగా మన అంగీకారం తెలియాలి. వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఎలా యుద్ధం ప్రకటించారో, మనం కూడా అలాగే వెళ్లి ప్రకటించాలి. కానీ ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళినా వాళ్ళ మానసిక శక్తి దాదాపు తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు రుద్ర మాత్రమే అక్కడికి వెళ్ళగలడు. రుద్ర మాత్రమే అక్కడ సవాలు విసిరి సంకేతం ఇచ్చి తిరిగి రాగలడు," అని వివరించాడు.
అప్పుడే పరశురాముడు కూడా అక్కడ ప్రత్యక్షమై, "అవును, రుద్ర," అన్నాడు. పరశురాముడిని చూడగానే సామ్రాట్ నమస్కరించాడు. అందరూ అలాగే చేశారు. రుద్ర కూడా అదే విధంగా చేస్తూ, "ఏంటి, ఇంత గొప్ప గొప్ప యోధులు ఉండగా నన్ను అక్కడికి పంపించడం ఎందుకు? మీరు ఒక్కసారి అక్కడికి వెళితే తునాతునకల్ చేసి వస్తారు కదా?" అని అడిగాడు. అందరూ అవునన్నట్టు చూశారు. కానీ అక్కడ ఉన్న అశ్వద్ధామ, హనుమంతుడు, పరశురాముడు మాత్రం వాళ్ళందరినీ విచిత్రంగా చూశారు.
ఆ ముగ్గురూ ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. "ఏంటి, మేము వెళ్ళితే అంతం చేస్తాం, కానీ మేము ఎప్పుడన్నా యుద్ధం చేసింది చూశారా? ఒక యుద్ధరంగంలో మేము యుద్ధం చేసింది చూశారా?" అని గట్టిగా అడిగారు. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. "కానీ నేను అశ్వద్ధామను చూశాను కదా," అన్నాడు రుద్ర. అశ్వద్ధామ చిరునవ్వు నవ్వి, "అది నా మాట కోసం యుద్ధం చేశాను, లేదంటే మేము ఎవరూ యుద్ధం చేయము. మా అవసరాలకు చేశాం."
హనుమంతుడు మాట్లాడుతూ, "నేను యుద్ధంలో దిగాను, ఎంతమందిని చంపాను, కానీ ఒక ఆధిపత్యాన్ని అంతమొందించాను. అటుపక్క ఉన్న రాజును నేను చంపలేదు. నేను రామాయణంలో ఉన్నప్పుడు శ్రీరాముడు కి కాలనప్పుడు , నేను సహాయం చేశాను.అలాగే మహాభారతం లో నేను జెండాలలో నా శక్తిని నింపి ఉన్నాను కానీ యుద్ధం చేయలేదు. ఎందుకంటే యుద్ధం చేయాలంటే ఎవరినైతే నియమిస్తారో ఆ కాలానికి సరిపడే వాళ్ళు మాత్రమే యుద్ధం చేయాలి. మేము వాళ్లకు సహాయంగా మాత్రమే ఉంటాం."
ఇక పరశురాముడు మాట్లాడుతూ, "నేను కూడా అలాగే చేసి ఇప్పుడు ఈ కలియుగం అంతం వరకు ఇలాగే ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు చేసిన యుద్ధకాండ వల్లే మళ్ళీ అటువంటి తప్పు చేయాలనుకోలేదు. చూశారా, యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు కలియుగానికి అంతం వరకు ఉన్నారు. అర్థమవుతుందా?" అని ముగ్గురూ మరోసారి గట్టిగా నొక్కి చెప్పారు.
అలా కట్ చేస్తే, అందరూ తలదించుకున్నారు. తాము ఎంత పెద్ద తప్పు చేశారో వారికి అర్థమైంది. ప్రతి ఒక్కటి నిజమే. యుద్ధంలో దిగారు, కానీ ఆధిపతులను చంపలేదు. న్యాయం కోసం అలా పోరాడిన ప్రతి ఒక్కరూ కలియుగాంతం వరకు వేచి ఉన్నారు అని అందరూ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వారి తదుపరి పని ఏంటో వారికి అర్థమైంది – ఈ ఐదుగురు మాత్రమే తమ శక్తిని ఉపయోగించి యుద్ధం గెలవాలి అని అర్థం చేసుకున్నారు. చివరిలో ఎవరో ఒకరు సహాయం చేస్తారని నమ్మకంతో వారు ఆ యుద్ధానికి సిద్ధమయ్యారు.
రుద్ర కూడా "సరే, వెళ్తాను అక్కడికి. నేనే వెళ్తా, వాళ్ళ అంతు చూస్తా," అన్నాడు. హనుమంతుడు చిరునవ్వుతో, "చూడు, అక్కడ అంతు చూడటానికి కొరకడాలు ఏమీ లేవు," అన్నాడు. "సరే, నేను చెప్పింది మాత్రం చెయ్యి. అక్కడికి వెళ్ళు. వాళ్ళతో ఎలా మాట్లాడాలంటే వాళ్లకు పిచ్చి కోపం రావాలి. మన మీద దృష్టి పెట్టడం ఆపి వాళ్ళ యుద్ధంలో ఎలా గెలవాలి అని ఆలోచించాలి. మన మీద దృష్టి ఉండకూడదు," అని చెప్పాడు హనుమంతుడు. అశ్వద్ధామ, "హనుమా, నువ్వు ఇలా చెప్పడం బాగానే ఉంది. అక్కడున్నది శకుని! ఆలోచనలకు అమ్మ మొగుడు లాంటివాడు. అలాంటి వాడిని రుద్ర తప్పించగలడు అంటావా?" అని అనుమానం వ్యక్తం చేశాడు.