నాన్న చాలా మంచి వాడు.. చిన్నపటి నుంచి మమల్ని ఎంతో ప్రేమ గా పెంచాడు.
మేము ఏమి అడిగిన..
కాదు అనకుండా తనకు వున్న దాంట్లో మమ్మల్ని ప్రేమ గా చూసుకొనే వాడు.
ప్రతి పండుగకు అక్కకు,నాకు కొత్త బట్టలు కొనిచేవాడు.
మా అన్నలు ,అక్కలతో పోలిస్తే మా జీవితాలు చాలా మంచిగా వుండేవి.
కానీ నాన్న కొంచం మా భవిషత్తు గురించి భయ పడ్డాడు.
అందుకే నాన్న అక్కను పనికి పెట్టాడు.
అక్క కూడా నాన్న మాటకు అడ్డు చెప్పకుండా పనికి వెళ్ళేది.
అక్క కూడా తెలుసు ..మాకు ఒక అన్న వుంటే నాన్న కు బరువు బాధ్యతలలో తోడుగా వుండే వాడు అని..
అందుకే నాన్నకు కొడుకు లేకున్నా నేనే పెద్ద కొడుకును అయ్యి తనకు సాయం చేయాలి అని అక్క అనుకొని ...పనికి వెళ్ళేది.
అప్పుడు అక్కకు కేవలం 13ఏళ్లు మాత్రమే అయిన పేద్దవారికి సమానంగా పని చేసేది.
అక్క మగ వాడిలా ..మగ వారికి సమానంగా పని చేసేది.
అందరు అక్కని.. పని బాగా.. చాలా మంచిగా చేస్తుంది అని మెచ్చుకొనే వారు.
ఎండాకాలం అంతా అక్క పనికి వెళ్ళింది.
ఇంతలో వర్షాకాలం వచ్చింది.
నాన్న.. నన్ను ,అక్కను అదే వూరిలో వున్న .. ప్రాథమిక పాఠశాలలో నన్ను..
అలాగే అక్కను సెకండరీ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేశాడు.
అప్పుడు నేను మూడో తరగతి చదువుతున్నాను. అక్కను ఏడవ తరగతిలో జాయిన్ చేశాడు.
అక్క స్కూల్ నా స్కూల్ పక్క పక్కనే వున్నాయి.
స్కూల్ బాగానే ఉంది కానీ నాకు అందరితో సర్దుకోవడానికి కొంచెం టైం పట్టింది.
కొత్త వాతావరణం,కొత్త టీచర్స్ ,కొత్త ఫ్రెండ్స్ .. వాళ్ళ ను అలవాటు చేసుకోవటానికి నాకు టైం పట్టింది.
మా స్కూల్ కి వచ్చే టీచర్స్ అందరు కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చే వారు.
కరీంనగర్ నుంచి ఈ వూరికి కనీసం 2 గంటలు టైం పట్టేది.
మా టీచర్స్ రోజు ఉదయం స్కూల్ కి వచ్చి మళ్ళీ సాయత్రం 4 గంటలకు వూరి నుంచి వెళ్లే బస్ లో కరీంనగర్ కి వెళ్లే వారు.
టీచర్స్ చెప్పిన అన్ని పాఠాలు నేను చక్కగా చదివేది.
అందుకే నేను తొందరగా టీచర్స్ కి ఫేవరెట్ స్టూడెంట్ అయిపోయాను.
నాకు కూడా స్కూల్ లో ఒక ఫేవరెట్ టీచర్ వుండేది.
తన పేరు సాల్మన టీచర్ ..తను అదే వూరిలో వుండేది.
తను నన్ను ఏప్పుడు ఎంకరేజ్ చేసేది. నాకు కవిత్వాలు రాయడం కూడా తనే నేర్పించింది.
నేను రాసిన మొదటి కవిత.
రామ చిలుక పచ్చన..చిగురాకు పచ్చన..
మన గ్రామాలలో పొలాలు పచ్చన..
ఎటు చూసినా పచ్చదనం నా దేశా గొప్పతనం.
తను ఇచ్చిన ప్రోత్సాహంతో ఒక సాంగ్ కూడా రాశాను.
ఆ పాటను అందరి ముందు క్లాసులో పాడాను అందరూ చప్పట్లు కొట్టారు.
ఒక్కరోజు కూడా స్కూల్ మానేయకుండా ప్రతి రోజూ వెళ్ళేదాన్ని.
ఇటు పక్క అక్క కూడా చదువులో బాగా వుండేది.
తను కూడా చాలాబాగా చదివేది.
నేను స్కూల్ లేని టైం లో అమ్మ వాళ్ళతో పని దగ్గరికి వెళ్లి అక్కడ ఆడుకునే దానిని.
కానీ అక్క మాత్రము స్కూల్ లేని టైం లో అమ్మ వాళ్ళతో కలిసి పని చేసేది.
ఒక రోజు మా స్కూల్లో సైన్స్ కాంపిటేషన్ జరిగింది.
అందుకోసం నేను తర్మకొల్ తో మూత్రపిండ వ్యవస్థను రాత్రి అంతా కూర్చుని తయారు చేశాను.
నాన్న నన్ను చూసి చిన్న బుజ్జికి చదువు మీద చాలా ఇష్టం వుంది .
తనను మాత్రము "తను ఎంత చదివితే అంతా వరకు చదివించాలి "అని నాన్న అమ్మతో చెప్పాడు.
నేను పడిన కష్టానికి నాకు
అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
నేను ఆ బహుమతి తీసుకొని వెళ్ళి నాన్నకు చూపించాను.
నాన్న కూడా చాలా సంతోచించాడు.
ప్రతి రోజూ స్కూల్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్లి గేటు బయటనే కూర్చునే వాళ్ళం.
లోపలికి వెళ్లాలంటే మాకు భయంగా ఉండేది. అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాతే లోపలికి వెళ్ళే వాళ్లము.
వాళ్లూ వచ్చే వరకు బయట కూర్చొని హోంవర్క్ రాసుకునే వాళ్ళము.
ఆ ఇంట్లో పిల్లలం కనీసం 5గురం వుండేవాళ్ళు కానీ అక్క నేను మాత్రమే స్కూల్ కి వెళ్ళేది.
అక్క కూడా తన క్లాస్ వాళ్లతో చాలా కలిసి పోయేది.
అక్క క్లాస్ లో ఒక అమ్మాయి తో తనకు స్నేహం బాగా కుదిరింది.
తను మేము వున్న ఇంటి వెనుక భాగం లోనే వాళ్ళ ఇల్లు కూడా వుండేది.
ప్రపంచంలో కేవలం చదువు మరియు స్నేహం మాత్రమే కులం, మతము ,డబ్బు అనే తేడా లేకుండా దొరుకుతుంది.
అక్క వాళ్ళ ఫ్రెండ్ పేరు మానస.
మేము వాళ్ల ఇంటికి టీవీ చూడ్డానికి వెళ్లే వాళ్లము.
కానీ వాళ్ల చిన్న తమ్ముడు మమ్మల్ని లోపలికి రానిచ్చేవాడు కాదు.
తనకి 10ఏళ్లు మాత్రమే వుంటాయి. కానీ చాలా పొగరుగా వుండే వాడు.
వాళ్ల అమ్మ నాన్న అలా చెయ్యకూడదు అనీ ఎంత బెదిరించిన అతను అస్సలు వినకపోయేది.
మా వల్లనా అతని వాళ్ళ పెద్ద అన్న చాలా సార్లు అతడిని కొట్టాడు.
దానితో ఇంక మా మీద కోపం పెంచుకున్నాడు.
వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరు వుంటేనే రాత్రి సమయంలో కాసేపు టీవీ చూసి వచేవాళ్ళం.
మేము ఉంటున్న ఇల్లు చాలా పాతది కాబట్టి. ఇంటి చుట్టుపక్కల చాలా చెట్లపొదలు ఉండేవి.
దానితో ఇంటి చుట్టూ చాలా పెద్ద పెద్ద పాములు ఉండేవి.
ఒకరోజు రాత్రి చాలా పెద్ద నాగుపాము కోళ్ల గూడు లోపలికి వచ్చి ..ఒక కోడిని కరిచి, కోడిగుడ్డును తిని అందులోనే పడుకుంది.
ఆ ఇంటి మొత్తంలో ఒక బల్బు మాత్రమే వుండేది.
ఆ బల్బు కూడా బయట వరండాలోకి మళ్ళీ రూంలోకి వెళ్తూరు వచ్చేలా వుండేది.
అంత పెద్ద ఇంట్లో ఆ ఒక బల్బు వెల్తురు సరిపోయేది కాదు.
అందుకే చీకటికి , కోళ్ల వాసనకి పాము లోపటికి వచ్చింది.
పామును చూసి మిగితా కోడి పిల్లలు అరుస్తున్నాయి.
మేము అందరం ఆ టైం కి ఇంక పడుకోలేదు .
కోళ్ళు సౌండ్ చేస్తున్నాయి అని నాన్న కు అనుమానం వచ్చి ఫోన్ లైట్ పట్టుకొని కోళ్ల గూడు దగ్గరికి వచ్చి చూసాడు.
అప్పుడు అందులో ఒక పెద్ద నాగుపాము పడుకొని వుంది.
నాన్న ఇంక మిగితా వాళ్ళు అందరు వచ్చి ..ఒక పెద్ద కట్టే పట్టుకొని వచ్చి దానిని అక్కడే చెప్పేశారు.
అలాగే ఒక రోజు అందరము లోపల చాలా వేడిగా వుంది అని బయట పక్కవేసుకొని పడుకున్నప్పుడు..
ఒక పాము మా మామయ్య కాలు మీద నుంచి వెళ్లిపోయింది.
ఓక్క సారిగా మామమ్య" పాము పాము" అంటూ అరుస్తున్నాడు.
దానితో అందరం మంచి నిద్రలో వున్న వాళ్ళము ఒకసారిగా లేచి అరవడం మెదలు పెట్టాము.
బయట అంతా చిమ్మ చీకటి ఎవరికీ ఏమి కనిపిస్తాలేదు.
దేవుడి దయ వల్లనా ఎవరికీ ఏమీ కాలేదు.
దాంతో మేము అప్పటినుంచి బయట ఎప్పుడూ పడుకోకుండా లోపలే ఒక లైట్ పెట్టుకొని పడుకునేవాళ్ళం.
కానీ మాకు ఎప్పుడూ భయంగానే ఉండేది — ఎప్పుడు ఏ పాము ఎలా వస్తుందో అని.
మేముంటున్న ఇంటి దగ్గరలో ఒక బావిలో పెద్ద పాము పడి, బయటికి రాలేక చాలా రోజుల తర్వాత అందులోనే చనిపోయింది.
మేము వున్న ప్లేసులో చాలా సార్లు మాకు పెద్ద పెద్ద పాములు కనిపించేది.
కానీ మా కుల దేవత ఎల్లమ్మ తల్లి దయ వల్లనా మాకు ఎలాంటి హాని జరగలేదు.
ఇక్కడ పని బాగా నడిచి డబ్బులు రావడం తో నాన్న మమల్ని తిరుపతి కి తీసుకొని వెళ్ళాడు.
అమ్మ నాన్న నేను అక్క 4గురం తిరుపతి కి మా వూరు మహబూబాబాద్ నుంచి ట్రెయిన్ లో తిరుపతి కి వెళ్ళాము.
మొదటి సారిగా మేము అక్కడకి వెళ్ళాము ..నాకు చాలా సంతోషం గా అనిపించింది.
ఆ నారాయణుని దర్శనం బాగా చేసుకున్నాము ..అక్కడ లడ్డూలు కొనుకున్నము..ఆ లడ్డూలు చాలా తియ్యగా అమృతం లా వున్నాయి.
అమ్మ నాకు ఒక టెడ్డి బేర్ బొమ్మ కొనిచింది.
నేను మొదటి సారి తిరుపతి వెళ్లిన గుర్తుగా ఆ బొమ్మ చాలా రోజులు నా దగ్గరే జాగర్తగా దాచుకున్న.
అక్కడ మేము ఒక ఫోటో కూడా దిగాము.కానీ ఫోటో స్టూడియో అతను ఆ ఫోటోను వెంటనే ఇయ్యలేదు.
"ఇంకా ఫోటో రెడీ కాలేదు మీ అడ్రస్ ఇవ్వండి నేను ఆ అడ్రస్ కి పోస్టులో పంపిస్తాను" అని చెప్పాడు.
నాన్నకు అతని నమ్మలా వద్దా అని అనుమానం అనిపించింది.
అయినా ఆ దేవుడి మీద నమ్మకము వుంచి ..అతనికి డబ్బులు అన్ని ఇచ్చి మా అడ్రస్ రాసిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాము.
తిరుపతి నుంచి మా వూరికి వెళ్లి అక్కడి నుంచి మళ్ళీ పని జరిగే చోటుకు వచ్చాము.
కొన్ని రోజుల తరువాత మా సొంత ఇంటికి మేము తిరుపతిలో దిగిన ఫోటోలు పోస్టులో మా ఇంటికి వచ్చాయి.
కనీసం మేము ఒక రెండున్నర సంవత్సరాల వరకు పని జరిగే చోటనే ఇక్కడే ఉన్నాము. ఆ పని ఇక్కడ రెండున్నర ఏళ్లు జరిగింది.
ఇక్కడ పని చేసిన డబ్బుల తోనే నాన్న ఒక సెకండ్ హాండ్ ట్రాక్టర్ తీసుకున్నాడు.
ట్రాక్టర్ మాకు చాలా బాగా కలిసి వచ్చింది.
ట్రాక్టర్ ను నాన్న ఇక్కడ రోడ్డుకు వాటర్ కొట్టటానికి ట్యాంకర్ లాగా ఎంగేజ్ కు పెట్టాడు.
నెలకు మాకు పది వేల నుంచి 15 వేలు వచ్చేది.
ఇలా వచ్చిన డబ్బులతో నాన్న కరీంనగర్ లో ఒక ప్లాట్ ను ఒక లక్ష రూపాయలు పెట్టు గుంట భూమి కొన్నాడు.
కొంచం కొంచం గా మేము డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాము.
కానీ నాన్న మందు బాగా తాగినప్పుడు అమ్మతో గొడవ చేసేవాడు.
మా నాన్న కోపం లో ఎన్నో రేడియో లు పగల గొట్టాడు ...మళ్ళీ కొన్ని రోజులకు కొత్త రేడియో తెచ్చుకొనే వాడు.
నాన్న కు రేడియో లేకపోతే మనసున పట్టేది కాదు.
ఎందుకంటె మన దేశం లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది..రేడియో లో వార్తలు విని తెలుసుకొనే వాడు.
ఇంక వుంది..