Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మొక్కజొన్న చేను తో ముచ్చట్లు - 24

వర్షం పడిన మరుసటి రోజు...తెల్లవారు జామున మబ్బులను దాటుకొని సూర్యడు ఎరుపు వర్ణం లో వస్తున్నాడు..

సూర్యుడి వెలుతురుకి పక్షులు వాటి గూటి నుంచి బయటి వచ్చి సూర్యునికి  ఎదురుగా ఎగురుకుంటూ పోతున్నాయి..

వర్షం పడడం తో ఈ ప్రాంతం అంత మట్టి వాసనతో నిండిపోయింది.

ఇన్ని రోజులు వర్షానికి... నీటి తాకిడికి దూరమైన చెట్లు అన్ని వర్షం నీటి తో ఊపిరి పీల్చుకున్నాయి.

ఊరిలోని జనం అంతా తెల్లవారు జామునే నిద్ర లేచి ...వారి ఇంటి  పనులు చక్క పెట్టుతున్నారు.

ఉదయం 8 గంటలు కాగానే అందరు...విత్తనాలతో చెలకల లోనికి బయలు దేరారు.

నా చుట్టుపక్కల చెలకాలో కొందరు పత్తిని,కొందరు మొక్కజొన్నాను వేస్తున్నారు.

ఇన్ని రోజులు జనం అంత వూరిలో కనిపించే వారు కానీ ఇప్పుడూ జనం అంతా చేలకాలో కనిపిస్తున్నారు.

ప్రతి ఒక చెలకలొ మనషులు కనిపిస్తున్నారు...

ఈ దృశ్యం చూడటానికి "భూమి తల్లి "జాతర గా చెప్పుకోవచ్చు.

మా రాము వాళ్ళు కూడా నాకు కొంచం దూరం లో పత్తి గింజలు పెడుతున్నారు.

ఈ టైం లో అస్సలు కూలీ  చేసే వారే దొరకరు..

దొరికిన వారితోనే సరిపెట్టుకొని విత్తనాలు వేస్తుంటారు.

మామూలుగా అయితే ఒకరికి కూలీ రోజు కు 300 కానీ ఈ టైం కి విత్తనం వేస్తే ...విత్తనం పట్టి కూలీ పెరుగుతుంది.

ఒక పక్క దున్నే ట్రాక్టర్ సౌండ్స్ మరో పక్క విత్తనం వేసే  ఎద్దుల నాగలి సాళ్ళూ..ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.

నిన్న పడిన వానకు వాతావరణం చల్లగా వుండేసరికి నాకు మత్తుగా నిద్ర వస్తుంది అని.. ఇక కాసేపు అలా తలవార్చాను.

కాసేపు అలా తలవార్చనో లేదో ఇంతలో నా చెవిని ఎవరో తింటున్నట్టు అనిపిస్తుంది. 

ఎవరు నా చెవిని తినేది అని కళ్ళు తెరిచి చూడగా ..

నా ప్రాణాన్ని కొద్ది కొద్దిగా తింటూ.. తీసే పచ్చ  పురుగు వీడు..

నేను పుట్టి పది రోజులు కావడంతో నేను తినడానికి తియ్యగా ఉంటాను అని వాడు నన్ను తినటానికి వచ్చాడు.

వాణి ఫ్యామిలీతో వచ్చి నా ఫ్యామిలీని నాశనం చేస్తున్నాడు. 

కొంచెం కొంచెంగా రోజుకింత నా చేతులు, ముక్కు ,చెవి అన్ని ఒకటి ఒకటిగా తింటున్నాడు. 

నేను కొంచెం కొంచెంగా చావుకి దగ్గరవుతున్న అనిపిస్తుంది.

కొన్ని రోజుల తర్వాత మా రాము  నా దగ్గరికి వచ్చి చూశాడు.

నా దగ్గరకు వచ్చి చూసి నా కడుపు లోపల  వున్న పురుగును  బయటకు తీశాడు. 

నువ్వు ఎప్పుడు వచ్చావ్ ...నేను చూడక ముందు వచ్చి నా మొక్కను తిని...మళ్ళీ ఎండ కాగానే లోపలికి వెళ్ళి పడుకుంటున్నావా..

నా పంటను అంతా నాశనం చేస్తున్నారు..రేపు చెబుతా ఆగు మీ పని అనీ...వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు ఉదయాన్నే 8 గంటల వరకు భుజాన మందు కొట్టే పంపు వేసుకొని  నా దగ్గరకు బయలుదేరాడు.

చావు బతుకుల మధ్య వున్న నాకు తనని చూడగానే ప్రాణం లేచి వచ్చింది.

తన  పంపు లో 20 లీటరు లా నీళ్లు పోసుకుని అందులో నన్ను తినే పురుగులు చనిపోయే మందు,అలాగే నేను పచ్చగా రావటానికి ఒక మందు అన్ని కలిపిన పంపు భుజాన  వేసుకొని నెమ్మది నెమ్మదిగా మాకు మందు కొట్టుకుంటూ వస్తున్నాడు.

తను కొట్టే మందు పవర్ కి ఆ పురుగులు విల విలా లాడుతున్నాయి.

కాసేపు తరువాత చనిపోతునాయి.

అవి చనిపోవడంతో నాకు నెత్తి మీద వున్న బరువు దిగిపోయినట్టు అనిపించింది.

ఒక పంపు కొట్టిన తరువాత మా రాము భార్య బింద తో నీళ్ళు తెచ్చి పంపు లో పోస్తుంది.

రెండు బిందలకు పంపు నిండుతుంది.

పంపు నిండిన తరువాత రాముకు పంపు ఏత్తుకోవడం లో సహాయం చేస్తుంది..ఒక్కడే 20 లీటర్ల  పంపు ఎత్తుకోవడం కష్టం అవుతాది అని తను హెల్ప్ చేసింది.

కానీ ఎవరు లేని సమయంలో మా రాము ఒక్కడే ఆ పంపు ను యెత్తుకో గలాడు.

 మా రాము చెనుకు మందు కొట్టిన కొద్దీ తను బిందా తో  వాళ్ళ ఇంటి దగ్గర  నుంచి నీళ్ళు తెచ్చి పోస్తుంది.

కనీసం ఒక ఎకరం చేనుకు 10 పంపుల మందు పడుతుంది.

ఇప్పటి వరకు కనీసం 8 పంపుల మందు కొట్టాడు..

ఈరోజు వాతావరణం చల్లగా వుంది కాబట్టి ఉదయం 8 నుంచి మధ్యానం 2 గంటల వరకు కొడుతున్నాడు.

ఇంకో రెండు పంపు లు అవుతే అయిపోతుంది.

ఉదయం నుంచి మందు కొట్టి తన భుజాలు నొప్పిగా ఉన్నాయి అనుకుంట .. నాకు మందు కొట్టాలి అనీ మధ్యానం అన్నం కూడా ఇంక తినలేదు..దానితో ఇంక నీరసంగా అయిపోయాడు.

తన నిరాశని రాము భార్య తనతో పాటు నడుచుకుంటూ...తనతో  ప్రేమగా మాట్లాడుతూ..తనను నవిస్తూ..రాముకు ఉత్సాహం వచ్చేలా చేసి మిగితా రెండు పంపు లు కూడా కొట్టేలా చేసింది.

మందు కొట్టడం అయిపోయిన తరువాత వెంటనే ఇంటికి  వెళ్లి  స్నానం చేసి అన్నం తిని మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు.

నేను కొట్టిన పురుగుల మందు పని చేస్తుందా లేదా..

అని..

నా చుట్టూ వున్న పచ్చ పురుగులు మందు వాసనకు ప్రాణ భయం తో వేరే చేలాక వైపుగా పరుగెత్తుతునాయి.

కానీ అవి ఎంత ప్రయత్నించినా నా చెలక లోనే ప్రాణం వదిలాయి.

చనిపోయి వున్న పురుగులను చూసిన తరువాత రాము మనసు కుదుట పడింది.

ఎందుకంటే పురుగులకు కొట్టిన మందుకు అయిన ఖర్చు 1000 రూపాయలు.

పురుగులు చనిపోక పోతే వేయి రూపాయిలు వృధా అయిపోయేవి.


ఇంక వుంది...