Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మొక్కజొన్న చేను తో ముచ్చట్లు - 2

మొక్కజొన్న విత్తనం  వేసిన 7 వ రోజు ..

ఉదయం 5 గంటలు అవుతుంది..అప్పుడే కొంచం కొంచం గా తెల్లవారుతుంది ..

ఇది ఎండాకాలం "రోణి తిధి" చివరి రోజులు కాబట్టి కొంచెం కొంచెంగా  మసగా మాసగా అయిదు గంటలకే తెల్లవారుతుంది. 

కొంచెం కొంచెంగా  ఇప్పుడే నేను పైకి వస్తున్నా..

మొన్న 3 రోజుల కిందట  రాము కట్టిన నీటి తడి నాకు సరిపోయింది .

అది నేను పెరగడానికి ఉపయోగపడింది. 

"నేను మట్టిలోంచి బయటికి రావాలని చూస్తుంటే"..

'నువ్వు ఎలా వస్తావో నేను చూస్తాను అంటూ' నా పైన ఉన్న ఒక మట్టి పెడ్డ నన్ను అపాలని చూసింది.

కానీ నేను ఊరుకుంటానా! తనను రెండు ముక్కలుగా  చేస్తూ మరి.. బయటికి వచ్చాను. 

బయటికి వచ్చి చూస్తే ..చుట్టూ ఎవరూ లేరు.

అన్ని విత్తనం వేయడం కోసం రెడీగా ఉన్నా చెలకలు కనిపిస్తున్నాయి.

కొంచెం దూరంలో ఇల్లులు ఉన్నాయి .

నా వెనుక భాగం లో వూరు వుంది . నా కుడి వైపు మరియు ముందు భాగంలో ఊరు నుంచి చెలకాలకు వెళ్ళటానికి ట్రాక్టర్ పోయింతా దారి వుంది.

నా కింద పక్క మరియు ఎడమ పక్క దున్ని విత్తనం వెయ్యటానికి తయారుచేసిన చెలక వుంది.

దారికి ఆటు ఇటు కూడా  అన్ని చెలకాలే.. నా కను చూపు మేర మొత్తం దుక్కులు కనిపిస్తున్నాయి.

నేనున్న చెలకలో కుడి పక్కన దారికి అనుకొని   నాలుగు టేకు చెట్టు ఉన్నాయి .

ఆ చెట్లపై పడుకున్న  పిచ్చుకలు పిచ్చుకు పిచ్చుకు  మంటూ శబ్దాలు చేస్తున్నాయి.

తెల్లవారు జామున కాబట్టి ఈ ప్రాంతం అంత చాలా నిశ్శబ్దం గా వుంది..కేవలం పిట్టలు అరుపులు,చిన్న చిన్న పురుగుల శబ్ధాలు,దూరంగా వూళ్ళో నుంచి కోడి కూతలు వినిపిస్తున్నాయి.

ఈ కాలము రుతుపవనాలు వచ్చే సమయం కాబట్టి ఈదురు గాలులు వేగంగా వీస్తున్నాయి.

ఆ గాలి వేగానికి నేను అటు ఇటు ఊగుతున్నాను.

 ఏవరో ఒక పెద్ద మనిషి అటుగా నడుచుకుంటూ దారి వైపుగా వచ్చాడు.

నన్ను చూశాడు ..కానీ !నన్ను పలకరించలేదు. 

అయ్యో !నేను ఇప్పుడే వచ్చాను కదా .."నన్ను చూసి కూడా పలకరించకుండా పోతున్నాడు" అని, నాకు చాలా బాధగా అనిపించింది.

ఇంతలో కొంచెం దూరంలో  ఇల్లులా మధ్య నుంచి ఒక బైక్ శబ్దం వినిపించింది.

నేను వెనుకకు తిరిగి చూడగానే..   పల్సర్ బైక్   వేసుకొని  ఒక అబ్బాయి  నా పక్కన వున్న దారి నుంచి నా ముందు దారి వైపుగా వస్తున్నాడు.

నడుచుకుంటూ వెళ్లే వాళ్ళే నన్ను చూసి పలకరిస్త లేరు.

ఇతను బండి మీద వస్తున్నాడు 'నన్ను మందలిస్తారా 'అనుకుంటూ.. తల దించుకున్నాను.

ఇంతలో నన్ను చూసి బైక్ ఆపాడు.

 అతడు 25 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉంటాడు.

బైక్ కి  ఒక పక్క పాల క్యాన్ తాకీచుకున్నాడు.

బైక్ దిగి నా దగ్గరికి వచ్చాడు వచ్చి ఇలా అన్నాడు..." ఇప్పుడే బయటికి  వచ్చావా !

మొన్న కట్టిన నీళ్లు నీకు చాలా బాగా పనిచేశాయి.. 

నాకు చాలా సంతోషంగా ఉంది నీకు మళ్ళీ ఇంకో పదన కట్టాల్సి వస్తది.. అనుకున్నాను.

కానీ నువ్వు ఒక్క పదనకే బయటికి వచ్చావు".

నీ సోదరులను కూడా బయటికి రమ్మని చెప్పు నేను ఇంతలో ఆవు దగ్గరికి వెళ్లి పాలు పిండుకొని వస్తాను అని,   బైక్ వేసుకొని వెళ్లాడు. 

తన మాట్లాడిన ఆ మాటలు నా మనసుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి .

తలదించుకున్న నేను వెంటనే తల ఎత్తి నిలుచున్నాను. 

ఇంతలో చెట్ల మధ్యలో నుంచి కొద్దికొద్దిగా మబ్బుల చాటు నుంచి సూర్యుడు వస్తున్నాడు.

ఆ వెలుతురికి నా సహోదరులు అందరూ ఒకటి ఒకటిగా బయటికి వచ్చారు. 

కానీ కొన్ని మొక్కలు పెద్దపెద్ద మట్టి పెడ్డలు వాళ్ల మీద వుండడం తో  వారు తొందరగా బయటికి రాలేకపోయారు.

కొద్దికొద్దిగా మొత్తం తెల్లవారింది.. నా చుట్టూ ఉన్న ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది అన్ని నా ముందు వెనుక ఉన్న చెలకలు అన్ని విత్తనానికి సిద్ధంగా ఉన్నాయి.

ఏ చెలకలు కూడా ఇంకా ఎవరూ విత్తనం వెయ్యలేదు .

మా రాము మాత్రమే త్వరగా విత్తనం వేశాడనుకుంటాను.

ఈ రొణి తిధి లో పంట వేస్తే బాగా వస్తుంది అని రైతు నమ్మకం...

మేము వున్న చేలకలో ఒక గడ్డి చెట్టు కూడా లేదు..

కనీసం ఒక కట్టే పుల్ల కూడ లేదు...భూమి తల్లిని ఎర్ర మట్టితో అందగా అలికినట్టు వుంది...

అందుకే నేను ఏ అడ్డు లేకుండా త్వరగా బయటికి వచ్చాను.

పాలు పిండటానికి వెళ్లి వచ్చిన రాము ..మళ్ళీ ఇంటి వైపుగా వెళ్లాడు.

ఇంతలో నేను నా చుట్టూ వున్న ప్రకృతి అందాల్ని చూస్తూ వున్నాను ..ఈ ప్రాంతం నాకు బాగా నచ్చింది.

పిచ్చుకలు శబ్ధాలు...రామ చిలుకలు పలుకులు..ఆవు దూడల పిలుపులు.. నా మనసును పులకరించేలా చేశాయి.

చూస్తూనే ..సమయం 9 అవుతుంది .

ఇందులో  కొందరు మహిళలు ఇటు గా వస్తున్నారు.

చేతిలో అన్నం బాక్సలు పట్టుకొని నాచెలక పక్క దారి నుంచి నా వైపుగా వస్తున్నారు . ఆ మహిళలు పని కోసం కూలికి వెళ్లే అడవారు.

వాళ్ళు నన్ను చూసి ఇలా అనుకుంటున్నారు .

"రాము ఏప్పటి లాగానే ఈప్పుడు కూడా మొక్కజొన్న చేను  విత్తనం త్వరగానే వేసాడు" అనుకుంటూ వెళ్తున్నారు...

అంటే! మా రాము ఎప్పుడు  ఈ టైం లోనే పంట వేస్తాడు అనుకుంటాను.

కానీ ఈ టైం లో  పంట వేస్తే ఒకసారి మంచిగా వస్తుంది ..ఒకసారి రాదు..

ఎందుకంటే ఈ సమయంలో వర్షాలు పడుతే బాగా పడుతాయి.. ఒకోసారి అస్సలు పడవు.

"కానీ రైతు కాలం ఎలా వున్న..వర్షం పడిన పడకున్న.. తన పని తను వెనుక అడుగు వెయ్యకుండా.. చేసుకుంటూ పోతాడు."

మరి మా రాము వర్షాలు లేకున్నా నన్ను  వేసాడు అంటే  తనకి 'బావి' వుంది అనీ ధైర్యం.

కానీ బావి లేని రైతల పరిస్థితి ఏంటి.. వర్షానీ నమ్ముకొని వారు పంటలు వేస్తారు.

కానీ సమయనుగుణగా వానలు పడక పోతే వాళ్ళు  వేసిన పంట చేతికి రాదు ..

రైతుకు బతికించడం తప్ప బతకడం తెలియదు.

ఇదేంటి రైతు గురించి ఆలోచిస్తూ వుండగానే మధ్యానం అయిందా..

సూర్యుడు నా నెత్తి మీదకు వచ్చి దంచికొడుతున్నాడు.

ఓహ్ భానూడ..నువ్వు భగ భగ మండకు.. నేను ఈరోజే బయటకు వచ్చాను ..నీ వేడిని నేను తట్టుకోలేక పోతున్నాను.. 

నీ కిరణాలు మట్టి మీద పడి ఆ వేడి నా ముఖానికి తగులుతుంది ..పైన నువ్వు కింద మట్టి మీ వేడికి  నేను ముడుచుకు పోతున్నాను.

ఇంతలో అటుగా మా రాము భుజం మీద పారా పట్టుకొని నేత్తికి తల పాక కట్టుకొని నా చేలక వైపు గా వస్తున్నాడు.

వస్తునే! నన్ను చూసి...అయ్యో ఈ ఎండ పాడు గాను ఎండ కు  నా చేను అత్త ఒళ్ళిపోతుంది.

అనుకుంటూ..బావి వైపుగా అడుగులు వేసాడు.

బావి దగ్గరకు వెళ్ళి మోటార్ పెట్టాడు...బావి నా చెలకుకు దగ్గరిగానే వుంది.

బావి దగ్గరి నుంచి ఒక కాలువ ..నీళ్లు వచ్చేలా  చెలకలకు వుంది.

మోటార్ పెట్టీ.. నీళ్లు ఏక్కడ ఆగకుంటా..అడ్డు వచ్చే చిన్నచిన్న చెట్టు కొమ్మలను పారా తో నరుకుకుంటూ .. నీళ్ళలో అడ్డుగా వచ్చే చెత్తను తీసుకుంటూ వస్తున్నాడు..

మోటార్ నుంచి వచ్చే నీళ్లు ఎంతో వేగం తో నా వైపుగా వస్తున్నాయి..

ఆ నీళ్లు తడుపుతూ  వచ్చే మట్టి వాసనకు నా ప్రాణం లేచి వచ్చింది.

 "ఏ ప్రాణి కయిన నీరే జీవాని ఇస్తుంది కదా ఈ ధరణి లో " అనిపించింది.

మిగితా భాగం తరువాత