Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మొక్కజొన్న చేను తో ముచ్చట్లు - 23

మా రాము నాకు నీళ్లు కడుతున్న సమయం లో .. నా వెనుక నుంచి ఏదో గజ్జల శబ్దం వినిపిస్తుంది.

నేను వెనుకకు తిరిగి చూసాను .. నా వెనుక నుంచి ఒక 3 ఏళ్ల పాప నవ్వుకుంటూ ..వెనుక వస్తున్న వాళ్ళ అన్నయ్య కు దొరక కుండా పరుగెత్తుకుంటూ వస్తుంది.

"ఆగు చెల్లె "అంటూ వాళ్ళ 6 ఏళ్ల అన్న తన వెనుకే వస్తున్నాడు.

ఆ పాప తనకు దొరకకుండా  రాము దగ్గరికి పరిగెత్తుకుంటూ  వచ్చింది.

ఆ పాప చూడటనికి చాలా అందంగా ఉంది. "చిన్నచిన్న కనులు , గుండ్రటి మొఖము ..నల్లటి కురులతో .."ముద్దుగుమ్మలా ఉంది.

ఆ పిల్లలు "డాడీ" అంటూ రాము దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు.

అప్పటికే సమయం సాయత్రం 4 గంటలు అవుతుంది.కానీ ఎండ ఇంక బాగానే కొడుతుంది.

"ఇంత ఎండలో ఎందుకు బయటికి వచ్చారు మిమ్మల్ని ఇంటి దగ్గర ఉండమని చెప్పాను కదా" అని రాము వాళ్ళని బెదిరించాడు.

"అమ్మ పిలుస్తుంటే ఆగకుండా చెల్లి పరిగెత్తుకుంటూ వస్తున్న డాడీ "అని రాము కొడుకు రాఘవ్ చెప్పాడు.

నా వెనక ఉన్న ఇంటి పైనుంచి ఒక ఆడ మనిషి గొంతు వినిపిస్తోంది. 

"పిల్లలు వచ్చారా బావ" అని అడుగుతుంది. "ఇంటిదగ్గర బాగా అల్లరి చేస్తున్నారు కాసేపు అక్కడే ఉంచుకో" అని చెబుతుంది.

ఆ ఇల్లు నాకు చాలా దగ్గరలో ఉంది అంటే మా రాము ఇల్లు ఇక్కడే అన్నమాట.

"సరే చూసుకుంటాను" అని రాము తనకు సమాధానం ఇచ్చాడు.

"అమ్ములు ఇక్కడే చెట్టు కింద కూర్చొని ఆడుకోండి...  నీటిలోకి రావద్దు.. చెట్లు తొక్కుతారు.. అని రాము వాళ్ళతో చెప్పాడు.

"సరే డాడీ" అంటూ బుద్ధిమంతుల చెట్టు కిందకి వెళ్లారు.

రాము పార పట్టుకుని నీళ్లు అంతట పారుతున్నాయా లేదా అని చూడడానికి కింది పక్కకు వెళ్ళాడు.

రాము ఇటు వెళ్ళగానే ఇద్దరు పిల్లలు నీళ్లలోకి వచ్చి నీళ్లతో ఆడుకుంటున్నారు.

రాము దూరం నుంచి చూస్తూ "నీళ్లలోకి రాకండి బయటే ఉండండి" అని అరుస్తున్నాడు.

కాని వాళ్ళు రాము మాట పట్టించుకోకుండా నీళ్లలో బట్టలు మొత్తం తడిచేలా ఆడుతున్నారు.

ఇంతలో రాము పాప నా సోదరుని ఒక్కరిని తొక్కేసింది కూడా.. వాడి నడుములు కూడా విరిగాయి.

ఇంకొంచెం అయితే నన్ను కూడా తొక్కేసేది. 

ఇంతలో రాము వచ్చి "మిమ్మల్ని బయటే ఆడుకోమని చెప్పాను కదా . ..నీళ్లలోకెందుకు వచ్చారు మొక్కలు అన్నీ తొక్కేస్తున్నారు...

ఈ కర్రను నువ్వేనా తొక్కేసింది అంటూ" ఆ కర్రను కొద్దిగా మట్టి పెట్టి లేపాడు.

రాము అలా అనడంతో వాళ్ల పాప ఏడుపు మొదలు పెట్టింది. 

"ఊకో ఊకో నేను ఇప్పుడేమన్నాను నీటీలో ఆడుకోవద్దు" అని చెప్పాను.

మీరు అటు ఇటు ఆడుతూ ఉంటే కర్రలు మీ కాళ్ళ కింద పడి నలిగిపోతాయి అందుకే బయట కూర్చుమని చెబుతున్నాను.

మీరు ఎండలో.. నీటిలో ఆడడం వల్ల మీకు ఎండ దెబ్బ తగులుతుంది. 

అందుకే నీడలో కూర్చోవాలి అని చెప్పాను  అనీ.. ఇలా రాము పిల్లలతో చెబుతున్నాడు.

ఇంతలో రాము భార్య వారి దగ్గరకు వచ్చింది. తన పేరు రాణి. 

"ఏమైంది బావా పిల్లలు ఏడుస్తున్నారు "అంటూ రాము దగ్గరికి వచ్చింది.

"ఒక దగ్గర అసలు ఉండడం లేదు ..అటు ఇటు  తిరుగుతున్నారు.. మొక్క జొన్న కర్రలన్నీ తొక్కుతున్నారు.. నీళ్లలో ఆడుతున్నారు.." అనీ రాము చెప్పాడు.

"చిన్నపిల్లలు కదా అలాగే చేస్తారు కానీ .. నేను నీళ్లు కడుతా కానీ ..నువ్వు వెళ్లి ఎడ్లకు, బర్రెకు గడ్డి వేయమని రాముని ఎడ్ల కొట్టం దగ్గరికి తొలింది.

"సరే నేను వెళ్తాను కానీ ..కొంచెం తొందర తొందరగా నీళ్లు కట్టు.. కరెంటు పోయే టైం అయింది "అంటూ రాము రాణికి చెప్పి  ఎడ్ల దగ్గరికి బయలుదేరాడు. 

రాము చేతులు చాలా రోజుల నుంచి కష్టం చేసి ఉండడం వల్ల తన చేతులు మొత్తం కాయలు కాసినట్టు ఉన్నారు. 

కానీ రాణి  చేతులు మాత్రం చాలా సున్నితంగా ఉన్నాయి. తనకి నీళ్లు సరిగా కట్టడానికి రావడం లేదు .తను ఇప్పుడిప్పుడే పని నేర్చుకుంటుంది అనుకుంటాను.

కొత్త కొత్త అయినా సరే తొందర తొందరగా చేలక మొత్తం నీళ్లు కట్టింది.

నీళ్లు కట్టడంతో మా ప్రాణాలు అన్ని ఎండ నుంచి బయటపడ్డాయి.

ఇలా వారం గడిచిన తర్వాత మృగశిల కార్తి వచ్చింది.

ఆ కార్తి వస్తూనే ఒక భారీ వర్షాన్ని తీసుకువచ్చింది. 

 ఎవరి  చేలక లో వాళ్ళు.. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్న సమయంలోఉరుములు మెరుపులతో కూడిన చాలా పెద్ద వాన పడుతుంది. 

వానాను సైతం లెక్కచేయకుండా మా రాము ఎడ్లను, బర్రెను  వానకు తడవకుండ కొట్టంలో కట్టేస్తున్నాడు.

కొట్టంలో వాటిని కట్టేసి ఒక చెట్టు పక్కన రాము నిలుచున్నాడు. 

భారీ వర్షం పడుతుంది... వర్షం తగ్గేదాకా రాము అక్కడే ఉన్నాడు. 

అదే వేరే పని చేసేవారైతే వర్షం పడుతుందని ఆ పని వదిలేసి ఇంటికి వస్తారు. కానీ రైతు జీవితం అలా కాదు. 

వ్యవసాయం నమ్ముకున్న రైతు .వాన అయిన.. ఎండ అయిన..

పంటను చూసుకోవాలి.. తనకు సహాయం చేసే ఎడ్లను కాపాడాలి .. తన జీవితానికి కొద్దిగా తోడ్పడే పాలు ఇచ్చే బర్రె ను చూసుకోవాలి. 

వర్షంలోనే అన్ని పనులు చూసుకొని మొత్తం వాన లో తడుచుకుంటూ నా దగ్గరికి వచ్చాడు.

భారీ వర్షం కావడంతే ఎక్కువగా వచ్చే వరద నీరు మమ్మల్ని ఎక్కడ పాడు చేస్తుందో అని  చేలకకు  గండి పెట్టాడు.

ఆ భారీ వర్షం పడే వాతావరణం చాలా భయంకరంగా ఉంది.

ఆకాశంలో ఉండే మబ్బులు నేలను తాకినట్టుగా.. అ జలధార భూమిని ముద్దాడుతూ... పైనుండి పడే వాన చినుకులు ముత్యాల  మెరిసిపోతున్నాయి.

ఆకాశంలో మెరిసే మెరుపు ఆ  చీకటి ప్రాంతాన్ని మొత్తం వెలుగులతో నింపేస్తుంది.

మెరుపు తర్వాత వచ్చే పిడుగు శబ్దం అ ప్రాంతాన్ని మొత్తం కంపింపజేస్తుంది.


వానకు వచ్చే నీటి  చినుకులు ఎంతో వేగంతో రావడంతో నా మీద పడితే నాకు రాయితో కొట్టినట్టుగా అవుతుంది.

ఒక గంట సేపు భారీ వర్షం పడింది... ఇంత భారీ వర్షం పడిన రైతుకు మాత్రం సంతోషమే.

ఎందుకంటే ఈ వర్షానికి అందరూ రైతులు చెలకా లో విత్తనాలు వేసుకుంటారు.

కొన్ని విషయాలలో ఈ వర్షం ఇబ్బంది కలిగించిన రైతుకు మాత్రం ఈ సమయంలో  మేలే చేస్తుంది.

వారి బతుకు పోరాటం సాగించడానికి  ఈ వర్షం ఒక ప్రారంభం మాత్రమే...

ఇంక వుంది