ఒక రైతు పడే కష్టాన్ని ఒక మొక్కజొన్న చేను స్వయంగా మనకు చెబుతుంది
రైతే రాజు అంటారు కానీ రైతు ఎప్పటికీ రాజు, కాడు కాలేడు.ఎందుకంటే
"ఒక ప్రాజెక్టు చేసే వ్యక్తి.. ఒక ప్రాజెక్ట్ చేసి ఒక రోజులో లక్ష రూపాయలు" సంప్రదించగలడు.
"జీతం తీసుకొనే వక్తి నెలకు పదివేల నుంచి లక్ష రూపాయలు "తీసుకుంటాడు.అది కూడా వారు నీడలో కూర్చొని ..
కానీ "రైతు ఎండనక , వానా ఆనక పని చేసి కేవలం నెలకు మూడు వేల నుంచి ఐదు వేలు మాత్రమే తీసుకుంటున్నాడు "
అది కూడా నెల నెలకు కాదు 4 నెలది కలిపి ఒకేసారి.
అలాంటి రైతు రాజు ఎలా అవుతాడు ఏప్పటికి కాలేదు .
ఈ విషయాన్నే మనం మొక్కజొన్న చేను మాటలో విందాం...
మొక్కజొన్న చేను ఇలా అంటుంది..
నన్ను నీ పొలం లో వెయ్యటానికి పదిహేను రోజుల ముందు నుండే నీ చెలకను రెడీ చేస్తావు.
ఒక వాన పడగానే ఏక్కడ మళ్ళీ పదన ఆరి పోతుందో అని ట్రాక్టర్ తెచ్చి పొలం దున్నిస్తావు.
ఆ ట్రాక్టర్ వాడు ఏమో ఎన్ని సార్లు ఫోన్ చేసిన రాడు.
అతని పని చూసుకొని నిమ్మళంగా నీ పనికి వస్తాడు.
అది కూడా నువ్వు డీజిల్ కి డబ్బులు ఇస్తేనే వస్తాడు .నువ్వు" తరువాత ఇస్తాను..జొన్నలు కొనుకోవటానికి కావాలి "అన్న కానీ వినడు.
అతని బాధ అతనిది నీ పొలం దున్నడం కోసం అతని పైసలు ఖర్చు పెడుతాడ ?
అందుకే ఎలాగో అలగా అతనికి పైసలు ఇచ్చిన తరువాత ట్రాక్టర్ తీసుకొని వస్తాడు.
అతను వచ్చిన టైంకి నీకు ఎంత పని వున్న వదిలేసి అతని తో వుంటేనే నీ చేను బాగా మంచిగా దున్నుతాడు,
లేదు అంటే అది అటు ..ఇది ఇటు.. అన్నట్టు దున్ని బయట పడుతాడు.
ఎలాగో అలాగ పని అంతా వదిలేసుకొని వచ్చి చేను దున్నిపిచ్చావు.
మళ్ళీ ఇంకోసారి దున్నాలి అంటే వాన ఎప్పూడూ పడుతదో తెలియదు.
కొన్ని రోజులు దుక్కి బాగా ఎండిన తరువాత నీ అదృష్టం బాగుండి..మళ్ళీ వాన పడింది .
వాన పడిన తరువాత ఒక రోజు ఆగి ..మళ్ళీ ట్రాక్టర్ అతనికి మళ్ళీ వెయ్యి రూపాయలు ఇచ్చి ..దగ్గర వుండీ మరీ దుక్కి దున్నిచావు.
ఇంతటితో ఆగక వర్ష కాలం మూడు సార్లు దున్నిస్తేనే గడ్డి బాగా పడదు అని ఆలోచించి..
ఇంకోసారి వాతావరణం బాగుందా లేదా చూసుకొని మళ్ళీ ట్రాక్టర్ అతనికి డబ్బులు ఇచ్చి చేలకను బాగా దున్నిచవు.
నీ అదృష్టం బాగుండి మూడు సార్లు దున్నిన .. కూడా ట్రాక్టర్ వాళ్ళు సరిగా దున్నక పోతే ఏక్కడ గడ్డి అక్కడే కూడా వుంటుంది.
మంచిగా దున్నితే ఏమి బాధ లేదు..
ఇలా నన్ను వెయ్యటానికి భూమిని మంచిగా రెడీ చేశావు.
ఈగ నీకు నచ్చిన విత్తనాలు తేవటానికి షావుకారు దగ్గరకి వెళ్ళేవు..
నీ దగ్గర డబ్బులు వుంటే డబ్బులు ఇచ్చి నా విత్తనాలు కొంటావు లేదు
అంటే షావుకారు దగ్గర అప్పు పెట్టీ విత్తనాలు తేస్తావు .
షావుకారు ఏమయినా నీకు ఊరికే ఇస్తాడా నువూ పెట్టిన అప్పుకు వడ్డీ వేస్తాడు.
అయిన పరవాలేదు అంతా ఆ మైసమ్మ తల్లి చూసుకుంటది అని దేవుడి మీద బారం వేసి ..నా పంట బాగా వస్తె షావుకారు అప్పు తీర్చేస్త అనుకొని ..నా విత్తనాలు తెస్తావు.
ఒక మంచి రోజూ చూసుకొని ఇంట్లో దేవతలకు మొక్కుకొని..కొబ్బరి కాయ కొట్టి విత్తనం వెయ్యటానికి నీ భార్యను , మీ అమ్మను తీసుకొని వస్తావు.
నీ భార్య ప్యాకేట్ లో వున్న విత్తనాలను కాసేపు ఎండలో ఆరబెడుతుంది .
ఇంతలో నీవు నీకు ఇష్టమయిన ఎడ్లను తీసుకొని.. నాగలి కట్టుకొని .. చెలక దగ్గరికి వచ్చావు.
మీ అమ్మ తెచ్చిన కుంక్కుమ బొట్టు తీసుకొని నాగలి దున్నే ఎడ్లకు పెట్టవు ..నువ్వు పెట్టుకున్నావు..అలాగే విత్తనం వేసే అందరూ పెట్టుకున్నారు.
ఏడ్లకు కట్టిన తాడును పట్టుకొని ఈగ నాగలి దున్నడం మొదలు పెట్టవు ..రెండు మూడు సాళ్ళు దున్నిన తరువాత ..ఎడ్లను ఒకసారి ఆపి.. నీ భార్య చేతుల్లో వున్న విత్తనాలను తీసుకొని ...దేవుడికి బాగా మొక్కుకుని మనసులో వేయడం మొదలు పెట్టవు.
అదేంటో కానీ నీ చేతితో వేస్తేనే "నేను బాగా పండుతాను" ..అందుకే "నాకు కూడా నువ్వు మొదలు పెడుతేనే నచ్చుతది".
రెండు సాల్లు వేసి మళ్ళీ నాగలి పట్టుకున్నావు ..
తరువాత నీ భార్య నువ్వు వేసినట్టే ..నువ్వు దున్నుకుంట్టు వెళ్తూ వుంటే తను వెనుక విత్తనం వేసుకుంటూ వస్తుంది.
ఊరికే మట్టిలే వేస్తే" నేను మొలుస్తనా " నాకు మట్టి నుంచి రావటానికి బలం కావాలి .
అందుకే మీ అమ్మ ...మీ భార్య వేసిన జొన్నలు మీద 2020 మందు అదే మీ భాషలో అడుగు పిండి వేస్తూ వస్తుంది.
విత్తనం అంతా అయిపోవటానికి మీకు సాయంత్రం అవుతుంది ..మధ్యలో కొన్ని నీలు తాగుతూ..మధ్యానం అన్నం తిని మొత్తం చెలకలో నన్ను వేయడం పూర్తి చేశారు.
రాత్రికి ఇంటికి వచ్చాక పొద్దున దాకా దుక్కిలో నడవడం వల్ల మీకు భరించలేని కాళ్ళ నొప్పులు వస్తాయి..చెప్పులు లేకుండా నడవడం వాళ్ళ అరికాళ్ళకు మట్టలు కూడా వస్తాయి ..కానీ అన్ని బరించి నన్ను మొలిపించడం కోసం మళ్ళీ పొద్దునే నా చేలక దగ్గరికి వచ్చి నీళ్లు కట్టాల..వర్షం పడుతదా అని ఆకాశం వైపు ఆశగా చూస్తూ వుంటావ్..
వర్షం వచ్చేలా కనిపించకపోతే ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పైపులు అన్ని సరి చేసుకొని కాలువను సరీ చేసుకొని నీళ్ళను కడుతావు.
నువ్వు కట్టిన నీళ్ళను నేను బాగా పిర్చుకొని 7 రోజుల తరువాత నిన్ను చూడటానికి ఒకటి ఒకటిగా బయటికి వస్తాము.
నేను బయటికి వచ్చే టైంకి బాగా వర్షం పడిన నేను బయటికి త్వరగా రాలేను.ఎండ బాగా కొట్టిన మళ్ళీ నీళ్లు కట్టాలి నాకు..
ఇవీ అన్నీ బాగా వుంటేనే నేను మొత్తoగా బయటికి వస్తాను.
నేను అన్ని అడ్డకులు దాటుకొని బయటికి వచ్చినప్పుడు ..
నీ కళ్ళలే వచ్చే సంతోషం అంతా ఇంత కాదు ..నువ్వు చూసిన చూపు నేను చనిపోయే దాకా మర్చిపోలేను .
మిగితా స్టోరీ 2 భాగం లో