Read Chitta Bramanan (The Illusion) - 3 by Suresh Josyabhatla in Telugu Crime stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

చిత్తభ్రమణం (The Illusion) - 3

Part - 3
సందేహాస్పదం (Suspicious)

భవ్య జైలు లొ ఉన్న అర్జున్ ని కలవడానికి ఓ 4 రోజులు ముందు. కోర్టు లొ అర్జున్ కేసు ను వాధించిన లాయర్ అవినాష్ ని కలవడానికి తన ఆఫీసు కి వెళుతుంది. 

అసిస్టెంట్ : సర్ ఏవరొ అమ్మాయి. పేరు భవ్య అంట మిమల్ని కలవడానికి వచ్చింది. 

లాయర్ అవినాష్ : ఎందుకు ఏంటి అని అడిగావా?

అసిస్టెంట్ : అడిగాను తాను లాయర్ విష్ణువర్ధన్ గారి జూనియర్ లాయర్ ని అని. అర్జున్ కేసు విషయమై మీతొ మాట్లాడాలని వచ్చింది అని చెప్పింది.

లాయర్ అవినాష్ : లాయర్ విష్ణువర్ధన్ గారి జూనియర్ లాయరా? లోపలి కి పంపించు.

అసిస్టెంట్ : మేడమ్ మిమల్ని సార్ రమ్మంటున్నారు.

భవ్య లోపలికి వెళుతుంది.

భవ్య : నమస్తె అండి.

లాయర్ అవినాష్ : నమస్తె కూర్చోండి. మీరు లాయర్ విష్ణువర్ధన్ గారి జూనియర్ అని చెప్పారు.

భవ్య : అవును సార్. నేను మీ దగ్గర కి వచ్చాక మీతొ ఒకసారి ఆయనకి కాల్ చేయించమన్నారు.

లాయర్ అవినాష్ : అవునా. ఒక్క నిమిషం ఇప్పుడె కాల్ చేస్తా.

భవ్య చెప్పినట్టు లాయర్ అవినాష్ ఢిల్లి లొ ఉన్న లాయర్ విష్ణువర్ధన్ కి కాల్ చేస్తాడు.

అవినాష్ : హలొ! సార్. నేను అవినాష్ ను మాట్లాడుతున్నా. 

విష్ణువర్ధన్ : హలొ! అవినాష్ ఎలా ఉన్నావు.? నా దగ్గర నుంచి వెళ్ళి సొంతంగా ప్రాక్టీసు పెట్టుకున్నాక కనీసం కాల్ కూడా చేయడం మానేసావు. నన్ను మర్చిపోయావా?

అవినాష్ : అయ్యొ సార్. అలాంటిది ఏమి లేదు. అయిన మిమల్ని నేను మర్చిపోవడమా సమస్యె లేదు. మీరు నాకు గురువు మీ వల్లె నేను ఇవాళ ఇలా ఉన్నా.

విష్ణువర్ధన్ : సరె సరె... ఆ అమ్మాయి భవ్య నా జూనియర్ లాయర్ అంతె కాదు నా ప్రాణ స్నేహితుడు సంతోష్ వర్మ కూతురు కూడా. తను ఆ అర్జున్ కేసు ని తీసుకోమని నన్ను అడిగింది. నా ప్రతినిధి గా కోర్టు లొ తనె వాధిస్తాను అంటుంది. కాబట్టి ఆ కేసు తాలుకు వివరాలు అన్ని తనకు చెప్పి చూపించు. తరువాత NOC మీద నీ సంతకం పెట్టు.

అవినాష్ : కాని సార్ ఆ కేసు నేను చూస్తున్నా.

విష్ణువర్ధన్ : నాకు తెలుసు లేవయ్యా. నిన్ను ఏం నిరుత్సాహ పరచనులే ఖంగారు పడకు నీ సంగతి నేను చూసుకుంటా.

అవినాష్ : ఆ మాట అన్నారు చాలు. ఆ అర్జున్ కేసు తాలుకు వివరాలు అన్నీ ఈ అమ్మాయి కి నేను చెబుతా. NOC కూడా ఇస్తా.

విష్ణువర్ధన్ : సరే. ఉంటాను వీలు చూసుకొని ఒకసారి ఢిల్లి కి రా. మిగిలిన విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం.

అవినాష్ : అలాగె సార్ తప్పకుండా వస్తా.

అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. లాయర్ అవినాష్ తన వద్ద ఉన్న అర్జున్ కేసు తాలుకు వివరాలు అన్నీ చెప్పి దాని ఫైల్ మరియు వీడియె కాపి ఇస్తడు. భవ్య అవన్నీ తీసుకొని ఢిల్లి లొ ఉన్న లాయర్ విష్ణువర్ధన్ వద్దకు వెళుతుంది. 

విష్ణువరధన్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి. వీడియొలొని ఒక పొరపాటును గమనిస్తాడు. 

"ఈ ఒక్కపొరపాటు చాలు హైకోర్ట లొ అపీల్ చేయడానికి. కచ్చితంగా అక్కడ అర్జున్ కి బెయల్ దొరుకె అవకాశం ఉంది " అని అంటాడు.

ఆ తరువాత భవ్య అర్జున్ ని జైల్ లొ కలిసి తన తరుపున హైకోర్టు లొ వాధించడానికి వకలత్నామా (Vakaltnama) పత్రాల పై అర్జున్ చేత సంతకం చెయించుకుంటుంది.

కొన్నీ రోజులు తరువాత హైకోర్టు లొ

జడ్జ్ : వకలత్నామా ప్రకారం లాయర్ విష్ణువర్ధన్ గారు రావాలి. ఆయన ఏరి?

భవ్య : సార్. నేను లాయర్ విష్ణువర్ధన్ గారి తరపున హాజరవుతున్నాను. ఆయన నన్ను వాదించమని అనుమతించారు. కాబట్టి నేను ఈ కేసుని వాదించేందుకు మీ అనుమతి కోరుతున్నాను.

జడ్జ్ : సరే వాధించడానికి అనుమతి ఇస్తున్నా.

భవ్య : ధన్యవాదాలు మి లార్డ్. 

జడ్జ్ : మీరు ఈ కేసు ని ఇక్కడ అపీల్ చేసారు. ఈ కేసు ని కోర్టు స్వీకరించాలి అంటె దర్యాప్తు లొ ఏమైన తప్పులు ఉన్నాయా అని మీరు నిరుపించాలి. అందుకు మీ వాదనని వినిపించండి.

భవ్య : సార్ ఈ కేసు ప్రాధమిక ఆధారంగా (Prime evidence) చూపించబడుతున్న మీరా యొక్క వీడియె మీద మాకు అనుమానాలు ఉన్నాయి.

జడ్జ్ : ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? మీరు ఎదైనా చెప్పేముందు ఆ విడియొ నిజమైందని ఇదివరకె ఫారన్సిక్ వాళ్ళు ధృవీకరించారన్న సంగతి మర్చిపోవద్దు.

భవ్య : ఆ వీడియొ నిజమైందె కావచ్చు. కాని మీరా మరణించిన కనీసం 2 రోజులు తరువాత ఆ వీడియొ రికార్డ చేసారని మా అనుమానం.

జడ్జ్ : మీ వాదనికి ఏ విధంగా బలం చేకూర్చగలరు.?

భవ్య : తేది 08/01/2025 న అర్జున్ కాకుండా ఆ ఇంట్లొ మొదట మీరా శవాన్నీ చూసింది పని మనిషి లక్ష్మీ అదే రోజు పోలీసులు వచ్చి మీరా శవాన్నీ పంచనామ (Postmortem) కి పంపించారు. ఆ పంచనామ (Postmortem) రిపోర్ట ప్రకారం అప్పటికె మీరా చనిపోయి 4 రోజులు అయ్యింది అన్నారు.

జడ్జ్ : అవును పంచనామ (Postmortem) రిపోర్ట లొ అలాగె ఉంది. అయితె ?

భవ్య : 4 రోజులు ముందు అంటె 04/01/2025 తెది అనే కదా?

జడ్జ్ : అవును ?

భవ్య : ఒక మొబైల్ ద్వారా మనం ఏ వీడియె రికార్డ చేసిన ఆ రికార్డ్ చేసిన సమయం మరియు తేది మొబైల్లొని టైస్టాంప్ (Time stamp) లొ నమొదు చేయబడి ఉంటుంది. మా అనుమానం ప్రకారం అందులొ జనవరి 6వ తేది లేద 7వ తేది 2025 అని ఉండచ్చు అని అనిపిస్తుంది.

జడ్జ్ : దానికి దీనికి ఏంటి సంబంధం.?

భవ్య : సంబంధం ఉంది సార్. మీరా చనిపోయన 2 రోజులు తరువాత ఆ వీడియొ రికార్డ్ చేసారంటె కచ్చితంగా ఇందులొ ఏదొ కుట్ర ఉంది. అసలు మీరా ది ఆత్మహత్య కాదు హత్య అని తనని చంపిన తరువాత ఆ వీడియొ రికార్డ చేసి ఉంటారని అనుమానం.

జడ్జ్ : ఆ వీడియొ ని వేరొక ఫోన్ నుంచి కాపి చేసి ఉండచ్చు కదా?

భవ్య : ఎవరు చేసి ఉంటారు.? చేస్తె ఎందుకు చేసి ఉంటారు.? అసుల అతనె హంతకుడు అవ్వచ్చేమొ? ఇవన్నీ తెలియాలి అంటె ముందు మనం ఒక్కసారి పోలీసులు వద్ద ఉన్న మీరా ఫోన్ ని మళ్ళి ఫారెన్సిక్ వద్దకి పంపించి పూర్తిగా పరిశోధించమని చెప్పాలి.

జడ్జ్ : సరే. 

జడ్జ్ పోలీసులకు మీరా ఫోన్ ని మళ్ళి ఫారెన్సిక్ వాళ్ళకిచ్చి అన్నీ కోణాలలొ చెక్ చేయమని చెప్పి కేసు ని 4 రోజులు వాయిదా వేస్తారు.

4 రోజులు తరువాత ఫారెన్సిక్ రిపోర్టు ని పోలీసులు కోర్టులొ అప్పిగిస్తారు.

ఆ రిపోర్టు ప్రకారం ఆ వీడియొ ఆ మొబైల్ లోనె రికార్డం చేయబడిందని మరియు టైమ్స్టాంప్ (Time stamp) ప్రకారం వీడియొ రికార్డ చేసిన తేది 06/01/2025. సమయం 15:30 గంటలకి అని ఉంది.

భవ్య : సార్ రిపోర్టు ప్రకారం మీరా చనిపోయిన తరువాత తన మొబైల్ లొ ఆ వీడియొ రికార్డు చేయబడింది. కాబట్టి ఇది హత్య అని మా అనుమానం. ఒకవేళ హత్యె అయితె అది అర్జున్ చేసె అవకాశం లేదు ఎందుకంటె అతను ఆయా తేదిలలొ కంపెని పని బెంగుళూరు లొ ఉన్నాడు. 

జడ్జ్ : ఏం? ఎవర్నైనా మనుషులను పెట్టి చంపించచ్చు గా?

భవ్య : అలా చేసె వ్యక్తి తనపై నేరం వచ్చేలా మీరా మొబైల్ లొ ఆ వీడియొ ఎందుకు రికార్డ్ చేయిస్తాడు. మనం గనక అర్జున్ యొక్క ఫోన్ కాల్స రికార్ఢ్స మరియు తన బ్యాంక్ లావాదేవీలను తనిఖి చేస్తె అర్ధం అవుతుంది..

జడ్జ్ : కేసు వచ్చె వారానికి వాయిదా వేస్తున్నా. ఈ లోపు పోలీసులు సదరు లాయర్ భవ్య చెప్పినట్టు అర్జున్ యొక్క ఫోన్ కాల్ వివరాలు మరియు అతని బ్యాంక్ అకౌంటు స్టేట్మెంట్లు తీసుకురండి. అవి చూసాక బైల్ పై తుదినిర్ణయానికి వస్తా.

అర్జున్ యొక్క ఫోన్ కాల్ వివరాలు మరియు అతని బ్యాంక్ అకౌంటు స్టేట్మెంట్లు ని పరిశీలించిన జడ్జ్. మీరా ది ఆత్మహత్య కాదు హత్య అని మరియు ఇది అర్జున్ వల్లె జరిగింది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి. జడ్జ్ అర్జున్ కి బైల్ మంజూరూ చేస్తాడు.

తరువాత మీరా హత్య కి సంబంధించి మళ్ళి పూర్తి దర్యాప్తు ప్రారంభించమని పోలీసులకు జడ్జ్ ఆదేశాలు ఇస్తాడు.

దాంతొ ఒక్కసారి గా ఈ వార్తా మళ్ళి న్యూస్ చెనెల్సు లొ చర్చ కు దారి తీసింది. మొన్నటివరకు అర్జున్ ని అతని కుటుంబాన్నీ తప్పుబట్టిన వాళ్ళు ఇప్పుడు పోలీసులను తప్పుబడుతున్నారు.

ఇదంతా తమ ఇంట్లొ రహస్యంగా కూర్చొని న్యూస్ చానల్ లొ చూస్తున్న మీరా తన తల్లిదండ్రుల వైపు కి తిరిగి.

"ఇప్పుడు మనం మన 2వ పథకాన్నీ అమలు చేయాల్సిన సమయం వచ్చింది. అందుకు అన్నీ సిద్దం చేయండి నాన్న " అని చెబుతుంది.