Part - 2
గతం (Flash back)
ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఓ ఇంటి తలుపు కొడతాడు. కాసేపటికి ఓ అమ్మాయి వచ్చి తలుపు తీస్తుంది. ఆమె పేరు భవ్య
భవ్య : వరుణ్ ? ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు?
వరుణ్ : అక్కా ఇవాళ పొద్దున్న వార్త చూసావా?
భవ్య : ఏం వార్తా?
అని అడిగేలోపు వరుణ్ తన మొబైల్ లొఉన్న వీడియొ ఒకటి భవ్య కి చూపిస్తాడు. అందులొ అర్జున్ యొక్క అరెస్టు మరియు అతనికి పడ్డ 7 సంవత్సరాల శిక్ష గురించి ఉంది.
అది చూసి భవ్య ఒక్కసారిగా నిర్ఘాంతపోయి సోఫాలొ చితికిలబడిపోతుంది తరువాత చాలా బాధపడుతూ ఏడుస్తుంది
వరుణ్ : బాధ పడకు అక్క. నువ్వు ఎడవకు.
భావ్య : (ఏడుస్తూ) రేయ్ వరుణ్ తను అలాంటివాడు కాదురా. అర్జున్ చాలా మంచి వాడు. తను తప్పు చేసి ఉండడు. నీకు తేలీదా చెప్పు?
వరుణ్ : అర్జున్ అలాంటివాడు కాదు అని నాకూ తెలుసు అక్క. ఇప్పుడు ఏం చేద్దాం?
భావ్య : మనం వెంటనె అర్జున్ ని మరియు తన కుటుంబాన్నీ కలవాలి. అసలు ఏం జరిగిందొ మనం తెలుసు కోవాలి. వైజాగ్ కి ఫ్లైట్ టికెట్స్ బుక్ (Flight tickets book) చేయ్. మనం ఈ రోజె బయలుదేరాలి.
వరుణ్ : సరె అక్క నువ్వు వెళ్ళి తయ్యారవ్వు. నేను టికెట్స్ మరియు విమానాశ్రయానికి టాక్సి బుక్ చేస్తా.
అలా 3 గంటల్లొ వాళ్ళు ఢిల్లి విమానాశ్రయానికి చేరుకుని ఫ్లైట్ ఎక్కుతారు.
ఫ్లైట్ లొ కూర్చున్న భవ్య కు మనసులొ గతం తాలుకు ఙాపకాలు గుర్తుకు రా సాగాయి.
అర్జున్ మరియు భవ్య చిన్నపటి నుంచి మంచి స్నేహితులు స్కూలు నుంచి ఇంజినేరింగ్ వరకు కలిసే చదువుకున్నారు. వరుణ్ వచ్చి భవ్య యొక్క బాబాయి కొడుకు మరియు కాలేజి లొ వీళ్ళ జూనియర్.
స్వతహాగ అర్జున్ చాలా తెలివైనవాడు మరియు కష్టపడెతత్వం ఉన్న మనిషి. తనకు ఉన్న ఆర్ధిక ఇబ్బందుల రిత్యా ఒకానొక సందర్భంలొ కాలేజి ఫిజు కట్టలేని పరిస్థితి. ఆ సమయంలొ భవ్య మరియు వరుణ్ వీళ్ళిద్దరె తనకి సహాయం చేసారు.
తరువాత తను షేర్ మార్కట్ బ్రోకర్ అయినటువంటి వరుణ్ వాళ్ళ నాన్న గిరిధర్ దగ్గర అసిస్టెంట్ గా పార్ట టైమ్ ఉద్యోగం లొ చేరుతాడు.
మెల్ల మెల్ల గా వాళ్ళిద్దరి దగ్గర తీసుకొన్న డబ్బుని ఒక 6 నెలల్లొ తిరిగి చెల్లించడమె కాకుండా తన ఇంట్లొ వాళ్ళ పై ఆధారపడకుండా తన అవసారలకి డబ్బులు తానె సంపాదించుకొనె వాడు.
ఇలా ఉండగా ఇంజినేరింగ్ ఇంకొ 2 నెలల్లొ పూర్తి అవుతుంది అనగా ఒకరోజు భవ్య అర్జున్ వద్దకు వచ్చి
భవ్య: అర్జున్ చాలా రోజులు గా నీకు ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నా
అర్జున్ : ఏంటి భవ్య?
భవ్య: ఐ లవ్ యూ. (నేను ప్రేమిస్తున్నాను)
అది విన్న అర్జున్ కొంచెం సేపు మౌనంగా ఉండిపోయాడు.
భవ్య: ఏమైంది అర్జున్ ఏం మాట్లాడవేమి.?
అర్జున్ : నన్ను క్షమించు భవ్య ఇప్పుడు నేను అటువంటి ఆలోచనలు ఏమి పెట్టుకోలేదు. నా ద్యాస అంతా నా కెరియర్ పైనె. నా కుటుంబం ఆర్ధికంగా నిలదొక్కుకునేంత వరకు నా మనసులో ఈ ప్రేమ పెళ్ళి అనె ఆలోచనలు లేవు.
భవ్య: నన్ను పెళ్ళి చేసుకుంటె నా ఆస్తి నీది కాదా. పైగై కాలేజి తరువాత మన ఇద్దరు ఎలాగొ ఉద్యోగం చేస్తాం గా. నా సంపాదాన కూడా నీదె కదా.
అర్జున్ : నా గురించి తెలిసె ఇలా మాట్లాడుతున్నావా భవ్య. అయిన చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఒక మంచి స్నేహితురాలుగానె చూసాను. అటువంటప్పుడు నీపై నాకు ఎందుకు ఆ ఆలోచన వస్తుంది.
అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భవ్య ఏడుస్తూ అక్కడె కూర్చుండి పోతుంది. అక్కడ తనని చూసి వరుణ్ వెళ్ళి ఓదారుస్తాడు.
2 రోజుల తరువాత అర్జున్ భవ్య వద్ద కు వచ్చి
అర్జున్: భవ్య ఆ రోజు అలా కొంచెం పరుషంగా (Harsh) నీతొ మాట్లాడినందుకు నన్ను క్షమించు. ఈ వయసు లొ నీకు అలాంటి ఆలోచన రావడం సహజమె. కాని నిజంగా నిపై నాకు అలాంటి ఉద్దష్యాలు లేవు. నన్ను అర్ధం చేసుకుంటావు అనుకుంటున్నా.
కాసేపటికి భవ్య కుదుట పడి తను చెప్పింది అర్ధం చేసుకుంటుంది. కాని మునుపటి లా అర్జున్ తొ ఉండలేదు అందుకె తన నుంచి దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటుంది. అదె అర్జున్ కి కూడా చెబుతుంది. అర్జున్ తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తన నిర్ణయాన్నీ గౌరవిస్తాడు.
తరువాత వాళ్ళ కాలేజి పూర్తి అవుతుంది. అర్జున్ ఎం.టెక్ ఎంట్రెన్స్ కి తయ్యారవుతున్నాడు. భవ్య తను 'లా' (Law) చదవడం కోసం ఢిల్లి యునివర్సిటి లొని ఎల్.ఎల్.బి (L.L.B) ఎంట్రెన్స్ కి తయ్యారవుతుంది.
అర్జున్ కి ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్టణం లొ ఎం.టెక్ లొ సీటు వస్తుంది.
భవ్య కి ఢిల్లి విశ్వవిద్యాలయం లొ 3 సంవత్సరాల 'లా' కోర్సు లొ సీటు వచ్చి తను ఢిల్లి కి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి సంవత్సరం వరుణ్ కి ఢిల్లి దగ్గర నోయిడా లోని హెచ్.సి.ఎల్ (HCL) కంపెనీలొ ఉద్యోగం వస్తుంది.
అలా అర్జున్ ఈ 7 ఏళ్ళ పాటు భవ్య కి దూరంగా ఉన్నాడు.
కాసేపటి కి విమానం విశాఖపట్టణం లొ దిగగానె వరుణ్ పిలుపు కి భవ్య గతంలోంచి బయటకి వస్తుంది.
ముందుగా వాళ్ళిద్దరు అర్జున్ వాళ్ళ అమ్మనాన్న లని కలవడానికి విజయనగరం వెళతారు.
అర్జున్ వాళ్ళ అమ్మ లక్ష్మీ భవ్య ని చూడగానె తనని పట్టుకొని ఏడుస్తుంది. భవ్య ఆవిడను లోపలికి తీసుకెళ్ళి అర్జున్ తండ్రి క్రిష్ణమూర్తి వద్ద కు వెళతుంది.
క్రిష్ణమూర్తి : ఏం అమ్మ భవ్య ఎలా ఉన్నావు తల్లి.? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు ఏం చేస్తున్నావు?
భవ్య : నేను బానె ఉన్నా అంకుల్. ఢిల్లి లొ ఉంటున్నా. అక్కడ విష్ణు లా ఫిర్మ (Vishnu Law Firm) లొ విష్ణువర్ధన్ గారి దగ్గర జూనియర్ లాయర్ గా చేస్తున్నా.
వరుణ్ : నేను ఢిల్లి దగ్గర నోయిడా లొ సాఫ్టవేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నా.
భవ్య : మా సంగతి పక్కనపెట్టండి అర్జున్ కి ఏంటి ఇలా అయ్యింది. ఇంత జరిగన తరువాత కూడా నాకు ఒక్క ముక్క చెప్పలేదు. నేను అంత పరాయిదానిని అయిపోయానా?
లక్ష్మీ : అలా ఏమి లేదు తల్లి. మేము చెబుదామనె అనుకున్నాం కాని అర్జున్ చెప్పద్దు అన్నాడు.
భవ్య : ఎందుకు?
క్రిష్ణమూర్తి : నువ్వు దూరంగా ఉండాలని తనని కోరావు గా. ఆ మాట కి ఇంకా అర్జున్ కట్టుబడి ఉన్నాడు. అందుకె చెప్పద్దు అన్నాడు.
భవ్య మౌనంగా ఉండిపోయింది.
క్రిష్ణమూర్తి : అర్జున్ నాకు అంతా చెప్పాడు అమ్మ. ఇందులొ నీ తప్పు ఏమి లేదులె. దగ్గర గా ఉండి నిన్ను బాధ పెట్టడం తనకి ఇష్టం లేదు. కాని నువ్వు వెళ్ళిపోయిన తరువాత అర్జున్ చాలా రోజులు బాధపడ్డాడు నీ మనసు కష్టపెట్టినందుకు.
భవ్య : అసలు ఇంతకి ఏం జరిగింది అంకుల్?
క్రిష్ణమూర్తి మరియు లక్ష్మీ జరిగింది అంతా చెబుతారు. ఈ లోపు అర్జున్ చెల్లి సమీర ఏడ్చుకుంటు ఇంటి వస్తుంది.
అది చూసి లక్ష్మీ తన వద్దకు వెళ్ళి
లక్ష్మీ : సమీర ఏమైందె ఎందుకు ఏడుస్తున్నావు?
సమీర : అమ్మ నేను ఇంక కాలేజి కి వెళ్ళను.
లక్ష్మీ : ఏమైంది? ఎందుకు వెళ్ళనంటున్నావు?
సమీర : కాలేజి లొ లెక్చెరర్లు దగ్గర నుంచి అందరు నన్ను హంతకుడి చెల్లి అంటు చీదరించుకుంటున్నారు . అంతే కాకుండా కొంతమంది కాలేజి కుర్రవాళ్ళు "మీ అన్నయ్య జైలుకి వెళ్ళాడు ఇంక నిన్ను ఎవరు పెళ్ళి చేసుకోరు. కాబట్టి నన్ను చేసుకో " అంటు ఏడిపిస్తున్నారు.
అని చెప్పి బోరున ఏడుస్తుంది సమీర.
అది చూసిన భవ్య తన వద్దకి వచ్చి తనని ఓదారుస్తుంది. అప్పుడు భవ్యని చూసిన సమీర
సమీర : భవ్య నువ్వా? ఎప్పుడు వచ్చావు?
అని కళ్ళు తుడుచుకొని అడుగుతుంది.
భవ్య : నేను కాసేపటి క్రితమె వచ్చాను గాని ఇది చెప్పు మీ అన్నయ్యె నిజంగా మీ వదిన చావు కి కారణం అంటె నమ్ముతావా?
సమీర : మా అన్నయ్య అలాంటి వాడు కానె కాదు కచ్ఛితంగా ఎవరో తనని ఇందులొ ఇరికించారు.
భవ్య : ఒకసారి నేను అర్జున్ ని కచ్చితంగా కలవాలి.
వచ్చేవారం అర్జున్ కలవడానికి అందరు విశాఖపట్టణం వస్తారు. భవ్య లాయర్ కావడంతొ ముందు రోజు జైలర్ వద్ద అనుమతి తీసుకొని వెళుతుంది.
అక్కడ కాసేపటికి అర్జున్ వస్తాడు. భవ్య ని చూసి చాలా సంతోషిస్తాడు.
అర్జున్ : ఎలా ఉన్నావు భవ్య? ఎప్పుడు వచ్చావు?
భవ్య : నా సంగతి తరువాత అర్జున్. నువ్వు ఏంటి ఇలా?
అర్జున్ : ఏం చేస్తాను అంతా నా తలరాత. మీరా ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు ఇప్పటికి తేలీదు? ఆ వీడియె లొ ఎందుకు అలా చెప్పిందొ?
భవ్య : నీ కేసు తాలుకు వివరాలు అన్ని మా సీనియర్ లాయర్ విష్ణువర్ధన్ గారికి చెప్పాను. నీ కేసు దర్యాప్తు లొ చాలా తప్ఫులు ఉన్నాయి అని అన్నారు. ఆయన ఈ కేసు ని మళ్ళి హైకోర్టు లొ తెరవబోతున్నారు. ఆయన ప్రతినిధి గా నేను నీ కేసు ని వాధిస్తా అన్నాను.
అర్జున్ : నిజమా ?
భవ్య : నిజం అర్జున్. నేను మళ్ళి వచ్చేటప్పుడు లీగల్ పరంగా కొన్ని డాక్యుమెంట్సు తీసుకు వస్తా వాటి మీద నీ సంతకం కావాలి.
10 రోజులు తరువాత అర్జున్ కేసు ని భవ్య తన సీనియర్ లాయర్ విష్ణువర్ధన్ ద్వారా ఆంధ్రప్రదేష్ హై కోర్టు లొ అపీల్ చేస్తుంది.