Part - 5
పునఃపరిశీలన (Re-Investigation)
ముంబయి నగరం లొని ధనవంతులు మరియు పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థల కార్యాలయాలు ఉండె ప్రాంతాలలొ సముద్రతీరం వద్ద ఉన్న కఫ్ పరేడ్ (Cuff parade) ప్రాంతం ఒకటి. అక్కడ ఒక పెద్ద కార్పొరేట్ భవనం లోని 20 వ అంతస్తులొ ఉన్న ఆఫీసు. అక్కడ టీ.వీ లొ మీరా హత్య కు సంబందించిన వార్తను తెలుగు న్యూస్ చానెల్ లొ చూపిస్తున్నారు.
" వార్తా వ్యాఖ్యాత (News Anchor) : 2 నెలలు క్రితం విశాఖపట్టణం, రుషికొండ ప్రాంతంలోని సీ-వ్యూ అపార్టమెంట్సు లొ జరిగిన మీరా హత్య కేసు లొ ఇప్పుడు మరొ కొత్త మలుపు.
మీరా చనిపోయిన తరువాత తన తల్లిదండ్రులు తమ సొంత ఊరు బొబ్బిలి కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు చనిపోయారు. మీరా హత్య తాలుకు పునఃపరిశీలన కోసం పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం (special team) వాళ్ళు మీరా తల్లిదండ్రుల యొక్క వివరణ (Statement) కై బొబ్బిలి లొ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇద్దరు చనిపోయి కనిపించారు.
చూసేందుకు వాళ్ళిద్దరిది సహజ మరణం లా కనిపించిన కాని అనుమానాలు ఉన్నాయంటు పొలీసులు తెలిపారు".
కాసేపటికి ఆ ఆఫీసులొ ఉన్న ఒక వ్యక్తి ఆ టీ.వీ ని ఆపి. తన ఎదురుగా నించొని ఉన్న అసిస్టెంట్ వైపు తిరిగి .
ఆఫీసులొని వ్యక్తి : మీరా దొరికిందా?
అసిస్టెంట్ : లేదు సార్. మనవాళ్ళు వెళ్ళేసరికి అమె తల్లిదండ్రులు అపస్మారక స్తితి లొ పడి ఉన్నారు. అది చూసి మనవాళ్ళు లేపడానికి ప్రయత్నించారు కాని వాళ్ళు అప్పటికె చనిపోయారు. ఈ లోపు ఇంటి బయట గేటు ముందు ఏదొ వాహనం వస్తున్న శబ్దం వినిపంచ గానె ఇంటి వెనుక నుంచి తప్పించుకొన్నారు.
ఆఫీసులొని వ్యక్తి : మరి మీరా?
అసిస్టెంట్ : తను అప్పటికె తప్పించుకుంది సార్. ఎక్కడికి వెళ్ళిందొ తెలీదు
ఆఫీసులొని వ్యక్తి : నువ్వు ఏం చేస్తావొ నాకు తెలియదు అసలు నిజం బయటికి వచ్చె లోపు వెంటనె మీరా ని కనిపెట్టి తీసుకురండి. జాగ్రత్త మనకు ఇంకా నెల రోజులె సమయం ఉంది.
అసిస్టెంట్ : మేమంతా ఆ ప్రయత్నం లోనె ఉన్నాం సార్.
ఆఫీసులొని వ్యక్తి : సరె ఇంక వెళ్ళు.
------------------------------------------------------------------------
మీరా తల్లిదండ్రులు చనిపోయిన వార్త విన్న అర్జున్ అతని తల్లిదండ్రులు, తన చెల్లి సమీర మరియు భవ్య అందరు కలిసి వాళ్ళ అంత్యక్రియల కోసం బొబ్బిలి వెళ్ళారు .
పోలీసులు మీరా తల్లిదండ్రుల మృతదేహాలకు పంచనామ (Postmortem) చేసిన తరువాత అర్జున్ వాళ్ళ కి అప్పగించారు. ఎందుకంటె మీరా తరువాత అర్జున్ తప్ప తన తల్లిదండ్రులకు ఇంకెవ్వరు లేరు.
తల్లిదండ్రుల ప్రోత్బలంతొ అర్జునె వాళ్ళ ఇద్దరి కి అంత్యక్రియలు నిర్వహించి మరియు 11వ రోజు పెద్దకర్మ కూడా చేసి తరువాత అందరు తిరిగి విశాఖపట్టణం వచ్చేస్తారు.
2 రోజుల తరువాత మీరా తల్లిదండ్రుల యొక్క పంచనామ రిపోర్టు (PostMortem report) పోలీసుల వద్దకు వస్తుంది. అందులొ వాళ్ళిద్దరి మరణం సహజం అని. మీరా తల్లి కి మధుమేహం (Diabaetic) ఉండడం వల్ల శుగర్ లెవల్సు హెచ్చు తగ్గులవడంతొ (Fluctuate) చనిపోయింది. తండ్రి కి రక్తపోటం (BP) ఉండడం వల్ల బీ.పి లెవల్సు హెచ్చు తగ్గులవడంతొ (Fluctuate) చనిపోయాడు అని ఉంది.
డి.సీ.పి సంతోష్ ఆ పంచనామ రిపోర్టు ని మరియు మీరా తల్లిదండ్రుల యొక్క శవాల తాలకు ఫొటోలను, ఫారన్సిక్ వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని క్షుణ్ణంగ పరిశీలంచడం మొదలు పెడతాడు.
కాసేపటికి డి.సీ.పి సంతోష్ ఆఫీసు గదిలోకి ప్రత్యేక బృందం అధికారులు (Special Team) ఐదుగురు వస్తారు.
C.I సురేష్ : సార్ మీరు అడిగినట్టు మీరా యొక్క పంచనామ రిపోర్టు (PostMortem report) తయ్యారు చేసిన డాక్టర్ శంకర్ వాంగ్మూలం తెచ్చాను
అని చెప్పి తన వద్ద రికార్డ చేసిన డాక్టర్ శంకర్ వాంగ్మూలం యొక్క వీడియొ ని చూపిస్తాడు.
S.I ప్రవీణ్ : సార్ మీరు అడిగిన మీరా మొబైల్ యొక్క కాల్ డేటా రిపోర్ట్.
డి.సీ.పి సంతోష్ : S.I సందీప్ మరియు S.I వీర్రాజు మీకు అర్జున్ వాళ్ళ అపార్టుమెంట్ యొక్క 6 నెలల సి.సి.టీవి ఫూటేజ్ మరియు ఆ అపార్టుమెంట్ వాసుల అందరి వాంగ్మూలాలు తీసుకోమన్నాను. తెచ్చారా?
S.I సందీప్ : ఈ పెన్ డ్రైవు లొ ఆ అపార్టుమెంట్ యొక్క 6 నెలల సి.సి.టీవి ఫూటేజ్ ఉంది సార్.
S.I వీర్రాజు : అదె పెన్ డ్రైవు లొ ఆ అపార్టుమెంట్ లొ ఉంటున్న వాళ్ళందరి వాంగ్మూలాలు కూడా ఉన్నాయి సార్.
డి.సీ.పి సంతోష్ : వెంకట్ నీ సంగతి ఏంటి నువ్వు వెళ్ళిన సమయానికె మీరా తల్లిదండ్రులు చనిపోయి ఉన్నారు అన్నావు. మరి అక్కడ అనుమానస్పదంగా ఏమి కనిపించలేదా? అక్కడ నువ్వు ఏం గమనించావు?.
A.S.I వెంకట్ : వాళ్ళు చనిపోయిన విషయం మీకు విషయం చెప్పాక మీరంతా వచ్చె లోపు నేను ఆ ఇంటి పరిసరాలన్ని గమనించడం మొదలు పెట్టాను అనుమానం ఉన్న చోట నా మొబైల్ లొ ఫొటోలు కూడా తీసాను.
డి.సీ.పి సంతోష్ : అక్కడ నీకు అనుమానస్పదంగా ఏం కనిపించాయి.?
A.S.I వెంకట్ : ఇంటి వెనుక మరియు చుట్టు పరిసర ప్రాంతాలలొ నాకు ఏం కనిపించ లేదు సార్. కానీ.....
డి.సీ.పి సంతోష్ : ఆ కాని.?
A.S.I వెంకట్ : ఇది ఎంత వరకు మన కేసు కి సంబంధించందొ తెలియదు కాని చెప్తున్నా. వాళ్ళ ఇంట్లొ ఉన్నది ఇద్దరు కాబట్టి వాళ్ళిద్దరికి చెరొ ఫోన్ చప్పున 2 ఫోన్లె ఉండాలి. కాని నాకు అక్కడ మూడొ ఫోన్ కూడా కనిపించింది సార్.
S.I సందీప్ : అది చనిపోయిన మీరా ఫోన్ అయ్యుండచ్చు గా.?
A.S.I వెంకట్ : తన ఫోన్ పోలీసులు ఆ రోజే స్వాధినం చేసుకున్నారు కద సార్.
S.I సందీప్ : ఏమొ మీరా కి లేదా తన తల్లిదండ్రులు కి ముగ్గురి లొ ఎవరొ ఒకిరికి 2 ఫోన్లు ఉండచ్చు గా.
డి.సీ.పి సంతోష్ : ఇంతకి ఆ మూడు ఫోన్లు ఏవి?
A.S.I వెంకట్ ఫారెన్సిక్ వాళ్ళు అందించిన కవర్లొ ఆ మూడు ఫోన్లు తీసి ఇచ్చాడు.
A.S.I వెంకట్ : అంతె కాదు సార్ నేను ఇంకొన్నీ కూడా గమనించాను.
డి.సీ.పి సంతోష్ : ఏంటి ?
A.S.I వెంకట్ : ఇంటి వెనక దెండం మీద వాళ్ళు ఆరేసిన బట్టల్లొ ఇప్పటి తరం అమ్మాయిలు వాడె బట్టల కూడా చూసాను.
S.I ప్రవీణ్ : అవి మీరా బట్టలు అయ్యుడచ్చు కదా?
A.S.I వెంకట్ : కాని అవి ఉతికి ఆరెయ్యాల్సిన అవసరం ఏంటి ? ఎవరు వాడనప్పుడు?
డి.సీ.పి సంతోష్ : అంటె నీ ఉద్దేష్యం ఆ ఇంట్లొ మీరా తల్లిదండ్రుల మాత్రమె కాకుండా ఇంకొ మూడొ వ్యక్తి అదీ ఒక స్త్రీ ఉండచ్చు అంటావా?
A.S.I వెంకట్ : అవును సార్. అదే నా అనుమానం.
డి.సీ.పి సంతోష్ : మరి ఆ చుట్టు పక్కల ఇంటి వాళ్ళని అడిగి చూసావా?
A.S.I వెంకట్ : అడిగి చూసా సార్. వాళ్ళు ఎవరు కూడా ఆ మూడొ వ్యక్తి అంటు ఎవరూ లేరు కేవలం వాళ్ళు ఇద్దరు మాత్రమె ఉండెవారు అని చెప్పారు. పైగా వాళ్ళు ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చే వాళ్ళు కాదంటా.
డి.సీ.పి సంతోష్ : చూస్తుంటె ఈ కేసు మరి కఠినంగా తయ్యారు అవుతుందె. ముందు మీరా చనిపోయింది. ఇప్పుడు తన తల్లిదండ్రులు ఒకేసారి సహజంగా ఇద్దరు చనిపోయారు. ఆ ఇంట్లొ మూడొ వ్యక్తి ఉన్న ఛాయలు కనిపిస్తున్నాయి.
S.I వీర్రాజు : మనం ఈ కేసు ని వేరె కోణం నుంచి దర్యాప్తు చెయ్యాల్సి ఉంటుంది సార్.
డి.సీ.పి సంతోష్ : అవును వేరె కోణం నుంచి మళ్ళి మొదలుబెట్టాలి.............
ఈ లోపు డి.సీ.పి సంతోష్ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి
డి.సీ.పి సంతోష్ : ఎస్స్స్..... ఎటువైపు నుంచి మొదలుపెట్టాలొ నాకు తెలిసింది.
------------------------------------------------------------------------
విశాఖపట్టణం లోని అర్జున్ ఇంట్లొ అందరు ఒకే చోట హాల్ లొ మౌనంగా కూర్చోని ఉంటారు.
క్రిష్ణ మూర్తి (అర్జున్ తండ్రి) : ఏరా అర్జున్ నీ ఉద్యోగం విషయం ఏమయ్యింది రా?
అర్జున్ : కంపెనీ వాళ్ళు ఏమి చెప్పడం లేదు నాన్న. నేను కేవలం బైల్ పై మాత్రమె బయటకి వచ్చాను. పూర్తిగా నన్ను నిర్దోషి గా కోర్టు చెప్పలేదు కదా.
క్రిష్ణ మూర్తి (అర్జున్ తండ్రి) : అయితె ఇప్పుడు ఎలా? ఇలా ఉంటె మరి ఆ కేసు తేలేంత వరకు నీకు ఇక్కడె కాదు మరి ఇంక ఎక్కడ కూడా ఉద్యోగం వచ్చేలా లేదు.
అర్జున్ : ఉద్యోగం లేనంత మాత్రాన ఎమవ్వదు నాన్న. షేర్సు లొ నేను పెట్టుబడి పెట్టింది ఇంకా ఉంది గా. కుదిరితె నేనె ఆ డబ్బుతొ సొంత కంపెనీ పెట్టుకుంటాను. మన భవిష్యత్తు గురించి మీరేమి బెంగపడకండి.
భవ్య : అంతగా కావాలంటె మా నాన్న ద్వారా అర్జున్ కంపెనీ పెట్టడానికి సహాయం చేస్తాను అంకుల్.
ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగ. అర్జున్ తల్లి లక్ష్మీ వచ్చి. అందరిని భోజనానికి రమ్మని పిలుస్తుంది.
ఈలోపు హాల్ పక్కన ఉన్న గది లొ నుంచి చప్పుడు మొదలవుతుంది.
లక్ష్మీ : ఇంతకి ఆ గది లొ ఉన్న దానీ సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నారు ?
అని కోపంగా అడుగుతుంది.