Read ChitthaBramanam (The Illusion) - 4 by Suresh Josyabhatla in Telugu Crime stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

చిత్తభ్రమణం (The Illusion) - 4

Part - 4
దర్యాప్తు (Investigation)

వైజాగ్ లో ఆర్. కె బీచ్ తరువాత అంత ఎక్కువ పేరున్న ఇంకో బీచ్ ఋషికొండ బీచ్. దానికి దగ్గర లొ కెఫేన్ కప్స్ (Caffeine cups) అనె కాఫీ రెస్టారెంట్ ఉంది. అందులొ ఒక వ్యక్తి ఖంగారు పడుతూ ఒక టేబుల్ దగ్గర ఎవరి కోసమొ ఎదురు చూస్తున్నాడు.

మద్య మద్య లొ తన మోబైల్ తీసి చూస్తున్నాడు. కాసేపటికి " ఎక్కడ ఉన్నావు" అంటు ఎవరికొ మెసేజ్ చేశాడు. 5 నిమిషాల తరువాత "దగరలొ ఉన్నాను 2 నిమిషాలలొ అక్కడుంటా " అని తనకి తిరిగి మెసెజ్ వచ్చింది.

2 నిమిషాల తరువాత ఒక అమ్మాయి ఆ వ్యక్తి ఉన్న టేబుల్ వద్దకు వచ్చి. " హాయి మీరు సంతోష్ ఏ కదా? " అని అడిగింది.
"యా నేను సంతోష్ నె. మీరు తనుజా కదా? "

తనుజా : అవును. సారి లేట్ అయినందుకు మిమల్ని చాలా సెపు ఎదురు చూసేలా చేశానా? నిజానికి కాబ్ దొరకెసరికి చాలా సమయం పట్టింది అందుకె అలస్యం అయ్యింది. 

సంతోష్ : మరి ఏం పరవాలేదు. ఏం తీసుకుంటారు.?

తనుజా : ఎదో ఒకటి మీరె చెప్పండి. నాకు కాఫీ ఐటెమ్సులొ అన్నీ ఇష్టమె.

సంతోష్ : ఓ సరె (నవ్వుతు) 

అని 2 కోల్డ్ కాఫీలు చెబుతాడు. కాసేపటికి వైటర్ 2 కోల్డ్ కాఫీలు తీసుకువస్తాడు.

నిజానికి సంతోష్ మరియు తనుజా సామాజిక మాద్యం (Social network) అయినటువంటి ఇంస్టాగ్రామ్ (Instagram) లొ సంవత్సరం క్రితం కలుసుకున్నారు. కాని వాళ్ళిద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొకుండా అలాగె మాట్లాడుకునె వారు. ఆ పరిచయం కాస్త స్నేహం గా మారి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి అనె కుతూహలం తొ వాళ్ళ ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. తరువాత ఒకరి పై ఒకరికి ఇష్టం కలిగి నేరుగా కలవాలి అని నిర్ణయించు కొని ఇలా ఇప్పుడు కలిసారు.

సంతోష్ : కంఫ్యూశన్ (Confusion) లేకుండా ఇంకోసారి ఒకరి గురించి ఇంకొకరు చెప్పుకుందామా?.

తనుజా : సరె. ముందు నేను చెబుతా. నేను బయొసోమా థెరాపేటిక్స్ (BioSoma Therapeutics) అనె కంపెని లొ సీనియర్ సెల్యులార్ ఇమ్యునొలోజి రిసర్చ్ అసోసియెట్ (Senior Cellular Immunology Research Associate) గా పని చేస్తున్నా.

సంతోష్ : అంత పెద్ద పొజిషనా మీ కంపెనీలొ మీది? 

తనుజా : (నవ్వుతు) వినడానికి నాది పెద్ద పొజిషను లా అనిపిస్తుంది గాని అంత పెద్దది కాదు లెండి. అర్ధమైయ్యేలా చెప్పాలి అంటె నేనొక స్టెమ్ సెల్ రీసెరిచ్ శాస్త్రవేత్త (Stem Cell Research Scientist) ను ఇమ్యునొ ఇంజినేరింగ్ విభాగం(Immuno engineering Division) లొ.

సంతోష్ : అంటె ఏం చేస్తారు అందులొ మీరు?

తనుజా : ఒక దాతా (donor) నుంచి తీసిన కణాలను (Cells) అందరికి నప్పేలా (universal) గా మారస్తాము. 

సంతోష్ : ఎలా ?

తనుజా : అలా మార్చాలంటే, మొదట అతని రక్తం లేదా మెదడులోని కణాలు తీస్తారు. వాటిని జన్యుశోధన సాంకేతికత (Gene editing technology) ద్వారా, ఎవరి శరీరం తిరస్కరించకుండా సార్వత్రిక కణాలు (Universal cells) గా మార్చుతారు. వీటిని తర్వాత అనేక రకాల వైద్య అవసరాలకు వాడవచ్చు. ఉదాహరణకు మూత్రపిండాలు, కాలేయం మరియు బోన్ మేరో లాంటివి మనం కొత్త గా ప్రయోగశాల (Lab) లోనె తయ్యారు చేసుకోవచ్చు. 

సంతోష్ : ఇది నాకు చాలా కొత్త విషయం. 

తనుజా : కొత్త విషయమె. ఎందుకంటె ఇది మొదలు అయ్యి కేవలం 2 సంవత్సరాలె అవుతుంది. సరె ఇప్పుడు మీ గురించి చెప్పండి.?

సంతోష్ : నా గురించి అంటె మీకు ముందె చెప్పాను గా నేనొక పోలీసు అధికారి ని అని.

తనుజా : చెప్పారు గాని పూర్తి గా చెప్పలేదు గా.

సంతోష్ : నేనొక ఐ.పి.ఎస్ అధికారి (IPS Officer) ని విశాఖపట్టణం యొక్క ప్రత్యేక నేరాల విభాగం (Special crimes division) లొ డిప్యూటి కమీషనర్ అఫ్ పోలీసు (Deputy commissioner of police) గా పనిచేస్తున్నా.

తనుజా : ఓ అంటె మీరు డీ.సి.పి సంతోష్ కుమార్ కదా?

డి.సీ.పి సంతోష్ : అవును.

తనుజా : మీ గురించి నేను విన్నాను. మీరు ప్రత్యేకించి సైబర్ మరియు మెడికొ లీగల్ ఇన్వస్టిగేషన్ వింగ్ (Cyber & Medico Legal Investigations Wing (CMLIW)) డిపార్టుమెంటు లొ పని చేస్తారు కదా?

డి.సీ.పి సంతోష్ : అవును మీకు ఎలా తెలుసు.?

తనుజా : మా కంపెనీ లొ మీ గురించి విన్నాను లేండి. క్రితం సంవత్సరం మీరు అవయవాల అక్రమ రవాణా ముఠా (Illegal organ trading rocket) ను పట్టుకున్న తీరు చాలా ప్రశంసించదగినది.

డి.సీ.పి సంతోష్ : పోనీలెండి ఇప్పుడు నా వృత్తి గురించి వివరించె శ్రమ తగ్గింది (నవ్వుతూ)

తనుజా : హా హా హా ......

అలా వీళ్ళద్దరు చాలా సేపు మాట్లాడుకొన్నారు.
కాసేపటికి సంతోష్ కు డిపార్టుమెంటు నుంచి కాల్ వస్తుంది. ఎదొ ముఖ్యమైన విషయమై పోలీసు కమీషనర్ తనని రమ్మనట్టు చెబుతారు.

డి.సీ.పి సంతోష్ : నన్ను క్షమించు తనుజా నేను వెళ్ళాలి. 

తనుజా : పరవలేదు. మనం మళ్ళి కలుద్దాం. నాకు కూడా కొంచె పని ఉంది వెళ్ళాలి నేను కూడా.

డి.సీ.పి సంతోష్ : అవునా మీరు ఎక్కడికి వెళ్ళాలి ? 

తనుజా : జగదాంబ సెంటర్ వెళ్ళాలి.

డి.సీ.పి సంతోష్ : నేనూ అటువైపె వెళుతున్నా. నన్ను మిమల్ని డ్రాప్ చేయమంటారా? 

తనుజా : మీకు ఎందుకు ఇబ్బంది. నేను ఎదైనా కాబ్ తీసుకొని వెళతాను.

డి.సీ.పి సంతోష్ : ఇందులొ ఇబ్బంది ఏముంది. నేను ఎలాగొ అటువైపె వెళుతున్నా. పైగా మీకు కాబ్ లు అంత త్వరగా దొరకవు ఇక్కడ.

తనుజా : (చిరు నవ్వుతూ) సరె 

ఇద్దరు కారు లొ బయలుదేరి జగదాంబా సెంటర్లొ ఆగుతారు. తనుజా " ఠాంక్స " చెప్పి కారు దిగుతుంది.

డి.సీ.పి సంతోష్ : మళ్ళి ఎప్పుడు కలుద్దాం.?

తనుజా : (నవ్వతూ) చెబుతాను లెండి. ఇప్పుడె కలిసాము కదా. ఇకమీదట కలుస్తూనె ఉందాం. బై....

డి.సీ.పి సంతోష్ : బై.....

తనుజా ని దిగబెట్టిన తరువాత సంతోష్ నేరుగా పోలీసు కమీషనర్ ఆఫీసు కి వెళతాడు. కమీషనర్ శరత్ ని కలవడానికి.

డి.సీ.పి సంతోష్ : ఎక్సక్యూస్ మి సార్ (Excuse me sir) 

అని చెప్పి కమీషనర్ ఆఫీసు లొకి వెళతాడు.

కమీషనర్ శరత్ : రా సంతోష్ కూర్చొ.

డి.సీ.పి సంతోష్ : నన్ను రమ్మన్నారంటా?

కమీషనర్ శరత్ : హై కోర్టు మనకి ఒక హత్య కేసు పై దర్యాప్తు కి ఆదేశించింది. ఇది ఆ కేసు తాలుకు వివరాలు ఉన్న ఫైల్. ఒక ప్రత్యేక బృందాన్నీ (Special team) ఈ దర్యాప్తు కి ఏర్పాటు చేస్తున్నా. నువ్వే ఆ బృందానికి అధికారివి (Team head). ఈ బృందం లొ ఎవరెవరు ని నియమించాలి అనేది నీకె వదిలేస్తున్నా. ఇది కాకుండా నీకు ఇంకేమి కావాలన్న నన్ను అడుగు.

డి.సీ.పి సంతోష్ : అలాగె సార్. కాని నాకు ఉన్న శరతులు మీకు తెలుసు కదా.

కమీషనర్ శరత్ : హ్మ్మ్మ.... తెలుసు నాకు చెప్పక్కర్లేదు. అయిన నువ్వు నాకు మాత్రమె రిపోర్ట చేస్తావు నీపై ఎటువంటి ఒత్తిడి రాదు. ఏం జరిగిన నేను చూసుకుంటా లె. ఇప్పటికె చాలా కేసులు పెండింగుల్లొ ఉన్నాయి. నేను రిటైర్ అయ్యె సమయానికి ఏ కేసులు ఏవి పెండింగుల్లో ఉండకూడదు అనేది నా కోరిక.

డి.సీ.పి సంతోష్ : (చిరు నవ్వుతూ) సరె సార్ మరి నేనింక బయలుదేరుతాను.

కమీషనర్ శరత్ : సరె ఇంక వెళ్ళు.

సంతోష్ ఆ కేసు తాలుకు వివరాలన్ని క్షుణ్ణంగా చదివి మరుసటి రోజు తనకి కావలిసిన వ్యక్తులను 5 గురిని కమీషనర్ శరత్ ద్వారా ఎంచుకొని ఒక ప్రత్యేక బృందాన్నీ ఏర్పాటు చేసి దర్యాప్తుని ప్రారంభిస్తాడు. 

ముందుగా మీరా ఉన్న వీడియొ ని క్షుణ్ణంగా పరీశీలిస్తాడు. ఈ లోపు తన బృందంలొ ఒకరైన C.I సురేష్ కి మీరా శవాన్నీ పంచనామ చేసిన డాక్టర్ శంకర్ ని పిలిచి విచారించమని చెబుతాడు. 

తరువాత S.I ప్రవీణ్ కి మీరా తాలుకు ఫాన్ డేటా మరియు తన కాల్ డేటా మొత్తాన్నీ తెప్పించి పరీశీలించమని చెబుతాడు.

బృందంలొ మిగిలిన ముగ్గురిలొ ఇద్దరు (S.I వీర్రాజు & S.I సందీప్) ని మీరా మరియు అర్జున్ వాళ్ళు ఉన్న అపార్టుమెంటుకు వెళ్ళి గత 6 నెలల తాలుకు సి.సి.టీవి ఫూటేజ్ (CCTV footage) ని తెమ్మని మరియు ఆ అపార్టుమెంటు లొ ఉన్న వాళ్ళందరి వివరణలు (Statements) అర్జున్ వాళ్ళ ఇంటి పనిమనిషి తొ సహా మరొక్కసారి తీసుకోమని చెబుతాడు.

బృందం లొ మిగిలిన ఒక్కడు A.S.I వెంకట్ ని మీరా తల్లిదండ్రుల ను కలవమని చెబుతాడు. ఎందుకంటె మీరా చనిపోయిన తరువాత ఆమె తల్లిదండ్రులు విశాఖపట్టణాన్నీ విడిచి తమ సొంతూరు విజయనగరం జిల్లా, బొబ్బిలి కి వెళ్ళిపోయారు.

కాని A.S.I వెంకట్ బొబ్బిలి లొ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మీరా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి ఉంటారు.