ఎపిసోడ్ – 9
ఒక క్షణం, ఒక కలయిక
బాబాయి యొక్క ఆందోళన
ప్రియాను విశాఖపట్నానికి తీసుకువెళ్లిన తర్వాత…
“ప్రియా, నీకు ఏం మంచిదో నాకు తెలుసు. ఆ వర్మ ఫ్యామిలీతో సంబంధం పెట్టుకోవద్దు. నువ్వు వాళ్లతో మిళితమైతే నీ జీవితమే నాశనం అవుతుంది,” అని గట్టిగా అన్నాడు.
ప్రియా ఎంత అడిగినా, ఎంత ఏడ్చినా…
బాబాయి తేల్చి చెప్పాడు —
“నేను నీ తండ్రి స్థానంలో ఉన్నాను. నా మాటే తుది. ఇక నుంచి ఆ ఇంట్లో ఎవ్వరితోనూ, ముఖ్యంగా కృష్‌తోనూ నువ్వు కలవకూడదు.”
ఆ మాటతో బాబాయి సరిహద్దులు గీసేశాడు.
ప్రియా తన మనసులో వందసార్లు కృష్ పేరు పలికినా, అతన్ని కలిసే అవకాశమే ఇవ్వలేదు.
ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.
ప్రియా–కృష్ ఇద్దరూ ఒకరినొకరు మిస్ అవుతూనే, దూరంలోనే బతకాల్సి వచ్చింది.
ఆదిత్య ద్వారా కృష్‌కి మొత్తం నిజం తెలుసవుతుంది. ప్రియాని కలవడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ ఏదో ఒక కారణం వల్ల అది కుదరదు.
కృష్ ఆందోళనలో ఉండడం చూసి ఆదిత్య:
“కృష్, కొంచం సమయం ఇవ్వు. తానే తిరిగి వస్తుంది,” అని చెప్పాడు.
కృష్ కూడా సరే అని, తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు.
ఒక రోజు హఠాత్తుగా ప్రియా కృష్‌కి కాల్ చేసి ఇలా అంటుంది:
ప్రియా: “నేను ఇక్కడే ఉన్నాను. ఈవెనింగ్ కలుద్దాం.”
కృష్‌కి ఎక్కడా లేని సంతోషం కలిగింది. నిశ్చయంగా కలుద్దాం అని చెప్పాడు.
---
ప్రస్తుతం
ఇద్దరూ బీచ్‌లో అలానే మాటలు మారుస్తూ కూర్చొని ఉన్నారు.
ప్రియా ఏదో తలచుకుంటూ మెల్లగా నవ్వింది.
కృష్: “ఏమైంది?” అని అడుగాడు.
ప్రియా: “ఇప్పుడు తలచుకుంటుంటే నవ్వొస్తోంది… ఇద్దరిలో ఒకరు గీత దాటి ఆ రెండు వైపులా వచ్చి చేరినట్లయితే అయిపోయేది కదా… నువ్వు లేదా నేను…”
కృష్ వెంటనే స్మైల్ చేస్తూ:
“నేను రావాలని అనుకున్నాను. కానీ నువ్వే ఎక్కడ ఉన్నావో చెప్పకుండానే మాయమైపోయావు. అయినా వెళ్లింది నువ్వు… నువ్వే రావాలి,” అని తనకి దగ్గరగా లాగుకుని నవ్వుతూ చెప్పాడు.
ప్రియా: “అందుకే వచ్చాను,” అని మెల్లగా కృష్‌ను తాకుతూ నవ్వింది.
కృష్ కూడా వెనకబడకుండా నవ్వుతూ చేరాడు.
అలా ఆగి కృష్ ప్రియా చేతిని పట్టుకుని ఇలా చెప్పాడు:
“నేను నీతో ఒకటి చెప్పాలి…”
ప్రియా తన వేళ్లను కృష్ పాదాలపై పెట్టి:
“ఇప్పటికే నువ్వు చాలా చెప్పావు. ఇప్పుడు నా వంతు,” అని చెబుతూ ఇలా అంటుంది:
“నాకంటూ నువ్వున్నావని,
నీకంటూ నేనున్నానని,
కలవాలనుకున్నా కలవలేకపోయానని,
మాట ఒకటి చెప్పలేకపోయానని,
నన్ను వెంటాడే నీ కలలకు చెప్పనా…
నాలోనే ఉన్న నా ఊపిరి నువ్వని చెప్పనా…
నా ప్రాణం నువ్వని,
నా ప్రేమ నువ్వని…”
“I love you, కృష్,” అని చెప్పింది.
కృష్ సంతోషంగా:
“I love you too… I love you more… much more…” అని చెప్పాడు.
ఇద్దరూ కలుసుకుని ఆనందంగా నిలిచారు.
కృష్: “ప్రియా, ఇది నా జీవితంలో ఉత్తమ రోజు… ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. పద, ఇప్పుడే వెళ్లి నాన్నతో మాట్లాడుదాం,” అని అన్నాడు.
ప్రియా ఆశ్చర్యంగా అడిగింది:
“అంకుల్‌తో నా…?”
కృష్: “మన పెళ్లి గురించి. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇక ఎక్కడికీ వెళ్ళనివ్వను. మనం పెళ్లి చేసుకుందాం,” అని చెప్పాడు.
ప్రియా సైలెంట్ అయిపోయింది, కృష్‌ను చూసింది.
కృష్: “నువ్వు నాతో పెళ్లి చేసుకోవాలనుకోడం లేదా?” అని ఆందోళనతో అడిగాడు.
ప్రియా: “Of course I want to marry you… కానీ ఒక చిన్న సమస్య ఉంది,” అని అర్థముగా చెప్పింది.
కృష్ వెంటనే అడిగాడు:
“ఇప్పుడు ఏ సమస్య?”
ప్రియా: “బాబాయి…” అని సలముగా చెప్పింది.
కృష్: “సీరియస్‌గా? బాబాయికి మన రిలేషన్‌లో సమస్య ఏంటి?” అని అడిగాడు.
ప్రియా బాధతో:
“కృష్, నాకు మా నాన్న–బాబాయి ఇద్దరూ ఒకటీ. బాబాయి చిన్నప్పటి నుంచి నన్ను చాలా గారాబంగా చూసుకున్నారు. నాన్న చనిపోయాక ఆయనే మమ్మల్ని దగ్గరుండి చూస్తున్నారు. బాబాయికి మీ ఫ్యామిలీ వల్లే నాన్న అలా అయిపోయారు అన్న కోపం. ఇంకా ఆ కోపం తగ్గలేదు… అంతే,” అని చెప్పింది.
కృష్: “నాకు అర్థమైంది… చింతించకు. బాబాయితో నేను మాట్లాడతాను. వారు ఒప్పుకున్నాక మన పెళ్లి జరుగుతుంది,” అని ప్రియా చేతిని పట్టుకుని చెప్పాడు.
ప్రియాకు సంతోషంగా అనిపించింది.
కృష్: “ఇప్పుడు ఎలా వచ్చావు? బాబాయికి చెప్పి వచ్చావా?” అని ఆశ్చర్యంగా అడిగాడు.
ప్రియా నవ్వుతూ:
“అబద్ధం చెప్పి వచ్చాను. నిన్ను చూడకుండ ఉండలేకపోయాను. ఏమి చేయాలో అర్థం కాక, నా ఫ్రెండ్ ద్వారా బాబాయికి ఫోన్ చేయించి ట్రిప్‌కు వెళ్తున్నానని చెప్పి వచ్చాను. రేపు తెల్లవారుజామున బయలుదేరి వెళ్లాలి.”
కృష్ సంతోషంతో:
“నా కోసం అబద్ధం చెప్పి ఇంత దూరం వచ్చావా!” అని మురిసిపోయాడు.
కృష్: “నాకు తెలుసు ప్రియా. నువ్వు కంగారు పడకు. బాబాయితో నేను మాట్లాడుతాను. నువ్వు మార్నింగ్ విశాఖపట్నంకి బయలుదేరు. నేను రెండు రోజులు తరవాత మీ ఇంటికొచ్చి బాబాయితో మాట్లాడుతాను. వాళ్లు కన్‌విన్స్ అయ్యేవరకు అక్కడే ఉండి కన్‌విన్స్ చేస్తాను. సరేనా?
నెక్స్ట్ టైమ్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరం కలసి వస్తాం,” అని చెప్పాడు.
ప్రియా సంతోషించింది.
ఇద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకున్నారు.
అప్పటివరకూ…
“మనం ఆగిపోదాం కానీ,
చెయ్యి వదలకుండ పట్టుకుందాం,”
అని చెబుతూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తున్నారు.
ప్రియా: “రేపు మోర్నింగ్ రైల్వే స్టేషన్‌లో నన్ను డ్రాప్ చేయి,” అని చెప్పింది.
కృష్ నవ్వుతూ:
“ఎందుకు… ఎలా వచ్చావో అలా వెళ్ళు. నేను నా నిద్రను చేజారనివ్వను,” అని సరదాగా చెప్పి ఇద్దరూ నవ్వుతూ టైమ్ స్పెండ్ చేశారు.
ప్రియా: “లేట్ అవుతోంది… వెల్దాం పద,” అని కృష్‌కు చెబుతూ నవ్వుతూ పరుగు తీసింది.
కృష్: “అగు…” అని ఆమె వెనకనే పరుగెత్తాడు.
---
– ముగింపు –
మౌనం మట్లాడేనే…