Featured Books
  • అంతం కాదు - 24

     ఇక సముద్రం పైన చూస్తే చనిపోయిన శవాన్ని అంటే సామ్రాట్ శవాన్న...

  • మౌనం మట్లాడేనే - 8

    ఎపిసోడ్ - 8 విక్రం యొక్క అంగీకారంప్రియా, ఆదిత్య దగ్గరకు పరుగ...

  • కళింగ రహస్యం - 4

    ఆ రోజు రాత్రి 9 ఏళ్ళ అనిరుద్ కి వీరఘాతకుడి కధ చెప్పి శాంతి న...

  • థ జాంబి ఎంపరర్ - 16

    అంతే! స్కెలిటన్ జాంబీ తన చేతుల్లోంచి కత్తులు లాంటి ఎముకలను వ...

  • కళింగ రహస్యం - 3

    Part - III ఆ రోజు రాత్రి అందరు పడుకున్నాక వంశి నెమ్మదిగా బయట...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మౌనం మట్లాడేనే - 8

ఎపిసోడ్ - 8


విక్రం యొక్క అంగీకారం


ప్రియా, ఆదిత్య దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి —

“అంకుల్ … లేవండి… అంకుల్, please wake up…” అని నీళ్లు తీసుకొచ్చి, ఆయన ముఖంపై చల్లింది.

ఆదిత్య మెల్లగా స్పృహలోకి వచ్చారు.


“అంకుల్, కొంచెం నీళ్లు తాగండి,” అని ఆత్రంగా చెప్పి, కొంచెం నీళ్లు తాగజేసింది. ఆయన మెల్లగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నంతలో, ప్రియా కట్లు విప్పడానికి ప్రయత్నం చేస్తుంది విక్రం చూసి ఇలా అన్నాడు —


విక్రం: “Oh, come on Priya… don’t act smart… Move away.”

అని చెప్పి, గన్‌ను తన తలమీద పెట్టి పక్కనే కూర్చోబెట్టాడు.


ఆదిత్యకి పూర్తిగా మెలకువ వచ్చింది.

ఆదిత్య: “విక్రం, వదులు తనని! ఏమైంది నీకు? ఎందుకు అందరితో ఇలా ప్రవర్తిస్తున్నావ్?” అని కోపంగా అరవగా —


విక్రం నవ్వుతూ —

“Cool, అన్నయ్య… What did you say? ఎందుకిలా చేస్తున్నానా? సరే… ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి…


విక్రం యొక్క వేదన


విక్రం:

“నీకు తెలుసా… చిన్నప్పటి నుంచి ఇంట్లో, స్కూల్లో, కాలేజీలో… చివరికి ఉద్యోగం వరకూ… ప్రతీ విషయంలోనూ నువ్వే ముందుండేవాడివి.

అందరు ‘అన్నయ్యను చూసి నేర్చుకో’ — అని చెప్పేవారు.

నేను అడిగింది… ఎప్పుడూ నాకు దొరకలేదు. నేను అనుకున్నది… చేయనీయలేదు.

నువ్వు అన్నిటిలోనూ ముందుండి, నేను నీ వెనకాల నడవాల్సిందేనా?

నాకు ఒక అభిప్రాయం ఉండకూడదా? ఒక కల ఉండకూడదా?

స్కూల్ నుంచి కాలేజ్ వరకూ నువ్వు చదివిందే నేనూ చదవాలి… బుక్స్ కూడా నీవే వాడాలి… నా అభిప్రాయం గురించి ఎవరూ ఆలోచించలేదు… ఎవరూ అడగలేదు.

ప్రతిసారీ నువ్వే లైమ్‌లైట్ లో ఉంటావ్… నేను నీ వెనకాల ఒక సెక్యూరిటీ గార్డ్ లా నిలబడాలా?”

అని కోపంగా అన్నాడు.


ఆదిత్య:

“నువ్వు ఇంత ఇన్సెక్యూర్ గా ఉంటావని నాకు తెలియదు రా…

ఒకసారి చెప్పుంటే అన్ని నీకే ముందే  ఇచ్చేసే వాని కదా… నీ అహం కోసం, నీ స్వార్థం కోసం… ఇంతమంది జీవితాలతో ఆడుకుంటావా? అని ఘాటుగా అన్నాడు.


దాడి మరియు ఆగ్రహం


విక్రం:

“నువ్వు భిక్షం వేసినా, నేను ‘సరే అన్నయ్య’ అని వంగి నమస్కరించాలా?” నువ్వు ఇస్తే అది నాకు భిక్షం తో సమానం, అదే నేను తీసుకుంటే అది నా బలం.

అని అనేసి, గాయం అయిన చేతిపై గన్‌తో కొట్టాడు.


ఆదిత్య నొప్పితో అరవగా…

ప్రియ వెంటనే వచ్చి విక్రం కాలర్ పట్టుకొని తోసేసింది.


ప్రియా: “Uncle… Uncle, are you OK?” అని ఏడుస్తూ ఆత్రంగా అడిగింది.


తరువాత కోపంగా విక్రం కాలర్ మరోసారి పట్టుకొని —

“నీ ఇన్స్యూరిటి వల్ల ఇంతమంది ప్రాణాలతో ఆడుకుంటావా? అసలు నువ్వు మనిషివేనా?” అని అరిచింది.


విక్రం ప్రియా చేయి వెనక్కి నెట్టి —

“నీ వంతు కూడా వస్తుంది, అమ్మా… ముందు మీ బాస్, మహాన నాయకుడు Mr. ఆదిత్య వర్మ ని తన వైఫ్ కౌసల్యాదేవి గారి దగ్గరికి పంపి… ఇక నీ దగ్గరికి వస్తాను…” అని చెప్పి ప్రియా ని తోసేశాడు.


---


అసలు నిజం బయటపడటం


విక్రం:

“ఇన్ని రోజులు అన్నీ నువ్వే చేసావనుకుంటున్నావా, అన్నయ్య?

కాదు… గత కొన్నేళ్లుగా నీ జీవితంలో జరిగిన ప్రతీ సంగతీ… నేను చేయించినదే.

నీ వృత్తి లో, నీ జీవితంలో పీక్ టైంలో ఉన్నప్పుడు… నీది అనుకున్నదాన్ని నేను తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే చేశాను కూడా.

ముందు నీ తల్లిదండ్రులని — అంటే మన తల్లిదండ్రులని — చంపించాను.

తర్వాత నీ కంపెనీ ని… నీ స్నేహితుడిని… నీ భార్యను… ఇప్పుడు నిన్ను కూడా.”


ఆదిత్య, ప్రియ ఇద్దరూ షాక్‌లో ఒకరినొకరు చూశారు.


విక్రం — “అవును అన్నయ్య… నీ తల్లిదండ్రులు చనిపోవడం యాక్సిడెంట్ కాదు. ఆ ప్రమాదం నా ప్లాన్ ప్రకారం జరిగింది… నేను ఏమీ చేసిన ముందు అడ్డు వచ్చేది వాళ్లే కదా అందుకే... తరువాత కంపెనీ లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేటట్లు చేశాను… నేను అక్కడే పని చేసేలా ఆఫర్ ఇచ్చారు. నువ్వు రెడీ చేసిన ప్రజెంటేషన్ ని మార్చి, నిన్ను జాబ్ నుంచి తొలగించించాను. తర్వాత అప్పుల పాలయ్యారు వేరే చోట షిఫ్ట్ అయ్యారు.

తర్వాత ప్రియా తండ్రితో కలిసి AK Vision Works స్టార్ట్ చేసావ్… ఆ కంపెనీ బాగా నడిచింది… కానీ నాకు నచ్చలేదు. 

ఇన్వెస్టర్సతో కలిసి గోప్యంగా డీల్ చేసి, నీ కంపెనీ లో జాయిన్ అయ్యాను.

కంపెనీ ఫైల్స్, డాక్యుమెంట్స్, క్లయింట్స్ వివరాలు — ఏది మిగల్లేదు… అన్నీ తీసేశాను.

అసలు ఆ రోజు నువ్వు సింగపూర్ వెళ్లేల చేసింది నేనే. కంపెనీ నా చేతుల్లో రావాలంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు కదా అందుకే..

నీ వైఫ్ హాస్పిటల్ లో ఉందని నమ్మించి ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అని నాటకాలు ఆడి సైన్ చేయించాను… దాంతో కంపెనీ నీ చేతుల్లో నుండి పోయింది. మళ్లీ రోడ్డున పడ్డావు.

ఆ తరువాత నీ ఫ్రెండ్ గిల్ట్‌తో చనిపోయాడు… నీకు తాగుడు అలవాటు చేశాను. నీ భార్యకు నిజం తెలిసింది, నీ భార్యను చంపేశాను… కృష్ కి అది హార్ట్ అటాక్ అని చెప్పాను.

మొత్తానికి Vikram Group of Industries పేరుతో నేను సామ్రాజ్యాన్ని నిర్మించాను, చాలా బ్రాంచెస్ పెట్టాను. నిన్ను నా కంపెనీ లో పెట్టుకున్నాను. 

ఇన్నేళ్లు CEOగా ఉన్నావ్ అనుకున్నావా?… పేరుకి మాత్రమే మీరు CEO.. అక్కడ అన్ని నా కంట్రోల్ లోనే ఉంటుంది. ప్రతి డెసిషన్ నా పర్మిషన్ తోనే తీసుకోవాల్సింది. అది నీ స్థాయి..

కృష్ డిగ్రీ పూర్తయ్యాక అక్కడే జాయిన్ అయ్యేలా చేశాను.

ఇక్కడివరకు బాగానే సాగింది… కానీ ప్రియా ఎక్కడినుంచి వచ్చిందో… అన్నీ మార్చేసింది.


కృష్ ప్రియని ప్రేమించాడు… కానీ ఆమె కృష్ణ ప్రసాద్ రావు కుమార్తె అని తెలియదు.

నువ్వు నిజం బయట పెట్టడానికి ప్రయత్నించావు… కానీ చివరికి నా దగ్గరికి వచ్చి చిక్కుకున్నావు.”


---


ముగింపు పోరాటం


ఆదిత్య: “నువ్వు అమ్మా, నాన్నను చంపి… నా భార్యను చంపి… నన్ను నాశనం చేసినా… నిన్ను విడిచిపెట్టను, విక్రం!”


ప్రియా, పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని విక్రం కళ్ళ దగ్గరికి కొట్టింది. గన్ కిందపడింది. ఆదిత్య, విక్రమ్‌ని బలంగా కొట్టడం మొదలుపెట్టాడు.

ప్రియా — “Uncle, చాలు! ఆపండి!” అని అడ్డుకునే ప్రయత్నం చేసింది.

విక్రం కిందపడ్డాడు. ప్రియా అదే కుర్చీ కి విక్రం ని కట్టేసింది.


---


ప్రియా యొక్క తెలివి


విక్రం కి దగ్గరగా వెళ్ళి ప్రియా —

“So Mr. విక్రం వర్మ … ఇంతసేపు నీ గన్ చూసి భయపడ్డాననుకున్నావా? అని చెప్పి అక్కడే ఉన్న ఫోటో ఫ్రేమ్ వెనకాల పెట్టిన తన ఫోన్ తీసింది.

ఇంతసేపు నువ్వు చెప్పిన ప్రతీ మాట…వీడియోతో పాటు రికార్డు అయింది.

ఇది చాలు కోర్టు లో నీ కుట్రలు నిరూపించడానికి.”


పోలీస్ కి కాల్ చేసింది.

“10 నిమిషం లో పోలీసులు ఇక్కడ ఉంటారు… నీ చాప్టర్ కి ముగింపు,” అని చెప్పింది.


ఆదిత్య: “నువ్వు చేసిన పనులకు జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాను.” అని అన్నారు 


---


అరెస్టు


పోలీస్ వచ్చి విక్రం ను అరెస్ట్ చేశారు.

ఆదిత్య — “స్టేషన్ కి తీసుకెళ్ళండి… నేను కంప్లయింట్  ఇస్తాను.. FIR నమోదు చేయండి,” అని చెప్పారు.


ప్రియా: “అంకుల్, ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ అవసరం… రేపు కంప్లయింట్ రిజిస్టర్ చేద్దాం,” అనగా…

ఆదిత్య: “లేదు అమ్మా… ముందుగా ఇతనికి శిక్ష పడాలి… ఇప్పడు అదే ముఖ్యం,” అని పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.

విక్రం నేను మిమ్మల్ని వదలను అని గట్టిగా అరుస్తు ఉన్నాడు.

కంప్లయింట్ ఇచ్చిన తర్వాత, ప్రియా ఆదిత్యని హాస్పిటల్ కి తీసుకెళ్ళింది.

కృష్ కి కాల్ చేసినా, ఫోన్ ఎత్తలేదు.


---


కొత్త మలుపు


ప్రియా ఆందోళనగా తిరుగుతుంటే… వెనక నుంచి ఎవరో భుజంపై చేయి వేశారు.

తిరిగి చూసి ఆశ్చర్యపోయింది —


“బాబాయి! మీరేంటి ఇక్కడ?”


బాబాయి: “నిన్ను వెతుక్కుంటూ వచ్చాను… నువ్వు, నీ అమ్మ ఇప్పుడే నాతో కలిసి విశాఖపట్టణం వస్తున్నారు… రా!” అని చేయి పట్టుకొని లాగాడు.


ప్రియా: “బాబాయి, ఆగండి… మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడే వెళ్లడం ఏంటి? నాకు ఏం అర్థం కావట్లేదు…”


బాబాయి: “నాకు అంతా తెలుసు.”


ప్రియా: “ఏం తెలుసు?” అని అడగగా…


బాబాయి: “అవును… నాకు అన్నీ తెలుసు. ఇక మౌనంగా నాతో రా… లేదంటే మీ నాన్న మీద ఒట్టు,” అని చెప్పి, ప్రియాని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు.


[ముందుకు కొనసాగుతుంది]