ఎపిసోడ్ – 4
ఎదురుగాలిలో నిలిచిన నిశ్శబ్దం
అలా సముద్రపు ఒడ్డులో కూచొని మాటలు కొనసాగిస్తున్నారు...
[ ఫ్లాష్‌బ్యాక్ ]
ప్రేమ పావురం కాలాన్ని మించి ఎగురుతోంది…
తనవైపు మళ్లే ప్రతి సరిహద్దును దాటేస్తోంది…
ఇద్దరు ఒకరు గా మారరు కానీ,
తెలియనిదేదో గాలి కమ్మేస్తోంది...
తెలియక ప్రేమ మయకంలో మునిగారు ఇద్దరూ…
ఏ గాలి, ఏ తుఫాను వచ్చినా “చేయి వదలము” అనుకున్నారు ఇద్దరూ…
ఇంత లోతుగా ప్రేమించుకున్నా —
ఇంకా ఆ మూడు ముక్కలు మాత్రం
చెప్పుకో లేదు ఇద్దరు..
రానేవచ్చింది ఎదురు చూస్తున్న రోజు,
ఒక మాట చెప్పాలనుకున్న రోజు…
ఆ మూడుముక్కల్ని మూడుముళ్లుగా మార్చేద్దాం అనుకున్నారు ఇద్దరూ…
ఆ రోజు ప్రియ బర్త్‌డే —
క్రిష్ ఎన్నో రోజులు గా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది...
క్రిష్ – స్వాతి తో మాటల్లో:
క్రిష్: “స్వాతి, ఈ రోజు ప్రియ బర్త్‌డే. తనకి సర్‌ప్రైజ్ పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాను…
ఈరోజు I will definitely say those 3 magical words to her!” అని నవ్వుతూ అన్నాడు.
స్వాతి: “చెప్పు, చెప్పు! అక్కడంతా మిమ్మల్ని లవర్స్‌గా చూస్తున్నారు…
ఇవాళ్టి తర్వాత ఆఫీషియల్‌గా ప్రకటించేయ్!" అని ప్రియ చెప్తున్నట్టు హుందాగా చెప్పింది.
క్రిష్: (స్మైల్ చేస్తూ) “హ్మ్… ఈవెనింగ్ పార్టీకి అందరూ రావాలి. Call everybody…”
స్వాతి: “Ok ok! I will invite everyone…” అని చెబుతూ వెళ్తుంది.
క్రిష్ (తనలోతానే):
"We’ll start our new life from today, ప్రియ… I’m so excited!"
అంటూ హ్యాపీగా ఫీలవుతూ రెడీ అవుతున్నాడు.
---
అలాగే అదే రోజు…
ప్రియ, ఆదిత్య వర్మ గారిని కలవడానికి వారి ఇంటికి వెళుతుంది.
Calling bell రెండు సార్లు కొట్టింది. ఎవరూ తలుపు తీయలేదు.
తనలో తానే… భయంతో ఇలా అనుకుంటూ:
ప్రియ:
"దేవుడా… ఈరోజు క్రిష్‌తో నా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. దాచిన నిజాన్ని కూడా చెప్పి… కానీ ఆ అడుగుల్లో మేము ఇద్దరమే ఉంటే సరిపోదు.. మా ఇద్దరి ఫ్యామిలీ కూడ కలవాలి, ఒప్పుకో వాలి.. ప్లీజ్ స్వామీ… యెలాగైనా అంకుల్ మా ప్రేమను అంగీకరించే లాగ చూడు!"
అంతలో పనివాడు తలుపు తీసాడు.
ప్రియ: “ఆదిత్య సర్‌ని కలవాలి…”
దాసయ్య లోపలికి పిలిచి, "సర్‌ని పిలిచి వస్తాను" అని చెబుతాడు.
ఇంతలో ఆదిత్య వర్మ గారు వస్తారు.
ఆదిత్య వర్మ: “Hi ప్రియ… How are you?”
ప్రియ: “I’m fine, అంకుల్… (తప్పు గ్రహించి) I mean, I’m fine… సర్.”
ఆదిత్య (నవ్వుతూ): “ఇది ఆఫీస్ కాదు ప్రియ… You can call me uncle. That’s fine!”
ప్రియ (నవ్వుతూ): “Okay అంకుల్… మీరు ఎలా ఉన్నారు?”
ఆదిత్య: “I’m good. ఏమైనా ముఖ్యమైన విషయం
ఉందా? ఇంత సడెన్‌గా వచ్చావు కదా!”
ప్రియ (కొంచెం టెన్షన్‌తో): “అంకుల్… మీతో ఒక విషయమూ మాట్లాడాలి…”
ఆదిత్య: “చెప్పు ప్రియ… ఏం విషయం? ఎందుకు టెన్షన్ పడుతున్నావ్?”
ప్రియ (నిశ్చయంగా): “Uncle… నేను కృష్ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం."
ఆదిత్య (నవ్వుతూ): “ఇది చెప్పడానికి అంత భయం ఎందుకు? నాకు తెలుసు.”
ప్రియ (ఆశ్చర్యంగా): “మీకు ఎలా తెలుసు?”
ఆదిత్య: “క్రిష్‌ని నేను అంత హ్యాపీగా ఎప్పుడూ చూడలేదు ప్రియ… తన అమ్మ చనిపోయిన తర్వాత క్రిష్‌ని అంత హ్యాపీ గా చూసింది నీతో ఉన్నప్పుడే. తను జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే… నేను ఎందుకు అంగీకరించను?
నువ్వేమీ దిగులు పడకమ్మా… నేను మీ ఇంటికొచ్చి మీ అమ్మా-నాన్నతో మాట్లాడతాను. మీ పెళ్లి బాధ్యత నాది!”
ప్రియ (తడబడుతూ దగ్గరవుతుంది): “Thanks uncle… మీరు ఇంత త్వరగా అంగీకరిస్తారని అనుకోలేదు…”
ఆదిత్య (నవ్వుతూ): “నన్ను అందరూ స్ట్రిక్ట్ అంటారు కానీ… నేను చాలా ఏళ్ల తర్వాత నా కొడుకు ముఖంలో ఆనందం చూశాను. అది కోల్పోవాలని అనుకోను.”
ప్రియ: “Uncle… మీకు ఇంకొక విషయం చెప్పాలి…అని తడబడుతూ.. కొంచం భయం తో అంకుల్ … నేను...నేను... కృష్ణప్రసాద్ రావు గారి కూతుర్ని…” అని చెప్పింది...
ఆదిత్య (ఘోరంగా షాక్): “What?!”
ప్రియ: “అవును అంకుల్… నేను కృష్ణప్రసాద్ రావు గారి కూతుర్ని. ప్రియ కృష్ణప్రసాద్ రావు…”
ఆదిత్య (ఒక్కసారిగా లేచి): “GET OUT!!”
చేయి తలుపు వైపు చూపిస్తూ, “దాసయ్య… ఇంకో ఐదు నిమిషాల్లో ఈ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు!” అని అరిచి లోపలకి వెళ్తుండగా.
ప్రియ (భయంతో కానీ ధైర్యంగా): “అంకుల్ please… ఒక్కసారి నేను చెప్పేదీ వినండి…”
అయినా వినకుండా మెట్లు ఎక్కుతుంటే:
ప్రియ (గట్టిగా): “అయిన… ఇప్పడు లేరు అంకుల్!” అనగానే
ఆదిత్య ఆగి వెనక్కి చూసాడు… ప్రియ కళ్లలో నీరు…
ప్రియ: “అవును అంకుల్ … మా నాన్న చనిపోయి ఐదు ఏళ్లు అయింది…”
ఆదిత్య షాక్‌లో కళ్ళు తెరిచి చూస్తున్నాడు…
---
ఇదే సమయంలో క్రిష్:
తనకి ఏం జరుగుతోందో తెలియక, ప్రియ కలుస్తున్న స్పాట్ దగ్గర సర్‌ప్రైజ్ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నాడు.
“Wish చేద్దామని ” అనుకుంటూ ఫోన్ తీసి చూస్తాడు…
“వద్దు … సాయంత్రం డైరెక్ట్ గా ప్రపోజ్ చేసాక wish చేద్దామని…” మళ్లీ ఫోన్‌ను జేబులో పెడతాడు.
---
ఇక్కడ ఇంట్లో:
ఆదిత్య గారు కోపంగా చూస్తుంటే, ప్రియ చెబుతుంది:
ప్రియ: “అంకుల్ … please listen to me…”
ఆదిత్య: “GET OUT!” అని కోపంగ అన్నారు..
ప్రియ షాక్ అవుతుంది… కళ్ళలో కన్నీళ్లు… ఒక్క నిమిషం ఎమి మాట్లాడలేకపోతుంది...
---
[ ప్రస్తుతం ]
ప్రియ క్రిష్‌ని చూస్తూ:
“ఆ రోజు అంకుల్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతారన్నది తెలుసు… కాని అలా రియాక్ట్ అవుతారు అని అసలు ఊహించలేదు క్రిష్…”
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ కౌగిలించుకుంటారు…
---
[మరింత కొనసాగుతుంది…]