భారత దేశం మొత్తానికి సంచలనంగా మారిన మీరా rape & murder case లో జడ్జి గారు ఇవ్వబోయే తుది తీర్పు కోసం court లో ఉన్న మీరా తల్లి, తండ్రులు మరియు స్నేహితులతో భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంది. తన కూతుర్ని దారుణంగా rape చేసి చంపిన వాళ్ళని న్యాయస్థానం శిక్ష విధిస్తుందా, లేదా అనే తెలియని భయంతో మీరా తల్లి, తండ్రులు ఎదురు చూస్తున్నారు. Court లోపలికి వెళ్ళే ధైర్యం లేని మోనిక తన స్నేహితురాలిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి అని దేవుడిని వేడుకుంటుంది. మీడియా వాళ్ళు ఏ తీర్పు ఇస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముద్దాయి అధికార పార్టీ mp కొడుకు కావడంతో ప్రతిపక్షాలు మీరా చావుని రాజకీయ అస్త్రంగా వాడుకుని దేశం మొత్తం, ఒక సంచలన case గా మారేలా చేయడం వల్ల, దేశం మొత్తం ఈ case లో వచ్చే తీర్పు కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. జడ్జి గారు తీర్పు కాపీని దగ్గరకు తీసుకొని కళ్ళజోడు సరి చేసుకుంటూ చూస్తున్నాడు. మీరా తల్లి, తండ్రులు ఊపిరి బిగబట్టి నిశ్శబ్దంగా జడ్జి గారు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. Mp కొడుకు సూరజ్ మరియు అతని స్నేహితులు భయం, భయం గా judge వైపు చూస్తూ ఉన్నారు. Court లో ఉన్న జనం గొడవ చేస్తూ ఉండడం గమనించిన జడ్జి గారు silence, silence అని సుత్తితో కొట్టి కళ్ల అద్దాలు సరి చేసుకుని, తీర్పు కాపీని దగ్గరకు తీసుకొని, మీరా మానభంగం మరియు హత్య case లో ముద్దాయిలు గా ఉన్న సూరజ్, శివ, కార్తికేయ మరియు అఖిలేష్ లపై ఆరోపించబడిన నేరాలను సరైన సాక్ష్యాధారాలతో నిరూపించని కారణంగా, ముద్దాయులను నిర్దోషులుగా నిర్ధారించి విడుదల చేయడం జరిగినది. అని జడ్జి నోటి నుంచి తీర్పు రాగానే court Hall మొత్తం అరుపులతో నిండిపోయింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు కాని జడ్జి గారు ఇచ్చిన తీర్పు అక్కడున్న వాళ్ళకి నచ్చలేదు అని మాత్రం అర్థం అయ్యింది. జనంలో కూర్చుని ఉన్న మీరా అమ్మగారు 45 సంవత్సరాల జుబేదా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. ఆ పక్కనే ఆమె భర్త 48 సంవత్సరాల పరూక్ ఏడుస్తూ ఆమెని పట్టుకుని ఉన్నాడు.. లాయర్ వీరేంద్ర నాయర్ తో పాటు Mp పట్నాయక్ కొడుకు Sooraj మరియు అతని friends నడుస్తూ కిందకి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా ఆవేశంగా sooraj కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు బరికెట్లు పెట్టీ వాళ్ళని బలవంతంగా ఆపుతూ ఉన్నారు. ఆ జనం లోంచి మోనిక కోపంగా సూరజ్ వైపు చూస్తూ ఉంది, తన చేతిలో ఉన్న రాయి వైపు చూసింది. సూరజ్ తన ఫ్రెండ్స్ అండ్ లాయర్ తో కలిసి court మెట్లు దిగుతున్నాడు. మోనిక రాయిని గట్టిగా సూరజ్ వైపు విసిరింది, రాయి వెళ్ళి సూరజ్ నుదిటి మీద తగిలింది. సూరజ్ బాధతో తల పట్టుకున్నాడు, కొంతమంది పోలీసులు కంగారుగా పరిగెడుతూ వెళ్ళి సూరజ్ చుట్టూ కాపలాగా నిలబడ్డారు.. సూరజ్ కోపంగా తల పైకెత్తి జనంలోకి చూసి, అక్కడ మోనిక తన వైపు కోపంగా చూస్తూ ఉండడం గమనించి తనే కొట్టింది అని అర్ధం చేసుకుని కోపంగా మోనిక వైపు వెళ్ళబోతుండగా lawyer ఆపి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైనా జరిగిందా నిన్ను ఇక ఎవరు కాపాడలేరు. ఈ case నుంచి చాలా కష్టపడి బయటకి తీసుకొచ్చాను, నువ్వు మళ్ళీ పెంట చేస్తే నీ జీవితమే కాకుండా, మీ నాన్న గారి పొలిటికల్ career కి కూడా end card పడిపోతుంది అన్నాడు. సూరజ్ కోపాన్ని control చేసుకుని, మోనిక వైపు కోపంగా చూస్తూ, పోలీసుల సహాయం తో తనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న జనాన్ని, మీడియా ని తప్పించుకుని car దగ్గరకి వెళ్ళి car ఎక్కి వెళిపోయాడు. మోనిక and her friends కోపంగా చూస్తు ఉన్నారు...
సంవత్సరం తర్వాత:
అర్దరాత్రి 2 గంటల సమయంలో, పూర్తిగా మంచుతో కప్పేసి ఉన్న, పెద్దగా వాహనాలు తిరగని ఒక road లో, మొహానికి monky cap వేసుకుని, road side ఉన్న మైలు రాయి మీద కూర్చుని, cigarette కలుస్తూ road వైపు చూస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. కొంత సేపటి తర్వాత దూరంగా car lights కనిపించడంతో పైకి లేచి పాంట్ సరి చేసుకుంటూ అటు వైపు నడుస్తున్నాడు. car వస్తూ, వస్తూ అతనికి కొంచెం దూరంలో ఆగింది. monkey Cap వేసుకున్న వ్యక్తి తన వెనుక జేబులో ఉన్న కత్తి తీస్తూ car దగ్గరకి వెళ్తూ ఉన్నాడు. ఆగిన car లోంచి lawayer జితేందర్ reddy కిందకి దిగి ఫ్రంట్ tyre మీద phone light వేసి చూస్తాడు. tyre puncture అవడం చూసిన జితేందర్ reddy విసుక్కుంటూ phone lock on చేసి ఎవరికో phone చేసి చెవి దగ్గర పెట్టుకుని, ఈ time లో phone lift చూస్తాడో, లేదు అని అనుకుంటుండగా వెనుక నుండి ఏదో శబ్దం వచ్చినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూసాడు, monky cap వేసుకున్న వ్యక్తి చేతిలోని కత్తి అప్పటికే అతని వైపు దూసుకొచ్చిన జితేందర్ రెడ్డి పొట్టలో దిగుతుంది. జితేందర్ రెడ్డి నొప్పితో కిందకి కూలబడి పోయి మాట్లాడడానికి ప్రయత్నించాడు కాని మాట రాలేదు, పొడిచిన చోట గట్టిగా అదిమి పట్టుకుని దగ్గి, చావు భయంతో అతి కష్టం మీద monkey Cap అతని వైపు చూసి ఎవ.. ఎవరు నువ్వు అని అడిగాడు. monkey Cap వేసుకున్న వ్యక్తి కింద కూర్చుని జితేందర్ రెడ్డి వైపు కొన్ని క్షణాల పాటు చూసి "సారీ" అని చెప్పి గుండెలో గట్టిగా పొడిచాడు. ఆ పోటుతో ఒంట్లో ఓపిక లేని జితేందర్ రెడ్డి గిల గిల కొట్టుకుంటూ కొన్ని క్షణాల్లోనే, monkey Cap వేసుకున్న వ్యక్తి వైపు చూస్తూ చనిపోయాడు. monky cap వేసుకున్న వ్యక్తి జితేందర్ రెడ్డి shirt కి, కత్తికి ఉన్న రక్తపు మరకల్ని తుడిచి పైకి లేచి, పక్కనే ఉన్న జితేందర్ రెడ్డి car లో ఉన్న water bottle తీసుకుని కత్తికి, తన చేతి గ్లౌస్ కి అంటుకున్న రక్తపు మరకలను కడిగి, కొద్దిగా water తాగి water bottle కింద పడేసి, కత్తిని వెనుక జేబులో పెట్టి, ముందు జేబులో ఉన్న ciggerate packet లోంచి ఒక సిగరెట్ తీసుకుని వెలిగించి, తన bike దగ్గరకి వెళ్ళి bike start చేసి దూరంగా వెళ్ళిపోయాడు.
We will meet very soon with next episode... Please give me me your feedback..