Read Meera (One Love, One Revenge) - 3 by surya Bandaru in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మీరా (One Love, One Revenge) - 3

మౌనిక tension పడుతూ ఉండడం గమనించిన నాని "అలాంటి వాళ్ళకి ఎంతో మంది శత్రువులు ఉంటారు, ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర పాడుచేసుకోకండి" అని మౌనిక వైపు చూసి "వెళ్దామా"? అన్నాడు. 

మౌనిక రెండు క్షణాలు నాని వైపు చూసి silent గా బయటకు వెళ్తుంది. 

"సరే రా మీరు collage కి వెళ్ళండి, మేము temple నుంచి Direct గా collage కి వచ్చేసాం" అంటూ మౌనిక వెనుక నడుస్తూ వెళ్ళాడు నాని.



వెంకటేశ్వరస్వామి ఆలయం 
శనివారం కావడంతో భక్తులతో నిండిపోయిన వెంకటేశ్వరస్వామి ఆలయం ముందు scooter ఆపాడు నాని, మౌనిక కిందకి దిగింది. 

నాని scooter park చేయడానికి వెళ్తూ "నువ్వు వెళ్తూ ఉండు నేను పార్కింగ్ లో పెట్టి వస్తాను" అని పక్కనే ఉన్న పార్కింగ్ place లో scooter park చేసి, తన ముందు నడుస్తున్న మౌనిక వైపు వెళ్ళాడు. 

ఇద్దరూ కాళ్ళు కడుక్కుని ఆలయంలోకి వెళ్తున్న సమయంలో మౌనిక, నాని చేయి పట్టుకుని "ప్రదక్షిణలు చేద్దాం పద" అంది, 

నాని మోనిక వైపు చూసి ఇక చేసిది ఏమి లేక తప్పదు అన్నట్లు silent గా తన వెనుక నడిచాడు. 

3 సార్లు తిరిగినా కూడా ఇంకా తిరుగుతూ ఉండడంతో doubt గా మౌనిక దగ్గరకు వెళ్లి "3 సార్లు అయిపోయింది కదా ఇంకా ఎందుకు తిరుగుతున్నావ్"? అని అడిగాడు. 

మౌనిక దండం పెట్టుకుంటూ తిరుగుతూనే "108 సార్లు తిరగాలి" అంది. 

ఆ మాట వినగానే కళ్ళు తీరినట్లు అయిన నాని "108 సార్లా? ఏంటి పిచ్చి, పిచ్చి గా ఉందా, టెంపుల్ చూసావా ఎంత పెద్దది ఉందో? సాయంత్రం అవుతుంది పూర్తి అయ్యేసరికి, నా వల్ల కాదు" అని కోపంగా ఆగిపోయాడు. 

మౌనిక serious గా నాని వైపు చూస్తూ ఉంది. 

నాని నీరసంగా చూస్తూ "అమ్మ, తల్లి నా వల్ల కాదు. నేను అసలు గుడికే వెళ్ళను, ఐనా నీ కోసం తప్పక వచ్చాను" అన్నాడు. 

నాని దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని ప్రేమగా కిప్రదక్షిణలు కూడా నా కోసం చెయ్ ప్లీజ్" అంది మౌనిక. 

నాని కోపంగా చేయి విదిలించుకుని, "ప్రేమిస్తున్నాను కదా అని నువ్వు చెప్పే ప్రతిదీ చేయడం నా వల్ల కాదు" అన్నాడు. 

మౌనిక 2 seconds పాటు silent గా నాని వైపు చూసి "మరి ఎవరి కోసం చేస్తావ్? సరే నన్ను అడుగు నీ కోసం ఏమైనా చేస్తా" అంది మౌనిక. 

మౌనిక కళ్ళలో తన మీద ఉన్న ప్రేమ చూసి, తన కోసం ఏమైనా చేస్తుంది అని చాలా సార్లు అనుభవపూర్వకంగా చూసిన నాని, కొన్ని క్షణాల పాటు మౌనిక వైపు చూసి, ఇక చేసిది లేక అయిష్టంగానే ప్రదక్షిణలు చేయడం start చేశాడు. అతని వెనుక మౌనిక కూడా నడవడం start చేసింది. 

కొన్ని రౌండ్లు తిరిగిన తర్వాత అప్పటికే నీరసంతో నడవలేక నడుస్తున్న నాని "ఎన్ని rounds అయ్యాయి" అని అడిగాడు. 

"75 rounds" అంది మౌనిక, నాని నీరసంగా పక్కనున్న గోడకు జారబడి నుంచుని "ఇక నా వల్ల కాదు" అన్నాడు. 

మౌనిక నాని చేయి పట్టుకుని తన నడుం మీద పెట్టుకుని, తన భుజం మీద చేయి వేసి పట్టుకొని నాని వైపు ప్రేమగా చూసి "పద" అంది. 

నాని నీరసంగా చూస్తూ "ఇలా బలవంతంగా చేస్తే పుణ్యం రాదే అంబులెన్స్ వస్తుంది" అన్నాడు. 

మౌనిక కొన్ని క్షణాల పాటు silent గా చుట్టూ ఉన్న జనాన్ని గమనించి, నాని వైపు చూసి "దేవుడు ఉన్నాడు అనేది నిజమో కాదో నాకు తెలియదు, కాని వాళ్ళ నమ్మకం మాత్రం నిజం" అంటది అక్కడ తిరుగుతున్న భక్తుల వైపు చూపిస్తూ, నాని వాళ్ళ వైపు చూసాడు. 

మౌనిక భక్తుల వైపు చూస్తూ, "ఇక్కడికి వచ్చే వాళ్ళలో చాలా మంది ఏం ఆశించకుండా, కేవలం దేవుడి మీద నమ్మకం తో వస్తారు, నువ్వు దేవుడ్ని నమ్మకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ నమ్మకాన్ని అవమానించే హక్కు నీకు లేదు". 

ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కొన్ని క్షణాల పాటు భక్తి భావంతో కొంత మంది భక్తులు పొర్లి దండాలు పెట్టడం, వయసు మళ్ళిన వాళ్ళు కూడా కష్టం అని అనుకోకుండా 108 ప్రదక్షిణాలు చేయడం చూసిన నాని, మౌనిక వైపు చూసి "ఎక్కడ నేర్చుకుంటున్నవే ఈ డైలాగులు అన్నీ, ఏదోకటి చెప్పి నన్ను మాట్లాడకుండా చేస్తావ్" అని, తన నడుం మీద చేయి తీసి చిన్నగా నవ్వుతూ "పద" అన్నాడు తల ఊపుతూ, 

మౌనిక చిరు నవ్వు నవ్వుతూ నడవడం మొదలు పెట్టింది తన పక్కనే నడుస్తున్న నాని వైపు ప్రేమగా చూస్తూ, 

108 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నాని నీరసంగా ఉండడం గమనించిన మౌనిక "కాసేపు ఇక్కడ కూర్చుని ఆ తర్వాత దేవుని దర్శనానికి వెళ్దాం" అంది. 

నాని ఆయాసపడుతూ "పర్లేదా"? అని అడిగాడు. 

"పర్లేదు లే పద" అని పక్కనే కాలిగా ఉన్న మందిర ప్రవేశంలో ఇద్దరూ కూర్చున్నారు. 

తన వైపు చూస్తూ ఏదో చెప్పడానికి try చేస్తూ, ఎందుకో చెప్పకుండా మౌనిక ఆగిపోవడం గమనించిన నాని కళ్ళతో సైగ చేస్తూ ఏమైంది? అన్నాడు. 

కొన్ని క్షణాల పాటు నాని వైపు ఇబ్బందిగా చూసిన మౌనిక "actual గా నిన్న కౌసల్య (నాని mother) ఆంటీతో మాట్లాడాను. చాలా కాలం క్రితం నీతో 108 ప్రదక్షిణలు చేయిస్తాను అని మొక్కుకున్నాను అని, ఎన్ని సార్లు అడిగినా నువ్వు చేయలేదు అని చెప్పారు, నువ్వైనా వాడి చేత ఆ మొక్కు తీర్పించు అమ్మ అని అడిగారు" అంది. 

మౌనిక తన మీద చూపించే ప్రేమకి ఆనందంగానే ఉన్నా చిరు కోపంతో "మా అమ్మ, నువ్వు కలిసి plan చేశారు ఐతే ఇదంతా"?, అని "సరే పద దర్శనం చేసుకుందాం" అని పైకి లేచాడు. 

మౌనిక కూడా పైకి లేచి ఇద్దరూ నడుచుకుంటూ లోనికి వెళ్లి అక్కడున్న జనం పక్కన line లో నుంచున్నారు. పంతులు గారు దేవుడికి హారతి ఇస్తూ పూజ చేసి అందరికీ హారతి ఇచ్చి, మౌనిక వాళ్ళ దగ్గరకి వచ్చాడు. 

మౌనిక, నాని హారతి కళ్ళకు హద్దుకుని, నాని తన జేబులోంచి 100 రూపాయలు నోట్ తీసి పంతులు గారి చేతిలో ఉన్న పళ్ళెంలో వేశాడు. 

పంతులు గారు ఇద్దరికీ శాతగోపం పెట్టి ఆశీర్వదించారు. మౌనిక, నాని కళ్ళు మూసుకుని దండం పెట్టుకున్నారు. మౌనిక పక్కన plate లో ఉన్న కుంకుమ తీసుకుని తన నుదుటన పెట్టుకొని నాని కి కూడా పెట్టింది. ఇద్దరూ నడుచుకుంటూ బయటకు వెళ్ళారు...

మౌనిక collage campus 

Jean ఫాంట్, tight t-shirt వేసుకుని స్టైలిష్ గా రాగిణి నడుచుకుంటూ వస్తూ ఉంటే, అక్కడున్న కుర్రాళ్లలో చాలా మంది తన వైపే చూస్తున్నారు. 

పక్కన ఉన్న basketball court లో తన friends తో కూర్చుని ఉన్న సుదీర్ రాగిణి వైపు చూసి ఆనందంగా నవ్వుతూ "రాగిణి వస్తుంది రా" అన్నాడు శ్రీను తో, 

రాగిణి వైపు చూసి casual గా ఆ వస్తుంది, అది రోజు వస్తూనే ఉంది కదా, ఏరా రావట్లేదా? అన్నాడు శ్రీను తన పక్కనున్న తన classmats వైపు చూస్తూ, 

sudeer తన వైపు కోపంగా చూస్తూ ఉండడం గమనించిన శ్రీను, "రేయ్ నా మాట విని దాన్ని light తీసుకో, అదేమో super fast , నువ్వేమో 3 years గా చూడడం తప్ప కనీసం తనతో మాట్లాడలేవ్" అన్నాడు శ్రీను,.

ఆ మాటలకి తన ఈగో hurt అయిన sudeer కోపంగా చూస్తూ, "నేను ఇప్పుడే దానికి propose చేస్తాను" అన్నాడు, 

నీకు దైర్యం ఉంటే వెళ్ళి చెప్పరా అన్నట్లు వాళ్ళంతా చూస్తుండడం చూసి "ఏంట్రా అలా చూస్తున్నారు"? అన్నాడు sudeer. 

"propose చేస్తాను అని dialogue చెప్పి 2 minutes అయింది నువ్వు ఇంకా ఇక్కడ ఎంత సేపు ఉంటావా అని చూస్తున్నాను" అన్నాడు శ్రీను. 

సుదీర్ కి కోపం వచ్చి రాగిణి తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న వైపు వెళ్ళాడు. 

శ్రీను పక్కన కూర్చున్న శ్రీను classmate అర్జున్ tension గా చూస్తూ "కొంపతీసి నిజంగానే చెప్పేస్తాడు అంటావా రా"? అంటాడు. వాడికి అంత scene లేదు light తీసుకోరా అన్నాడు. శ్రీను serious గా sudeer వైపు చూస్తూ ఉన్నాడు.

సుదీర్ కొంత దూరం ధైర్యంగా వెళ్ళి  భయంగా రాగిణి వైపు చూసి "I love you చెప్తే ఇది కచ్చితంగా అందరిలో పిచ్చ కొట్టుడు కొడతాది". అని శ్రీను వాళ్ళ వైపు చూసాడు. 

శ్రీను వాళ్ళు తన వైపే చూస్తూ ఉండడం చూసి మొహం తిప్పుకుని ఇప్పుడు "ఏం చేయాలి రా నాయన అనవసరంగా నోటి దూలతో ఇరుక్కు పోయాను, చెప్తే ఇది కొడతాది, చెప్పకపోతే వాళ్ళ దగ్గర పర్మినెంట్ గా ఎదవని అయిపోతాను" అని తనలో తానే తిట్టుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకుని "వాళ్ళ దగ్గర ఎదవని అయ్యే కంటే దీనితో చెప్పు దెబ్బలు తినడమే better, కనీసం నా Love విషయం దానికి చెప్పాను అని సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది" అని ధైర్యం తెచ్చుకుని రాగిణి వైపు వెళ్తాడు. 

రాగిణి దగ్గరికి వెళ్లి భయంగా చూస్తూ ఉన్నాడు. 

శ్రీను వాళ్ళు టెన్షన్ గా అటువైపే చూస్తూ ఉన్నారు. 

భయపడుతూ తనువైపు చూస్తూ ఉండడం గమనించిన రాగిణి "ఏమైందిరా"? అని అడిగింది. 

సుధీర్ కి ఒక్క సారిగా tension start అయ్యి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగి తనవైపే చూస్తూ ఉన్న శ్రీను వాళ్ళ వైపు చూసి, తన మొహం నిండా పట్టిన చమటను కర్చీఫ్ తో తుడుచుకుని మెల్లగా రాగిణి వైపు తిరిగి చూసాడు . doubt గా తన వైపు చూస్తున్న రాగిణి వైపు చూసి తింగరిగా నవ్వాడు. 

Amazon Kindle unlimited లో succesful గా మంచి page reads తో run అవుతున్న मीरा: मरी, लेकिन प्यार नही novel యొక్క తెలుగు version ఇది. ఈ novel మీకు నచ్చితే మీ feed back నాకు తప్పకుండా తెలియజేయండి..


సుదీర్ Propose చేసాడా? లేదా? Propose చేస్తే రాగిణి ఏం సమాధానం చెప్పింది? అనేది రేపటి episode లో చూద్దాం...