Read Meera (One Love, One Revenge) - 4 by surya Bandaru in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మీరా (One Love, One Revenge) - 4

సుదీర్ టెన్షన్ పడుతూ తన మొహం మీద కారుతున్న చెమటను తుడుచుకుని కళ్ళు మూసుకుని ధైర్యం చేసుకుని "రాగిణి ఐ లవ్ యు, ఈ విషయం 1 year గా చెప్పాలని try చేస్తున్న కాని భయంతో చెప్పలేకపోయా" అని మెల్లగా భయంగా కళ్లు తెరిచి చూసాడు sudeer.

రాగిణి మొహం లో ఏ విధమైన expression లేకపోవడంతో భయపడుతూ తన వైపే చూస్తూ ఉన్నాడు.

కొన్ని క్షణాల తర్వాత షాక్ లోంచి బయటికి వచ్చిన రాగిణి sudeer బుగ్గ పట్టుకుని గిల్లుతూ "so sweet" అని, తన bag లో ఉన్న లాలిపాప్ తీసి సుదీర్ కి ఇచ్చి ఈ "love you too" అని నవ్వుతూ తన friends కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

అసలు రాగిణి ఏం చెప్పిందో అర్థం కాని సుధీర్, తన వైపే చూస్తూన్న శ్రీను దగ్గరకి వెళ్ళి silent గా కూర్చున్నాడు.

ఏం జరిగిందో తెలుసుకోవడానికి తహతలడుతున్న శ్రీను tension తట్టుకోలేక "ఏం జరిగింది రా" అని అడిగాడు.

sudeer తింగరిగా శ్రీను వైపు చూసి "నేను దైర్యం చేసుకుని i love you చెప్పాను, తను ఈ లాలీపాప్ ఇచ్చి I love you too అని చెప్పి వెళ్ళిపోయింది, అసలు అది ఏం చెప్పిందో నాకు అర్ధం కాలేదు" అన్నాడు.

శ్రీను వాళ్ళు కొన్ని క్షణాల పాటు అయోమయంగా సుదీర్ వైపు చూసి, అందరూ ఒకే సారి గట్టిగా నవ్వుతారు.

వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాని sudeer వాళ్ళ వైపు అయోమయంగా చూస్తూ ఉండగా, శ్రీను నవ్వు బలవంతంగా ఆపుకుంటు, "నీకు ఇంకా ప్రేమించేంత మెచ్యూరిటీ రాలేదు నాన్న అని చెప్పి లాలిపాప్ ఇచ్చి నిన్ను పెద్ద లాలిపాప్ ని చేసింది రా సన్నాసి" అన్నాడు.

సుధీర్ అవమాన భారంతో కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉండగా దూరం నుంచి మౌనిక scooter drive చేసుకుంటూ వచ్చి స్కూటర్ ఆపి నాని దిగిన తర్వాత scooter parking place కి వెళ్ళింది.

నాని ఒంటి నొప్పులతో ఇబ్బంది పడుతూ మెల్లగా నడుచుకుంటూ సుధీర్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.

నవ్వుతూ ఉన్న శ్రీను, నాని భుజం మీద గట్టిగా కొట్టి "రేయ్ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా"? అంటుండగానే అప్పటికే నొప్పులతో బాధపడుతున్న నాని కి శ్రీను కొట్టిన దెబ్బ వల్ల కోపంతో శ్రీను చెంప మీద లాగిపెట్టి కొట్టాడు.

అలాంటి reaction expect చేయని అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి నాని వైపు చూస్తూ ఉన్నారు.

శ్రీను కొంతసేపటికి ఆ షాక్ నుంచి కోరుకుని "ఎందుకు కొట్టావ్ రా "?అని అన్నాడు.

నాని కోపంగా "body లో ఏ part ని touch చేసినా చంపేస్తా, 108 rounds రా' అన్నాడు.

శ్రీను అయోమయంగా చూస్తూ "108 rounds ఏంట్రా" అన్నాడు.

temple చుట్టూ "108 రౌండ్లు తిప్పింది రా" అన్నాడు బాధగా కాళ్ళు మెల్లగా దగ్గరకు తీసుకుంటూ,

శ్రీను తనకి తగిలిన దెబ్బ విషయం మర్చిపోయి షాక్ తో నాని వైపు చూస్తూ "108 ప్రదక్షిణలా"? అని ఆశ్చర్యంగా చూస్తూ గుండెల మీద చేయి వేసుకుని "ఇంకా నయం రా మమ్మల్ని రమ్మనలేదు" అని వాళ్ళ వైపే వస్తున్న మౌనిక వైపు చూస్తూ,

నాని కి దండం పెట్టి "నువ్వు కాబట్టి బారిస్తున్నావ్ రా బాబు దాన్ని" అన్నాడు.

కొంచెం దూరం లో నాని వైపు నడుస్తూ వెళ్తున్న మౌనిక confusing గా నాని తన వైపు చూడడం గమనించి కళ్ళతో సైగ చేస్తూ ఏంటి అని అంది. నాని చిన్నగా నవ్వి ఏం లేదు అన్నట్లు తల ఊపుతాడు. మౌనిక చిరు నవ్వు నవ్వుతూ తన వైపు నడుస్తూ ఉంది..

police station...police station ఎదురుగా ఆగిన పోలీసు వాహనం లోంచి ప్రతాప్ వర్మ దిగి తన రూం లోకి వెళ్తూ ఉండగా si ప్రమోద్ కంగారుగా వచ్చి selute చేసి "Sir CC TV footage లో ఒక important clue దొరికింది"అన్నాడు.

Pratap Varma ఆశ్చర్యం గా చూస్తూ "ఏంటది"? అన్నాడు.

"రండి sir మీరే చూద్దురు గాని" అని ప్రతాప్ వర్మ తో కలిసి సైబర్ expert దగ్గరకి వెళ్ళి, "sandeep మనం ఇందాక చూసిన వీడియో play చెయ్" అన్నాడు.

సందీప్ Play చేశాడు. ప్రతాప్ వర్మ తీక్షణంగా screen వైపు చూస్తూ ఉన్నాడు. వీడియో లో ఇద్దరు వ్యక్తులు బారికేడ్లు పెట్టి, కావాలి అని లాయర్ ని వేరే root కి divert చేయడం చూసి shok గా SI ప్రమోద్ వైపు చూసి ఏ area ఇది అని అడిగాడు.

"పానమలూరు దగ్గర Sir" అని చెప్పాడు ప్రమోద్.

ప్రతాప్ కొన్ని క్షణాల పాటు వీడియో వైపు చూసి, "ఇది pre planned murder but ఇంతలా plan చేసి murders చేసేంత అవసరం ఎవరికి ఉంది"? అన్నాడు దీర్ఘంగా ఆలోచిస్తూ.

వాళ్ళ మొహాలు ఎక్కడైనా కనిపిస్తాయేమో అని తీక్షణంగా చూసిన ప్రతాప్ వాళ్ళ మొహాలు కనిపించకపోయే సరికి నిరుత్సాహం గా చిరాకు పడుతూ "చా, వీడియో clear గా లేదు" అనుకుని, si ప్రమోద్ వైపు చూసి "లాయర్ ఫ్యామిలీ members ఏమైనా చెప్పారా"? అని అడిగాడు.

"లేదు sir వాళ్ళు కి perticular గా ఎవరి మీద doubt లేదు అంట" అన్నాడు ప్రమోద్.

ప్రతాప్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి "సరే నువ్వు ఒక పని చెయ్, last one year గా అతను హ్యాండిల్ చేసిన ప్రతి కేసు detsils తీసుకురా, అలాగే తన దగ్గర జూనియర్స్ గా పని చేస్తున్న ప్రతి ఒక్కర్ని proper గా enquiry చెయ్ అన్నాడు.

ప్రమోద్ okay sir అని సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. ప్రతాప్ కొన్ని క్షణాల పాటు వీడియో వైపు చూసి అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు.

మౌనిక house;daining table దగ్గర కూర్చుని మౌనిక అన్నయ్య చందు భోజనం చేస్తూ ఉన్నాడు. తన తల్లి, తండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మౌనిక కి అన్ని తానై పెంచాడు చందు. విజయవాడ లోని ఒక ఆటోమొబైల్ కంపెనీ లో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నాడు.

చందు భార్య గీత. గీత ఒక private junior collage లో lecturer గా పనిచేస్తుంది.

గీత కిచెన్ లోంచి ఒక bowl తీసుకొచ్చి చందుకి chicken వేసి, మౌనిక భోజనం తిందువు రా అని పిలిచింది.

మౌనిక నుంచి "ఆ వస్తున్న వదిన" అన్న సమాధానం విన్న గీత రెండు chairs దగ్గర ఒక పెద్ద plate, ఒక చిన్న plate పెట్టి raise వడ్డిస్తూ ఉంది .

మౌనిక ఎత్తుకుని వస్తున్న తన 3 సంవత్సరాల పాప తేజస్వి చాక్లెట్ తింటూ ఉండడం చూసి కోపంగా వెళ్ళి పాప చేతిలో చాక్లెట్ లాక్కుని "నీకు ఎన్ని సార్లు చెప్పాను దీనికి చాక్లెట్ ఇవ్వొద్దని" అంది. 

తేజస్వి ఏడవడం స్టార్ట్ చేయడంతో మౌనిక కోపంగా "ఎందుకు దాన్ని అంతమాను ఏడిపిస్తూ ఉంటావు"? అని, పాపని డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న chair లో కూర్చోబెట్టి కళ్ళు తుడుస్తూ, "ఏడవకు రా బంగారం, మనం shop కి వెళ్ళి 5 చాక్లెట్స్ తెచ్చుకుందాం"అంది.

తేజస్వి ఏడుస్తూనే ముద్దు, ముద్దు గా "మమ్మీ కి ఇవ్వొద్దు" అంది.

డైనింగ్ టేబుల్ దగ్గర plate లో rice పెడుతున్న గీత నవ్వుతూ "నాకు ఇవ్వొద్దు లే కాని వచ్చి బోజనం చేయండి" అంది.

ప్రియా పైకి లేచి తన chair లో కూర్చుని గిన్నెలో ఉన్న చికెన్ కర్రీ చూసి, "చికెన్ కర్రీ నా? నాని గాడికి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం, వదిన కొంచెం box లో పెట్టు వాడికి ఇచ్చి వస్తాను అని పైకి లేచి తన room వైపు వెళ్తూ ఉంది.

"తినేసి వెళ్ళు" అంటది గీత. "వచ్చాక తింటాలే వదిన" అని scooter keys తెచ్చుకోవడానికి తన రూం లోకి వెళ్ళింది మోనిక. 

"నాని పేరు వింటే ఈ అమ్మాయికి ఏమి వినిపించదు" అని చందు పక్కనే ఉన్నాడని గుర్తొచ్చి నాలుక కరుచుకుని, sudden మాట్లాడడం ఆపి, "ఇతను ఉన్నాడు అని మర్చిపోయి తొందరపడి ఏదో వాగేశాను" అనుకుంది. చందు తింటూనే doubt గా గీత వైపు చూస్తున్నాడు.

గీత అతని వైపు చూడకుండా తేజస్వి ప్లేట్ లో curry వేసి కలుపుతూ "నువ్వు తింటూ ఉండు తల్లి నేను aunty కి కర్రీ పెట్టి ఇస్తాను" అని చందు వైపు చూడకుండా తల అటు తిప్పుకుని కిచెన్ లోకి వెళ్ళింది.

గీత లోనికి వెళ్ళే వరకు తన వైపు చూసిన చందు, తేజస్వి వైపు చూసి "తల్లి నేను తినిపిస్తా రా" అన్నాడు.

తేజస్వి లేచి వెళ్ళి చందు ఒడిలో కూర్చుని చందు ముద్దలు పెడుతుంటే తింటున్న time లో box తీసుకుని వచ్చిన గీత, "అది తింటుంది కదా, తినే దాన్ని ఎందుకు చెడగొడుతున్నావ్"? అంటూ box లో chicken పెడుతూ ఉంది. అదే  time లో మౌనిక  "పెట్టావా వదిన"? అంటూ speed గా నడుచుకుంటూ వచ్చింది.

చందు పాప కి తినిపిస్తూ మౌనిక అని పిలిచి, "నాని ని love చేస్తున్నావా"? అని అడిగాడు. తన అన్నయ్య ఇలా direct గా అడగడం తో షాక్ అయిన ప్రియ షాక్ గా చందు వైపు చూస్తూ ఉంది.

చందు అడిగిన ప్రశ్నకు మోనిక ఏం సమాధానం చెప్పింది, అనే దానికి రేపటి episode లో తెలుసుకుందాం అప్పటి వరకు bye... Friends దయచేసి ఈ నవల మీ అభిప్రాయాలను తెలియచేస్తూ ఉండండి దాని వల్ల నాలోని రచయిత ను ఇంకా మెరుగు పరుచుకోవడానికి సహకరించండి..