Read Meera (One Love, One Revenge) - 2 by surya Bandaru in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • మౌనం మట్లాడేనే - 9

    ఎపిసోడ్ – 9ఒక క్షణం, ఒక కలయికబాబాయి యొక్క ఆందోళనప్రియాను విశ...

  • మీరా (One Love, One Revenge) - 2

    crime scene - lawyer జితేందర్ రెడ్డి:lawyer చనిపోయిన ప్రాంతం...

  • అంతం కాదు - 34

    ఇంకా ఆ ఆత్మ అనుకుంటూ ఈ దేవుళ్ళ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిం...

  • భ్రమ

    ఏడేళ్ల వేణు తన చిన్న ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు....

  • అనుకోని పరిచయం

    ️అనుకోని పరిచయం ️మన జీవితంలో కొన్ని పరిచయాలు అనుకోకుండా జరుగ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మీరా (One Love, One Revenge) - 2

crime scene - lawyer జితేందర్ రెడ్డి:
lawyer చనిపోయిన ప్రాంతం పోలీసులు, మీడియా వాహనాలతో నిండిపోయింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది రాకుండా కొంతమంది పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఒక పోలీసు వాహనం వచ్చి అక్కడ ఆగింది, దాంట్లోంచి ci pratap Varma కిందకి దిగి నోట్లో నములుతున్న గుట్కా కింద ఊసి అప్పటికే car దిగి తన పక్కకి వచ్చి నుంచున్న కానిస్టేబుల్ రాజు వైపు చేయి చాపాడు. రాజు water bottle ఇవ్వకపోయేసరికి అటు వైపు చూసాడు. రాజు అర్ధం కాలేదు అన్నట్లు face పెట్టి CI వైపు భయంగా చూస్తున్నాడు. ci కోపం గా కానిస్టేబుల్ రాజు తలమీద కొట్టి 6 నెలలుగా నాతో ఉంటున్నావ్ ఇప్పటికీ నాకు ఏ time కి ఏం కావాలో తెలుసుకోలేకపోయావ్, ఆ water bottle ఇలా ఇవ్వు అన్నాడు. రాజు భయంగా car లో ఉన్న water bottle తీసి ఇచ్చాడు. ప్రతాప్ వర్మ కొన్ని నీళ్ళు నోట్లో వేసుకుని పుక్కిలించి ఊసి, చేయి కడుక్కుని, కొన్ని నీళ్ళు తాగి water bottle car లో వేసి, murder జరిగిన ప్రదేశానికి నడుస్తున్న సమయంలో, మీడియా వాళ్ళు ఏమైంది sir, ఎవరు చంపారు లాయర్ గారిని అని అడుగుతున్నా ఏం సమాధానం చెప్పకుండా dead body దగ్గరకి వెళ్ళాడు. అక్కడున్న ఉన్న Si ప్రమోద్, ప్రతాప్ వర్మ ని చూడగానే సెల్యూట్ చేశాడు. ప్రతాప్ వర్మ body దగ్గర కూర్చుని, clues collect చేస్తున్న forensic వ్యక్తి నరేష్ ని clues ఏమైనా దొరికయా అని అడిగాడు. లేదు sir ఏ clue దొరకకుండా చాలా perfect గా చేశాడు అన్నాడు నరేశ్. ప్రతాప్ కొన్ని క్షణాల పాటు lawyer శరీరం మీద ఉన్న కత్తిపోట్ల వైపు చూసి time of death? అని అడిగాడు. body temperature ప్రకారం రాత్రి 1 to 3 మద్యలో జరిగి ఉంటుంది sir అన్నాడు నరేశ్. ప్రతాప్ సరే అన్నట్లు తల ఊపి పైకి లేచి ప్రమోద్ వైపు చూసి చుట్టుప్రక్కల అంతా check చేశారా అని అడిగాడు. చెక్ చేశాం sir useful గా ఏమి దొరకలేదు అన్నాడు ప్రమోద్. ప్రతాప్ చుట్టూ పరిశీలిస్తూ doubt గా అసలు అంత night time ఈ road లో ఎందుకు వస్తున్నాడు అనుకుంటుండగా. పక్కనున్న ప్రమోద్ పామర్రు లో ఏదో function ఉంటే family తో వెళ్ళారు అంట sir, ఈ రోజు ఈయనకి హైకోర్టులో ఏదో important hearing ఉంది అని night start అయ్యి వచ్చాడంట sir అన్నాడు. ప్రతాప్ వర్మ అనుమానంగా చూస్తూ పామర్రు నుంచి విజయవాడ main road ఉండగా ఈ road లో ఎందుకు వచ్చాడు అని కొన్ని క్షణాల పాటు ఆలోచించి, సరే నువ్వు ఒక పని చెయ్ ఈ road కి Link అయ్యి ఉన్న అన్ని main roads and highways లో ఉన్న CC TV footage collect చెయ్, ఏ చిన్న clue miss అవ్వకూడదు అని నరేశ్ వైపు చూసి shoe print ఏమైనా దొరికిందా అని నరేశ్ ని అడిగాడు, లేదు sir అని చెప్పాడు నరేష్. body ని పోస్టుమార్టం కి పంపించి report వచ్చిన తర్వాత phone చెయ్, వాళ్ళ ఇంటికి inform చేశావా? అని అడిగాడు ప్రతాప్. చేశాను sir, వాళ్ళు పామర్రు లో ఉన్నారు అంట బయలుదేరి వస్తున్నారు అన్నాడు ప్రమోద్. నువ్వు వీలైనంత త్వరగా CC TV footage collect చేసి station కి తీసుకురా అని car ఎక్కుతూ ఈ case ఏదో మనకి తలనొప్పి తెచ్చేలా ఉంది అనుకుని car లో కూర్చున్నాడు. రాజు car start చేసి వెళ్తున్నాడు. ప్రమోద్ selute చేసి car వెళ్లగానే, dead body వైపు నడుస్తూ వెళ్ళాడు.


మోనిక, నాని flat కి రావడం:
sudeer, నాని ఒకరి మీద, ఒకరు కాళ్ళు వేసుకుని పడుకుని ఉన్న time లో నాని phone Ring అవుతుంది. ఆ sound కి మెలకువ వచ్చిన sudeer చిరాకుగా అటువైపు గా తిరిగి పడుకుంటూ రేయ్ నాని phone Ring అవుతుంది చూడరా అన్నాడు. నాని కళ్ళు మూసుకునే తన pillow పక్కన ఉన్న phone తీసుకుని lift చేసి, నిద్ర మత్తుతో Hello అన్నాడు. ఏరా ఇంకా లేవలేదా అని మౌనిక వాయిస్ విని, night పడుకునే సరికి late అయింది అన్నాడు. సరే fresh అయ్యి ready గా ఉండు ఒక half an hour లో వస్తా, టెంపుల్ కి వెళ్దాం అని మౌనిక వాయిస్ విన్న నాని టెంపుల్ కా దేనికి అని అడిగేలోపే phone cut చేసింది మౌనిక. నాని అసహనంగా phone వైపు చూసి, phone పక్కన పెడుతూ ఇది పక్కన వాళ్లు చెప్పేది కూడా వినడం ఎప్పుడు నేర్చుకుంటుందో అంటూ పైకి లేచి హల్ లోకి వెళ్ళి fridge లోంచి water bottle తీసి తాగి, సోఫా లో కూర్చుని laptap లో ఏదో work చేస్తున్న శ్రీను వైపు చూసి కాఫీ పెట్టావా రా అని అడిగాడు. శ్రీను వర్క్ చేస్తూనే కిచెన్ లో ఉంది చూడు అన్నాడు. నాని కిచెన్ లోకి వెళ్లి గిన్నెలో ఉన్న కాఫీ వేడి చేసుకుని cup లో పోసుకుని తాగుతూ వెళ్ళి శ్రీను పక్కన కూర్చుని laptap వైపు చూస్తూ ఏం చూస్తున్నావ్ రా అని అడిగాడు. smart surveillance system మీద project report submitt చేయమన్నాడు గా professor అదే చేస్తున్న అన్నాడు. నాని doubt గా చూసి ఇంకా submit చేయలేదా నువ్వు అని అడిగాడు నాని. శ్రీను విసుక్కుంటూ లేదు రా, ఈ రోజు ఎలాగైనా submit చేయాలి ఆ ప్రొఫెసర్ గాడి గోల పడలేక చూస్తున్న అన్నాడు. నాని laptop వైపు చూస్తూ కాపీ తాగి, సరే నేను fresh అవుతా అని తన room లోకి వెళ్ళాడు. మధ్య, మధ్య లో irritate అవుతూ serious గా శ్రీను work చేసుకుంటుండగా కొంత సేపటికి calling bell మోగడంతో శ్రీను door వైపు చూసి ఎవరై ఉంటారు అని విసుక్కుంటూ పైకి లేచి వెళ్ళి door open చేశాడు. ఎదురుగా సుమారు 22 సంవత్సరాల వయసు గల blue Saree కట్టుకున్న మౌనిక, వాడు ఏడి అంటూ లోనికి వస్తుంది. శ్రీను తన వెనకే నడుస్తూ, fresh అవుతున్నాడు అని, మోనిక వైపు విచిత్రంగా చూస్తూ ఏంటి ఈ రోజు సారి కట్టావ్? అని అడిగాడు. hall లో నడుస్తూ వెళ్తున్న మౌనిక అక్కడ కింద ఉన్న beer bottles, ciggerate పీకలు చూసి శ్రీను వైపు కోపంగా చూస్తూ ఏంట్రా ఇది? ఇది ఇల్లా లేక night pub లా మార్చేశారా? తిండి మానేసి ముందు, సిగరెట్లు కాలుస్తూ బ్రతికేస్తున్నారంట్ర అంది. శ్రీను అమాయకంగా చూస్తూ మేము కాదు ఆ sudeer గాడు అన్నాడు. మౌనిక serious గా చూసి చా మీ గురించి నాకు తెలియదు అని సోఫా వైపు నడుస్తూ వెళ్ళి కూర్చుని, tv remote తీసుకుని tv on చేసింది. TV లో ఖుషీ సినిమా song వస్తుంటే చూస్తూ ఉంది ఇంతలో నాని jeans ఫాంట్, టీషర్ట్ వేసుకుని బయటకు వచ్చి గుడికి దేనికి సడన్ గా అని అడిగాడు. మౌనిక కోపంగా చూసి ఏం చెప్తే కాని రావా? నువ్వు అన్నీ నాకు చెప్పే చేస్తున్నావా? అంది. నాని doubt గా చూస్తూ నేనేం చేశాను అని శ్రీను వైపు చేసాడు. శ్రీను సైగ చేస్తూ బీర్ bottles వైపు చూపిస్తాడు. నాని beer bottle వైపు చూసి, దొరికిపోయనురా అన్నట్లు face పెట్టి కోపంగా శ్రీను వైపు చూసి bottles తీయలేదా అన్నట్లు సైగ చేసాడు. అదంతా గమనిస్తున్న మౌనిక నాని వైపు కోపంగా చూసి ఆ dress ఏంటి మనం ఏమైనా pub కి వెళ్తున్నామా? వెళ్ళి formal dress వేసుకుని రా అంటది. నాని ఏం మాట్లాడకుండా silent గా కొన్ని క్షణాల పాటు మౌనిక వైపు చూసి తప్పదు అన్నట్లు తన room లోకి వెళ్ళాడు. మౌనిక TV remote తీసుకుని news channel పెడుతుంది. నిన్న రాత్రి పామర్రు నుంచి విజయవాడ car లో వస్తున్న lawayer జితేందర్ రెడ్డి గారిని ఎవరో అత్యంత దారుణంగా హత్య చేశారు. జితేందర్ రెడ్డి ఎన్నో సంచలనమైన case లు వాదించారు. గత సంవత్సరం దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసిన మీరా case లో మీరా తరపు లాయర్ గా పని చేసింది కూడా ఇతనే అని జితేందర్ రెడ్డి murder గురించి news రావడం చూసి ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఒకరి మొహం ఒకరు చూసుకుని, కోపంగా tv వైపు చూస్తూ ఉన్నారు. dress change చేసుకుని shirt సర్దుకుంటూ బయటకు వస్తున్న నాని వాళ్ళు కోపంగా tv వైపే చూస్తుండడం గమనించి మౌనిక దగ్గరకి వెళ్ళి, tv వైపు, వాళ్ళ వైపు doubt గా చూస్తూ ఏమైంది ఇద్దరూ అలా ఉన్నారు అని అడిగాడు. శ్రీను బాధగా నాని వైపు చూసి 1 year back మా friend మీరా చనిపోయింది తెలుసు కదా? అన్నాడు. అవును మీరు చెప్పారు కదా తనని mp కొడుకు, తన ఫ్రెండ్స్ rape చేసి చంపారు అని అన్నాడు. ఆ case లో వాళ్ళు తప్పించుకోవడానికి వీడు కూడా ఒక కారణం అని కోపంగా tv వైపు చూసి చచ్చాడు కొడుకు అని doubt గా ఎదో గుర్తొచ్చినట్లు మౌనిక వైపు చూసి ఇంతకీ ఎవరు చంపి ఉంటారు అని అడిగాడు, మౌనిక doubt గా శ్రీను వైపు కొన్ని క్షణాల పాటు చూసి, serious గా TV వైపు చూసింది.