ప్రియ ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉండడంతో అర్జున్ ఇక చేసిది ఏమి లేక ప్రియ కి కొంచెం దగ్గరగా వెళ్ళి, "అమ్మ తల్లి ఇప్పుడు నేను ఇక్కడే పడుకోవాలి అంతే కదా! సరే ఇక్కడే పడుకుంటాను okay నా" అన్నాడు నాని..
ప్రియ కోపంగా చూస్తూ, "నా పక్కన పడుకుంటే నిన్ను ఏదోలా tempt చేయడానికి try చేస్తాను అనే పిచ్చి ఆలోచనలు ఏమైనా నీ బుర్రలో ఉంటే వాటిని నీ దగ్గరే పెట్టుకో, నేను నిన్ను love చేస్తున్నాను నిజమే, అందుకే నిన్ను marriage చేసుకున్నాను. నువ్వు కూడా నన్ను love చేస్తున్నావు అని నాకు నమ్మకం కలిగినప్పుడే నీతో life share చేసుకునేది. అప్పటి వరకు మనం just husband and wife అంతే. over గా ఆలోచించకుండా light off చేసి పడుకో" అని ప్రియ వెళ్ళి అర్జున్ కి opposite side తిరిగి పడుకుంది.
"love చేస్తున్నాను అంటుంది, మళ్ళీ నన్ను tourcher చేస్తుంది. దీని ప్రేమ తగలెయ్య" అని మనసులో తిట్టుకుని, ఇక చేసేది లేక వెళ్ళి పడుకుని లైట్ off చేశాడు.
next day morning:
గంగ, జ్యోతి help చేస్తుంటే ప్రియ పూరీలు చేస్తూ, తన పక్కన నుంచుని పూరీలు వత్తుతున్న జ్యోతి తో,
"జ్యోతి నువ్వు collage కి వెళ్ళాలి కదా! వెళ్లి fresh అవ్వు" అంది.
జ్యోతి పూరీలు వత్తుతూనే ప్రియ వైపు చూసి "పర్లేదు madam ఇవి అయిపోయాక వెళ్తాను" అంది.
గిన్నెలో వేగిన పూరి తీసి పక్కన ఉన్న box లో వేస్తూ,
"అర్జున్ నీకు అన్నయ్య అయినప్పుడు, నేను నీకు వదిన అవుతాను కదా" అంది ప్రియ.
జ్యోతి ఇబ్బందిగా ప్రియ వైపు చూసి సిగ్గు పడుతూ
"చిన్నప్పట్నుంచి అర్జున్ అన్న ని అలా పిలవడం అలవాటు అయిపోయింది madam" అంది.
"ఏం పర్లేదు నన్ను కూడా వదిన అనే పిలువు" అని, జ్యోతి ఇబ్బందిగా ఉండడం గమనించిన ప్రియ"సరే నువ్వు వెళ్లి అర్జున్ అన్న ని tiffen చేయడానికి రమ్మని చెప్పి, collage కి ready అవ్వు"అంది.
జ్యోతి సరే అన్నట్లు తల ఊపి silent గా బయటకు వెళ్ళింది.
ప్రియ gass stow off చేసి, పూరీలు ఉన్న box తీసుకుని, hall లోకి వెళ్ళి box dinning table మీద పెట్టి, ashok room వైపు వెళ్లి door కొడుతూ అశోక్ tiffin ready అయింది రా అంది, హా వస్తున్న అని అశోక్ వినిపించేసరికి తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి రెండు chairs దగ్గర plats పెడుతూ ఉండగా
పైనుంచి అర్జున్, కింద ఉన్న room లోంచి అశోక్ ఒకే సారి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ ఉన్నారు.
ప్రియ బౌల్స్ అన్ని open చేసి చూస్తూ, "ఇడ్లీ తేవడం మర్చిపోయానా" అనుకుని, కిచెన్ లోకి వెళ్ళి ఇడ్లీ box తీసుకుని వచ్చి అశోక్ ప్లేట్ లో రెండు పూరి లు వేసి, అర్జున్ plate లో పూరి లు వేస్తుంటే అర్జున్ చేయి అడ్డు పెట్టి
"పూరి వద్దు ఇడ్లీ వేయి చాలు" అన్నాడు.
ప్రియ కోపంగా చూస్తూ "వద్దు అంటే? నీకు ఇష్టం అని పూరీలు చేశాను మరి ఇవన్నీ ఎవరు తింటారు. నేను చేసేది నీకు నచ్చకపోతే నీకు ఏం కావాలో ముందే చెప్పాలి! లేదంటే ఒక పని చెయ్ బయట tiffin centre అని board పెట్టు నువ్వు తినని ప్రతిసారి ఎవరికైనా అమ్ముతూ ఉంటాను".
అశోక్ షాకింగ్ గా ప్రియ వైపు చూసి అర్జున్ వైపు చూసి నవ్వుతూ, "వీడికి ఇలాంటి అమ్మాయే correct" అనుకుని silent గా తింటున్నాడు.
అర్జున్ కోపంగా చూస్తూ "ఇప్పుడు ఏంటి పూరి తినాలి అంతే కదా? సరే వేయ్" అని పూరీలు వేయించుకుని తిని కోపంగా ప్రియ వైపు చూసి "సంతోషమా"? అని అన్నాడు.
ప్రియ కోపంగా చూస్తూ, "ఈ కోపానికి ఏం తక్కువ లేదు" అని మనసులో అనుకుని తన రూం వైపు పైకి వెళ్ళబోతూ ఆగి ,
"అర్జున్ evening temple కి వెళ్ళాలి 5 కి అట్లా రా" అంది.
అర్జున్ పూరి తింటూ "నాకు office లో work ఉంది నాకు కుదరదు, అశోక్ తీసుకెళ్తాడు లే" అన్నాడు.
ప్రియ కోపంగా చూస్తూ "నేను పెళ్ళి చేసుకుంది నిన్ను వాడ్ని కాదు" అంది.
పూరి తింటున్న అర్జున్ ఒక్కసారిగా ఆగి ప్రియ వైపు చూసి,
"నేనే వచ్చి నిన్ను temple కి తీసుకెళ్లాలి కదా"? అని, "చీ నా బ్రతుకు football ఆడుకుంటుంది", కోపంగా మాట్లాడలేను, అలా అని ఈ tourcher బరించలేను" అని మనసులో అనుకుని తన మీద తనే జాలి పడుతూ "ఏం చేస్తాం adjust అయ్యి బ్రతకడమే" అనుకుని,
ప్రియ వైపు చూసి "నేనే వచ్చి నిన్ను గుడికి తీసుకెళ్తాను okay"? అన్నాడు చిరాకు గా చూస్తూ,
అర్జున్ వైపు serious గా చూస్తూ ఉన్న ప్రియ ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళింది.
తనకి ఏం సంబంధం లేదు అన్నట్లు silent గా తింటున్న అశోక్ వైపు కోపంగా చూస్తూ,
"ప్రేమ అంటే దానిది, నిన్ను పిచ్చిగా ప్రేమిస్తుంది అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పి దానితో పెళ్ళి చేశారు కదరా చూస్తున్నావ్ కదా దాని ప్రేమ, ఇది ప్రేమ లా లేదు నన్ను tourcher చేయడానికి పెళ్ళి చేసుకున్నట్లు ఉంది" అన్నాడు అర్జున్, చేతిలో ఉన్న పూరి ముక్కని plate లో కోపంగా విసిరికొడతూ,
"మామూలుగా అయితే నువ్వు మాట్లాడవు కదా! అందుకే నిన్ను tourcher చేస్తుందేమో అన్నాడు అన్నాడు అశోక్ పైకి లేస్తూ,
అశోక్ మాట విన్న అర్జున్, "ప్రియ తనతో ఎలా మాట్లాడాలో అర్ధం అవక, నాతో ఇలా గొడవ పడుతుందా"? అని తనలో తాను ఆలోచిస్తున్న time లో,
hand wash చేసుకోవడానికి వెళ్ళబోతున్న అశోక్, "నేను జ్యోతి ని కాలేజ్ లో join చేసిన తర్వాత showroom కి వస్తా నువ్వు వెళ్ళిపో" అన్నాడు.
ప్రియ గురించి ఆలోచిస్తూ ఉన్న అర్జున్ dull గా అశోక్ వైపు చూసి సరే అన్నట్లు తల ఊపాడు.
అశోక్ వెళ్ళిన కొన్ని క్షణాలకి అర్జున్ కూడా తను తిన్న plate తీసుకుని పైకి లేచి వెళ్లబోతుంటే అప్పుడే లోనికి వచ్చిన బొంగరం "అయ్యగారు" అంటూ పరిగెత్తుకుని అర్జున్ దగ్గరకి వచ్చి వినయంగా చేతులు కట్టుకుని నుంచుని, అర్జున్ పట్టుకున్న plate వైపు చూస్తూ ఉన్నాడు.
అర్జున్ కి ఏమి అర్దం అవక confusing గా చూస్తూ "ఏమైంది" అని అడుగుతాడు.
బొంగరం ఏం మాట్లాడకుండా తను పట్టుకున్న plate వైపే చూస్తుండడం గమనించిన అర్జున్ తన చితిలో plate వైపు చూసి బొంగరం కి ఉన్న జబ్బు గురించి గుర్తు వచ్చి,
"ఇప్పుడు నీకేం కావాలి కావాలి రా ఈ plate నేను తీసుకెళ్ళకూడదు అంతే కదా"? అని కోపంగా plate table మీద పెట్టి "దేశంలో ఉన్న వింత జంతువులు అన్ని ఈ ఇంట్లోనే ఉన్నాయి" అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు.
బొంగరం silent గా plates తీసుకుని కిచెన్ లోకి వెళ్ళిపోయాడు..