Read Adhoori Katha - 1. by surya Bandaru in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అధూరి కథ - 1

Episode 1:

విద్యుత్ దీపాల కాంతిలో మెరుస్తున్న విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన కళ్యాణ మండపం లో జనం ఒకరిని ఒకరు పలకరించుకుంటూ, కేటరింగ్ వాళ్ళు అందిస్తున్న కాఫీ, టీ లు తాగుతూ,  ఇంద్ర భవనాన్నితలపించేలా ఉన్న కళ్యాణ మండపం దగ్గరకి ఒక car వచ్చి ఆగుతుంది .

దానిలో నుంచి అశోక్  బయటకు దిగి, వేగంగా జన సందోహాన్ని తప్పించుకుంటూ కళ్యాణ మండపంలోకి వెళ్ళాడు.

అర్జున్.. పిన్ని కౌసల్య గారు,

“కదలకు రా”

అంటూ అర్జున్ కి పెళ్ళి బొట్టు పెడుతున్న సమయంలో, కౌసల్య గారి భర్త ఆనందరావు, కుమారుడు అశోక్ ఆ గదిలోకి వస్తారు.

అర్జున్ కదలకుండా  అశోక్ వైపు చూసి  —

"ఏరా, అను వాళ్ళు వచ్చారా?" అన్నాడు… చిన్న చిరునవ్వు తో , 

అశోక్ , ఆనందరావు బాధగా ఒకరి ముఖం చూసుకుని అర్జున్ వైపు బాధగా చూస్తూ ఉంటారు. అర్జున్ doubt గా చూసి,

"ఏమైంది బాబాయ్?"

అని అడగడం తో పెళ్లి బొట్టు పెడుతున్న కౌసల్య ఆగి doubt గా ఆనందరావు వైపు తిరిగి టెన్షన్ పడుతూ చూసింది.

ఆనందరావు  బాధతో నిండిన స్వరంతో—

"అను… వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని, "నిన్న రాత్రే అమెరికా వెళ్లిపోయింది అంటరా.!

అర్జున్ రాయిలా రెండు క్షణాలు చూసి, తన మనసులో మొదలైన చిన్నపాటి భయాన్ని అదిమిపెట్టి. కంగారుగా పైకి లేచి.,

చిన్నగా నవ్వుతూ, "ఏంటి జోక్ చేస్తున్నారా… “అను” వేరే అతన్ని పెళ్ళి చేసుకోవడం ఏంటి?..

అశోక్ బాధగా,

నాన్న చెప్తుంది నిజం రా!.. అని, తల పైకి ఎత్తి అర్జున్ వైపు చూసాడు.

అర్జున్ అయోమయంగా చూస్తూ,

ఏం మాట్లాడుతున్నావ్ రా, నిన్న రాత్రి నేను తనతో phone లో మాట్లాడాను కదా?.. అని తను morning నుంచి call చేస్తున్నా అను phone lift చేయకపోవడం గుర్తు వచ్చి అయోమయంగా అశోక్ వైపు చూసాడు. 

అశోక్ బాధతో తనలో చేతిలో ఉన్న papers చూసి, అర్జున్ దగ్గరకి వెళ్ళి ఆ పేపర్స్ ఇచ్చాడు. అర్జున్ confusing గా ashok వైపు చూసి భయంగా papers open చేసి చూసాడు. Anu మరియు Mahesh పేర్లు మీద ఉన్న flight tickets చూస్తూ Arjun షాక్ తో రాయి లా నిలబడిపోతాడు. అర్జున్ చేతిలోని పేపర్స్ మెల్లగా కిందకి జారి, గాలికి ఎగురుతూ ఉన్నాయి. ఆ గది లోపల, బయట మొత్తం ఒక్కసారి గా నిశ్శబ్దంతో నిండిపోతుంది. కౌసల్య గారు భయంతో అర్జున్ ని పట్టుకుని అర్జున్, అర్జున్ అని పిలుస్తున్నారు. తనకే తెలియకుండా కళ్లలో తిరిగిన నీళ్లతో, చుట్టూ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్న అర్జున్ కౌసల్య గారి వైపు కొన్ని క్షణాలు చూసి..,

నీకు అను గురించి బాగా తెలుసు కదా పిన్ని, తను ఇలా చేస్తుంది అంటే నువ్వు నమ్ముతావా?.. అని కళ్ళు తుడుచుకుని కోపంగా,..

లేదు అను ఎప్పటికీ అలా చేయదు. There is Something wrong. నేను వెళ్ళి అను ని తీసుకొస్తాను.

అని, అశోక్ ఆపడానికి ప్రయత్నించినా, అర్జున్ అతని చెయ్యి లాగేసి బయటకు పరుగెత్తాడు. తన వెనకే అశోక్ పరుగు లాంటి నడకతో వెళ్ళాడు. జనం అంతా confusing గా చూస్తూ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాని ఏ ఒక్కరి మాట స్పష్టంగా వినిపించట్లేదు. 

అశోక్ కారు అర్జున్ ఎదురుగా ఆపి—

"ఎక్కు రా! అన్నాడు!"

అర్జున్ ఏమీ మాట్లాడకుండా car ఎక్కాడు.

విషాద వదనంతో పిచ్చి వాడిలా road వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉన్న అర్జున్ వైపు మధ్య, మధ్య లో చూస్తూ car drive చేస్తుంటాడు ashok. Car వచ్చి Anu ఇంటిదగ్గర ఆగగానే, కారులోంచి దిగి, వేగంగా మెట్లు ఎక్కుతుంటాడు. తన వెనకే అశోక్ కంగారుగా పరిగెడతాడు.

 

"అను! తలుపు తీయ్! అంటూ, అర్జున్ అరుస్తున్నాడు. 

తలుపు తెరిచిన..  సౌమ్య. Shockin గా అర్జున్ ని చూస్తూ,..

"అర్జున్… ప్లీజ్…" — ఆమె మాట పూర్తి అవ్వకుండానే, అతడు లోపలికి దూసుకెళ్తాడు.

"అను! ఎక్కడ ఉంది? మాట్లాడాలి!"

సౌమ్య ఆపే ప్రయత్నం చేస్తూ —

"అర్జున్ ప్లీజ్… మా అమ్మ పడుకుంది… గొడవ వద్దు"

"మీరు అబద్ధం చెప్తున్నారు. అను ఎక్కడ ఉంది చెప్పు please?" అంటూ గట్టిగా ఆమెను పట్టుకుని అరుస్తాడు.

సౌమ్య కోపంగా అర్జున్ ని విడిపించుకుంటూ అరుస్తూ,

"అది వెళ్ళిపోయింది… నువ్వు ఏడ్చినా, నేనూ ఏడ్చినా… తిరిగి రాదు!" చిన్నప్పట్నుంచి Friend అయిన నాకే చెప్పకుండా వెళ్ళిపోయింది. అంటూ

సౌమ్య ఏడుస్తూ కింద కూలబడిపోయింది…

ఆ మాటలు విన్న తర్వాత అర్జున్ లో ఎక్కడో ఉన్న చిన్న ఆశ కూడా చనిపోయి, పిచ్చి వాడిలా బయటకు వెళుtuన్నాడు. అశోక్ భయపడుతూ అర్జున్ వెనుక వెళ్తాడు. బయట వర్షం కురుస్తోంది.

వర్షంలో తడుస్తూ పిచ్చోడిలా నడుస్తూ ఉన్నాడు.  పక్కనుంచి పెద్దగా శబ్దాలు చేసుకుంటూ వెళ్తున్న వాహనాల వెలుతురు తప్ప, ఆ time లో అక్కడ power కూడా లేదు. అశోక్ ఏం మాట్లాడకుండా silent గా అర్జున్ వెనుక నడుస్తాడు. అర్జున్ కొంత దూరం నడిచిన తర్వాత ఒక చోట ఆగి గట్టిగా ఏడుస్తూ కిందకి కూలబడిపోయి పిచ్చోడిలా ఏడుస్తూ ఉన్నాడు. అశోక్ దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించి, మళ్ళీ ఆగిపోయి బాధగా అర్జున్ వైపు చూస్తుండిపోయాడు!!..

రెండు సంవత్సరాల తర్వాత… పూర్తిగా పెరిగిపోయిన గడ్డంతో,  bar లో ఓ మూలన సైలెంట్‌గా కూర్చుని,  bottle లో ఉన్న beer కొద్దిగా తాగి table మీద పెట్టి, ఇంకో చేతలో వెలిగించి ఉన్న సిగరెట్ నోట్లో పెట్టుకుని కలుస్తూ ఉన్నాడు. 

ఇంతలో అశోక్ తన మేనమామ కొడుకు కార్తీక్ తో కలిసి వచ్చి, అర్జున్ వైపు కోపంగా చూస్తూ ఎదురుగా ఉన్న సోఫాలో ఇద్దరూ కూర్చున్నారు. అర్జున్ వారిని చూసినా పట్టించుకోకుండా beer bottle ఎత్తి తాగుతూ ఉన్నాడు.

కార్తీక్ అర్జున్ పక్కన ఉన్న సిగరెట్ ప్యాకెట్ లో నుంచి ఒక సిగరెట్ తీసుకుని వెలిగించి, ప్యాకెట్ టేబుల్ మీద పెడుతూ,

“What’s this రా!

ఇంకా ఏ కాలంలో ఉన్నావ్ రా నువ్వు? నిన్ను వదిలి వెళ్ళిపోయిన అమ్మాయిని గురించి రెండేళ్లు తలుచుకుంటూనే ఉన్నావా?

ఆ గడ్డం ఏంటి… మొహం ఏంటి! అని irritating గా అర్జున్ వైపు చూస్తూ,..

ఈ మధ్య లవ్ ఫెయిలైతే గడ్డం పెంచుకోవడం బాగా ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కడికి…”అంటాడు వెటకారంగా,..

అర్జున్ కాస్త కోపంగా కార్తీక్ వైపు చూసాడు.

అశోక్ కార్తీక్ తొడని గోకుతూ వద్దు అన్నట్లు తల ఊపుతాడు.

కానీ కార్తీక్ ఆగకుండా,.. కోపంగా,,..

“నువ్వు ఆగరా వాడికి ఎవరో ఒకరు చెప్పాలి గా ,

నువ్వు చెప్పవ్… ఆనందరావు మావయ్య అసలే చెప్పడు..

ఇక ఎవరు చెప్తారు వాడికి? అని సీరియస్ గా అర్జున్ వైపు చూస్తూ,..

ఇదేం ప్రేమ రా… మేమంతా love చేయట్లేదా? విడిపోతే మళ్ళీ వేరే అమ్మాయిని ప్రేమించట్లేదా?

ఈ రోజుల్లో సిన్సియర్ అమ్మాయిలు ఎక్కడ ఉంటారు?

Be practical రా!”

అర్జున్ ఒక్కసారిగా కోపంతో లేచి… కార్తీక్ చెంపమీద దిమ్మతిరిగేలా లాగించి కొట్టాడు.

కార్తీక్ షాక్ అయిపోయి నిశ్శబ్దంగా కూర్చున్నాడు.

అర్జున్ –

బీర్ బాటిల్ తీసుకుని తాగి కింద పెట్టి,..

“ఇన్ని తెలిసిన నీకు… ఇలాంటి టైమ్‌లో నా లాంటి వాడ్ని కెలికితే… ఇలానే పగులుద్ది అని తెలియదారా?? అని వెళ్తూ ఆగి కార్తీక్ వైపు చూసి,

Mood వచ్చినప్పుడల్లా ఒక్కో అమ్మాయిని మార్చేయడానికి నేనేమైనా రోడ్ మీద తిరిగే కుక్కనా?

లవ్ ఫెయిల్ అయినోడు ఎలా బ్రతుతున్నాడో కూడా వాడికే తెలియదు… అలాంటోడు నా గడ్డం పెరిగిందా, నేను అందంగా ఉన్నానా లేనా అని చూసుకుంటూ కూర్చుంటాడు! అని చీరకు గా చూస్తూ,

ఇది సిన్సియర్‌గా ప్రేమించే వాళ్లకి తెలుస్తుంది. నీ లాంటి ఎదవలకి ఏం తెలుస్తుంది. అని వెళ్తూ ఉంటే,

అశోక్ ఒక్కసారిగా లేచి:

“అవును! నువ్వు చెప్పేది నిజమే!!!

ప్రేమ విలువ సిన్సియర్‌గా ప్రేమించేవాళ్లకే తెలుస్తుంది. ఒక్క నీకు తప్ప..,,అంటాడు

అర్జున్ వెనక్కి తిరిగి, Confusing గా చూస్తున్నాడు.

నీది మాత్రమే ప్రేమ అనే భ్రమల్లో బ్రతుకుతూ, వేరే వాళ్ళ ప్రేమని అర్ధం చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయావ్…

అర్జున్ అశోక్ వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు..

“నిధి మాత్రమే ప్రేమా రా?

ప్రియది ప్రేమ కాదా?

నువ్వు ఇలా పిచ్చోడిలా తిరుగుతున్నావ్ అని తెలిసి కూడా,

నువ్వు ముహూర్తానికి వస్తావో లేదో, పెళ్లి చేసుకుంటావో లేదో అనే భయంతో… నీకోసం ఎదురుచూస్తుందే ప్రియ,  దానిది ప్రేమ కాదా?”

అర్జున్ ఏం మాట్లాడకుండా రాయిలా చూస్తుంటాడు

(కొద్దిసేపు నిశ్శబ్దం)

“నిన్ను వదిలి వెళ్ళిపోయిన అమ్మాయిని తలుచుకుంటూ అందర్నీ బాధ పెట్టడం ప్రేమ అని నువ్వు అనుకుంటున్నావ్, నీకు తన మీద ప్రేమ లేదు అని తెలిసి కూడా, జీవితాంతం నీతో కలిసి ఉంటే చాలు అని తను అనుకుంటుంది.

ఎవరిది నిజమైన ప్రేమో నువ్వే నిర్ణయించుకో!!! అని కోపంగా,

కార్తీక్ భుజం మీద చేయి వేసి,

“పదరా… వెళ్దాం” అని అశోక్ కార్తీక్ తో కలిసి బయటకి వెళ్ళిపోయాడు.

అర్జున్… రాయిలా ఏ కదలిక లేకుండా నిలబడిపోతాడు..