కౌసల్య గారు తన room లోంచి బయటకి వచ్చి hall లో ఉన్న సోఫా లో కూర్చుని,
" రాధికా copy తీసుకురా అంది"..
కిచెన్ లో ఉన్న పనిమనిషి ,
"అలాగే అమ్మ" అంటుంది.
కౌసల్య ఎదురుగా ఉన్న paper తీసుకుని చదువుతున్నారు. కొంచెం సేపటి తర్వాత,
"అమ్మ గారు కాపీ" అని voice వినడం తో కాపీ తీసుకుని,
ఆమె వైపు చూస్తూ నువ్వొచ్చవేమ్మ మీ అమ్మ రాలేదా?
అమ్మ కి ఊర్లో పనుండి వెళ్ళింది అమ్మ సాయంత్రం వచ్చేస్తుంది అంది.. పనిమనిషి రాధిక కూతురు జ్యోతి.
సరే నువ్వు వెళ్ళి నాగరాజు తో house cleaning వాళ్ళకి మళ్ళీ call చేసి ఈ రోజు వస్తున్నారో, లేదో అడగమని చెప్పు" అన్నారు కౌసల్య గారు.
జ్యోతి సరే అమ్మ అని చెప్పి బయటకు వెళ్ళింది.
కౌసల్య గారు మళ్ళీ paper చదవడంలో నిమగ్నం అయిపోయింది. కొంతసేపటి తర్వాత
అర్జున్ తన room లోంచి మెట్లు దిగి hall లోకి వచ్చి కౌసల్య గారి పక్కన కూర్చున్నాడు. కౌసల్య గారు అర్జున్ వైపు చిన్నగా తిరిగి చూసి అర్జున్ dull గా ఏదో పరధ్యానం లో ఉండడం గమనించి మళ్ళీ పేపర్ చదువుతూ,
"ఏరా కాపీ తాగుతావా" అని అడిగారు.
అర్జున్ ఆవిడ చేతిలో ఉన్న పేపర్ లాక్కుని పక్కన వేసి ఆవిడ ఒళ్ళో పడుకున్నాడు, ఒక పక్కగా తిరిగి. కౌసల్య గారు ప్రేమగా తల నిమురుతూ,
"ఏమైంది రా అన్నారు"..
అర్జున్ ఏం మాట్లాడలేదు. ఆవిడ కూడా ఏం మాట్లాడకుండా అర్జున్ తల ప్రేమగా నిమురుతున్నారు. అర్జున్ కొంతసేపటి తర్వాత,
"పిన్ని... నా వల్ల మీరంతా చాలా బాధ పడుతున్నారు కదా?.. అని అడుగుతాడు..
కౌసల్య గారు ఒక క్షణం మౌనంగా ఉండి.." ఏమైంది రా... suden గా ఇలా అడుగుతున్నావ్?.. ఎవరైనా ఏమైనా అన్నారా"? అంది.
అర్జున్ కొద్దిసేపు మౌనంగా ఉన్న తర్వాత... "ప్రియ ని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు పిన్ని" అన్నాడు చిన్నగా,
ఆ మాట విని కౌసల్య గారు బాధగా కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకుని, తెరిచి అర్జున్ తల నిమురుతూ,..
"సరే నేను బాబాయ్ తో మాట్లాడతాను" అన్నారు.
అర్జున్ కోపంగా పైకి లేచి
"ఎందుకు పిన్ని నేను ఏం చేసినా, సరే అంటారు. నేను తప్పు చేస్తున్నాను అని తెలుసు కదా! మరి నన్ను ఎందుకు తిట్టవు? .. బాబాయ్ కూడా అంతే నేను ఏం చెప్పినా, సరే నీ ఇష్టం రా అంటాడు. నేను తప్పు చేస్తున్నాను అని తెలిసి కూడా మీరు ఏమి అనకపోవడం ఎక్కువ బాధగా ఉంది నాకు" అని ఏడుపు మొహం పెట్టుకుని కౌసల్య గారిని గట్టిగా హత్తుకుంటాడు.
కౌసల్య గారు అర్జున్ ని ఒళ్ళో పడుకోపెట్టుకుని కొద్దిసేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి, రేయ్ నాన్న ఒక విషయం అడుగుతాను చెప్తావా?..నీకు ప్రియ ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేనిది తన మీద ప్రేమ లేకనా లేక నీ వల్ల తను బాధ పడడం ఇష్టం లేకా?
అర్జున్ ఏం మాట్లాడకుండా silent గా ఉన్నాడు... కొద్ది సేపు మౌనంగా ఉండి అర్జున్ సమాధానం కోసం ఎదురు చూసిన కౌసల్య గారు తను ఏం మడ్లకపోవడంతో
ప్రియ నిన్ను ఎంతగా love చేసిందో ఈ రెండు సంవత్సరాలలో చూసాను రా నేను. నువ్వు బాధ పడుతుంటే చూడలేని పిచ్చిది రా అది.
నువ్వు అను ని ప్రేమిస్తున్నావు అని తెలిసినప్పుడు నీకు తన ప్రేమ విషయం తెలిస్తే ఎక్కడ బాధ పడతావో అని, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక, కనీసం తన ప్రేమ గురించి కూడా నీకు చెప్పకుండా నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. నేను ప్రియ ని చిన్నప్పట్నుంచి చూస్తున్నాను రా, నువ్వు బాధలో ఉంటే తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండలేదు, నీతో తప్ప.
అర్జున్ ఏం మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉన్నాడు.
నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను వదిలి వెళ్ళిపోయింది అని నువ్వు బాధ పడుతున్నావ్, తను ప్రేమించిన అబ్బాయి ఇలా బాధపడుతూ ఉండడం చూడలేక ప్రియ బాధ పడుతుంది అంతే తేడా మీ ఇద్దరికి అన్నారు కౌసల్య గారు.
అర్జున్ ఏం మాట్లాడకుండా బాధగా కళ్ళు మూసుకున్నాడు. తనకి తెలియకుండానే తన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి.
ఇంతలో జ్యోతి వచ్చి అమ్మగారు అయ్యగారు పిలుస్తున్నారు అంది.
కౌసల్య గారు అర్జున్ ని పైకి లేపి
"సరే రా నువ్వు నీ room కి వెళ్ళి fresh అవ్వు"
అని అర్జున్ ని బలవంతంగా తన room లోకి పంపించి, ఆవిడ వాళ్ళ room వైపు వెళ్ళింది..
ప్రియ ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని అర్జున్ అయిష్టంగానే పెళ్లి పీటల మీద కూర్చుని పంతులు గారు చెప్పినట్లు పూజ చేస్తున్నాడు.
సన్నాయి వాళ్ళ సన్నాయి sound తప్ప అక్కడ మాట్లాడుకుంటున్న ఎవరి మాట వినిపించట్లేదు.
ఆనందరావు speed గా నడుచుకుంటూ వెళ్తూ తన పక్కనే నడుస్తున్న ఉన్న అశోక్ తో ఒక వైపు చేయి చూపిస్తూ చెవి దగ్గరగా వెళ్ళి ఏదో చెప్తాడు. ఆ సన్నాయి మేళాల శబ్దంలో అతను ఏం చెప్పాడో ఎవరికి అర్థం కాకున్నా, అశోక్ కి అర్ధ కావడంతో okay అన్నట్లు తల ఊపి అటు వైపు పరుగుపెడుతూ వెళ్ళాడు.
ఆనందరావు గారు వస్తున్న అతిధులను చిరు నవ్వుతో ఆహ్వానిస్తూ ఉన్నారు.
కౌసల్య గారు అర్జున్ పక్కన నుంచుని ఆనందంతో నవ్వుతూ అర్జున్ వైపు చూస్తూ ఉంది. ఇంతలో,
"పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అమ్మ"
అని పంతులుగారు చెప్పడం తో ప్రియ mother సుభద్ర గారు పరుగులాంటి నడకతో ప్రియని తీసుకురావడానికి వెళ్ళారు.
ప్రియ వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది. అర్జున్, ప్రియ పూజ చేస్తూ ఉన్నారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ తాళి తీసి అర్జున్ కి ఇచ్చాడు. అర్జున్ తాళి తీసుకుని వంగి తన రెండు చేతులతో ప్రియ మెడ దగ్గర తాళి పట్టుకుని ఆగి ఆలోచిస్తున్నాడు.
ప్రియ tension తో బాధగా కళ్ళు మూసుకుంది. అక్కడున్న బందువులు అందరూ tension గా చూస్తూ ఉన్నారు. అర్జున్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ప్రియ మెడలో తాళి కట్టాడు. అందరూ ఊపిరి పీల్చుకుని నవ్వుతూ అక్షింతలు వేసారు. అర్జున్ serious గా తల వంచుకుని కూర్చున్నాడు. అర్జున్, ప్రియ అక్షింతల వర్షంలో తడుస్తూ అందరికీ దండం పెడుతున్నారు..