Read Adhuri's story - 3 by surya Bandaru in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • అంతం కాదు - 13

    అవును నాకు తెలుసు. ఓడిపోవడం కొత్త కాదు. గెలవడం కొత్త. ఈ గెలు...

  • అధూరి కథ - 3

    Arjun తన room లోంచి కిందకి దిగుతూ ఉన్నాడు. జ్యోతి hall clean...

  • పాణిగ్రహణం - 6

    భార్గవి ఆలోచిస్తూ ఉంటుంది. మాకు అలాంటి నమ్మకాలు లేవు అంటే......

  • తనువున ప్రాణమై.... - 20

    ఆగమనం.....అదేమీ పట్టనట్టు పొట్టి పాప మాత్రం...తన సిక్స్ ఫీట్...

  • అంతం కాదు - 12

    7: అగ్నిపర్వతం పుట్టిన రోజు (The Birth of the Volcano)ఘటోత్క...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అధూరి కథ - 3

Arjun తన room లోంచి కిందకి దిగుతూ ఉన్నాడు.

జ్యోతి hall clean చేస్తూ ఉంది.

ఆనంద రావు గారు ఇంటి బయట garden లో కూర్చుని paper చుడుతున్నారు. అర్జున్ కేటరింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నాడు. జ్యోతి అమ్మ రాధిక బయట clean చేస్తూ ఉన్నారు. 

అర్జున్ hall లోంచి వెళ్తూ జ్యోతి దగ్గర ఆగి,

"జ్యోతి పిన్ని ఎక్కడ ఉంది" అని అడిగాడు. 

"కిచెన్ లో ఉన్నారు అన్న" అని చెప్పింది జ్యోతి, 

"సరే" అని చెప్పి వెళ్తూ ఆగి, 

"నువ్వు collage కి వల్లలేదా ఈ రోజు" అని అడిగాడు, 

"రేపట్నుంచి వెళ్తాను అన్న అంది", జ్యోతి 

"collage మానకు, నీకు ఏమైనా అవసరం ఐతే పిన్నిని అడుగు, సరే నా" అన్నాడు. 

జ్యోతి నవ్వుతూ సరే అన్న అంది. 

అర్జున్ కిచెన్ లోకి వెళ్ళి "పిన్ని" అని ఏదో చెప్పబోతూ అక్కడ సుభద్ర గారు ఉండడం చూసి ఇబ్బందిగా "hi అత్త" అంటాడు. 

అర్జున్ అలా తన దగ్గర ఇబ్బందిగా మాట్లాడడం కొత్తగా అనిపించిన సుప్రజ గారు అర్జున్ ని ఆశ్చర్యంగా చూస్తూ చిన్నగా కోపంతో, 

ఏంట్రా కొత్తగా సిగ్గు పడుతున్నావ్ నా దగ్గర అంది, 

కౌసల్య గారు చిన్నగా నవ్వుతూ బంగాళదుంపలు cut చేస్తూ ఉంది. అర్జున్ ఏం మాట్లాడకుండా ఇబ్బందిగా చూస్తూ ఉన్నాడు. 

మొన్నటి వరకూ అత్త, అత్త అని తిరిగే వాడివి ఇప్పుడేంటి కొత్తగా సిగ్గు పడుతున్నావ్? అంటే, నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటే నాతో మాట్లాడానికి సిగ్గు పెడతావా? ముందు నువ్వు నా అన్న కొడుకువి, ఆ తర్వాతే నా కూతురు మొగుడివి, మీ ఇద్దరూ ఎలా అయినా ఉండండి. కాని నా దగ్గర మాత్రం ఇలా పిచ్చి వేషాలు వేయకు, అర్థం అయిందా" అంటుంది సుభద్ర. 

సుభద్ర, అర్జున్ తండ్రి కి ఒక్కగానొక్క చెల్లెలు, ప్రస్తుతం కాకినాడ లో district collector గా పని చేస్తుంది. తన కూతురి మీద ఎంత ప్రేమ చూపిస్తుందో, అర్జున్ మీద కూడా అంతే ప్రేమ చూపిస్తుంది. 

అర్జున్ ఆవిడ దగ్గరకు వెళ్లి అక్కడున్న gass బల్ల మీద కూర్చుని, ప్లేట్ లో cut చేసి ఉన్న క్యారెట్ ముక్క ఒకటి తీసుకుని తింటూ , 

ఇప్పుడు నువ్వు దేనికి ఇలా tv serial లో లాగా బారీ emotional dialogues చెప్తున్నావ్, రెండు సంవత్సరాల నుంచి నేను అందరితోనూ ఇలానే ఉన్నాను కదా!. నీ కూతుర్ని బాధ పెట్టాను, నిన్ను బాధ పెట్టాను, పిన్ని , బాబాయ్ అందర్నీ బాధ పెట్టాను. 

నువ్వంటే గొప్ప మనసున్న దానివి కాబట్టి నీ కూతుర్ని బాధ పెడుతున్న కూడా ఏం జరగనట్లు ఉండగలగుతున్నావ్, కాని నేను నీ అంత గొప్పొడ్ని కాదు, నిన్ను బాధ పెడుతూ, ఏం జరగట్లు ఉండడానికి! మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే ఈ ఇంట్లో నాకు నేనే పెద్ద విలన్ లా కనిపిస్తున్నాను. ఇప్పుడు నిన్ను చూడగానే hug చేసుకుని అత్త ఎలా ఉన్నావ్? అంటూ పాత అర్జున్ లా మాట్లాడడానికి కాస్త time పడుతుంది. కాబట్టి నీ serial డైలాగులు ఆపు please... అని,

అర్జున్ మాటలకి చిన్నగా నవ్వుతూ బంగాళదుంపలు cut చేస్తూన్న కౌసల్య గారి వైపు చూస్తూ 

పిన్ని నేను showroom కి వెళ్ళి వస్తా ఏమైనా urgent ఐతే నాకు call చేయ్" అంటాడు.

సరే నాన్న evening త్వరగా రా, ప్రియ నిన్ను తన office కి తీసుకెళ్తాను అంది. అంటుంది.

చిన్నగా విసుకున్నట్లుగా సరే పిన్ని వస్తాలే అని వెళ్తూ, తన వైపు చిన్నగా కోపంగా చూస్తున్న సుభద్ర వైపు చూసి "నన్నేం చేస్తావ్ ఆ onions cut చెయ్" అని వెళ్ళిపోతాడు.

evening మర్చిపోకుండా రారా? అని గట్టిగా అరుస్తుంది కౌసల్య. సరే పిన్ని అని అర్జున్ voice వినిపిస్తుంది.. 

సుభద్ర గారు onions cut చేస్తూ చిన్నగా నవ్వుతూ, 

నిజంగా మీ ఇద్దరి bonding చూస్తే ఒక్కోసారి నాకు చాలా guilty గా ఉంటుంది కౌసల్య, చిన్నప్పుడే అమ్మా, నాన్న ని కోల్పోయిన వాడ్ని ఈ ఇంట్లో ఉంచడానికి నేను ఒప్పుకోలేదు. ఎంతైనా నువ్వు వేరే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి కదా వాడ్ని అమ్మ లా చూసుకుంటావో లేదో అని నేను చాలా బయపడ్డాను. కాని ఆ తర్వాత నువ్వు ఒక తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న విధానం చూసి అప్పుడు అలా అనుకున్నందుకు ఇప్పటికీ guilty గా feel అవుతూనే ఉన్నాను! 

కౌసల్య గారు బంగాళదుంపలు cut చేస్తూనే చిన్నగా నవ్వుతూ , కంటేనే తల్లి అనుకుంటే ఈ దేశంలో చాలా మంది పిల్లలు అనదాలుగానే మిగిలిపోతారు వదిన, వాడు నన్ను పిన్ని అని పిలుస్తున్న నాకు అమ్మ అనే వినిపిస్తుంది. అని కౌసల్య గారు అనే సరికి సుప్రజ గారి కళ్ళలో ఆనంద బాష్పాలు తిరుగుతాయి. 

రెండు క్షణాల తర్వాత ఆనందంతో చిన్నగా నవ్వుకుంటూ ఉల్లిపాయలు cut చేస్తూ, వీళ్ళ marriage Life ఎలా ఉంటుందో అని ఒక్కోసారి భయంగా ఉంటుంది. అని పరధ్యానంగా onions cut చేస్తూ ఉంది.

కౌసల్య గారు అదే భయం తో ఉన్నట్లు గా సుభద్ర గారి వైపు కొన్ని క్షణాల పాటు ఏదో ఆలోచిస్తూ చూస్తూ ఉంది.....

వీళ్ళ marriage Life లో ఎలాంటి మలుపులు రాబోతున్నాయి అని రానున్న episodes లో చూద్దాం... 

మీ అభిప్రాయాలను comments రూపంలో తప్పక తెలియచేయండి. నా writing లో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి help అవుతుంది..