ఎపిసోడ్ - 7
తిరస్కరణ
ఆ సాయంత్రం… ప్రియా రోడ్డు పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చొని, కన్నీళ్లు తుడుచుకుంటూ, ఫోన్‌లో కృష్ ఫోటో చూస్తూ అనుకుంది —
“సారీ కృష్… నువ్వు ఏమి చెప్పబోతున్నావో నాకు తెలుసు.
నేను కూడా నిన్ను ప్రేమించాను… కానీ ఇప్పడు నీ ప్రేమను అంగీకరించే స్థితిలో లేను. కారణం కూడా నీకు ఇప్పుడే చెప్పలేను.
అందుకే… ఒక అబద్ధం చెప్పబోతున్నాను. నేను చేయబోయేది క్షమించు… నా దగ్గర మరో దారి లేదు.”
అంతలో ఫోన్ మోగింది — కృష్ కాల్.
కృష్: “హే ప్రియా… ఎక్కడున్నావు? ఆల్రెడీ ఏడు అయ్యింది. నేను వెయిట్ చేస్తున్నాను,” అని ఎంతో ఆనందంగా అన్నాడు.
ప్రియా: “హా కృష్… వస్తున్నా. పది నిమిషాల్లో అక్కడ ఉంటాను.”
స్పాట్‌కి చేరుకున్న వెంటనే, లైట్లు అన్నీ ఆఫ్‌లో ఉన్నాయి.
“కృష్!” అని పేరు పిలిచగానే ఒక్కసారిగా లైట్లు వెలిగాయి.
అందరూ: “హ్యాపీ బర్త్‌డే ప్రియా!” అని ఒకేసారి అరిచారు.
కృష్ దగ్గరికి వచ్చి —
కృష్: “హ్యాపీ బర్త్‌డే ప్రియా! సర్ప్రైజ్ ఎలా ఉంది?”
ప్రియా మనసులో — “కృష్ నువ్వు ప్రపోజ్ చేస్తావని నాకు తెలుసు… కానీ ఇలాగే అందరి ముందు చెబుతావని అనుకోలేదు. ఇప్పుడు నేనేం చేయను?”
కృష్: “ప్రియా, రా.”
అతను ఆమె చేతిని పట్టుకుని మధ్యలోకి తీసుకెళ్ళాడు.
కృష్: “ఫ్రెండ్స్… నేను చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్… నేను పిలవగానే వచ్చినందుకు. ఈ రోజు ఈ డే ని చాలా స్పెషల్‌గా మార్చారు.”
ప్రియాకి కళ్లలో నీళ్లు తిరిగాయి. “ఇంత ఆనందంగా ఉన్న అతన్ని ఇప్పుడు ఎలా తిరస్కరిస్తాను? అందరి ముందే చెబితే… ఎలా తీసుకుంటాడో.”
కృష్: “ప్రియా… ఏమైంది? ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్?”
ప్రియా (చిన్న స్మైల్): “ఏం కాలేదు, కృష్… ఈ అందమైన సర్ప్రైజ్‌కి థ్యాంక్స్. చాలా బాగుంది.”
కృష్ కూడా నవ్వుతూ —
కృష్: “ఓకే గైస్… మిస్ ప్రియాకి నేను ఒక ఇంపార్టెంట్ కన్ఫెషన్ చేయాలి.”
అందరూ: “కమ్ ఆన్ కృష్, చెప్పేయ్!” అని హర్షధ్వానాలు చేశారు.
ప్రియాకు గుండె వేగంగా కొట్టుకుంటోంది.
కృష్ ఆమె చేతిని పట్టుకుని —
కృష్:
“ప్రియా… నా జీవితంలో నేను నిజమైన నవ్వు నవ్వింది నిన్ను కలిసినప్పుడే.
ఎంత టెన్షన్‌లో ఉన్నా… నిన్ను చూసే సరికి అన్ని మాయమైపోతాయి.
నీతో గడిపిన ప్రతి క్షణం… నా రోజు మరింత అందంగా మారుతుంది.
ఈ ఒక్క సంవత్సరం… నేను ఎన్నటికీ మర్చిపోలేను, ప్రియా.
ఇది నీకోసం—”
అతను పఠించాడు —
“ప్రేమ నన్ను చేరి వచ్చిందా…
నేను ప్రేమను చేరి వెళ్లానా…
తెలుసుకోవాలని లేదు… నా మనసు నా హద్దుల్లో లేదు…
కనురెప్పకైనా అలసట కలగదు… నిన్ను చూస్తుంటే…
మనసే నిండిపోతుంది… నీ మాట వింటుంటే…
అంతా కొత్తగా అనిపిస్తుంది…
ఇన్నేళ్ల తర్వాత అర్థం దొరికినట్లుంది…
ప్రేమ నన్ను చేరి వచ్చిందా…
నేను ప్రేమను చేరి వెళ్లానా…”
అని చెప్పి, మోకాలిపై కూర్చుని, రింగ్ చూపిస్తూ —
కృష్: “ఐ లవ్ యూ.”
ఒక క్షణం… నిశ్శబ్దం.
ప్రియా చాలా గిల్టీగా ఫీల్ అవుతోంది. కన్నీళ్లు కళ్లలో మెదిలాయి. కృష్ సమాధానం కోసం ఎదురు చూశాడు.
ప్రియా ఒక అడుగు వెనక్కి వేసింది.
కృష్: “ప్రియా… ఏమైంది?”
ఇంకో అడుగు వెనక్కి వేసింది.
అందరూ సైలెంట్.
ప్రియా: “నేను… ఇది నీ నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు, కృష్.”
కృష్: “నువ్వు ఏమంటున్నావో తెలుసా?” అని షాక్‌తో అడిగాడు.
ప్రియా: “కృష్… నేను నిన్ను ప్రేమించలేదు.”
భారీ నిశ్శబ్దం.
కృష్ కళ్లలో నీళ్లు తిరిగాయి.
స్వాతి: “గైస్, లెట్స్ గో… ఇప్పుడే వెళ్ళిపోదాం.”
అందరూ నెమ్మదిగా వెళ్ళిపోయారు.
ప్రియా ఏడుస్తూ మళ్లీ మళ్లీ — “నేను నిన్ను ప్రేమించలేదు, కృష్… సారీ… ప్రేమించలేదు.”
కృష్: “ఎందుకు ప్రియా? ఏమైంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? చెప్పు… నేను చూసుకుంటా.”
ప్రియా: “స్టాప్ ఇట్, కృష్… స్టాప్! నేను చెప్పానుగా… నేను నిన్ను ప్రేమించలేదు అని.”
కృష్ (కోపంగా): “అయితే… మనం గడిపిన ఈన్ని రోజులు… ఆ క్షణాలన్నీ అబద్ధమా? నేను నిన్ను నమ్మలేను, ప్రియా.”
ప్రియా: “ఒక అమ్మాయి నీతో నవ్వుతూ, మాట్లాడితే… ప్రేమిస్తుంది అని ఎలా అనుకుంటావు, కృష్? ఈ ఏడాది లో నేను ఎప్పుడైనా వచ్చి చెప్పానా నీకు నా మనసులో ఫీలింగ్స్ ఉన్నాయని?
నువ్వెప్పుడైనా అడిగావా?
నీకు నా గురించి ఏం తెలుసు? నా ఫ్యామిలీ గురించి? నా బ్యాక్‌గ్రౌండ్ గురించి? ఏం తెలుసు నీకు?”
కృష్ కాసేపు మౌనం.
కృష్: “సరే… ఇప్పుడు అడుగుతున్నాను. ఈ ఏడాది లో నీకు నా మీద ఒక్క ఫీలింగ్ కూడా రాలేదా? నా కళ్లల్లోకి చూసి చెప్పు… నిజంగా ప్రేమించలేదని.”
ప్రియా అతని కళ్లలోకి చూసి — “నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు” అని చెప్పింది.
కృష్ కోపంతో టేబుల్‌ను పక్కకు తోసి, తిరిగి చూడకుండానే వెళ్ళిపోయాడు.
ప్రియా అక్కడే నిలబడి, ఏడుస్తూ — “సారీ కృష్… అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను… చాలా ప్రేమిస్తున్నాను…”
అప్పుడే కాల్ వచ్చింది.
ప్రియా: “హలో?”
విక్రం వర్మ: “మిస్ ప్రియా… కృష్ వెళ్ళిపోయాడా? నువ్వింకా అక్కడే ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా.”
ప్రియా కోపంతో ఫోన్ కట్ చేసింది.
కొద్ది సేపటికి విక్రం ఇంటికి చేరుకుంది.
ప్రియాకు షాక్ — అదిత్యని కుర్చీకి కట్టేసి, బాగా కొట్టి, చొక్కా మొత్తం రక్తంతో తడిచిపోయింది.
ప్రియా: “అంకుల్!” అని ఆందోళనగా ముందుకు వచ్చి —
విక్రం తుపాకీ చూపించాడు.
విక్రం: “స్టాప్, ప్రియా… రైట్ దేర్.”
తుపాకీని అదిత్య తల దగ్గర పెట్టి —
విక్రం: “గుడ్, ప్రియా… నువ్వు యాక్టింగ్ బాగా చేసావు. ఒక్క వికెట్ నీ మాటలకే ఔట్ అయిపోయింది. ఇప్పుడు… ఈ వికెట్‌ను ఔట్ చేయడం నా బాధ్యత.” అని ఆదిత్య వైపు చూశాడు.
అతను గట్టిగా నవ్వాడు.
అదిత్య స్పృహలో లేడు.
ప్రియా కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.
[ముందుకు కొనసాగుతుంది…]
---