Read Excuse me - 10 by Aiswarya Nallabati in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • నా ఆత్మ కథ

    ఆత్మలు ఉన్నాయో లేవో తెలియాలి అంటే నేను ఆత్మగా మారితే కానీ తె...

  • అంతం కాదు - 19

    చివరి భాగం: పోరాటం మొదలవుతుందిఆ మాటలు విన్న తర్వాత అక్షర భయప...

  • అధూరి కథ - 5

    జ్యోతి ని తీసుకుని కోపంగా వెళ్తున్న అర్జున్ దగ్గరకి కౌసల్య,...

  • థ జాంబి ఎంపరర్ - 9

    అదంతా చూస్తున్న జగదీష్ 'అక్క మరి?' అని అమాయకంగా నటిస...

  • మన్నించు - 10

    ప్రేమా, ఆకర్షణ.. నిజం, నీడ లాంటివి... ఆకర్షణ అనే నీడని చూసి...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మన్నించు - 10

ప్రేమా, ఆకర్షణ.. నిజం, నీడ లాంటివి... ఆకర్షణ అనే నీడని చూసి అదే ప్రేమ అనే నిజం అనుకుంటే ఎలా? ఏదో ఒక క్షణం... నీడ ఒంటరిని చేసి వెళ్ళిపోతుంది... నిజం మనల్ని చూసి జాలి పడుతుంది.

వెల్తురులో మాత్రమే తోడుండే నీడ ... చీకటిని చూసి భయపడినట్టు... దూరాన్ని చూసి కలిగిన ఆకర్షణ... దగ్గర అవుతున్న కొద్ది తరిగిపోతుంది. 

********************

సిడ్ పార్కింగ్ వైపు వెళ్ళడం చూసి తనతో  మాట్లాడడానికి అందరికన్నా ముందు సైకిల్ దగ్గరకి వచ్చేశాను. క్లాస్ ఉన్నా సరే కొంచెం బాలేదు అనే సాకు చెప్పాల్సి వచ్చింది. 

"సిడ్... సిడ్.... " నా మాటలు వినిపించినట్టుగా వెళ్ళిపోతున్నాడు. 

ఇంక వెనక పరిగెత్తలేక ఆగిపోయాను ... ఆయాసంతో

నా ఊపిరి శబ్దం వినిపించిందో ఏమో... ఆగి వెనక్కి చూసాడు. ఆయాస పడుతున్న నా దగ్గరకి వచ్చి బ్యాగ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఇచ్చాడు. 

"ధీర .. క్లాసెస్ వదిలేసి ఎందుకు వచ్చావ్.... కాల్ చేసుంటే సరిపోయేదిగా.." పక్కన ఉన్న బైక్ మీద చేరబడ్తు అన్నాడు.

"నాకు ఫోన్ ఇవ్వట్లేదు మా అమ్మ..." నిట్టూరుస్తూ చెప్పాను. 

"హ్మ్మ్... ఇంకేంటి సంగతులు... నీ కొత్త ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు?" కిందకి ఎటో నేల వైపు చూస్తూ అడిగాడు

"సిడ్.. చందు నా ఫ్రెండ్ కాడు... నీకు బాగా తెలుసు.. ఎందుకు మరి ఇలా బిహేవ్ చేస్తున్నావ్.. నేను ఏం తప్పు చేశాను.."

"నువ్వు చీర కట్టుకొని వచ్వావు కదా ధీర... నేను చాలా చెప్పాను... నాకు తెలుసు నీ అందం చూసి మత్తు ఎక్కిపోతారు అని... నువ్వు నా మాటకి వాల్యూ ఇవ్వలేదు.. " నిరాశగా చెప్పాడు.

నా అందం గురించి ఇంత మంది ఇన్ని రకాలుగా పొగుడుతుంటే నమ్మలేకపోతున్నాను.. ఇంత అటెన్షన్ నేను కోరుకోలేదు... 

"చాలా ట్రై చేశాను... అబ్బాయిల అంత ఈజీ అనుకుంటున్నావా అమ్మాయిలకి ఇంట్లో..." ఎలా కన్విన్స్ చేయాలో తెలీలేదు. 

"నాకు చాలా కోపంగా ఉంది... ఈ విషయం ఎక్కువ సాగదీయడం ఇష్టం లేదు నాకు... ప్లీజ్ కొన్ని రోజులు వదిలేయ్ ధీర.." 

నేను బదులు ఇచ్చలోపే మొత్తం జనాలు వచ్చేశారు.. కాలేజీ అయిపోయింది .. అందరినీ ఒకేసారి వదిలేశారు. 

రీతూ వచ్చే వరకు అక్కడే పార్కింగ్లో ఎదురు చూస్తూ ఉండిపోయాను. 

"హే ధీర.." రీతూ పలకరింపులో ఎప్పుడూ ఒక ఆహ్లాదం ఉంటుంది. 

"రీతూ... వచ్చేశావా... " జాతరలో తప్పిపోయిన పిల్లలా రీతుని చూసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను.. 

చాలా విషయాలు మాట్లాడుకుంటూ నెమ్మదిగా సైకిల్ తోసుకుంటూ వెళ్తున్నాం..

ఇంటికి వెళ్ళక మంచం మీద కులబడిపోయాను. సిడ్ మాటలు ఆలోచిస్తూ ఉండగా.. ఎందుకో నిన్ను రాత్రి అజయ్ చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. 

ఈ రోజు అస్సలు అజయ్ కనిపించనే లేదు.. కనిపించి ఉంటే బాగున్ను అనిపించింది. అలా చాలా ఆలోచనలతో నిద్ర పట్టేసింది. 

మళ్ళీ అమ్మ అన్నం తినడానికి లేపే వరకు గాఢంగా పడుకున్నాను. 

అన్నం తినేసాక కొంచెం సేపు బుక్స్ తీసి చదువుకొని ... మళ్ళీ నిద్ర లోకి జారుకున్నాను..

**

"2 డేస్లో స్లిప్ టెస్ట్స్... ఏం ఐన డౌట్స్ ఉంటే అడగండి" బ్లాక్ బోర్డు తుడుస్తూ చెప్పారు మ్యాథ్స్ సార్. 

"ఎక్సెక్యూస్ మీ సార్... సర్క్యులర్" ఆఫీసు బాయ్ సర్క్యులర్ పట్టుకొని వచ్చాడు. 

సార్ గొంతు సరి చేసుకొని చదవడం మొదలు పెట్టారు..

"2 డేస్లో స్లిప్ టెస్ట్స్ ఉన్న కారణంగా .. ఈ 2 డేస్.. బాయ్స్ అండ్ గర్ల్స్ క్లాసెస్ కలిపి 2 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. పాత స్లిప్ టెస్ట్స్ అన్నిటినీ పరిగణలో తీసుకొని.. 2 లేదా అంత కన్నా ఎక్కువ టెస్ట్స్ లో పాస్ అయిన వాళ్ళని ఒక సెక్షన్లో.. 2 కన్నా తక్కువ పాస్ అయిన వాళ్ళని, అస్సలు పాస్ అవ్వలేని వాళ్ళని ఇంకో సెక్షన్లో ఉంచి ప్రాక్టీస్ అండ్ ఎక్స్ప్రెషన్ క్లాసెస్ జరుగుతాయి. ఇక మీదట ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ విధంగా స్లిప్ టెస్ట్లకి  2 రోజుల ముందు ఇలా చేయబడును. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నోటీస్ బోర్డు చూసి క్లాసెస్ డివైడ్ అవ్వండి." 

ఒకసారిగా క్లాస్ రూమ్ అంత గోల... అబ్బాయిలతో కలపబోతున్నారనే ఆనందం అనుకుంటా... కో ఎడ్యుకేషన్లో ఉండే అల్లరి, ఆనందం.. ఒక రకం ....

***

చుట్టూ తెలిసిన అబ్బాయిలే కూర్చున్నా... కొంచెం తడబాటు.. మేము గర్ల్స్ లో లాస్ట్ బెంచ్లో కూర్చున్నాం... మా వెనక బెంచ్లో  యువ, సిడ్, అజయ్ కూర్చున్నారు...

ఇలా ఒకే క్లాసులో కూర్చుంటాం అని అస్సలు ఎవరం అనుకోలేదు.

మిత్ర కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. 

అజయ్, దివ్య వాళ్ళు ప్లాన్ చేసినట్టు క్లోజీగా ఉన్నట్టు నటిస్తున్నారు అనిపించింది. 

సిడ్ ఇంకా నా మీద కోపంగానే ఉన్నాడు. 

క్లాసెస్ మొదలు అయ్యాయి. 

"ఈవ్... ఈవ్...." అబ్బాయిలు సౌండ్స్ చేస్తున్నారు... చాలా డిస్టర్బన్సెగా ఉంది క్లాస్ మొత్తం...

"సైలెన్స్... సైలెన్స్.... " సార్ గట్టిగా టేబుల్ మీద డస్టర్తో కొడుతున్నారు "ఎంతో కొంత చదివే పిల్లలు కదా అని మీకు ఒక క్లాసులో వేసారు.. మేనేజ్మెంట్దే తప్పు అనుకుంటా... కోతి పిల్లలని కలిపారు... అందుకే ముందు నుంచి మన క్యాంపస్లో కో- ఎడ్యుకేషన్ లేనిది. " సార్ చాలా కోపంగా అరిచేశారు.. దెబ్బకి క్లాస్ మొత్తం సైలెంట్గా అయిపోయింది. 

"ఎవరికైనా లాస్ట్ స్లిప్ టెస్టులో ఏం ఐన డౌట్స్ ఉన్నాయా? ... అమ్మ ధీర... నీకు ఏం ఐన డౌట్స్ ఉన్నాయా? " సార్ నన్ను అడగడానికి కారణం.. నేనే లాస్ట్ టెస్టులో హైయెస్ట్ ఆఫ్ ద బ్యాచ్. 

నిల్చొని పేపర్ని అటు, ఇటు తిప్పాను... 

"3rd అండ్ 12th క్యూస్షన్స్ .. ఆన్సర్స్ రాలేదు సార్ ఎంత ట్రై చేసినా...." 

"మిగిలినవన్నీ వచ్చేశాయా టప్పర్ గారు.." అబ్బాయిలు నవ్వుతూ సెటైర్లు వేసారు..

"ఎవడ్రా... ఎవడు కామెంట్ చేసింది" సార్ గొంతు కంగుమంది. 

క్లాస్ అంత నిశబ్దం.. 

సార్ బోర్డు వైపు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుబెట్టారు.. 

వెనకాల గుసగుసలు.. ముందు పాటలు.. ఏది అర్ధం కాలేదు... ఓన్లీ గర్ల్స్ క్లాస్ ఎందుకు చాలా బెటర్ అనేది ఇప్పుడు అర్ధం అయ్యింది నాకు. 

కొన్ని క్లాసెస్ నాకు తెలిసిన పాఠాలే మళ్ళీ చెప్తున్నారు. ఈ లోపు నా ఆర్టిస్టిక్ స్కిల్స్ బయటకి తీసి ఒక మంచి బొమ్మ వేసాను నా నోట్సులో.

"ఎవరికైనా ఏం ఐన అర్ధం కాకపోతే.. ధీరకి అడిగి చెప్పించుకోండి" లాస్టులో సార్ వేసిన డైలాగుకి అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు. 

హమ్మయ్య .. ఎవరు ఏం అడగలేదు. 

"ధీర... " ఒకేసారి వెనక నుంచి సిడ్, అజయ్ పిలిచారు. 

వెనక్కి తిరిగి ఇద్దరిని చూసాను. 

ఒకరి వైపు ఒకరు చాలా కసిగా చూసుకుంటున్నారు... సిడ్ చూస్తున్నాడు అంటే ఒక అర్ధం ఉంది.. అజయ్ ఎందుకు అలా చూస్తున్నాడో అర్ధం కాలేదు. 

"సోరీ ధీర.. కొంచెం ఓవర్గా రియాక్ట అయినందుకు.. " కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు సిడ్.

"హ్మ్మ్... పర్లేదు సిడ్... చెప్పు ఏం ఐన డౌట్స్ ఉన్నాయా?" క్యాస్యువల్గా అడిగాను. 

"నాకు నీ నోట్స్ ఇంటికి ఇస్తావా... నేను చాలా చాప్టర్స రాయలేదు... ప్లీజ్" అంత ముద్దుగా అడగాల్సిన అవసరం ఏం ఉంది .... క్యూట్గా అనిపించాడు సిడ్. 

"సరే ఇస్తాను... రేపటికి తెచేయి... నాకు ప్రిపరేషన్ కోసం కావాలి".

మా కన్వర్జేషన్ అంత వింటున్నారు.. మిత్ర , దివ్య, శ్రీస్తి.... ఏం మాట్లాడకుండా అంత వింటున్నారు... 

కొన్నిసార్లు మాట్లాడకపోయినా ... చూపులతోనే జడ్జి చేసే శక్తి ఫ్రెండ్స్కీ మాత్రమే ఉంటుంది. 

మా మధ్య ముందు అంత చనువు ఉండట్లేదు అనిపించింది. ఎవరి సీక్రెట్స్ వాళ్ళం దాచుకున్నాం... 

మిత్ర చెప్పేవరకు రామ్ గురించి తెలుసుకోలేకపోయం.. దివ్య, అజయ్ వేస్తున్న ప్లాన్ గురించి నాకే చాలా అంత అంత మాత్రంగా తెలుసు, మిగిలిన ఇద్దరికీ తెలిసే అంత ఛాన్స్ కూడా లేదు... శ్రీస్తి సిడ్ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి అని కూడా బయట పెట్టడానికి రెడీగా లేదు.. 

"కామ్గా ఉండండి అందరూ..." కెమిస్ట్రీ మేడమ్ డస్టర్ బెంచ్కి కొడుతూ అరిసారు క్లాసులో ఎంటర్ అవ్వగానే..

మేడమ్ క్లాస్ చెప్తున్నంత సేపు అబ్బాయిలు అందరూ కామ్గా క్లాస్ విన్నారు.... అందరూ మేడంనే చూస్తూ ఉండిపోయారు.

"మేడమ్ బలే ఉన్నారు కదరా.. రెడ్ సారిలో..." అజయ్ స్లోగా అందం అనుకున్న మాట.. గట్టిగా అనేశాడు.. 

ముందు బెంచ్లో ఉన్నది మేమే గనుక.. కొంచెం గట్టిగానే వినిపించింది. 

అందరం వెనక్కి తిరిగి చూసాం.. 

అజయ్లో ఇదో కొత్త కోణం.... మిత్ర చాలా చిరాకుగా చూసింది.. దివ్య అదేం పెద్ద విషయం కాదు అన్నట్టు... నేను, శ్రీస్తి ఒకేలా చూసాం.. ఎలాంటి భావాలు తెలియనట్టుగా.. కొన్నిసార్లు ఏం ఫీల్ అవ్వాలో కూడా తెలీదు ...

క్లాసెస్ అయ్యాయి... అందరం బై చెప్పుకొని.. ఎవరి దారిలో వాళ్ళం బయల్దేరాం.. 

రీతూ నా కోసం వెయిట్ చేస్తుంది పార్కింగ్కి వెళ్ళేసరికే... 

"ఎలా అయ్యాయి క్లాసెస్... ఇప్పుడు కో-ఎడ్ కదా మీది... " తెలుస్తుంది రీతూ మాటలలో ఆతృత.

"బానే ఉంది రీతూ... ఇప్పటి వరకు బ్రేక్లోనో, ఇంటికి వెళ్ళేటప్పుడో కొంచెం సేపు మాత్రమే తల నొప్పి తెప్పించే వాళ్ళు... ఇప్పుడు రోజంతా వెనకాలే కూర్చొని తల నొప్పి తెప్పిస్తున్నారు" నవ్వుతూ చెప్పాను. 

"అన్నట్టు... చందు ఒక ఫేవర్ అడిగాడు....."రీతూ మాటలు పూర్తి అయ్యేలోపు చందు పక్కన ప్రత్యక్షం అయ్యాడు. 

"హాయి.. ధీర..." నవ్వుతూ పలకరించాడు. 

నేను నవ్వుతూ హాయి చెప్పాను. గానీ లోపల ఏం తుఫాను తెచ్చాడు అనే ఆలోచన చిరుక్కు మంది. 

"బలే అందంగా నవ్వవు ధీర.." చందు మాటలకి రీతూ నవ్వేసింది, నేను పెదాలు బిగించేసాను. 

"ఏంటి సార్ సంగతి" సీరియస్గా మొఖం పెట్టీ అడిగాను. 

"సార్ ఎందుకులే ధీర... చందు అని పిలొచు కదా..వినాలనుంది" ఆశగా అడుగుతున్నట్టు అనిపించింది. 

గానీ అంత చనువు వొద్దు అని సైలెంట్గానే ఉండిపోయాను. 

"ఒక చిన్న ఫేవర్ కావాలి ధీర..." పోన్లే ఇప్పటికీ పాయింట్ లోకి వచ్చాడు. 

"హ్మ్మ్.. ఏంటి" ఇంట్రెస్ట్ లేదు.. అది స్పష్టంగా తెలిసేలానే అడిగాను. 

"నా రికార్డు నువ్వు రాస్తావా?" ఒక పాజ్ ఇచ్చి " ప్లీస్" యాడ్ చేశాడు. 

"నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి" నో డైరెక్ట్గా చెప్పలేక ఏదో కారణం చెప్పడానికి ట్రై చేశాను. 

"3 మంత్స్ టైమ్ ఉంది... స్లోగా రాయు... ఊరికినే వద్దులే డైరీ మిల్క్ సిల్క్ కొని ఇస్తా.... ప్లీస్ ధీర... నాకు నువ్వంటే నిజంగా ఇష్టం గానీ నిన్ను ఇంప్రెస్స్ చేసే అంత టైమ్ నా దగ్గర లేదు.. నేను ఈ ఇయర్ అయిపోతే కాలేజీ లోనుంచి వెళ్ళిపోతాను... అట్లెస్ట్ ఒక మంచి మెమొరి ఉంటుంది కదా నీ తరుపు నుంచి నా దగ్గర" చందు మాటలలో అర్థాలు చాలా లోతుగా అనిపించాయి. 

" సరే " అని చెప్పక తప్పలేదు. 

బుక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. 

సైలెంట్గానే నడుస్తున్నాం నేను, రీతూ.. 

అజయ్ కనిపించాడు దారి మధ్యలో.. 

రీతూ పలకరించింది అజయ్ని.. అజయ్ కూడా నవ్వుతూ పలకరించాడు. 

"ధీర కోసం వెయిట్ చేస్తున్నావా?" నవ్వుతూ అడిగింది రీతూ. 

అవును అన్నట్టు తల ఊపాడు. 

నాకు , రీతూకి మద్యలొ గ్యాప్లో నడుస్తున్నాడు అజయ్.. 

"ధీర... నీతో కొంచెం ప్రైవేటుగా మాట్లాడాలి..." రీతూ ఏం అనుకుందో కొంచెం స్లోగా వెనక్కి వెళ్ళి.. కొంచెం డిస్టెన్స్లో నడడం స్టార్ట్ చేసింది. 

"చెప్పు... ఐన రీతూ పక్కన ఉంటే ఏం ప్రోబ్లం నీకు..." పాపం రీతూ అనిపించి అడిగేసాను. 

"దివ్యతో వర్క్ అవ్వదు ధీర... "

"నేనేం అడుగుతున్నాను.. నువ్వు ఏం చెప్తున్నావ్?" 

"దివ్య ఫస్టులో బానే ఉంది.. ఇప్పుడు నా మీద ఫీలింగ్స్ వస్తాయేమో అంటుంది.. వెనక వెనకే తిరుగుతుంది. టార్చర్లా అనిపిస్తుంది... నన్ను లవ్ చేయొచ్చు కదా మిత్రాని వదిలేసి అని అంటుంది... కొన్నిసార్లు సరదాగా చేస్తున్న అంటుంది... కొన్నిసార్లు సీరియస్గా అంటుంది" ఫాస్ట్ ఫాస్టుగా చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు... నేను ఇంకా దివ్యలో ఫీలింగ్స్ ఉన్నాయి అనే మొదటి విషయం దెగ్గరే ఆగిపోయాను. 

"ధీర... ఇంటి దగ్గరకి వచ్చేశాం" సైకిల్ బెల్ కొడుతూ చెప్పింది రీతూ. 

ముందు అజయ్ చెప్పింది ఆలోచించడానికే కొంచెం టైమ్ కావాలి అనిపించింది నాకు. 

"రేపు మాట్లాడదాం అజయ్.. ప్లీజ్" అని అన్నాను. 

నా వైపు చాలా ఆతృతగా, నిస్సహాయంగా చూసాడు. 

"ప్లీజ్...." 

"రేపు క్లాసులో కలుద్దాం ధీర...బై" వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు


************

రచయిత్రి మాట... 

మనం 10 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం... సపోర్ట్ చేసిన అందరికి పేరు పేరునా థాంక్స్... 

ఒక చిన్న ప్రశ్న చదువుతున్న అందరికీ... 

ఈ 10 చాప్టర్లో మీరు కామన్గా అబ్జర్వ్ చేసిన ఒక విషయం కామెంట్ చేయండి... చూద్దాం ఒకరైన అది కనిపెట్టరా అని... 

ఒకరు కనిపెట్టి కరెక్టుగా చెప్పిన.. నెక్స్ట్ 2 చాప్టర్స్ ఒకేసారి రిలీజ్ చేస్తాను.. 


స్పెషల్ థాంక్స్ టు : avyaktha _parna ఫర్ యూవర్ బెస్ట్ ఫీడ్బాక్ 

అండ్

వెరీ మచ్ థాంక్ఫుల్ టూ: priyanka akula యూవర్ కామెంట్ మేడ్ మై హార్ట్ టు మెల్ట్ అండ్ లవ్ మై స్టోరీ మైసెల్ఫ్ మోర్


థిస్ చాప్టర్ ఇస్ డెడికేటెడ్ టు బోత్ అఫ్ థెం.. మై ఫేవరేట్ రీడర్స్..💖💖