ప్రేమ వ్యక్తి పైనా? వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పైనా? ... వ్యక్తిని చూసి పుట్టిన ప్రేమ ఐతే తన కన్నా కళ్ళకు ఆకర్షణగా ఇంకొకరు కనిపిస్తే ప్రేమ వాళ్ల మీదకు మారుతుందా? .... వ్యక్తిత్వం పైనే ఐతే అదే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎందరో తరసపడతారు కదా, ప్రేమ వాళ్ల మీదకు మరుళ్ళుతుందా?
వ్యక్తిని కాక వ్యక్తిత్వాన్ని కాక ఇంకేమైనా కారణం చేత ప్రేమ పుడితే .... ఆ కారణం ఏం అయ్యుంటుంది అంటారు?
పిచ్చి మనస్సు... సమాధానం తెలిస్తే అస్సలు ప్రేమలో ఎందుకు పడుతుందిలే ....................
************
"ధీర... ఇంత రాత్రి మీద ఒకదానివే వచ్వావు ఎమ్మా" షాప్ నుంచి వెనక్కి వస్తున్న దారిలో నాన్నగారు కనిపించి బండి మీద ఎక్కించుకొని వెనక్కి తీసుకెళ్లారు.
బండి మీద అస్సలు ఏమి మాట్లాడలేదు.
ఇంటికి వెళ్లగానే అమ్మని వెతుక్కుంటూ గబగబా కిచెన్లోకి వెళ్ళిపోయారు.
హాల్ లోకి వినిపిస్తున్నాయి మాటలు.
"ఎదిగిన పిల్లని ఎందుకు ఒంటరిగా పంపిస్తున్నావ్?"
"ఎందుకు అండి.. ఇప్పుడు అంత కోపం....ధీర......" కుక్కర్ విస్టెల్ కి అమ్మ మాటలు సగమే వినిపించాయి.
"మన పక్కింటి రాజు గారు.. మన అమ్మయిలా ఎవరో బస్ స్టాప్ దగ్గర అబ్బాయితో మాట్లాడుతూ కనిపించారు... మీ అమ్మాయి అయ్యుండదు లెండి... గానీ వయసులో పిల్ల కదా జాగ్రత్త" అని ఆఫీసు కి కాల్ చేసి మరీ జాగ్రత్తలు చెప్పాడు.
"పని ఏమి ఉంది అతనికి.. మన పిల్లలని మనం కాకపోతే ఎవరు నమ్ముతారు ... నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది" కచ్చితంగా చెప్పింది అమ్మ.
ఇంత నమ్మకం నా మీద... తప్పు చేస్తున్నానా...
ప్రేమించే అంత వయస్సు రాలేదు ...
***
"సిడ్ చాలా కోపంగా ఉన్నాడు. నీకు శారీ కట్టుకోవద్దు అన్నాడు అంట కదా?" రీతూ పొద్దునే కాలేజీకి వెళ్తుండగా అడిగింది.
"నువ్వు చూశావు గా రీతూ... మా ఇంట్లో డ్రెస్ కోసం ఎంత సీన్ అయిందో"
"ఐన ధీర... తను ఎవరు నువ్వు ఏం వేసుకోవాలో, ఏం వేసుకోకూడదో చెప్పడానికి... తనతో కూడా అదే అన్నాను... ఎవరికీ ఆ రైట్ లేదు పేరెంట్స్ తో సహా... అఫ్టెరాల్ వీ లివ్ ఫర్ అవర్సెల్వెస్.."
రీతూ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది..
"నా కోసమే చెప్పాడు కదా రీతూ... నేను సీనియర్స్తో ఇబ్బంది పడకుండా వుండాలి అని.. మాట వినలేదు కాబట్టి చందుతో సీన్ క్రియేట్ అయ్యింది" ఒక విధంగా సిడ్ ఎందుకు చెప్పాడో నాకు లేటుగా అర్ధం అయ్యింది.
"సో... నీకు సిడ్ మీద సాఫ్టు కార్నర్ ఉంది... యూ లైక్ హిం" రీతూ అనలైజ్ చేస్తుంది నా మాటలు..
"ఐ లైక్ హిం... ఎస్ ఏ ఫ్రెండ్" నేను చాలా క్లారిటీగా చెప్పాను.
"అయ్యో.. పాపం సిడ్.. ప్రేమ అనుకుంటున్నాడు" ..... కొంచెం గ్యాప్ తర్వాత... "బై ది వే... చందు ఏం అంత ఎదవ కాదు.. హి ఇస్ టప్పర్ ఆఫ్ ద బ్యాచ్... ఏదో అందంగా కనిపించేసరికి ఎక్సైట్ అయ్యాడు"
"నీ ఫ్రెండ్స్ అందరినీ ఇలా నే సపోర్ట్ చేస్తావా?"
"కొంతమందినే..." నవ్వేశం ఇద్దరం.
***
" ఫ్రెషర్స్ డేలు, ప్రోగ్రాములు ఐ పోయాయి.. ఇక మత్తులోనుంచి బయటకి వచ్చి నెక్స్ట్ మంత్ టెస్టులకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.." ఫిజిక్స్ సార్ మాటలకి అందరూ ఒకసారి నిట్టూర్చారు".
"సో లెట్స్ బిగిన్.. మోషన్ ఆఫ్ ఎ బాడీ......." క్లాస్ చాలా లాంగ్గా అనిపించింది అందరికీ.. అందరూ నిద్ర మొఖాలు పెట్టేసం.
క్లాసెస్ గ్యాప్ లేకుండా జరిగిపోతున్నాయి. ఈ మధ్య గ్యాప్ వచ్చిన సిలబస్ అంతా ఒకేసారి పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కడుపు నిండిపోయినా బలవంతంగా ఫుడ్ కుక్కుతున్నట్లు.. బ్రెయిన్ నిండిపోయినా గ్యాప్ ఇవ్వట్లేదు.
క్లాసెస్ అన్ని అయినప్పటికీ చాలా లేట్ అయిపోయింది.
రీతూ నా కోసం ఎదురుచూస్తుంది. రీతూతో పాటు సిడ్, చందు కూడా ఉన్నారు.
ఏంటి వీళ్ళు కలిసి వెయిట్ చేస్తున్నారు...
"ధీర... హాయి" చందు పలకరించాడు. రీతూ కళ్ళు అందిస్తుంది ... గానీ ఏమి చెప్పాలనుకుంటుందో తెలియడంలేదు.
"హ్మ్మ్... హాయి చందు..." స్లో గా అన్నాను.
సిడ్ కోపంగా చూస్తున్నాడు.
రీతూ పెదాలు బిగించి నవ్వు ఆపుకుంటుంది.
"చుసావ్ కదా బ్రో... ధీరకి నాతో ఏం ప్రోబ్లం లేదు... తను రెస్పాండ్ అవుతే వెళ్ళిపోతా అన్నావ్ కదా... ఇది చాలు అనుకుంటా నీకు క్లారిటీ రాడానికి..." చందు మాటలకి నాకు కొంత వరకు క్లారిటీ వచ్చింది ....
"ధీర... ఒక సారి కూడా నేను అనుకున్నట్లు నువ్వు లేవు.. అస్సలు ప్రోబ్లం ఎవరిలో ... నాలోనా? నిలోనా? " సిడ్ మాటల్లో బరువు తెలుస్తుంది. గానీ నేను ఏం అంత తప్పు చేశానో తెలియట్లేదు.
"సిడ్.... నువ్వు అనుకున్నట్టు........" మాటలు రాడానికి కూడా గొంతులో ఏదో అడ్డు పడుతున్నట్టు అనిపించింది.
"వొద్దు ధీర... ఏం చెప్పకు... నీ కొత్త ఫ్రెండ్స్తో చిల్ల్ అవ్వు... కాలి ఉంటే నైట్ కాల్ చేయు... కాలి అవ్తునే..... బై రీతూ" సిడ్ వెళ్ళిపోయాడు.
ఆగుంటే బాగున్ను అనిపించింది.
నా తప్పు లేదు అని చెప్పాలనిపించింది. చాలా చెప్పాలనిపించింది, గానీ వినే పరిస్థితిలో తను లేడు.
"వెళ్దామా ధీర.... " చందు మాటలకి సిడ్ ఆలోచనలు ఆగాయి.
"వెళ్దామా ఏంటి... రీతూ నీ ప్లాన్ ఏనా?" కోపంగా చూసాను రీతూ వైపు"ఇప్పటికీ నా లైఫులో ఉన్న టెన్షన్స్ సరిపోవు అనా?"
"నేను ఏం రమ్మనలేదు... ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయకు" రీతూ చేతులు పైకి ఎత్తి నవ్వింది.
"ధీర... మా ఇల్లు అటు వైపే... ఐన తన అంత ఇమ్మేచుర్ కాదు నేను... ఐన నువ్వు ఏం చేయాలో తను ఎలా చెప్తాడు"
"కదా...." రీతూ కూడా మాట కలిపింది.
"ప్లీజ్... నాకు ఇప్పటికే తల పగిలిపోతుంది..." దండం పెట్టేసాను.
"ఒకే... ఐ ఆమ్ సారీ " చందు తల దించేసాడు.
ఇక స్లోగా నడవడం స్టార్ట్ చేశాం ముగ్గురం.... సైలెన్సులో కూడా చందు కళ్ళు చాలా సైగలు చేశాడు ఛాన్స్ దొరికినప్పుడల్లా...
"ధీర... ఇంత సైలెన్స్ అవసరమా" మొత్తానికి మాట్లాడకుండా రాలేడు అని ప్రూవ్ చేశాడు.
"చెప్పు... ఏం చెప్పాలనుకుంటున్నావు?"
"సీరియస్గా ఉన్నావ్ ... చెప్పాను... ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడదాంలే... ఎలానూ రోజూ కలిసి ఇంటికి వెళ్తంగా.."
"రోజునా.... " మనసులో అనుకునేది బయటకి వచ్చేసింది.
"ధీర... అంత విసిగిస్తున్నానా.."
"విసిగించడం అని కాదు... రోజు ఇలా వస్తే ఎవరైనా చూస్తారు... నాకు చాలా ప్రాబ్లం అవుతాది ఇంట్లో"
"పోన్లే... ఎక్కడ కోపంతో అవును అంటావ్ ఏమో అని భయపడ్డాను" నవ్వుతూ అన్నాడు "నీ ఫోన్ నెంబర్ కావాలి ధీర"
ఎందుకు అందరికి ఇంత ఈజీ క్యాచ్ ఐ పోతున్నాను... కావాలనే చేస్తున్నారా?
"నాకు ఫోన్ లేదు "
"మరి సిడ్ కాల్ చేస్తా అన్నాడు"
"తను చేస్తా అనలేదు... నన్ను చేయమన్నాడు... అది మా అమ్మ నెంబర్"
"చందు... తనని ఎక్కువ ఇబ్బంది పెట్టకు... మీ ఇంటి టర్నింగ్ వచ్చేసింది... ఇక వెళ్ళు... నెక్ట్ టైమ్ చూద్దాం" రీతూ సైకిల్ ఆపి చెప్పింది.
"ఓకే రీత్... బై ధీర..." తల ఎత్తి చూసే వరకు అక్కడ నుంచి కదలలేదు చందు.
"ధీర... సోరీ... వస్తాను అంటే వొద్దు అని చెప్పలేకపోయాను" రీతూ సర్దిచెప్పడానికి ప్రయత్నించింది.
"రీతూ... నీకు సిడ్తో ప్రాబ్లం తెలిసి కూడా నువ్వు చందుని ఎందుకు అవొయిడ్ చేయలేదు.... నేను నిన్ను చాలా నమ్మను.." ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది. "రేపు కలుద్దాం... లేట్ అయ్యింది కదా.. నేను సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోతా... " రీతూ ఆన్సర్ చెప్పే లోపే సైకిల్ ఎక్కి ముందుకు వచ్చేశా..
కొంత దూరం వచ్చాక... ఎంత తొక్కినా సైకిల్ ముందుకు వెళ్ళడం లేదు. కంగారుగా అనిపించి కిందకి దిగడానికి ప్రయత్నించాను.. అప్పుడే గమనించా... సైకిల్ టైర్ లోకి నా చున్నీ మొత్తం వెళ్ళి చుట్టుకుపోయింది అని.
చున్నీ లేకుండా రోడ్ మీద నిల్చుంటే చాలా సిగ్గుగా అనిపించింది.
అందరూ నా వైపు అదోలా చూస్తున్నట్టు అనిపించింది.
బైక్ హార్న్ గట్టిగా వినిపించడంతో పక్కకి తిరిగి చూసాను.
ఎప్పటి లానే నేను కష్టాల్లో ఉన్న అని తెలిసిందేమో నా హీరో వచేసాడు నా కష్టాల నుంచి నన్ను బయట పడేయడానికి.
అజయ్...
తన కళ్ళు మత్తుగా ఉన్నాయి... చలికి పెదవులు ఎర్రగా ... జుట్టు గాలికి ఎగురుతూ... అందం అనే పదానికి ఇప్పుడు ఎవరైనా అర్ధం చెప్పమంటే అది తనే.
"ఏం అయ్యింది ధీర" మాటలు తేలికగా ఉన్నాయి.
నాకు తెలిసి మనసు భారంగా ఉండి వుంటుంది.
ఈ లోపు ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలు గుమ్ము గుడారు.
"చున్నీ ..." అంటూ చున్నీ వైపు చూపించాను.
కిందకి కూర్చుని నా చున్నీ జాగ్రత్తగా సైకిల్లో నుంచి తీసాడు.
మాట్లాడదాం అనుకున్న... గానీ "జాగ్రత్తగా వెళ్ళు" అని చెప్పి వెళ్ళిపోయాడు.
కనీసం మళ్ళీ కలుద్దాం అని కూడా అనలేదు.
కొంచెం బాధగా అనిపించింది. గానీ... తన మనసులో ఉన్న బాధ కూడా అర్ధం చేసుకోవాలి కదా...
ఇంటికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాను.
అప్పటికే చాలా లేట్ అయ్యింది.
అమ్మకి ఎంత సేపు ఫోన్ అడిగినా ఇవ్వలేదు.
సిడ్ గురించి ఆలోచిస్తేనే చాలా బాధగా అనిపించింది.
నేను కావాలని కాకపోయినా తనని చాలా బాధ పెడుతున్నాను.. నేను నా వెనక తిరుగు అని అడగడం లేదు కదా...
నాకు తెలిసి శ్రీస్తి ఐతే సిడ్కి జోడిగా బాగుంటుంది. శ్రీస్తితో సిడ్ గురించి ఒకసారి మాట్లాడి చూడాలి.
భోజనం చేసి రూంకి వెళ్దాం అని అనుకుంటున్న... అమ్మ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది.."దివ్య కల్ చేసింది చూడు" అంటూ...
రూమ్ లోకి ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాను.
"హలో...." ఈ టైమ్ లో ఎందుకు చేసిందా అని ఆలోచిస్తూ పలకరించాను.
"సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయావా ...ధీర" అజయ్ మాటలు ఫోన్లో వింటుంటే కొత్తగా అనిపించింది.
"హా ...వచ్చేశాను" పొడి పొడిగా చెప్పాను.
"భోజనం తినేశావా?" టక్కున అడిగాడు..
ఇంకా తినలేదు.. ఏం వచ్చి తినిపిస్తావా అని అడగాలనిపించింది. గానీ అంత చనువు లేదు...
"తినేశాను..." ఓక్క ముక్కలో తేల్చేశాను.
"నన్ను అడగవా? " ఈ ప్రశ్న ఊహించలేదు.
"దివ్య ఉందిగా... నేను ఎందుకు అడగడం... అయ్యో మర్చిపోయా... నీకు మిత్ర అడిగితేనే నచ్చుతుంది కదా..." ఊరికినే కవ్విధాము కదా అని అన్నాను.
"హ్మ్మ్.... ధీర... ఫ్రెషర్స్ డే రోజు నుంచి నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను.... నువ్వు చాలా అందంగా వుంటావు... అందరికన్నా..."
మధ్యలోనే తన మాటలు ఆపుతూ..."మీ మిత్ర కన్ననా.." అంటూ అడిగేసాను.
"హా అందరికన్నా... కొన్ని సార్లు నువ్వు మిత్ర కన్నా ముందు నా లైఫులో ఎందుకు రాలేదు అని అనుకున్న తెలుసా" తన మాటలలో బాధ... ఏడుస్తున్నట్టు ఉన్నాడు.
"మిత్ర కన్నా ముందు కలిసినా... మనకి ఛాన్స్ వునదకపోవచ్చు... నేను అంత అందంగా ఏం ఉండను... మొన్న ఫ్రెషర్స్ డేకి కూడా రీతూ వాళ్ల పిన్ని రెడీ చేశారు" బయట లైట్స్ ఆపేసింది అమ్మ,
రూమ్ మొత్తం చీకటి.ఫ్యాన్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది.
"నువ్వు కౌన్సెలింగ్ రోజు నుంచి కూడా అందంగా ఉన్నావ్ ధీర.. మొన్న నీ అందం మరింత ఎక్కువ అయ్యింది అంతే" తన మాటలు.. మాటల మధ్యలో ఊపిరి శబ్దం...
"ఎంత సేపు తగుతావ్ రా... ఇందాకే కదా ఓమిటింగ్ చేసావ్.." వెనకాల నుంచి మాటలు... తాగుతున్నాడా... అది సంగతి... మత్తులో మాట్లాడుతున్న మాటలు... ఎమో కొన్నిసార్లు మత్తులోనే నిజాలు చెప్తారు అంటారు గా... ఎవరికీ తెలుసు.. రేపు పొద్దున్న అయ్యేసరికి మత్తు దిగి అన్ని మర్చిపోతాడేమో.. మర్చిపోవడం కూడా మంచిదే అనుకో...
"ధీర..... ఇంకా అవ్వలేదా మాటలు?" అమ్మ నడుస్తున్న శబ్దం కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది.
"బై అజయ్" కంగారుగా చెప్పాను. కాల్ కట్ చేసేద్దాం అనుకున్నాను...
"రేపు కలుద్దాం ధీర.. ఇంకా ఎక్కువ మాటలు ఉన్నాయి మాట్లాడడానికి" ఊపిరి గట్టిగా పిలుస్తూ చెప్పి.. కాల్ కట్ చేసేసాడు..
**********************
రచయిత్రి మాట...
థాంక్స్ potti గారు ... మీ రేటింగ్స్ కోసం.. మీరు నా ప్రతి చాప్టర్కి లైక్ కొడుతూ .. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు.
Avyaktha గారు... ఈ చాప్టర్ మీకే అంకితం... మీరు రాసిన కామెంట్ చదివాక.. నెక్ట్ చాప్టర్ చాలా ఫాస్ట్గా పోస్ట్ చేసేదేం అనిపించింది.. చాలా ఉత్సాహంగా రాశాను.. మీకు ఈ చాప్టర్ కూడా నచ్చింది అనుకుంటున్న... కీప్ సపోర్టింగ్..❤️