Read Excuse me - 8 by Aiswarya Nallabati in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • పాణిగ్రహణం - 5

    విక్రమ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి కిందికి వస్తాడ...

  • మన్నించు - 8

    ప్రేమలో నిజాలు, అబద్ధాలు ఉండవు.. నిన్ను బాధపెట్టకూడదు అనే అబ...

  • తనువున ప్రాణమై.... - 19

    ఆ గమనం.....కానీ పొట్టిది గట్టిది కదా!! పొట్టి దాని కంట్లో పడ...

  • ప్రేమలేఖ..? - 7

    తిరిగి కొట్టడం వాళ్ళ నోర్లు ముయించడం క్షణం పని ఆనంద్ కి. ప్ర...

  • అంతం కాదు - 11

    కొద్దిసేపటికే విశ్వ అక్కడున్నాడు. జాన్ తన చేతిలో ఉన్న ఆయుధాల...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మన్నించు - 8

ప్రేమలో నిజాలు, అబద్ధాలు ఉండవు.. నిన్ను బాధపెట్టకూడదు అనే అబ్బదం చెప్పాను అంటారు.. అంటే ప్రేమకి నిజం విని నిలబడే శక్తి లేదు అనా?? ... అబ్బధాలతో కట్టిన అద్దాల మేడ కదా, ఒక్క నిజం రాయాలా దూసుకువచ్చినా, ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. విరిగిన మనసు .. నిజాలకు, అబ్బదాలకు మధ్య ప్రేమని దహించేస్తుంది. 

********

"ధీర కళ్ళు తుడుచుకో" దివ్య వైపు మీద నిమురుతూ చెప్పింది. 

అందరూ మళ్ళీ ఫ్రెషర్స్ ప్రోగ్రామ్లో మునిగిపోయారు. డాన్సెస్ స్టార్ట్ ఐపోయాయి. నీరు తెస్తానని వెళ్ళిన అజయ్ తిరిగి రాలేదు. దాహం ఆగిపోయింది. 

దివ్యని రెడీ చేయడానికి మేకప్ రూంకి నన్ను లాగుకొని వెళ్ళిపోయింది. 

దివ్య హడావుడిగా రెడీ అవుతుంది. ఇంకో రెండు పెర్ఫార్మెన్సుల తర్వాత తనదే. 

అజయ్ ప్రేమ విషయంలో నేను హెల్ప్ చేయాలి అని కోరుకుంటున్నాడు. నా వల్ల అవ్వకపోయినా దివ్య వల్ల అవుతుందేమో అనిపించింది. 

"దివ్య... మన అజయ్ ఉన్నాడు కదా.." ఎలా చెప్పాలో తెలియక తికమక పడుతూ తన వైపు చూసాను. 

"హా అజ్జు.. ఏం అయ్యింది వాడికి.. బానే ఉన్నాడుగా ఇప్పటివరకు" మేకప్ వేసుకుంటూ నన్ను చున్నీ సెట్ చేయమంటూ సైగ చేసింది. 

కుర్చీలో వున్న చున్నీ తెస్తూ... ఇంక డైరెక్ట్గా చెప్పేయడమే కరెక్ట్ అనుకున్నాను. 

"అజయ్ మన మిత్రని లవ్ చేస్తున్నాడట" టక్కున చెప్పేశాను. 

"హా నాకు చెప్పాడు ... మిత్రతో మాట్లాడమన్నాడు" నేను ఊహించలేని సమాధానం. చున్నికి పెడుతున్న పిన్ వెళ్లికి గుచ్చుకొని చిన్నగా రక్తం వచ్చింది. 

"చూసుకొని ధీర" అంటూ నా చేతిలో చున్నీ తీసుకొని వేసుకుంది. 

"మరి మాట్లాడవా .. మిత్ర తో" నెమ్మదిగా అడిగాను. 

"హా మాట్లాడా రా.. టైమ్ వేస్ట్ చేసుకోవద్దని చెప్పమంది... ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి ఇద్దరికీ.. బై ది వే.. మిత్రకి ఆల్రెడీ వేరే లవర్ ఉన్నాడు.. దెగ్గరగా రా" అని నన్ను దెగ్గరగా లాగింది, అప్పటికే ఫుల్ షాక్లో ఉన్నా నన్ను "మిత్ర లవర్ మన సీనియర్ ఏ" నవ్వుతూ చెప్పింది సీక్రెట్ లా.. 

ఏదో అడగబోతున్న.. ఈలోపు అజయ్ రూంలో ఎంటర్ అయ్యాడు వాటర్ గ్లాస్ పట్టుకొని. 

"చెప్పకుండా ఇక్కడికి వచ్చేస్తే ఎలా.. నీ కోసం ఎంత వెతుకుతున్నాను" నాకు గ్లాస్ చేతిలో పెట్టి పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. 

"అజ్జు.. నెక్స్ట్ నా పెర్ఫార్మెన్సే రా" దివ్య చెప్పింది. 

"చించేస్తావ్.. నీకు ఏ డార్లింగ్" నవ్వుతూ హై-ఫై ఇచ్చుకున్నారు. 

నిరుతగుతూ పొలమారిపోయాను.. నా చేతిలో గ్లాస్ తీసుకొని నా వైపు తిరిగాడు అజయ్. 

"ఏం అయ్యింది ఈ రోజు.. ఎందుకు ఇంత కన్ఫ్యూజింగ్ గా ఉన్నావ్" అడిగాడు. 

"ఇప్పుడే నీ లవ్ స్టోరీ లో ట్విస్ట్ చెప్పారా...." నవ్వేసింది దివ్య. 

"హ్మ్మ్..." సౌండ్ చేశాడు ఏం ప్రోబ్లం లేనట్టుగా..

"నీకు ముందే తెలుసా?" తన కళ్ళల్లో సమాధానం కోసం వెతుకుతూ అడిగాను " నీకు తెలిసే నన్ను హెల్ప్ చేయమని అడిగావా?" .. అంతకు మించి మాటలు రాలేదు. 

"సోరి ధీర...." తను మాట పూర్తి చేసే లోపే అక్కడ నుంచి లెగిసి బయటకు వచ్చేశాను. 

నడుచుకుంటూ హాల్ బయటకి వచ్చేశాను. 

సడెన్ గా ఊపిరి తీసుకోడం కూడా కష్టంగా అనిపించింది. గట్టిగా ఊపిరి పిలుస్తూ వదులుతున్నాను. మనసులో ఆలోచనలు కూడా మాటలు మర్చిపోయినట్టు అనిపించింది. 

ఆకాశం చల్లగా మారిపోయింది. మబ్బులు కమ్ముకున్నాయి. చీకటిగా అయిపోయింది. 

వర్షం చినుకులు నేలని తాకుతున్నాయి. నిశబ్దం.. వర్షం నవ్వుతున్నట్లు అనిపించింది. నన్ను చూసి వెక్కిరించినట్టు అనిపించింది. 

"ధీర..." వెనక నుంచి నన్ను పిలుస్తూ పక్కన ఉన్న స్తంభం పైన వాలాడు చందు. 

సీనియర్ కదా రెస్పెక్ట్ ఇవ్వాలి. కళ్ళని గట్టిగా ఆర్పీ నీళ్ళు తిరగనివ్వకుండా .. పక్కకి తిరిగి నవ్వాను. 

"చెప్పండి సార్... " పలకరించాను. ముందునంత ఇబ్బంది లేదు. చుట్టూ జనాలు కూడా ఎవరు లేరు కదా. 

"ఏంటి ఇలా ఒంటరిగా.." అడిగాడు. 

"లోపల ఉక్కగా ఉంది..." చేతులతో గట్టిగా నన్ను నేనే చలిని తగ్గించుకునేలా పట్టుకుంటూ చెప్పాను. 

"లోపల ఏసీ లో ... నీకు ఉక్కగా ఉందా... బలే సమాధానం" నవ్వుతూ అన్నాడు.. రక్షణగా చూస్తూ.. ఇంకేదో సమాధానం కోసం వెతుకుతూ.. 

ఏం మాట్లాడలేదు.. ఒక క్షణం నేను తన కళ్ళలో ఏం ఉందా అని చూస్తూ ఉన్నాను. 

"నేను నిన్ను చాలా సార్లు చూసాను.. ఐ మీన్ మన కాలేజీ లో... బ్లాక్ డ్రెస్ లో ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు బలే అనిపించావ్.. పోనిటైల్ అండ్ లూస్ హెయిర్ సూట్స్ యూ" అస్సలు ఆలోచించకుండా చెప్పేశాడు. 

"సో ఫాలో అవుతున్నారా..." కళ్ళు పెద్దగా చేసి అడిగాను. ఇద్దరు సరిపోరు అన్నట్టు తిను కూడా మొదలుపెట్టాడు..

"అలానే అనుకో.. సీనియర్ ని కదా... జాగ్రత్తగా చూసుకుందాం అని" నవ్వుతూ అన్నాడు సర్కాస్టిక్ గా..

"నన్ను నేను చూసుకోగలను" ముక్కు సూటిగా చెప్పేశాను. 

లెట్స్ వెల్కమ్ దివ్య అండ్ గ్రూప్... అన్నాన్స్మెంట్ వినిపించింది. 

వెన్నకి తిరిగా.. డోర్ సగం తీసి ఉంది. డోర్ దగ్గర కోపంగా చూస్తూ సిడ్ కనిపించాడు.

"ఎక్సైజ్ మీ.. నా ఫ్రెండ్ పెర్ఫార్మెన్స్.. మిస్ అవ్వలెను" అని చెప్పి వెనక్కి తిరగకుండా డోర్ దాటుకుంటూ స్టేజ్ దగ్గరకి వెళ్ళిపోయాను.

దివ్య...దివ్య...దివ్య... అరుస్తూ కనిపించారు నా బ్యాచ్.. నెమ్మదిగా వాళ్ళలో కలిసిపోయి నేను అరిచాను. 

దివ్య మా వైపు చూస్తూ నవ్వుతూ .. బలే అదరగొట్టింది డాన్స్. 

సగం మంది అబ్బాయిలు ఫ్లాట్... సీనియర్స్తో సహా...

డాన్స్ పూర్తి అయ్యి స్టేజ్ దిగేసరికి.. ఒక గంపెడు అబ్బాయిలు దివ్య చుట్టూ ముగిపోయారు. 

ఈలోపు లంచ్ టైం ఐపోయింది. 

అందరం మళ్ళీ గ్రూప్ లా కలిసాం. 

"తిన పేరు.. అర్షద్.. తిను.. కరణ్.. యువ" ముగ్గురు కొత్త మొఖాలు పరిచయం అయ్యాయి. 

యువ కొంచెం తెలిసిన ముఖమే.. సిడ్ మొబైల్ దొరికిపోయినప్పుడు టబ్ తెచ్చిన అబ్బాయి. 

మొత్తానికి ఒక మినీ గ్రూపులా ఫామ్ అయ్యాం అందరం..

నేను, మిత్ర, దివ్య, శ్రీస్తి, సిడ్, అజయ్, అర్షద్, కరణ్, యువ... 

అయ్యో మర్చిపోయా.. నేను గ్రూప్ బయట .. రీతూ నీ కూడా నా ఫ్రెండ్స్ గ్రూపులో చేర్చుకోవాలి. 

"మిత్ర... నాకు నీ గ్రూప్ పరిచయం చేయవా?" దెగ్గరగా వచ్చిన అబ్బాయిని చూసి బ్లష్ అవుతూ కుర్చీలోంచి లేచింది మిత్ర. 

"రామ్.. " దివ్య నెమ్మదిగ అనింది.. పక్కన కూర్చోడం వల్ల నాకు మాత్రం వినిపించింది. 

"ఫ్రెండ్స్... మీట్ రామ్.. మన సీనియర్" సిగ్గు పడుతూ చెప్పింది మిత్ర. 

"సీనియరా...."శ్రీస్తి మా అందరి తరపునా రెస్పాండ్ అయ్యింది. 

"ఫ్రెండ్లీ సీనియర్ అనుకోండి.. మీ మిత్రని నేను .. లవ్ చేస్తున్న.. బేసికల్లీ... వీ ఆర్ ఇంటూ రిలేషన్షిప్" రామ్ నవ్వుతూ చెప్పాడు. 

అందరిలో ఒక వావ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళు ఇద్దరు పక్క పక్కన చూడడానికి కూడా బలే ఉన్నారు. 

నేను అజయ్ వైపు చూసాను. తన కళ్ళలో బాధ.. నేను తనకి మిత్ర మీద ఉన్న ప్రేమ తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో అదే బాధ.. అదే అసూయ.. జెల్లాసీ ... 

అబ్బాయిలు కూడా ఇలానే ఫీల్ అవతార అనిపించింది. ఓదార్చే అంత స్టేజిలో నేను లేను. చూసి అయ్యో ఇలా అయ్యిందే అనే ఆలోచన కూడా రాలేదు. 

"ధీర.. ఎలా ఉంది నా సెలెక్షన్?" మిత్ర అందరిలో నన్ను అలా అడుగుతుంది అని నేను అనుకోలేదు. 

అజయ్ చూపు నన్ను కత్తుల గుచ్చుకుంటున్నాయి. నా జవాబు కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు. కొంతమంది ఆతృతగా.. ఇంకొందరు కోపంగా.. 

"మిత్ర.. బాగున్నారు మీరు ఇద్దరు" ఇంకేం చెప్పగలను.. నిజం చెప్పాలంటే నిజంగానే బాగున్నారు.

అజయ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.. దివ్య అజయ్ చేయి నిమిరి ఆ నీరు కిందకి జారకుండా ఆపింది. 

"మిత్ర.. బాగున్నారు గానీ.. ఇంకొంచెం టైమ్ తీసుకొని సీరియస్ అవ్వచ్చుగా.... ప్రేమ అంటే ఒకరి గురించి ఒకరికి చాలా తెలియాలి అంటారు.. తన గురించి నీకు ఏం తెలుసు" దివ్య అజయ్క్ సపోర్ట్ చేయాలనుకుంటుంది అని స్పష్టంగా తెలిసిపోయింది. 

నిజానికి నేను దివ్యాలా మాట్లాడుంటే అజయ్ హ్యాపీగా ఫీల్ అయ్యుండే వాడు అనుకుంటా.. ఒక పక్క మాట్లాడాలనే ఉన్న.. ఇంకోపక్క.. రామ్ మిత్రాల ప్రేమ కూడా న్యాయమే అనిపించి ఆగిపోతుంటాను.

లేదా .. ఇంకా అజయ్ నన్ను చూస్తాడేమో.. మిత్ర లేని లైఫ్లో ఏదో మూల నేను కనిపిస్తానేమో..

లంచ్ కొంత వరకు లైన్ క్లియర్ అయ్యింది. వరుసగా మేము కూడా ప్లేట్లు పట్టుకొని లైన్లో జాయిన్ అయ్యాం. రామ్ సీనియర్స్ తో కలిసి భోజనం ఒడిచడంలో హెల్ప్ చేయడానికి వెళ్ళిపోయాడు. 

"మిత్ర... రామ్ అంత కరెక్టుగా అనిపించట్లేదు" అజయ్ నోట్లో మాటలు ఎంత బరువుగా వచ్చాయో నాకు మాత్రమే తెలుసు. 

"నీకన్న ఐతే చాలా మంచోడు.. మందు తాగడం, సిగరెట్లు కాల్చాడం అలవాటు లేదు.. అమ్మాయిలతో, అమ్మయిల పేరెంట్స్తో ఎలా మాట్లాడాలో చాలా బాగా తెలుసు తనకి.. ఈ విషయంలో నువ్వు కలగచేసుకోకు.. మా ఇంట్లో ఎలా చెప్పాలో నాకు చాలా బాగా తెలుసు" మిత్ర అస్సలు జంకలేదు. 

అజయ్క్ మిత్ర మాటలు గుచ్చుకున్నటు ఉన్నాయి. తను మరో మాట మాట్లాడే సహాయం చేయలేదు. 

సిడ్ వైపు చూసా.. ఇంకా నా వైపు చాలా కోపంగానే చూస్తున్నాడు.. కదిపితే ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. కొంచెం లైన్ వల్ల దూరంగానే నిల్చున్నాడు. 

రీతూ సీనియర్స్తో కలిసిపోయింది. 

"స్వీట్ తింటావా" చందు నన్ను చూస్తూ అడిగాడు. 

"వొద్దు" 

"డైటింగ్ ఆ" ఇద్దరం నవ్వేశం. 

"పోనీ బిర్యానీ" మళ్ళీ అడిగాడు

"చాలా కొంచెం చాలు" చేయి చిన్నగా చూపిస్తూ చెప్పాను. 

అర్ధం అయ్యింది అన్నట్టు తల ఊపి.. కొంచెం పెట్టాడు. 

"లంచ్ అయ్యాక నీతో కొంచెం మాట్లాడొచ్చ?" చనువుగా అడిగాడు. 

"ఈ రోజు కష్టం.. ఇంకెప్పుడైనా ప్లీజ్ సార్" అందరూ చూస్తున్నారు.. చందు అని పిలిచే ధైర్యం సరిపోలేదు. 

"సరే జూనియర్" నవ్వుతూ చెప్పాడు. 

లంచ్ ఐ పోయింది. కొన్ని స్పీచెస్ తర్వాత ఫ్రెషర్స్ డే కూడా ఐ పోయింది. 

నన్ను తిరిగి పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ముందులా రెడీ చేసి ఇంటి దగ్గర దింపేసింది రీతూ. 

ఈ రోజు చాలా జరిగిపోయాయి... నేను ఊహించలేదు... వెళ్లకపోయుంటే.. చందు పరిచయం మిస్ అయ్యుండేదాన్ని.. సిడ్ కోపం ఎలా ఉంటుందో తెలిసిందేది కాదు.. దివ్య కి అజయ్ ప్రేమ విషయం తెలిసిన సంగతి తెలుసుకోనుండేదని కాదు.. మిత్ర, రామ్ల ప్రేమ.. అజయ్ బాధ.. ఎన్నో ఎమోషన్స్.. 

అన్ని జీవితాంతం నాకు గుర్తుండిపోతాయి.. 

"ధీర.. కొంచెం షాప్ వరకు వెళ్ళి పెరుగు పాకెట్ తేవే" అమ్మ కిచెన్లో నుంచి అరిచింది. 

"వల్ల ఇద్దరికీ చెప్పుచు కథ అమ్మ..." అంటూ కిచెన్ లోకి వెళ్తూ .. ఇంటి గేట్ బయటికి చూసాను.. అజయ్ ఒక చెట్టు కింద నిల్చొని చూస్తున్నాడు.. ఎర్రని కళ్ళు.. ఏడుపు మొఖం.. 

ఇంక ఆగలేక.. డబ్బులు తీసుకొని షాపుకి బయల్దేరాను... 

కొంచెం దూరంలో నన్ను ఫాల్లో అవుతూ వచ్చాడు.. కొంత దూరం వెళ్ళక బస్ స్టాప్ దగ్గర ఆగాను.. 

"ఏం అయింది.. ఏంటి ఇలా వచ్చేసావ్?" 

"ధీర... నా వల్ల కావట్లేదు.. ఏడుపు ఆగట్లేదు.. తను ఎందుకు ఇలా చేస్తుంది?" 

"మనం ప్రేమించిన వాళ్ళు .. మనల్ని తిరిగి ప్రేమించాలని ఏమి లేదు కదా... నిన్ను ఇష్టపడే వాళ్ళ కోసం ఎదురు చూడు" 

"ఈసీ అనుకుంటున్నావా.. మర్చిపోవడం" 

"హ్మ్మ్... నిన్ను ప్రేమించుంటే ఏం చేసేవాడివి"

"చాలా..  చాలా హ్యాపీగా చేసుకునేవాడిని" 

"తను రామ్ తో.. హ్యాపీగానేగా ఉంది"

"అది...."

"ఎక్కువ ఆలోచించకు...అంత నీ మంచికే అనుకో"

"నీ కన్నా దివ్య బెటర్.. ఒక మంచి ఐడియా ఇచ్చింది"

"ఏంటో అది"

"నేను ఎవర్నైనా లవ్ చేసినట్టు యాక్ట్ చేస్తే తను అసూయ ఫీల్ అవుతాది కథ.. ఎప్పుడూ నా విలువ తెలుసుకుంటుంది కదా " చాలా మూర్ఖంగా అనిపించాడు మొదటిసారి. 

"ఓహ్.. నీ ఇష్టం.. మరి ఎవరితో కలిసి యాక్ట్ చేయబోతున్నావ్"

"అది తెలియకే.. నీకు అడుగుదాం అని వచ్చా"  నచ్చలేదు.. మొదటిసారి అజయ్ ఆలోచన చిరాకుగా అనిపించింది. 

"దివ్య ఉందిగా.. మంచి ఐడియా కూడా ఇచ్చింది.. తను ఐతే బెటర్" సరిపోతారు ఒకరికి ఒకరు.. 

"హ్మ్మ్... నేను అదే అనుకున్న... మళ్ళీ కలుద్దాం...." నా రిప్లై కూడా వినకుండా.. నా వైపు కూడా చూడకుండా చీకటిలో నడుస్తూ వెళ్ళిపోయాడు..


***********

రచయిత్రి మాట:

@potti రేటింగ్ అండ్ కామెంట్ కొరకు థాంక్స్

@avyaktha parna నా స్టోరీ మీకు నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలిపినందుకు చాలా మనస్పూర్తిగా అనుకుంటున్నాను. 

మీ ఇద్దరికోసమే ఈ చాప్టర్ అంకితం...


చాలా లేట్ అయ్యింది చాప్టర్ అప్డేట్ చేయడానికి sorry.. కొంచెం ఆఫీసు వర్క్స్ వల్ల రాయడం కుదరలేదు.. చాలా రైట్ అండ్ ఎరేస్ తర్వాత చాప్టర్ ఈ స్థాయిలో వచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్న... 


చదివిన వాళ్ళలో కొంతమంది ఐన కామెంట్ చేస్తే రాయాలి అనే స్ఫూర్తి కలుగుతుంది. ప్లీజ్ కామెంట్ చెయ్యచు కదా..