జీవితం చాలా చిన్నది. అంత చిన్న జీవితంలో పుడుతూ చచ్చిపోతున్న ప్రేమ ఇంకెంత చిన్నదో కదా. అలాంటి ప్రేమ కోసం ఎందరో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇంకెందరో రాజీపడి మర్చిపోయి ముందుకు సాగిపోతున్నారు. గానీ కొన్ని కథలు ఈ రెండిటికీ మధ్య ఎక్కడో ఇర్రుకుపోతాయి, బయటపడలేని అగాధంలో చిక్కుకుపోతారు.
-------------------------------------------------------------------------------------------
2013, ఇంటర్ చదువుతున్న రోజుల్లో...
"మా అమ్మాయికి డాక్టర్ చదవాలనే కోరికతో ఉంది, కొంచం ఈ సర్టిఫికెట్లు చూడండి." మా నాన్నగారు నా పదో తరగతి మార్కుల సర్టిఫికెట్ చూపిస్తూ గొప్ప ఆనందపడ్తూ, గర్వంగా చెప్పారు.
"9.0 పాయింట్స్.... మ్మ్.. " తల అడ్డంగా ఉపుతూ నా వైపు చూసారు డెస్క్లో వున్న అతను. భయపడుతూ చిన్నగా నవ్వాను.
"అమ్మాయికి ఒకసారి కౌన్సెలింగ్కి పంపించండి." అని చెప్పి పక్కగా వున్న ఒక డోర్ వైపు చూపించారు అతను.
మా నాన్నగారు సందేహంగా చూస్తూ "కౌన్సెలింగ్ ఎందుకు అండి, మేము బై. పి. సి అనే అనుకుంటున్నాం" అన్నారు.
"కౌన్సెలింగ్ కంపల్సరీ అండి. మా ప్రొసీజర్ అలానే వుంటుంది. అమ్మాయికి అవగాహన రావాలి కథ ఏ కోర్సు ఎలా వుంటుంది అనేది. నువ్వు వెళ్ళు అమ్మ ఆ రూంలోకి." విసుగ్గా చెప్పారు అతను.
"మీరు కూర్చోండి నాన్న. నేను వెల్లోస్తను." బ్యాగ్ వేసుకొని రూమ్ డోర్ కొట్టను.
"కమ్ ఇన్" ఒక వాయిస్ వినిపించింది.
నాలానే చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు కుర్చీలో కూర్చొని ఉన్నారు. అందరూ ఒకే రకం ఐనా కన్ఫ్యూజన్ మోకాలుతో ఉన్నారు.
కాలిగా వున్న ఒక కుర్చీలో కూర్చున్నాను నేను.
"మంచి కెరీర్ ఏంచుకోడం కూడా చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చిన 10త్ మార్కుల బట్టి మీరు ఎంత చదవగలరు అనేది తెలుసుకోండి. మాకు అడిగితే 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే డాక్టర్ కోర్సు చేయగలరు. మిగిలిన వాళ్ళు ఎం.పి.సి బెటర్. మేము ఎంతో మంది పిల్లల్ని చూశాం. ఒకసారి ఇంటర్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే మీ ఫ్యూచర్. మీరు ఇంక దాన్ని ఎప్పటికీ మార్చుకోలేరు. రక్తం చూసి బయపడేవాళ్ళు , ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేము అనుకునే వాళ్ళు ఇంకోసారి ఆలోచించుకోండి........బ్లా.....బ్లా....బ్లా...." చాలా చెప్తున్నారు గానీ నా ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి. నాకు నా దెబ్బలు చూస్తేనే బయం ఇంక వేరే వాళ్ళకి నేను ట్రీట్మెంట్ ఇచ్చే స్టేజ్లో ఉండగలనా అస్సలు.
ధబ్ ...ధబ్.... నా కుర్చీ మీద కొట్టాడు నా పక్కన వున్న అబ్బాయి... పక్కకి తిరిగి చూసాను.
నల్లని కళ్ళు, నుదురు మీదకి పడ్తున్న జుట్టు, యెర్రని పేదలు, అట్రాక్టివ్ బాడీ, మైమరిపించే నవ్వు...
"నీ ముందున్న అమ్మాయిని పిలు" అన్నాడు...
నాకు అర్ధం కాలేదు. వింతగా చూసాను.
"హేయ్ నిన్నే పిల్ల, నీ ముందు వున్న అమ్మాయిని పిలు తల్లి" నా కళ్ళ ముందు చపట్లు కొట్టి మళ్ళీ చెప్పాడు.
నాకెందుకు రా బాబు ఈ గొడవలు, నేను తనని పిలడం, తను నేను ఏదో తప్పు చేసినట్లు నన్ను తిట్టుకోడం. నేను ఏదో చదువుకుందాం అని వచ్చా అంతే. మోకం తిప్పేసాను.
"రెండు, మూడు రోజులు టైం తీసుకుని బాగా ఆలోచించుకోండి అందరు." డిస్పర్స్ అయిపోయాం.
ఫాస్ట్ గా పక్కనుంచి లేచి నా ముందు అమ్మాయిని ఫాలో చేస్తూ బయటకి వెళ్ళిపోయాడు నా పక్కన అబ్బాయి. జస్ట్ డోర్ దాటే ముందు ఒక రకం అయిన చూపు చూసాడు నా వైపు... అప్పుడే స్టార్ట్ చేసేశాడు ఫాలో అవ్వడం ఆ అమ్మాయిని.. ఇంక వీడు చదివినట్టే, ఏంటో చూడడానికి బానే వున్నాడుగా ఎందుకు ఈ ఏదవకి ఇంత ఆత్రం. అయినా వాడు ఏం చేస్తే నాకు ఎందుకులే, ఆ అమ్మాయి లాగి పెట్టి ఒక్కటి కొడితే దెబ్బకి దెయ్యం వదులుతుంది.
***
బాగా ఆలోచించి మా ఇంట్లో వాళ్ళతో కూడా డిస్కస్ చేసి. నా చాలా ఏళ్ల కలని పక్కన పెట్టేసి ఎం.పి.సి తీసాను. మా నాన్నగారు చాలా బాధపడ్డారు. ఒక కౌన్సెలింగ్తో నా కూతురి ఆశ చంపేశారు ఆ కాలేజీ వాళ్ళు అని మా అమ్మతో చెప్పి ఇంక చేసేదేమీ లేక నన్ను కాలేజీలో జాయిన్ చేశారు.
మొదటి రోజు కాలేజీ ... చాలా కొత్తగా అనిపించింది. చిన్న అగ్గి పెట్టె లాంటి క్లాస్ రూములు. దగ్గర దగ్గరగా వేసిన బెంచీలు. అక్కడక్కడ నామమాత్రంగానే బిగించిన ఫ్యాన్లు, పెర్లుతో పిచ్చి గీతలతో నిండిన గోడలు. కొంచెం తడపడుతూనే వెళ్లి రెండవ బెంచ్లో కూర్చున్న. పక్కకి చూస్తే కొంచెం తెలిసిన మొకంలా అనిపించింది. ఎక్కడ చూసనబ్బ ఈ అమ్మాయిని.
"హేయ్, నా పేరు మిత్ర" నవ్వుతూ చెప్పింది. బాగా చూసిన మోకంలా అనిపిస్తుందే...
"నా పేరు ధీర" చేయి అందించి చెప్పాను.
"వీళ్ళు దివ్య, శ్రీస్టి.. " ఇంకో ఇద్దరిని పరిచయం చేసింది. క్లాసులు బాగా సాగుతున్నాయి. బానే కలిసిపోయం మేము నలుగురం. నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ... సరదాగానే సాగిపోయింది. అందరం అమ్మైలమే మా క్లాస్ లో.. అన్నీ క్లాసులు అంతే ఆల్ బాయ్స్ అండ్ ఆల్ గర్ల్స్... అందరూ గర్ల్స్ అవ్వడం వల్ల అనుకుంటా చాలా సరదా జోకులు వేసుకొని నవ్వుకోగలిగాము.
అంతలోనే బ్రేక్ టైం అయ్యింది. నా పక్కన వున్న కిటికీ పైన ఎవ్వరో కొట్టిన శబ్దం. అటుగా చూశాం అందరం. మళ్ళీ కనిపించాడు ఆ మొదటి రోజు కనిపించిన కుర్రాడు.. ఈ రోజు ఇంకొంచెం అందంగా రెడీ అయ్యాడు. క్రీమ్ కలర్ షర్ట్లో ఏం వున్నాడు అనిపించింది. చిన్నగా నవ్వుతూ మిత్రానే చూస్తున్నాడు.
"రేయ్, నువ్ ఎందుకురా ఇక్కడికి వచ్చావ్. చెప్పా కదా ఇంట్లోనే మనం భావా, మార్థల్లం.. కాలేజీకి వచ్చాక ఎవరి దారి వారిదే అని" కోపంగా గసిరింది మిత్ర.
"నీ కొత్త ఫ్రెండ్స్నీ నాకు పరిచయం చేయవా?" అస్సలు మిత్ర మాటలని పట్టించుకొనట్టుగా నన్నే చూస్తూ అడిగాడు. కళ్ళలో కళ్ళు పెట్టి మరీ చూస్తున్నాడు. ఏంటా దైర్యం తనలో. తన కళ్ళలో దైర్యం ఇంకా ఎక్కువ అందంగా చూపిస్తున్నాయి తనని.
"ఈ అబ్బాయి నా భావ. పేరు అజయ్" ఏదో పరిచయం చేయాలి కథ అన్నట్టు చేసింది మిత్ర.
"హేయ్ బ్రో, యు ఆర్ లుకింగ్ కూల్". దివ్య ఒకేసారి ఏమి ఆలోచించకుండా, తడపడకుండా చెప్పేసింది. నా మనసులో కూడా అదే మెదులుతూ వుంది. నా వైపు నుంచి కొంచెం చూపు దివ్య వైపు తిప్పాడు అజయ్. ఊపిరి గట్టిగా వదిలాను, ఇంత సేపు బిగబట్టిన విషయం కూడా తెలీలేదు నాకు.
"మరి నీ ఫ్రెండ్స్ పేర్లు ఏంటో" మళ్ళీ ఒక్కసారిగా నా వైపు కళ్ళు తిప్పాడు. ఏం చూపు చూస్తున్నాడు. ఈ కళ్ళలో ఏదో తెలియని మ్యాజిక్ వుంది.
"నన్ ఆఫ్ యువర్ బిజినెస్" నా నోరు వుండబట్టలేదు. అయ్యో ఎందుకు ఇలా సమాధానం చెప్పాను.
"పిల్ల..నోరు జాగ్రత్త..." ఏదో చెప్పబోతు కోపంగా మారింది అజయ్ మొకం.
"టైం అయ్యింది క్లాసులకి వెళ్ళండి... వెళ్ళాలి.. వెళ్ళాలి... అమ్మాయిల క్లాస్ దగ్గర ఏంట్రా నీకు పని.. కదులు" గోడలపైన కర్రతో కొడ్తూ అరుస్తున్నాడు ఫ్లోర్ ఇన్చార్జి.
"మళ్ళీ కలుద్దాం...." కిటికీ దగ్గరగా తల వాల్చి, నన్ను కల్చేసే అంత కోపంతో చూస్తూ చెప్పాడు అజయ్. ఆ కోపంతో కూడిన కళ్ళలో కూడా మెరుపు వుంది. హీ ఇజ్ సంథింగ్.
"కలుస్తే మాత్రం ఏం చేస్తావ్ లే... పో" నేను గట్టిగానే సమాధానం ఇచ్చాను.